ముదురుతున్న వర్గపోరు | Sakshi
Sakshi News home page

ముదురుతున్న వర్గపోరు

Published Thu, Apr 23 2015 3:12 AM

in tdp serious conflicts

- చీపురుపల్లి పట్టణ టీడీపీలో  తీవ్రమైన విభేదాలు
- ఎంపీపీ వర్గంపై అధిష్ఠానానికి జెడ్పీటీసీ వర్గం ఫిర్యాదు
- మండల పార్టీ అధ్యక్ష ఎన్నికను ధ్రువీకరించని పరిశీలకుడు
- వివాదంపై ఊసెత్తని మంత్రి మృణాళిని
చీపురుపల్లి :
పట్టణ టీడీపీలో తలెత్తిన వర్గ విభేదాలు ముదిరిపాకాన పడుతున్నాయి. ఒకే పార్టీలో ఉంటూ ఎంపీపీ రౌతు కాంతమ్మ భర్త, జెడ్పీటీసీ   మీసాల వరహాలనాయుడు రెండు వర్గాలుగా విడిపోయి పోరుకు దిగిన సంగతి తెలిసిందే. అయితే సంస్థాగత ఎన్నికల పుణ్యమా అని ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు మరిం త రాజుకుంది. ఎంపీపీ భర్త మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడుపై జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు వర్గం అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసిం ది.

మరోవైపు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల పార్టీ అధ్యక్షులను ఈనెల 20వ తేదీన రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని, నియోజకవర్గ ఎన్నికల పరి శీలకుడు, పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పటికీ, చీపురుపల్లి మండల అధ్యక్ష ఎన్నిక మాత్రం అధిష్టానానికి పంపించలేదని విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది.

జెడ్పీటీసీ వర్గీయులు ప్రెస్‌మీట్ పెట్టి ఎన్నికలు పెట్టాలని డిమాం డ్ చేయడం, మరోవైపు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింత ముదురింది. అయితే ఇం త జరుగుతున్నా... స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రామీణాభి వృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని మాత్రం స్పం దించడం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

సొంత పార్టీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య జరుగుతున్న వివాదాన్ని చక్కబెట్టాల్సిన మంత్రి మౌనంగా ఉండడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్ష, పట్టణ పార్టీ అధ్యక్షుని పదవులకు ఎన్నికలు నిర్వహిం చాలని జెడ్పీటీసీ వర్గీయులు ప్రెస్‌మీట్ పెట్టి డిమాండ్ చేయడం పార్టీ శ్రేణుల్లో వేడెక్కించింది. దీనికితోడు ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు మేజర్ పంచాయతీలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలు గౌరవించకుండా, కనీసం ఎలాంటి అభిప్రాయాన్ని తీసుకోకుండా వ్యవహరిస్తున్నారంటూ మేజర్ పంచా  యతీలో జెడ్పీటీసీ వర్గీయులైన వార్డు మెంబ ర్లు, క్రియాశీలక కార్యకర్తలు పార్టీ అధిష్టానానికి బుధవారం ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

అంతేకాకు ండా సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 20న చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షునిగా ఎంపీపీ భర్త రౌతు కామునాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్టు సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి మృణాళిని ప్రకటించారు. అయితే ఎన్నికల పరిశీలకునిగా వచ్చిన తలే భద్రయ్య చీపురుపల్లి అధ్యక్షుని పేరును అధిష్టానానికి పంపించ లేదని తెలిసింది. దీంతో ఆ పేరును పంపిచ్చొద్దని మంత్రి మృణాళిని ఆదేశించారా..? లేదా పరిశీలకుడు తలే భద్రయ్య ఆ నిర్ణ యం తీసుకున్నారా అన్నది చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement