వాల్మీకి కులస్తులను ఎస్టీల్లో చేర్చాలి | Sakshi
Sakshi News home page

వాల్మీకి కులస్తులను ఎస్టీల్లో చేర్చాలి

Published Sun, Feb 7 2016 3:51 AM

వాల్మీకి కులస్తులను ఎస్టీల్లో చేర్చాలి

విజయవాడ (మధురానగర్): వాల్మీకి కులస్తులను వెంటనే ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని, లేనిపక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వాల్మీకి (బోయ) జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ చొప్పవరపు హనుమంతరావు హెచ్చరించారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2014 ఎన్నికల మేనిఫెస్టోలో వాల్మీకి (బోయ)కులస్తుల్లో ఉన్న ప్రాంతీయ బేధాలను తొలగించి ఎస్టీ జాబితాలో పునరుద్ధరిస్తామని టీడీపీ ప్రకటించిందన్నారు. దీంతో ఎన్నికలలో టీడీపీకి ఓట్లేసి గెలిపించామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత తమను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.  జేఏసీ కో కన్వీనర్ డాక్టర్ ఎం.జగదీశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీల్లో పునరుద్ధరించే విషయంపై చల్లప్ప కమిషన్ నివేదికనుత్వరలో సమర్పిం చనున్నారని ఆంద్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

13 జిల్లాలనుంచి వచ్చిన  వాల్మీకీ సేవాదళ్, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి, వాల్మీకి ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్,వాల్మీకి సేవాసమితి, బోయహక్కుల పోరాట సమితి, ఐక్యవాల్మీకి పోరాట కమిటీ, ఆల్ ఇండియా వాల్మీకి వెల్పేర్ అసోసియేషన్, వాల్మీకి సమాజ వికాస పరిషత్ తదితర సంఘాల నేతలు జేఏసీ నాయకులు బి.సాంబశివరావు, సీహెచ్.శంభువరప్రసాద్, సీహెచ్.సాంబశివరావు  పాల్గొన్నారు.

Advertisement
Advertisement