లోక్‌సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ.. | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ..

Published Sat, May 4 2024 4:25 AM

-

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ము మ్మరం చేస్తున్నాయి. ఇంకా వారం రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు శాసనసభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని మండలాల్లో నాలుగైదు గ్రామాలకు ఒక కమిటీని, మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా కమిటీలు వేసుకుని క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఆయా కమిటీల్లో సీనియర్లతో పాటు జూ నియర్లను సభ్యులుగా చేర్చారు. వీరంతా ప్రణాళిక ప్రకారం బూత్‌ స్థాయిలో అన్ని ఇళ్లను తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీ ప్రాధాన్యతలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.

నిజాం షుగర్స్‌, పసుపు బోర్డు తదితర అంశాలు, గల్ఫ్‌, బీడీ కార్మికులు, రైతు కూలీలు, ఉపాధి కూలీల సమస్యలతో పాటు మండలాలు, గ్రామా ల్లో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై నాయకులు, కార్యకర్తలు హామీలు ఇస్తున్నారు. ము ఖ్యంగా పోలింగ్‌ బూత్‌ల పరిధిలో సాధించే ఆధిక్యతను బట్టి స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని పార్టీల అగ్రనాయకులు చెప్పడంతో శ్రే ణులు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఆధిక్యత సాధి స్తే తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు లభిస్తాయనే ఆశాభావంతో శ్రమకోర్చి ప్రచారంలో పాల్గొంటున్నారు.

తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంతో పాటు స్థానికంగా తమ ఉనికినీ చాటుకునేలా మూడు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా పని చేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే కొన్ని రోజుల తేడాతోనే గ్రామ పంచాయతీ సర్పంచ్‌, మండల ప్రజాపరిషత్‌, జిల్లా ప్రజాపరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి జూన్‌ ఆఖరులో లేదా జూలై ప్రారంభంలో ముగించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల కోసం పనిచేయాలని, వారి పనితీరునే ప్రామాణికంగా తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ పదవుల పోటీకి అవకాశాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానికంగా వచ్చే ఓట్లకు సంబంధించి కూడికలు, తీసివేతల లెక్కలు వేసుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తమ గ్రామాల్లో సాధించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని ప్రచార వ్యూహాలను రూపొందించుకుని క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయా నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో వచ్చిన ఓట్లను బూత్‌ల వారీగా సరిచూసుకుని ప్లస్‌లు, మైనస్‌లను బేరీజు వేసుకుని ప్రచారం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ తమకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 6న నిజామాబాద్‌, 7న కామారెడ్డిలో కేసీఆర్‌ రోడ్‌షోలు ఉండడంతో వాటిని విజయవంతం చేసేందుకు గాను బీఆర్‌ఎస్‌ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

కేంద్రంలో మరోసారి అధికారాన్ని దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. నిజామాబాద్‌లో వరుసగా రెండోసారి జెండా ఎగురవేయాలనే పట్టుదలతో కార్యకర్తలు చెమటోడుస్తున్నారు. ‘మరోసారి మోదీ సర్కార్‌’ నినాదంతో పార్టీ శ్రేణులు, అనుబంధ హిందూ సంఘాలు క్షేత్రస్థాయిలో దూకుడుగా ప్రచారం నిర్వ హిస్తున్నాయి. పట్టణాల్లో, గ్రామస్థాయిలోనూ భారీగా ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ శ్రేణులు, యువత గట్టిగా ప్రచారం చేస్తున్నారు.

ఇవి చదవండి: మీరు తీసుకునేది ‘ట్యాపింగ్‌’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి

Advertisement
Advertisement