Kolkata: అండర్‌ వాటర్‌ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని | PM Modi Inaugurates India First Underwater Metro In Kolkata, Know Details Inside - Sakshi
Sakshi News home page

కలకత్తా: అండర్‌ వాటర్‌ మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని

Published Wed, Mar 6 2024 11:27 AM

Pm Modi Inaugurates Kolkata Under Water Metro - Sakshi

కలకత్తా: దేశంలోనే తొలి అండర్‌ వాటర్‌​ మెట్రో రైలు లైన్‌ను పశ్చిమబెంగాల్‌ రాజధాని కలకత్తాలో బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త లైన్‌పై రైలుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మెట్రో రైలులో మోదీ ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. రైలు బయట స్టేషన్లలో వేచిచూస్తున్న వారికి కిటికీల్లో నుంచి అభివాదం చేశారు. 

అండర్‌ వాటర్‌ మెట్రోతో పాటు పాటు మొత్తం రూ.15 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కలకత్తాలోని హౌరామైదాన్‌-ఎస్ప్లాండే సెక్షన్‌లోని  4.8కిలోమీటర్ల మెట్రో ఈస్ట్‌ వెస్ట్‌ కారిడార్‌లో హూగ్లీ నదిపై అండర్‌వాటర్‌ మెట్రోను నిర్మించారు.

భూమికి 30 మీటర్ల దిగువన మెట్రో రైల్‌ స్టేషన్‌ ఉంటుంది. ఈ కారిడార్‌ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఐటీ హబ్‌ సాల్ట్‌ లేక్‌ సెక్టార్‌తో అనుసంధానిస్తుంది. బుధవారం ఈ కారిడార్‌ను ప్రధాని అధికారికంగా ప్రారంభించినప్పటికీ ప్రయాణికులకు కొద్దిరోజుల తర్వాత అండర్‌ వాటర్‌ ప్రయాణం అందుబాటులోకి రానుంది. అండర్‌ వాటర్‌ మెట్రో ప్రారంభోత్సవంలో మోదీ వెంట బీజేపీ బెంగాల్‌ చీఫ్‌ సుకాంత మజుందార్‌, అసెంబ్లీలో ప్రతిపక్షనేత సువేందు అధికారి తదితరులు పాల్గొన్నారు.  ఐదురోజుల్లో పశ్చిమబెంగాల్‌లో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం.  

ఇదీ చదవండి.. ప్రధాని పర్యటన వేళ.. బీజేపీపై ‘దీదీ’ ఫైర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement