టీమిండియాతో తొలి మ్యాచ్‌.. ఆసీస్‌ తుది జట్టు ఇదే! స్టార్‌ ఆల్‌రౌండర్‌కు నో ఛాన్స్‌ | Sakshi
Sakshi News home page

WC 2023: టీమిండియాతో తొలి మ్యాచ్‌.. ఆసీస్‌ తుది జట్టు ఇదే! స్టార్‌ ఆల్‌రౌండర్‌కు నో ఛాన్స్‌

Published Thu, Oct 5 2023 10:51 AM

Aaron Finch picks his Australia XI vs india - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 సమరానికి మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. అహ్మదాబాద్‌ వేదికగా గురువారం జరగనున్న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఈ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

భారత్‌తో తొలి పోరు..
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీలో ఐదు సార్లు వరల్డ్‌ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌ కోసం ఆసీస్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఆ జట్టు మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఎంపిక చేశాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో తమ స్ధానాలను సుస్ధిరం చేసుకున్నారని ఫించ్‌ వెల్లడించాడు.

అదే విధంగా ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ కోసం మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఫించ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన కోడ్‌ స్పోర్ట్స్‌ నివేదిక ప్రకారం.. భారత్‌తో తొలి మ్యాచ్‌కు స్టోయినిష్‌ దూరం కానున్నట్లు తెలుస్తోంది. స్టో​యినిష్‌ ప్రస్తుతం చేతివేలి గాయంతో బాధపడుతున్నాడు.

ఫించ్‌ కోడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. "మొదటి మ్యాచ్‌కు ఎవరో ఒక ఆల్‌రౌండర్‌ కచ్చితంగా దూరం అవుతారు. ఎందుకంటే ఆసీస్‌ దగ్గర మార్కస్ స్టోయినిస్‌, కామెరాన్ గ్రీన్ రూపంలో ఇద్దరూ ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఉన్నారు. నా వరకు అయితే తుది జట్టులో డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌,స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అలెక్స్‌ క్యారీ, గ్రీన్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, హాజిల్‌ వుడ్‌, జంపా తుది జట్టులో ఉండవచ్చు అని అన్నాడు. కాగా ఫించ్‌ కూడా స్టోయినిష్‌కు తన ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు ఇవ్వలేదు.

ఆసీస్‌ వరల్డ్‌కప్‌ ప్రిపేరేషన్‌ గురించి మాట్లాడుతూ.. ఈ మెగా టోర్నీకి ఆస్ట్రేలియా సిద్దంగా ఉందని నేను భావిస్తున్నాను. ఈ ఈవెంట్‌ కోసం గత ఆరు ఏడు వారాల నుంచి మా బాయ్స్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే జట్టులో కొంతమంది ఆటగాళ్లు గత కొంత కాలంగా తక్కువ క్రికెట్‌ మాత్రమే ఆడారు. అది కాస్త ఆందోళన కలిగించే ఆంశంమని ఫించ్‌ చెప్పుకొచ్చాడు.

భారత్‌తో మ్యాచ్‌కు ఫించ్‌ ఎంచుకున్న ఆసీస్‌ తుది జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌,స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అలెక్స్‌ క్యారీ, గ్రీన్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌(కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, హాజిల్‌ వుడ్‌, జంపా
చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్‌ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్‌, బుమ్రా సూపర్‌..

Advertisement
Advertisement