‘సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్‌’ | Sakshi
Sakshi News home page

‘సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్‌’

Published Sat, Oct 28 2023 2:37 PM

YSRCP Leaders Comments Art Proddatur Bus Yatra Day 3 - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు: దళితులను గత ప్రభుత్వం మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళితులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. దళితులకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర ఎవ్వరికీ లేదని తెలిపారు. 

ఈ మేరకు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశాంలో.. బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం అందుబాటులోకి అందించామని తెలిపారు.

నామినేటెడ్‌ పదవుల్లోనూ బలహీన వర్గాలకే ప్రాధాన్యత
సామాజిక న్యాయం అనేది గతంలో మాటలకే పరిమితమైందని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా మండిపడ్డారు. బీసీలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్‌ ప్రభుత్వంలో కేబినెట్‌లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారని. నామినేటెడ్‌ పదవుల్లోనూ బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని చెప్పారు.  

‘సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్‌. వైఎస్సార్‌సీపీ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగింది. కుల, మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం. నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం. మళ్లీ జగనే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని అంజాద్‌ బాషా తెలిపారు.
చదవండి: చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే!

Advertisement
Advertisement