పన్ను ఎగవేతకు పాల్పడ్డాయా?, యూనికార్న్‌ సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు? | FirstCry Founder Supam Maheshwari Under Probe For Alleged $50 Million Tax Evasion: Report - Sakshi
Sakshi News home page

పన్ను ఎగవేతకు పాల్పడ్డాయా?, యూనికార్న్‌ సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు?

Published Tue, Aug 29 2023 12:57 PM

Tax authorities probe FirstCry Founder 50 Million Tax Evasion - Sakshi

దేశీయ ఆదాయపు పన్ను శాఖ అధికారులు యూనికార్న్‌ సంస్థలు పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా మూడు యూనికార్న్‌ సంస్థలు ఫస్ట్‌ క్రై డాట్‌ కామ్‌, గ్లోబల్‌బీస్‌ బ్రాండ్స్‌ లిమిటెడ్‌, ఎక్స్‌ప్రెస్‌బీస్‌లు ట్యాక్స్‌ చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డాయని  గుర్తించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.    

ఆ నివేదికల్ని ఊటంకిస్తూ దేశీయ యూనికార్న్‌ జాబితాలో ఉన్న ఫస్ట్‌ క్రై డాట్‌ కామ్‌ ఫౌండర్‌ సుపమ్ మహేశ్వరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లావాదేవీలపై 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ట్యాక్స్‌ ఎందుకు చెల్లించ లేదని ప్రశ్నిస్తూ సుపమ్‌కు జారీ చేసినట్లు నోటీసుల్లో ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. 

ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రిస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కో, ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌ కుటుంబ సభ్యుల కార్యాలయంతో సహా ఫస్ట్‌క్రైలో ఆరుగురు ఇన్వెస్టర్లు సైతం ఈ నోటీసులు అందుకున్నారని నివేదికలు హైలెట్‌ చేశాయి. నోటీసులతో సుపమ్‌ ఆదాయపు పన్ను శాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఆదాపు పన్ను శాఖ నోటీసులు, ట్యాక్స్‌ ఎగవేత అంశాలపై సుపమ్‌ మహేశ్వరి, క్రిస్‌ కేపిటల్‌, సునీల్ భారతి మిట్టల్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం విడుదల కావాల్సి ఉంది.  

Advertisement
Advertisement