Sakshi News home page

India-US CEO Forum: ఫార్మా బంధం బలోపేతం

Published Sat, Dec 2 2023 4:54 AM

India-US CEO Forum: India-US To Bolster Ties In Pharma, Semiconductor Sectors - Sakshi

న్యూఢిల్లీ: ఫార్మా, సెమీకండక్టర్లు, కీలక లోహాలు, వర్ధమాన టెక్నాలజీలు తదితర అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. అలాగే, పర్యవరణ అనుకూల సాంకేతికతలను కలిసి అభివృద్ధి చేయడం, క్రిటికల్‌ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించాయి. భారత్‌–అమెరికా సీఈవో ఫోరం వర్చువల్‌ భేటీలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్‌ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచి్చనట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఫోరం సభ్యులు సూచించిన సిఫార్సుల అమలుపై దృష్టి పెట్టాలని సీఈవో ఫోరంనకు రైమండో సూచించారు. అలాగే ఫోరంలో అమెరికాకు చెందిన దిగ్గజాలు హనీవెల్, ఫైజర్, కిండ్రిల్, వయాశాట్‌ చేరికను ప్రకటించారు. సెమీకండక్టర్‌ సరఫా వ్యవస్థ, ఇన్నోవేషన్‌ హ్యాండ్‌õÙక్‌ వంటి వేదికల ద్వారా పరిశ్రమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గోయల్‌ పేర్కొన్నారు. 2014లో ఫోరంను పునరుద్ధరించిన తర్వాత నుంచి ఇది ఎనిమిదో సమావేశం. వచ్చే ఏడాది తొలినాళ్లలో తదుపరి భేటీ నిర్వహించనున్నారు. భారత్, అమెరికా దిగ్గజ సంస్థల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు సభ్యులుగా ఉన్న ఈ ఫోరంనకు టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్, లాక్‌హీడ్‌ మారి్టన్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ టైస్లెట్‌ సారథ్యం వహిస్తున్నారు.   

Advertisement

What’s your opinion

Advertisement