-
సరిలేరు నాకెవ్వరూ....
లాస్ ఏంజెలిస్: బికినీ భామలతో ఖరీదైన స్కాచ్ విస్కీల నిషాలో ఖుషీ...ఖుషీగా అణుక్షణం జీవిస్తున్న కోటాను కోట్ల రూపాయల అధిపతి టోని టౌటౌని తన విలాసా జీవితానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం ద్వారా ‘ఇన్‌ష్టాగ్రామ్’లో అలజడి సృష్టిస్తున్నారు. సరస సల్లాపాలలో సరిలేరు నాకెవ్వరూ... అంటూ వివిధ భంగిమల్లో అందమైన భామలు, సూపర్కార్లు, ప్రైవేట్ జట్ విమానాల ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఏడున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ఇన్స్టాగ్రామ్ ‘రారాజు’ కిరీటాన్ని దక్కించుకోవడానికి మరెంతో దూరంలో లేరు. ప్రస్తుతం ఈ కిరీటం ఎనిమిది లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన ‘ప్లే బాయ్’ డాన్ బిల్జేరియన్ పేరిట ఉంది. సూపర్ రిచ్ డాన్ బిల్జేరియన్ తన స్నేహితుడేనని, ఆయన పేరిటనున్న ‘కింగ్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్’ టైటిల్‌ను తాను దక్కించుకోవాలనే తాపత్రయం ఏమీ లేదని, తన స్టైల్ చూసి ఫాలోవర్స్ పెరుగుతున్నారని పెళ్లికాని 42 ఏళ్ల టోని తెలిపారు. ‘అందరు కలలుగనే జీవితాన్నే నేనూ అనుభవిస్తున్నాను. నాలాగా జీవించాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. పురుష పుంగవుడిగా నేను ఎంతో మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాను. నేను కోరుకున్న అమ్మాయెవరూ కూడా ఇంతవరకు నన్ను కాదనలేదు. దటీజ్ మై లైఫ్ స్టైల్’ అని టోని తన గురించి తాను చెప్పుకుంటున్నారు. లాస్ ఏంజెలిస్‌కు చెందిన వ్యాపారవేత్త టోని తన 19 ఏళ్ల వయస్సులోనే కాలిఫోర్నియాలోని హాలీవుడ్లో నైట్ క్లబ్‌ను కొనుగోలు చేయడం ద్వారా కోటానుకోట్ల రూపాయలకు ఎదిగిపోయాడు. ఆయనకు ప్రస్తుతం అమెరికాలో పలు కార్ల డీలర్షిప్, రెస్టారెంట్లు, పబ్‌లు, బార్లు ఉన్నాయి. ‘ధనవంతుడివై దుర్భర జీవితాన్ని గడపడం కన్నా పేదవాడిగా ఉంటూ సంతోషంగా జీవించడం ఉత్తమమని పెద్దలంటారు. అందుకనే సూపర్ డూపర్ రిచ్ కాకుండా రాజీపడి మూడీగా బతుకుతున్నాను’ అనే ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఖాతా మొదలవుతోంది. ఆయనపై ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించినప్పుడు ‘అవును నన్ను కొంతమంది ఫెమినిస్టులు విమర్శిస్తారు నిజమే. ఎందుకంటే నాలో వారికి సమస్యలు కనిపిస్తాయి. అయినా సరే అన్ని రకాల పనులు చేయడానికి నేను సిద్ధమే’ అని సమాధానం ఇచ్చారు. ‘అట్ ది రేటాఫ్ లూనాటిక్’ పేరుతో ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఉంది. ఎవరి పిచ్చి వారికానందం! -
సరిలేరు నాకెవ్వరూ....
లాస్ ఏంజెలిస్: బికినీ భామలతో ఖరీదైన స్కాచ్ విస్కీల నిషాలో ఖుషీ...ఖుషీగా అణుక్షణం జీవిస్తున్న కోటాను కోట్ల రూపాయల అధిపతి టోని టౌటౌని తన విలాసా జీవితానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం ద్వారా 'ఇన్‌ష్టాగ్రామ్'లో అలజడి సృష్టిస్తున్నారు. సరస సల్లాపాలలో సరిలేరు నాకెవ్వరూ...అంటూ వివిధ భంగిమల్లో అందమైన భామలు, సూపర్కార్లు, ప్రైవేట్ జట్ విమానాల ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఏడున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ఇన్స్టాగ్రామ్ 'రారాజు' కిరీటాన్ని దక్కించుకోవడానికి మరెంతో దూరంలో లేరు. ప్రస్తుతం ఈ కిరీటం ఎనిమిది లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన 'ప్లే బాయ్' డాన్ బిల్జేరియన్ పేరిట ఉంది. సూపర్ రిచ్ డాన్ బిల్జేరియన్ తన స్నేహితుడేనని, ఆయన పేరిటనున్న 'కింగ్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్' టైటిల్‌ను తాను దక్కించుకోవాలనే తాపత్రయం ఏమీ లేదని, తన స్టైల్ చూసి ఫాలోవర్స్ పెరుగుతున్నారని పెళ్లికాని 42 ఏళ్ల టోని తెలిపారు. 'అందరు కలలుగనే జీవితాన్నే నేనూ అనుభవిస్తున్నాను. నాలాగా జీవించాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. పురుష పుంగవుడిగా నేను ఎంతో మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాను. నేను కోరుకున్న అమ్మాయెవరూ కూడా ఇంతవరకు నన్ను కాదనలేదు. దటీజ్ మై లైఫ్ స్టైల్' అని టోని తన గురించి తాను చెప్పుకుంటున్నారు. లాస్ ఏంజెలిస్‌కు చెందిన వ్యాపారవేత్త టోని తన 19 ఏళ్ల వయస్సులోనే కాలిఫోర్నియాలోని హాలీవుడ్లో నైట్ క్లబ్‌ను కొనుగోలు చేయడం ద్వారా కోటానుకోట్ల రూపాయలకు ఎదిగిపోయాడు. ఆయనకు ప్రస్తుతం అమెరికాలో పలు కార్ల డీలర్షిప్, రెస్టారెంట్లు, పబ్‌లు, బార్లు ఉన్నాయి. 'ధనవంతుడివై దుర్భర జీవితాన్ని గడపడం కన్నా పేదవాడిగా ఉంటూ సంతోషంగా జీవించడం ఉత్తమమని పెద్దలంటారు. అందుకనే సూపర్ డూపర్ రిచ్ కాకుండా రాజీపడి మూడీగా బతుకుతున్నాను' అనే ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఖాతా మొదలవుతోంది. ఆయనపై ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించినప్పుడు 'అవును నన్ను కొంతమంది ఫెమినిస్టులు విమర్శిస్తారు నిజమే. ఎందుకంటే నాలో వారికి సమస్యలు కనిపిస్తాయి. అయినా సరే అన్ని రకాల పనులు చేయడానికి నేను సిద్ధమే' అని సమాధానం ఇచ్చారు. 'అట్ ది రేటాఫ్ లూనాటిక్' పేరుతో ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఉంది. ఎవరి పిచ్చి వారికానందం!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement