-
వారెవ్వా... విజేందర్
భారత బాక్సర్ శుభారంభం అరంగేట్రంలోనే అదుర్స్ ప్రొఫెషనల్ కెరీర్లో తొలి గెలుపు వైటింగ్పై టెక్నికల్ నాకౌట్ విజయం మాంచెస్టర్ సిటీ: అమెచ్యూర్ బాక్సింగ్‌ను వదిలి ప్రొఫెషనల్ కెరీర్లో అడుగుపెట్టాలని తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ నిరూపించాడు. తన ప్రొఫెషనల్ కెరీర్లో బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే ఈ హరియానా బాక్సర్ విజయం రుచి చూశాడు. అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. బ్రిటన్ బాక్సర్ సన్నీ వైటింగ్‌తో శనివారం రాత్రి జరిగిన మిడిల్‌వెయిట్ బౌట్లో విజేందర్ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో జయభేరి మోగించాడు. మూడు నిమిషాల నిడివి గల నాలుగు రౌండ్లు జరగాల్సిన బౌట్ విజేం దర్ ధాటికి మూడో రౌండ్లోనే ముగిసింది. బౌట్‌కు ముందు తన మాటలతో చెలరేగినవైటింగ్ రింగ్‌లో మాత్రం విజేందర్ పంచ్‌ల వర్షానికి తట్టుకోలేకపోయాడు. మూడో రౌండ్లో రెండున్నర నిమిషాలకే చేతులెత్తేశాడు. విజేందర్ పంచ్‌ల ధాటికి వైటింగ్ తాళలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. పక్కా ప్రణాళికతో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన విజేందర్ మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థి వైటింగ్పై ఆధిపత్యం చలాయించాడు.ఈనెల 30న విజేందర్ తన రెండో ప్రొఫెషనల్ బౌట్లో తలపడతాడు. ‘ప్రొఫెషనల్ బాక్సింగ్ నాకు కొత్తది. దీని కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇది ఆరంభం మాత్రమే. నన్ను ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు’ అని బౌట్ అనంతరం విజేందర్ వ్యాఖ్యానించాడు. -
ఆ పంచ్ లో పవర్ సూపర్!
మాంచెస్టర్: ప్రొఫెషనల్ బాక్సర్ గా శనివారం తొలిసారి రింగ్ లోకి దిగబోతున్న భారత క్రీడాకారుడు విజేందర్ సింగ్ పై అతనికి శిక్షణ అందిస్తున్న బ్రిటీష్ ట్రైనర్ లీ బీర్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. విజేందర్ సింగ్ పంచ్ లో ఓ పవర్ ఉందంటూ కొనియాడాడు. విజేందర్ టెక్నీకల్ గా చాలా పరిణితి చెందిన బాక్సరే కాకుండా అతనిలో సహజసిద్ధమైన ప్రతిభ దాగి వుందన్నాడు. 'విజేందర్ పంచ్ గురించి అతని కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. అతని పంచ్ లో సూపర్ పవర్ ఉంది. దాంతో పాటు చాలా తెలివైన బాక్సర్. అతనిపై నాకు చాలా అంచనాలే ఉన్నాయి' అంటూ లీ బీర్డ్ స్పష్టం చేశాడు. రేపు మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ బాక్సర్ వైటింగ్ తో తో విజేందర్ తలపడనున్నాడు. ఇప్పటికే ప్రొఫెషనల్ బాక్సర్ గా వైటింగ్ కు 2-1 రికార్డు ఉంది. రాత్రి 10.20 ని.లకు సోనీ సిక్స్ లో ప్రసారం కానున్నఈ పోరులో విజేందర్ విజయం సాధించాలంటూ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ముందుగా శుభాకాంక్షలు తెలిపాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్‌బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
No Headline
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement