-
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్‌గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్‌గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్‌సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్‌కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. -
శృతికి జాక్‌పాట్
నటి శృతీహాసన్ బ్రేక్‌ను బ్రేక్ చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం అంటూ వరుస పెట్టి చిత్రాలు చేసిన ఈ సంచలన హీరోయిన్ ఆ తరువాత సుమారు రెండేళ్లు తెరపై కనిపించలేదు. అంతే కాదు నటనకు బ్రేక్ ఇచ్చారు. తరచూ బాయ్‌ఫ్రెండ్‌తో కనిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశారు. అయితే తాను సినిమాల్లో నటించకపోయినా ఖాళీగా లేనని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ తన ఫ్రెండ్స్‌తో కలిసి సంగీత ఆల్బమ్స్ రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ మధ్య బుల్లితెరపై రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా మెరిశారు. ఈ అమ్మడు కోలీవుడ్‌లో చివరిగా సింగం 3లో కనిపించారు. అదేవిధంగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో కాటమరాయుడు చిత్రంలో నటించారు. ఇక తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటించిన శబాష్నాయుడులో నటించినా, ఆ చిత్రం మధ్యలోనూ ఆగిపోయింది. ఆ తరువాత కొన్ని చిత్రాలను నిరాకరించారనే ప్రచారం హోరెత్తిన విషయం తెలిసిందే. బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్ అయిన తరువాత ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు శృతి. కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన ఒక చిత్రం, టాలీవుడ్లో రవితేజ్‌తో ఒక చిత్రం అంగీకరించారు. అవును ఈ అందాల భరిణి హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చే జాక్‌పాట్‌ను కొట్టేసిందని తెలిసింది. ఒక హాలీవుడ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో నటించడానికి ఓకె చెప్పారు శృతి. ప్రఖ్యాత లాసన్ బోర్మీ యూరనివర్స్ సంస్థ నిర్మించనున్న ట్రెడ్‌స్టోన్ సిరీస్‌లో శృతిహాసన్ నటించనున్నారు. ఈ సిరీస్‌లో ఢిల్లీలో ఒక హోటల్లో పని చేస్తూ ఇతర సమయాల్లో హత్యలు చేసే యువతిగా నటించనుందని సమాచారం. హంగేరీలోని బుడాపెస్ట్ ప్రాంతంలో జరగనున్న ఈ సిరీస్ షూటింగ్లో త్వరలోనే శ్రుతిహాసన్ పాల్గొననున్నారు. మొత్తం మీద నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడిప్పుడు ఆ బ్రేక్‌ను బ్రేక్ చేస్తున్నారన్న మాట. -
150 కోట్ల సినిమాలో...
వరుస విజయాలతో రేసుగుర్రంలా దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. ఇటీవల ‘ప్రేమమ్’ వంటి క్యూట్ లవ్‌ప్టోరీ, ‘సింగమ్ 3’ వంటి మాస్ కమర్షియల్ మూవీ.. ఈ రెండు చిత్రాల్లోనూ ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసి, మెప్పించారు. ఇప్పుడు ఓ భారీ చిత్రంలో శ్రుతీకి ఛాన్స్ దక్కిందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ‘సంఘమిత్ర’లో శ్రుతి ఓ హీరోయిన్గా ఎంపికయ్యారని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ఈ సినిమా కోసం పలువురు కథానాయికలను దర్శకుడు సంప్రదించినా, చివరికి శ్రుతీహాసన్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. చారిత్రక నేపథ్యమున్న చిత్రం కావడంతో శ్రుతి మరో ఆలోచన లేకుండా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. హిందీలో అక్కడి నటీనటులతో తీయాలనుకుంటున్నారని వినికిడి. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటించనున్నారు. -
మహేష్ బాటలో సూర్య
స్టార్ హీరోలు ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా తమకు హిట్ ఇచ్చిన దర్శకులను సర్ప్రైజ్గా కాస్ట్లీ కానుకలను అందిస్తున్నారు. గతంలో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివకు హీరో మహేష్ బాబు గిఫ్ట్ ఇచ్చాడు. శ్రీమంతుడు రిలీజ్ తరువాత కొరటాల ఖరీదైన కారును కానుకగా ఇచ్చాడు మహేష్. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరికి 50 లక్షల ఖరీదు చేసే టొయోటా ఫార్చూనర్ కారును గిఫ్ట్ ఇచ్చాడు. సూర్యను టాప్ స్టార్ నిలబెట్టిన సింగం సీరీస్ లో మూడు వరుస సూపర్ హిట్స్ అందించిన హరి, ముందు ముందు ఇదే సీరీస్ లో మరిన్ని సినిమాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
వెబ్సైట్లో సింగం 3 సన్నివేశాలు
పెరంబూర్: తమిళ్ రాకర్స్ కోర్టు తీర్పును ధిక్కరించి నిర్మాతపై చేసిన తన ఛాలెంజ్‌ను నెగ్గించుకుంది. కొంత కాలంగా ఈ వెబ్సైట్ కొత్త చిత్రాలను విడుదల రోజునే తమిళ్‌రాకర్స్ వెబ్సైట్ అక్రమంగా ప్రచారం చేస్తూ చిత్ర పరిశ్రమకు కంటకంగా మారింది. చాలా మంది నిర్మాతలు ఆ వెబ్సైట్ ప్రచారాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య కథానాయకుడిగా సీ–3 చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా తమిళ్‌రాకర్స్ వెబ్సైట్ నిర్మాహకుల అంతుచూస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు ఆ వెబ్సైట్ నిర్వాహకుడు సీ–3 చిత్రాన్ని విడుదల రోజునే తన వెబ్సైట్లో పెడతానని ఛాలెంజ్ చేశాడు. కాగా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ వెబ్‌సైట్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుమతి లేకుండా సీ–3 చిత్రాని వెబ్సైట్లో ప్రచారం చేయరాదని కోర్టు పేర్కొంది. అయినా తమిళ్‌రాకర్స్ నిర్వాహకుడు తను ఛాలెంజ్ చేసినట్లుగానే గురువారం సీ–3 చిత్రం విడుదల కాగా ఇదే రోజున చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తన వెబ్సైట్లో ప్రచారం చేశాడు. అంతే కాదు మరో కొన్ని నిమిషాల్లో పూర్తి చిత్రాన్ని ప్రచారం చేస్తానని పేర్కొన్నాడు.దీంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందుతోంది.
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement