-
అంబరాన్నంటిన సంబురాలు
నిర్మల్‌రూరల్ : ఇంటి ముందు ఆకట్టుకున్న ఆడపడుచుల రంగవల్లులు..డాబాపైన ఎగిరిన చిన్నారుల వినూత్న పతంగులు.. వాళ్లతో కలిసి కేరింతలు కొట్టిన పెద్దలు.. నోములు ఇచ్చిపుచ్చుకున్న సుహాసినులు.. గోమాతకు చేసిన పూజలు.. ఇలా భోగి, సంక్రాంతి, కనుమలు.. ముచ్చటగా గడిచిపోయిన మూడురోజులు. పల్లె నుంచి పట్టణం దాకా అంతటా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలను నిర్వహించారు. పట్టణంలోని బంగల్పేట్ చౌరస్తాలో శనివారం సాయంత్రం భోగి మంటలు వేసి, సంక్రాంతి సంబురాలు ప్రారంభించారు. ‘స్వామియే శరణమయ్యప్పా..’ అంటూ అయ్యప్పస్వామి శరణుఘోషతో పట్టణంలోని మల్లన్నగుట్టపై గల హరిహరక్షేత్రం మార్మోగింది. అభినవ శబరిమలగా పేరొందిన ఆలయంలో సంక్రాంతి సందర్భంగా మకరజ్యోతి దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్(మామడ) : మండలంలోని పొన్కల్ గ్రామంలో శనివారం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మమత, రశ్మిత, అక్షయలు వేసిన ముగ్గులు బహుమతులను గెలుచుకున్నారు. సారంగాపూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో శని, ఆదివారాలు సంక్రాంతి పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి సందర్భంగా మండలంలోని బోరిగాం గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. లక్ష్మణచాంద : మండలంలోని వివిధ గ్రామాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే వాకిళ్లలో రంగు రంగుల ముగ్గులను అందరంగా తయారు చేసారు. యువకులు ,పిల్లలు అనే తేడా లేకుండా అందరు కలిసి హుషారుగా గాలిపటాలను ఎగురవేశారు. -
ముందే పండుగ
ఆత్మకూరు : సంక్రాంతి పండుగ ముందు వచ్చిందేమిటీ?! ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ లోని విట్స్ కళాశాల ఆవరణకు సోమవారం వెళ్లి్లన వారందరికీ ఇదే భావన కలిగింది. మహిళలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆవరణ మొత్తాన్ని ముగ్గులతో నింపేయడమే దీనికి కారణం! సాక్షి–విట్స్ ఆధ్వర్యాన విట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీలకు పెద్దసంఖ్యలో మహిళలు హాజరై రంగవల్లులు తీర్చిదిద్దడంతో కోలాహలం నెలకొంది. ఈ మేరకు హాజరైన పోలీసు కమిçషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ వరంగల్ మహిళల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువని అన్నారు. మహిళల్లో ఉత్సాహం నింపడానికి ‘సాక్షి’ ముగ్గుల పోటీలు నిర్వహించడ ం అభినందనీయమన్నారు. పోటీల్లో విద్యార్థులు ఎక్కువగా పాల్గొనడాన్ని చూస్తే మన సంస్కృతి, సంప్రదాయాలు ముందు తరాలకు అందుతున్నట్లుగా భావించాల్సి వస్తోందని తెలిపారు. సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయండి మహిళల రక్షణ కోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యాన అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని సీపీ సుధీర్‌బా బు తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్వ శక్తి కార్యక్రమానికి గిన్నిస్‌బుక్‌లో చోటుదక్కడం వరంగల్ మహిళలకు గర్వకారణమన్నారు. అలాగే, మహిళలకు సమస్య ఎదురైతే 94910 89257 వాట్సప్ నం బర్కు మెసేజ్ పంపాలని సూచించారు. కార్యక్రమంలో విట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.శ్యాంకుమార్, డైరెక్టర్ మహేష్, ఎం పీడీఓ నర్మద, తహసీల్దార్ సరిత, సాక్షి రీజనల్ మేనేజర్ రాంచంద్రారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ భద్రారెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీధర్‌రెడ్డి, పరకాల సీఐ జాన్ నర్సింహులు, ఎస్సై లు విఠల్, రవిందర్ పాల్గొన్నారు. -
‘సాక్షి’ముగ్గుల పోటీలకు స్పందన
కరీంనగర్ కల్చరల్ : సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థ ప్రాంగణంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. సాక్షి అడ్వర్టయిజ్మెంట్ రీజినల్ మేనేజర్ శ్రీరాం శ్రీనివాస్ పోటీలను ప్రారంభించారు. కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ వైద్య శ్రీనివాస్ çమాట్లాడుతూ సృజనకు పదునుపెడుతూ సందేశాత్మకంగా నిర్వహించిన ఈ పోటీలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తాయన్నారు. న్యాయనిర్ణేతలుగా కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, సాయిశరణ్య హాస్పిటల్ వైద్యురాలు శేషశైలజ, స్రీ వైద్య నిపుణురాలు రేఖారాణి, వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య సతీమణి రాజేశ్వరి వ్యవహరించారు. టీఎన్ జీవో కేంద్ర సంఘం నాయకులు సుద్దాల రాజయ్యగౌడ్ మాట్లాడుతూ ‘సాక్షి’ పత్రిక మహిళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ప్రథమ బహుమతి తారకు రూ.6వేల నగదును సుద్దాల నర్సయ్యగౌడ్ స్మారకార్థం ఆయన కుమారులు రాజయ్యగౌడ్ అందజేశారు. ద్వితీయ బహుమతి ఇందూకు రూ.4వేలను సాయిశరణ్య హాస్పిటల్ తరఫున డాక్టర్ ఎల్.శేషశైలజ, తృతీయ బహుమతి లక్ష్మి విద్యుల్లతకు రూ.3వేల నగదును న్యూశ్రీనివాస మెడిసిన్స్ తరఫున విమలరవిగుప్త, ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిగా రూ.వెయ్యి సౌఖ్యశ్రీకి ఏఆర్ విజన్స్ యాడ్ ఏజెన్సీ తరఫున ఎలగందుల రవీందర్ అందజేశారు. ప్రోత్సాహక బహుమతులను జగదాంబ పెరల్స్ యజమానులు సూర శ్రీనివాస్, ఎలగందుల రవీందర్ తరఫున వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య సతీమణి రాజేశ్వరి, డాక్టర్ రేఖరాణి, డాక్టర్ శేషశైలజ, చొప్పరి జయశ్రీ, విమల గుప్తా అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ జగదాంబ పెరల్స్ వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు. కేఎస్.అనంతాచార్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంగీత దర్శకులు, గాయకులు కేబీ శర్మ, గాయకులు కనపర్తి శ్రీనివాస్, శివ హర్షిత, ఓదెలు, కె.సుదర్శన్ తమ పాటలతో అలరించారు. ఈ పోటీల నిర్వహణలో అడ్వర్ట్‌యిజ్‌మెంట్ మేనేజర్ ఊరగొండ లక్షి్మనారాయణ, సాక్షి టీవీ జిల్లా ప్రతినిధి కట్కూరి విజేందర్‌రెడ్డి, సీనియర్ ఫొటోగ్రాఫర్ గుంటపల్లి స్వామి, సీనియర్ కెమెరామెన్ సాయిని సతీశ్, అడ్వర్టయిజ్మెంట్ విభాగం పట్టణ ఇన్ చార్జి ముస్కుల విద్యాసాగర్‌రెడ్డి, గంగుల మహేందర్‌రెడ్డి, అడ్వర్టయిజ్మెంట్ ఇన్ చార్జీలు యెలిగేటి కమలాకర్, పొన్నాల ప్రవీణ్, వేముల శ్రీనివాస్, పూసాల శ్రీకాంత్, బరిగెల ఆంజనేయులు, అవుదుర్తి శ్రీనివాస్, మొదుంపల్లి సుమన్, గడ్డం చిరంజీవి, లక్ష్మణ్‌రావు, వి.శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌ను ప్రారంభించిన ఎంపీ పెద్దపల్లి: పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌ను ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రతీ మండలంలో పనిచేస్తున్న పాత్రికేయులకు పక్కాఇళ్లు నిర్మిస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామన్నారు. పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాలలాంటి పధాన పట్టణాల్లో ఆకర్షణీయంగా ప్రెస్ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం తన నిధుల నుంచి రూ. 10లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని దాదాపు 200మంది పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రెస్‌భవన్ కు కావాల్సిన నిధులు ఇచ్చేందుకు ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అంగీకరించారు. నగర పంచాయతీ చైర్మన్ ఎల్.రాజయ్య, రామగుండం కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్షీ్మనారాయణ, నాయకులు ఆడెపు రమేశ్, మార్కెట్ చైర్మన్ ఐలయ్యయాదవ్, రఘువీర్‌సింగ్, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు రవికిశోర్, కొట్టె సదానందం, తిరుపతి, సంపత్, శ్రీమాన్, రమేశ్, అశోక్, రాజు, గోపీ, మధు పాల్గొన్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement