-
ఇంత చిన్న వయసులో...
సందేహం మా అమ్మాయి వయసు పదేళ్లు. రెండు వారాల కిందటే మెచ్యూర్ అయింది. ఆమె పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు. – శ్రీలక్ష్మి, చిత్తూరు పదేళ్ల వయస్సు అంటే ఆడే పాడే చిన్న లేత వయస్సు. ఇంత చిన్న వయస్సులోనే రజస్వల అవ్వడం వల్ల వారికి అది కొత్తగా కనిపించడం, న్యాప్కిన్స్ వాడటం వంటి విషయాలలో కొద్దిరోజుల వరకు అయోమయంగా ఉంటుంది. మీరు మెల్లగా మీ పాపకి పీరియడ్స్ అంటే ఏమిటి? బ్లీడింగ్ ఎలా అవుతుంది, ఎలా జాగ్రత్త పడాలి, న్యాప్కిన్స్ ఎలా వాడాలి, ఆ సమయంలో ఉండే అసౌకర్యాలు, కడుపునొప్పి, శరీరంలో వచ్చే మార్పులు వంటి అనేక విషయాలను అర్థం అయ్యేలాగ వివరించి చెప్పండి. ఇది పిల్లలు శారీరకంగా పెరిగే వయసు కాబట్టి పప్పు, ఆకుకూరలు, పండ్లు, పాలు, మితమైన మాంసాహారం వంటి పౌష్టికాహారం ఇవ్వాలి. మెచ్యూర్ అయినా ఒకటి, రెండూ లేదా మూడు సంవత్సరాల వరకూ పీరియడ్స్ చాలామందిలో సక్రమంగా ఉండకుండా, ఎప్పుడంటే అప్పుడు రావడం, ఎక్కువగా అవ్వటం వంటివి ఉండవచ్చు. కాబట్టి స్కూల్లో ఇబ్బంది పడకుండా స్కూల్ బ్యాగ్‌లో ఎక్స్ట్రా న్యాప్కిన్స్, ప్యాంటీస్ వంటివి ఉంచటం మంచిది. నా వయసు 27 సంవత్సరాలు, బరువు 40 కిలోలు. నాకు పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇదివరకు పీరియడ్స్ సరిగా వచ్చేవి కావు. అయితే, మందులు వాడిన తర్వాత ఆరు నెలల పాటు పీరియడ్స్ రెగ్యులర్‌గానే వచ్చాయి. గతనెల పీరియడ్ రావాల్సి ఉన్నా, రాలేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ అని వచ్చింది. స్కానింగ్ చేయించుకుంటే పీసీఓడీ అని చెప్పారు. థైరాయిడ్ సమస్య లేదని పరీక్షల్లో తేలింది. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా? నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.– రామలక్ష్మి, నర్సీపట్నం పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్. ఇందులో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో (ఓవరీస్) చిన్న చిన్న నీటి బుడగలు ఎక్కువగా ఏర్పడతాయి. వాటి వల్ల రక్తంలో, మగవారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఏండ్రోజన్ హార్మోన్ పీసీఓడీ ఉండేవారిలో ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అధిక మోతాదులో టెస్టోస్టిరాన్, ఇంకా ఇతర హార్మోన్ల విడుదల వల్ల, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి నెలనెలా తయారయ్యి విడుదలయ్యే అండం సరిగా పెరగకపోవడం, విడుదల కాకపోటం, దాని నాణ్యత సరిగా లేకపోవటం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, అధిక మొటిమలు, అవాంఛిత రోమాలు ఏర్పడటం... వంటి అనేక లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడతాయి. అండం పెరగటంలో సమస్య వల్ల, సాధారణంగా గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి కొందరిలో అధిక బరువు, సన్నగా ఉన్నవారిలో కూడా జన్యుపరమైన సమస్య వల్ల, ఇన్సులిన్ హార్మోన్ సరిగా పనిచెయ్యకపోవటం వల్ల, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంటాయి. నువ్వు 40 కేజీల బరువు అంటే లీన్ పీసీఓ క్యాటగిరీ కింద వస్తావు. నువ్వు డాక్టర్ పర్యవేక్షణలో, పీసీఓడీ వల్ల నీలో ఏర్పడిన హార్మోన్ల అసమతుల్యత తగ్గడానికి మందులు వాడుకుంటూ, అండం తయారవ్వటానికి మందులు, వాడటం వల్ల నీకు గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ చికిత్సకు, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొన్ని నెలలు లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. ఓపిక పట్టవలసి ఉంటుంది. మందులతో గర్భం నిలవనప్పుడు, ల్యాప్రోస్కోపీ అనే చిన్న ఆపరేషన్ ద్వారా, నీటి బుడగలను కొన్ని తొలగించి, మరలా చికిత్స తీసుకోవలసి వస్తుంది. నా వయసు 26 ఏళ్లు, ఎత్తు 5.5 అడుగులు, బరువు 68 కిలోలు. నాకు ఏడాది కిందట పెళ్లి జరిగింది. మా వారూ, నేనూ ఇద్దరం జాబ్స్ చేస్తున్నాం. నాకు సెక్స్‌పై ఆసక్తి ఉండటం లేదు. దీనివల్ల మా ఆయన తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – కనకదుర్గ, కొల్లూరు కొంతమంది ఆడవారిలో జాబ్ చేస్తూ ఇంట్లో పని ఒత్తిడి వల్ల మానసికంగా, శారీరకంగా అలసిపోవటం వల్ల సెక్స్ మీద ఆసక్తి ఉండకపోవచ్చు. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అలా ఉండవచ్చు. కొందరిలో సెక్స్ మీద దురభిప్రాయం ఉండటం, భర్త మీద ఇష్టం లేకపోవడం, వారి ప్రవర్తన నచ్చకపోవడం... ఇతర కారణాల వల్ల ఆసక్తి ఉండకపోవచ్చు. ఇద్దరూ కొంచెం సమయం తీసుకొని మీ మనసులోని అభిప్రాయాలను, భావాలను, సందేహాలను మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల కొద్దిగా సమస్య తీరవచ్చు. అతని ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి మీకు అనుగుణంగా మారవచ్చు. ఇద్దరూ కలసి విహారయాత్రకు వెళ్ళడం, సినిమాలు, షికార్లు వెళ్ళడం వల్ల ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగి మీకు సెక్స్ మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. రొమాంటిక్ సినిమాలు, వీడియోలు చూడటం, నవలలు చదవటం వంటివి చెయ్యడం వల్ల కూడా ప్రయోజనం ఉండవచ్చు. అప్పటికి ఉపయోగం లేకపోతే ఒకసారి డాక్టర్ని సంప్రదించి సలహా, కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. డా‘‘ వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
ఆలస్యంగా మెచ్యూర్ అయితే..?
సందేహం నా వయసు 22. నాకు మరో మూడు నెలల్లో పెళ్లి జరగబోతోంది. అయితే నన్నొక సందేహం బాగా భయపెడుతోంది. నేను చాలా ఆలస్యంగా మెచ్యూర్ అయ్యాను. అంటే... పందొమ్మిదో యేడు దాటిన తర్వాత అయ్యాను. అంటే అయ్యి ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతోంది. మరి నా శరీరం, నా అవయవాలు అన్నీ పెళ్లికి తగినట్టుగా ఎదిగి ఉంటాయా? లేక ఆలస్యంగా మెచ్యూర్ అవ్వడం వల్ల అప్పుడే పెళ్లి చేసుకుంటే ఇబ్బందులేమైనా వస్తాయా? నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? సలహా ఇవ్వండి. - విజయశ్రీ, గుడివాడ సాధారణంగా మెదడులో స్రవించే హార్మోన్స్ ఆడపిల్లల అండాశయాలు, గర్భాశయం పైన ప్రభావం చూపడం వల్ల పీరియడ్స్ మొదలై రజస్వల అవుతారు. ఇది 12-16 సంవత్సరాల వయసు లోపల జరుగుతుంది. మారుతున్న ఆధునిక కాలంలో జీవనశైలిలో మార్పులు, ఆహారంలో జంక్‌ఫుడ్ మోతాదు పెరగడం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా టీవీలు, ఫోన్లలో కాలక్షేపం వంటివెన్నో మార్పుల వల్ల మెదడు త్వరగా ప్రేరేపణకు గురై 10-11 ఏళ్లకే చాలామంది పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. ఇలాంటి కాలంలో మీరు 19 ఏళ్లకి మెచ్యూర్ అయ్యారంటే చాలా ఆలస్యంగా అయినట్లే. మీ బరువు, ఎత్తు రాయలేదు. కొందరు మరీ బలహీనంగా, బక్కచిక్కినట్లు ఉండటం వల్ల... లేదా హార్మోన్లలో తేడా వల్ల... జన్యుపరమైన కారణాల వల్ల ఆలస్యంగా మెచ్యూరై ఉండొచ్చు. ఇప్పుడు మీకు నెల నెలా పీరియడ్స్ క్రమంగా వస్తున్నాయా లేదా రాయలేదు. నెల నెలా సక్రమంగా వస్తుంటే, మీ శరీరంలో పెద్దగా సమస్య లేనట్లే. సాధారణంగా రజస్వల కావడానికి రెండేళ్ల ముందు నుంచే శరీరంలో మార్పులు వస్తాయి. అంటే చంకల్లోను, జననాంగాల వద్ద వెంట్రుకలు రావడం, రొమ్ములు పెరగడం, కొద్దిగా ఎత్తు పెరగడం, బరువు పెరగడం వంటి మార్పులు మొదలై, తర్వాత రెండేళ్ల లోపల శరీరం పెళ్లికి, పిల్లలకు సన్నద్ధం అవు తుంది. మీరు మెచ్యూర్ అయి నాలుగేళ్లు అయింది కాబట్టి, మీ శరీరంలో పెళ్లికి, పిల్లలకి తగ్గట్టుగా అన్ని మార్పులూ వచ్చే ఉండొచ్చు. ఒకవేళ పీరియడ్స్ సరిగా రానట్లయితే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్, CBP, ESR వంటి రక్తపరీక్షలు, స్కానింగ్ చేయించుకొని గర్భాశయ పరిమాణం ఎలా ఉంది, అండాశయాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది చూసుకుని, దాన్నిబట్టి చికిత్స తీసుకోండి. నా వయసు 30. ఎత్తు ఐదున్నర అంగుళాలు. బరువు 75 కిలోలు. నాకు ఓవరీస్‌లో నీటి బుడగలు ఉన్నాయి. ఆ విషయం నేను గమనించుకోలేదు. దాంతో కుడివైపు ఓవరీలోని నీటి బుడగ ఒకటి పగిలిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఆ ఓవరీని తొలగించారు. అయితే రెండో ఓవరీలో కూడా నాకు బుడగలు ఉన్నాయి. కానీ ఇంకా చిన్నగానే ఉన్నాయి, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నారు డాక్టర్. కానీ నాకు చాలా భయంగా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ అలా అవ్వకుండా ఉంటుందో చెప్పండి ప్లీజ్. - వి.సుభాషిణి, కరీంనగర్ గర్భాశయానికి ఇరువైపుల ఉండే అండాశయాలలో నెలనెలా అండం తయారవ డానికి వీలుగా, అండాశయంలో చిన్న ఫాలికల్స్ ఉంటాయి. ఇవి కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలా ఎక్కువగా నీటి బుడగల్లాగా అండాశయం మొత్తం ఉంటాయి. వీటిని POLYCYSTIC OVARIES అంటారు. ఈ నీటి బుడగలు పగలడం ఏమీ ఉండదు. కొందరిలో ఈ ఫాలికల్స్ కొద్ది కొద్దిగా పెరుగుతూ వాటిలో నీరు ఎక్కువగా చేరి నీటిగడ్డలాగా (POLYCYSTIC OVARIES) మారుతుంది. ఇవి అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా పెరిగినప్పుడు కడుపు లోపల అది పగిలి, దాని నుంచి బ్లీడింగ్ అవ్వడం, విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ CYST ని తీసేస్తారు. అవసరమైతే మొత్తం అండాశయాన్ని తీసేయడం జరుగుతుంది. మీ విషయలో అదే జరిగివుంటుంది. మీకు ఇప్పుడు ఒక్కటే అండాశయం ఉంది. అందులోనూ నీటి బుడగలు ఉన్నాయంటే అది పాలిసిస్టిక్ ఓవరీ అన్నమాట. వీటిలో మళ్లీ ఇ్గఖీ తయారవుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం. మీ ఎత్తుకు మీరు 10 కేజీల బరువు ఎక్కువగా ఉన్నారు. అధిక బరువు వల్ల కూడా నీటి బుడగలు పెరగడం జరుగుతుంది. అందుకే మీరు బరువు తగ్గడానికి వ్యాయామం చేయండి. పరిమితమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో low dose pills కొంతకాలం వాడటం వల్ల సిస్ట్లు పెరిగే అవకాశం తగ్గుతుంది. మీకు పెళ్లి అయ్యిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా అన్నది రాయలేదు. ఎందుకంటే పిల్లలు లేకపోతే, దానికి తగ్గ చికిత్స కూడా తీసుకోవలసి ఉంటుంది. - డా.వేనాటి శోభ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement