-
మీరసలు మగాళ్లేనా..!
బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రాకు కోపం వచ్చింది. ఇంతకీ ప్రియాంక కోపానికి కారణం ఏంటా? అనుకుంటున్నారా! ఓ సంస్థకు చెందిన సభ్యులు... ‘ఐటమ్ సాంగ్స్‌లో నర్తించే నటీమణులను వ్యభిచారిణులుగా ప్రకటించాలి’ అంటూ కోర్టును ఆశ్రయించనున్నారు. వారి అభిప్రాయాన్ని మీడియా సాక్షిగా వ్యక్తపరిచారు కూడా. అమ్మాయిల అసభ్యకరమైన వస్త్రధారణ వల్లనే సమాజంలో మానభంగాలు ఎక్కువయ్యాయనీ, చిన్న చిన్న స్కర్టుల్లో కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా వారి వస్త్రధారణ ఉంటోందనీ సదరు సంస్థ వారు దుయ్యబట్టారు. ప్రియాంకా చోప్రా కోపానికి కారణం ఈ అంశమే. స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించాల్సింది పోయి... ఈ విధంగా అర్థం లేకుండా మాట్లాడతారా? అంటూ సదరు సభ్యులపై ప్రియాంక నిప్పులు గక్కారు. కేవలం స్కర్టులు వేసుకోవడం వల్లనే రేప్‌లు జరుగుతున్నాయనడం అమానుషమనీ, కామాంధుల చర్యలను తప్పుబట్టకుండా... మహిళల్ని వేలెత్తి చూపిస్తున్న మీరసలు మగాళ్లేనా అంటూ ప్రియాంక అంతెత్తున లేచారు. ‘‘ఈ విషయంపై నేను కూడా కోర్టుకెళ్తా. ఐటమ్ సాంగ్స్‌లో నర్తించడం వ్యభిచారం ఎలా అవుతుందో తేల్చుకుంటా. ఇలా మహిళలపై బాధ్యత లేకుండా కామెట్లు చేసిన మగాళ్లందరూ లంగాలు కట్టుకొని తిరగాలని ప్రకటించాలంటూ కోర్టును అభ్యర్థిస్తా’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు ప్రియాంక. -
'ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించండి'
జింద్(హర్యానా): మహిళలు జీన్స్ ధరించకుండా నిషేధం విధించాలని అఖిల భారత్ హిందూ మహాసభ డిమాండ్ చేసిన మరుసటి రోజే... అదే సంస్థ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించే వారిని వేశ్యలుగా ప్రకటించాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెళ్తామని ఓ విలేకరితో చెప్పారు. ' ఈ విషయంపై మా నాయకులతో చర్చిస్తున్నాం. ఐటెం గాల్స్ ను సుప్రీంకోర్టు వేశ్యలుగా ప్రకటిస్తే సమాజం వారిని బహిష్కరిస్తుంది' అని వ్యాఖ్యానించారు. కురుచ దస్తులు ధరించి సినిమాల్లో కలిపించే ఐటెంగాల్స్, హీరోయిన్లను వేశ్యలుగా పరిగణించాలని త్యాగి పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. తమ న్యాయవాదులతో మాట్లాడుతున్నందున ఈ విషయాన్ని ఇప్పుడే బహిరంగంగా వెల్లడించలేనని అన్నారు. పొట్టి బట్టలు వేసుకుని సినిమాల్లో తైతక్కలాడడం వల్లే మహిళలపై ఘోరాలు పెరుగుతున్నాయని త్యాగి అభిప్రాయపడ్డారు. పాఠశాలలు, కాలేజీల్లో ఆడపిల్లలకు డ్రెస్ కోడ్ ఉండాలని సెల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించాలని అఖిల భారత్ హిందూ మహాసభ సోమవారం డిమాండ్ చేసింది. -
ఐటమ్ గాళ్స్గా స్టార్ హీరోయిన్స్
ఐటంసాంగ్స్ అంటే మాస్ ప్రేక్షకులకు మహా పిచ్చి. సినిమాలో ఓ ఐటంసాంగ్ ఉంటే ఆ ఊపేవేరు. టాలీవుడ్లో ఈ సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. స్టార్ హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న బ్యూటీస్ కూడా ఐటం గాళ్స్ గా అవతారమెత్తి మతులుపోగొడుతున్నారు. కేక పుట్టిస్తున్నారు. బాలీవుడ్లో ట్రెండ్ ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు టాలీవుడ్లో కూడా బాగా కనిపిస్తోంది. స్టార్ స్టేటస్ అనుభవిస్తోన్న హీరోయిన్స్ కూడా ఐటంసాంగ్స్కి ఓకే చెబుతున్నారు. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరుపులా కనిపించి ప్రేక్షకులను మైమరపిస్తున్నారు. ఆ సినిమాకు సిరులు కురిపిస్తున్నారు. మిల్కీబ్యూటీ తమన్నా అల్లుడు శీను చిత్రంలో తళుక్కున మెరిసింది. నా ఇంటిపేరు సిల్కూ.. అంటూ మిల్కీ అందాలు ఒలకబోస్తూ.. ఆడియెన్స్ మదిలో అగ్గిపుట్టించింది గబ్బర్ సింగ్ మూవీతో భాగ్యలక్ష్మిగా కనిపించిన శృతి హాసన్ ఒక్కదెబ్బతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. టాలీవుడ్ యంగ్ హీరోలతో చిందులేస్తూ ఫుల్ బిజీగా ఉంది. శృతి కూడా ఐటం స్టెప్పులతో మతి పోగొట్టడానికి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోతోన్న ఆగడు మూవీలో ఓ ఐటంసాంగ్లో చిందేయబోతోంది. కొంత కాలంగా ఖాళీగా ఉన్న త్రిష మళ్ళీ ఇప్పుడు బిజీ అయిపోతోంది. సత్యదేవ్ డైరెక్ట్ చేస్తోన్న ఓ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా కనిపించబోతోంది. తమిళ్లో మరో రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఐటం స్టెప్స్ వేసే ఆఫర్‌ని కొట్టేసిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. లింగా మూవీలో త్రిష ఐటం బాంబ్‌గా మారి నిషా ఎక్కించబోతోందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఐటం సాంగ్స్‌ని హాయిగా ఆస్వాదిస్తున్నారు. అందుకే హీరోయిన్లు కూడా ఐటం సాంగులు చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఎప్పుడూ పద్దతిగా ఉంటే ఏం బాగుంటుదనుకుందో ఏమో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్‌తో హీటెక్కించింది. సింగం 2 మూవీలో ఓ హాట్ ఐటమ్ బ్యూటీగా కనిపించింది. అనుష్క సూపర్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ డాల్‌గా గరంగరంగా కనిపించి. గుండెలు ఝల్లుమనిపించింది. ఆరుంధతి మూవీతో జేజెమ్మగా జేజేలు అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ భారీ ప్రాజెక్టుల హీరోయిన్గా ఉన్న అనుష్క కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. సూపర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కింగ్ నాగ్‌తో కేడీ మూవీలో స్పెషల్ ఐటం గా మురిపించింది. ఆ తరువాత ఈ బ్యూటీ స్టాలిన్‌లో మెగాస్టార్ చిరంజీవితో కాలు కదిపింది. జ్యోతిలక్ష్మి, జయమాలిని... కాలంలో క్లబ్ సాంగ్స్ అంటే ఫ్యామిలీ ప్రేక్షకులు పెదవి విరిచే వారు. వాటిని అశ్లీల కేటగిరీ కింద లెక్కగట్టేవారు. రాను రాను ఐటం సాంగు తీరు మారడంతో పాటు ప్రేక్షకుల్లో ఆ సాంగ్స్‌పై అభిప్రాయం కూడా మారిపోయింది. శ్రీయ టాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్గా వెలిగిపోయింది. దేవదాసు మూవీ నుంచి ఐటం సాంగ్స్ చేయడం మొదలుపెట్టింది. కందిరీగ, తులసి, మున్నా, పులి చిత్రాల్లో శ్రీయ ఐటం సాంగ్స్‌లో చిందులేసి ఆడియెన్స్‌కు కంటిమీద కునుకులేకుండా చేసింది పాపం చార్మికి ఈ మధ్య ఆఫర్లు బాగా తగ్గాయి. తెలుగు, తమిళం, కన్నడం.. ఎక్కడా సరైన అవకాశాలు ఇవ్వకపోవడంతో ఐటం సాంగ్స్‌పై కన్నేసింది. బాలీవుడ్ భామలను స్ఫూర్తిగా తీసుకునిగాని ఐటం సాంగ్స్ తో అదరగొడుతోంది. ఆ మధ్య నాగార్జున డమరుకం సినిమాలో చాయ్ సాంగుతో సక్కుబాయిగా షేక్ చేసింది. ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా రూపొందిన నాయక్ సినిమాలో నెల్లూరే సాంగుతో ఛార్జీ కేక పుట్టించింది ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ప్రియమణి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. చెన్నైఎక్స్ ప్రెస్ సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ తన కెరీర్‌ను మళ్లీ మార్చేస్తుందని ఆశించింది. ఆ ఐటం కోసం ప్రియమణి పడ్డ ప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. ఆ పాటకి ఒక్క రూపాయి కూడా రెమ్యునిరేషన్ తీసుకోలేదట.షారూఖ్ సినిమా కాబట్టి అందుకు తగ్గ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ప్రియమణి ఆశలు పెట్టుకున్నా అంతగా ఫలితం దక్కలేదు పాపం. కాలంతో పాటు కొన్ని అభిప్రాయలు కూడా మారుతూ ఉంటాయి. ఐటంసాంగ్స్ కు అది బాగా వర్తిస్తుంది. ఇప్పుడు ఐటంసాంగ్స్ కేవలం శృంగార ప్రియుల్ని మాత్రమే అలరించటంలేదు. చిన్న పిల్లలు కూడా కెవ్వుకేక అంటూ స్టెప్పులేస్తున్నారు. అందుకే టాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఐటం చిందులేయటానికి ఆలోచించటంలేదు. పాలతరగలా ఉంటే పార్వతీ మెల్టన్ కూడా పువ్వాయ్.. పువ్వాయ్.. ఐటంబాట పట్టింది హంసానందిని ప్రతిదినం నీ దర్శనం.. అంటూ అనుమానాస్పదం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలతో తెరమరుగైంది. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత మిర్చిలో టైటిల్ సాంగ్ కోసం ఐటం గాళ్‌గా మారింది. భాయ్, అత్తారింటికి దారేది సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో సందడి చేసింది. హంసా ఐటం చిందులేస్తే ఆ మూవీ హిట్టే అన్న టాక్ కూడా వచ్చేసింది. లక్కీ ఐటంగాళ్గా హంసా నందిని ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతోంది. తెలుగుతెరపై ఐటంసాంగ్స్ ఆటం బాంబుల్లా పేలుతున్నాయి. అదిరిపోయో స్టెప్స్ తో అందాల భామలు బ్యాంక్ బ్యాలెన్సు నింపుకుంటున్నారు. కాంచమాల కేబుల్ టివీ అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమయిన లక్ష్మీరాయ్ కూడా ఐటం సాంగ్స్ వైపే టర్నింగ్ ఇచ్చుకుంది. ఎన్ని అవకాశాలు వచ్చినా హీరోయిన్గా బ్రేక్ రాకపోవటంతో చేసేదేమీలేక లక్ష్మీరాయ్ ఐటం అవతారమెత్తింది. 7/జి బృందావన కాలనీ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సోనియా అగర్వాల్ గుర్తుండే ఉంటుంది. ఆ తరవాత ఆమె కెరీర్ సజావుగా సాగలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రత్యేక గీతాలవైపు దృష్టి మళ్లించింది. అంజి శ్రీను దర్శకత్వం వహించిన అమ్మా నాన్న ఊరెళితే అనే యూత్ ఫుల్ మూవీలో ఐటంగాళ్ గా కనిపించింది. కానీ ఆ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఐటం మసాలా ఘాటు తగలకపోతే ఆ సినిమాలో టేస్టే ఉండదు. సగటు ప్రేక్షకుడు ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నాడు. సినిమా విజయంలో ఐటంసాంగ్స్కీ రోల్స్ పోషిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి ఇంపోర్టయింది సమీరారెడ్డి. జై చిరంజీవ మూవీలో మెగాస్టార్ తో కలిసి నటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కూడా జతకట్టింది. చాలా గ్యాప్ తీసుకుని కృష్ణంవందే జగద్గురుమ్ మూవీతో ఐటంగాళ్గా రీఎంట్రీ ఇచ్చింది. సినిమాలో అదిరిపోయో ఐటంసాంగ్ ఉంటే చాలు.. విపరీతమైన హైప్ క్రియోటయి కూర్చుంటుంది. ఆ మసాలా పాటలకున్న పవర్ అలాంటిది. ఐశ్వర్యారాయ్ రాయ్ పోలికలుండే స్నేహా ఉల్లాల్ తన అల్టిమేట్ అందాలతో మతి పోగొడుతూ ఉంటుంది. చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు కొట్టేసింది. చివరికి బాలయ్యతో సింహా మూవీ చేసినా కలిసిరాలేదు. స్నేహ కూడా ఐటం సాంగ్స్ వైపే అడుగేసింది. ఇప్పుడు ఐటం సాంగ్స్ కోసం కోట్ల ఖర్చుపెడుతున్నారు. అదే రేంజ్లో కాసులపంట పండిస్తోన్న ఈ ఐటం సాంగ్స్ ట్రెండ్ 70 వ దశకంలోనే ప్రారంభమైంది. క్లబ్ సాంగ్స్‌తో స్టార్టయిన ఈ ట్రెండ్ ఇప్పుడు పబ్ సాంగ్స్‌గా పరిణితి చెందింది. సీనియర్ హీరోయిన్లకు కూడా ఐటంపాటలు ఆయుధాలుగా మారాయి. టాలీవుడ్ టాప్ హీరోలతో సూపర్ హిట్స్ కొట్టింది రమ్యకృష్ణ. కెరీర్ డౌన్ ఫాల్లో పడ్డాక కూడా రమ్య స్క్రీన్‌ని వదిలిపెట్టలేదు. తెలుగు యంగ్ హీరోలతో ఐటం స్టెప్పులు వెయ్యటానకి ఏమాత్రం వెనుకాడలేదు. విందుభోజనంలా ఉండే స్పెషల్ చిందుల్ని చూసేందుకు ప్రేక్షకులు తెగ ఆరాటపడుతున్నారు. అందుకే స్టార్ హీరోయిన్లు సైతం ఐటంగాళ్స్గా మారిపోతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement