-
అలా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి..తమన్నా
పన్నెండు గంటల గ్యాప్‌తో ఆహారం తీసుకోవడం వల్ల తనకు ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నట్లుగా హీరోయిన్ తమన్నా చెబుతున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నేను చాలా రకాల డైట్స్‌ను ఫాలో అయ్యాను. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ డిన్నర్‌కి, నెక్ట్స్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య పన్నెండుగంటల గ్యాప్ ఉన్నప్పుడు నాకు మంచి ఫలితాలు కనిపించాయి. ఉదాహరణకు నేను ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు నా లాస్ట్ మీల్ చేస్తే... మర్నాడు ఉదయం 6 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేసేదాన్ని. ఇలా చేయడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. మునుపటి కన్నా నా ఎనర్జీ లెవల్స్ పెరిగాయి. అయితే నాకు బాగుందని అందర్నీ పన్నెండు గంటల గ్యాప్‌ని ఫాలో అవ్వమని చెప్పడంలేదు. ఎందుకంటే వారి వారి ఆరోగ్య స్థితి, వారి సామర్థ్యాలను బట్టి డైట్ టైమింగ్‌ని ఫాలో అవ్వడం ఉత్తమం’’ అని పేర్కొన్నారు. కాగా ఓ ప్రముఖ చానెల్లో తమన్నా చేస్తున్న కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ త్వరలో ప్రసారం కానుంది. సినిమాల విషయానికి వస్తే... తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్’, ‘గుర్తుందా..శీతాకాలం’ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. -
నా శారీరక వయసు 83 నా మానసిక వయసు 23
వయసు పెరిగేకొద్ది క్రియేటివిటీ తగ్గిపోతుందా? మెమరీ లాస్ అయిపోతుందా? ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయా? హెల్త్ దెబ్బతింటుందా? ఫిజిక్ కంట్రోల్ తప్పిపోతుందా? ఏమో... సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు విషయంలో మాత్రం ఇవన్నీ రాంగే! ఇప్పుడాయన వయసు 83 ఏళ్లు. కానీ 23 ఏళ్ల కుర్రాడిలాగానే ఆలోచిస్తారు. ఆ సీక్రెట్స్ ఏంటో ఆయన్నే అడిగి తెలుసుకుందాం! నో సీక్రెట్స్: నన్ను అందరూ కామన్‌గా అడిగే ప్రశ్న ఒక్కటే. ఈ వయసులో కూడా మీరింత ఉత్సాహవంతంగా ఎలా ఉండగలుగుతున్నారని. ఈ విషయంలో ఎలాంటి రహస్యాలూ లేవు. నా మనసే దీనికి ప్రధాన కారణం. మామూలుగా అందరికీ శారీరక వయసు, మానసిక వయసు ఉంటాయి. రెండింటినీ బ్యాలెన్స్ చేసేవారే యూత్‌ఫుల్‌గా ఆలోచిస్తారు. నా వయసు 83 అయితే, నా మనసు వయసు 23. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఉత్సాహమే నా మానసిక యవ్వనానికి కారణం. వయసు పెరిగాక శారీరకంగా రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అవన్నీ నాకూ ఉన్నాయి. మనసు మన అధీనంలో ఉంటే వాటిని సులువుగా అధిగమించేయొచ్చును. అభిరుచికి నో రిటైర్మెంట్: ఇప్పటి జనరేషన్లో నిరుత్సాహం ఎక్కువైపోయింది. ఎంత చేసినా మన బతుకింతేగా అనుకుంటూ బతుకు బండిని బరువుగా ఈడుస్తున్నారు. నాకలాంటి నిరుత్సాహాలు, నిస్పృహలు అప్పుడూ లేవు, ఇప్పుడూ లేవు. చేసే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటే ఉండొచ్చు కానీ, మన అభిరుచికి మాత్రం రిటైర్మెంట్ ఉండకూడదు. ఈసురోమంటూ ఆఫీసుకెళ్లడం... ఎప్పుడు అక్కడ నుంచీ బయటపడతామా అని ఎదురుచూడటం, సెలవు కోసం ఆత్రపడటం... ఇవన్నీ పనిమీద ఆసక్తి లేకపోవడం వల్ల వచ్చే చర్యలు. మనకు నచ్చే పని చేసే అవకాశం రావడం అందరికీ కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఉద్యోగంతో పాటు మన అభిరుచికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా తరచుగా పాల్గొంటే మనసు చైతన్యవంతం అవుతుంది. స్టూవర్డ్ అని నాకు తెలిసిన ఓ ఆంగ్లో ఇండియన్, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌లో పనిచేసేవారు. ఆయనకు పక్షులంటే చాలా ఇష్టం. సెలవు రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరుగుతూ రకరకాల పక్షులు గురించి పరిశోధన చేసి, ఓ పుస్తకం రాశాడు. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వ్యాపకం ఒకటి ఉంటుంది. దాని మీద ఏకాగ్రత చూపిస్తే ఎప్పటికీ ఉత్సాహంగా ఉంటాం. నా అంత బిజీ ఎవరూ ఉండరు: నేను అప్పుడూ బిజీనే. ఇప్పుడూ బిజీనే. అసలు నా అంత బిజీ ఎవ్వరూ ఉండరు కూడా. ఇప్పటికీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. టిఫిన్ చేయగానే నా రూమ్‌లోకి వెళ్లిపోయి, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి యూ ట్యూబ్‌లో నాకిష్టమైన సినిమాలు చూస్తుంటాను. పాటలకు ట్యూన్ కట్టుకుంటుంటాను. కొత్త కథల గురించి ఆలోచిస్తూ ఉంటాను. నాకు లైఫ్‌టైమ్ ఎఛీవ్మెంట్ అవార్డు ఇస్తానంటే, అంతకన్నా శాపం ఏదీ ఉండదు. ఎందుకంటే నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది చాలా ఎక్కువ. ఆ నడకే ఇప్పటికీ నాకు హెల్ప్: నేను మొదట్నుంచీ వాకింగ్ ఎక్కువ చేసేవాణ్ణి. షూటింగ్స్‌కి కూడా నడిచే వెళ్లేవాణ్ణి. ఆ నడక ఇప్పటికీ నాకు హెల్ప్ అవుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం ఓ అరగంట వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తాను. నేను తినేదంతా వెజిటేరియన్ ఫుడ్డే. లంచ్‌తో పాటు డిన్నర్లో కూడా రైస్ తీసుకుంటాను. నచ్చిన ఫుడ్ తినేస్తాను. రాత్రి 11 గంటలకు నిద్రపోతాను. ఇలా పడుకుంటానో లేదో వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుంది. అనవసరపు విషయాలు పట్టించుకోను: నా మనసు ఎక్కువ ఆలోచిస్తుంది కానీ, అనవసరమైన విషయాల గురించి కాదు. కోపాలు, ఈర్ష్యలు అస్సలుండవు. నాకు సినిమా ఫీల్డ్‌లో విరోధులు ఎవ్వరూ లేరు. 60 ఏళ్ల క్రితం విషయాలు కూడా గుర్తుంటాయి: నాకు పెద్దగా మనుషులు గుర్తుండరు కానీ, సినిమాకు సంబంధించిన ఏ అంశమైనా బాగా గుర్తు. 60 ఏళ్ల క్రితం ఏదో పేపర్లో చదివిన వార్త, సినిమాలో చూసిన సంఘటన కూడా ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. దాన్ని బట్టి ఆలోచించండి... నా మెమరీ పవరేంటో! నేనెప్పటికీ యూత్! ఫైనల్‌గా ఒక్క విషయం చెప్పనా... పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు నేను నా వయసు వాళ్లతో అస్సలు కూర్చోను. కుర్రవాళ్లతో కూర్చుని వాళ్ల కెరీర్, అభిరుచుల గురించి తెలుసుకోవడం నాకిష్టం. అలా అప్డేట్ అవుతాను. నాకు వయసు మీద పడిందనే ఆలోచన ఎప్పుడూ రాదు. నేను ఎప్పటికీ యూత్. అందుకే టీషర్ట్స్ వేసుకుంటుంటాను.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్‌రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
Advertisement