-
నగదు బదిలీ...
నేటి నుంచి అమలు సిలిండర్ ధర రూ.952 హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో అమలు మొదటి మూడు నెలలు మినహాయింపు మరో మూడు నెలలు అదనపు అవకాశం సిటీబ్యూరో: హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీకి (డీబీడీ) శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. నగరంలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.952గా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా తొలివిడత వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ విధానం అమలయ్యే జిల్లాల్లో హైదరాబాద్-రంగారెడ్డి కూడా ఉన్నాయి. ఇక వినియోగదారులు సిలిండర్‌ను మార్కెట్ ధర ప్రకారం పూర్తి స్థాయిలో నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా ఆధార్ నంబర్‌తో సంబంధం లేదు. విని యోగదారులకు బ్యాంక్ ఖాతా ఉంటే అందులో సబ్సిడీ నగదు రూపంలో జమవుతుంది. ఇదీ ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం జంట జిల్లాల్లో సుమారు 29 లక్షల ఎల్పీజీ గృహ వినియోగదారులు ఉన్నారు. అందులో బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన వారి సంఖ్య 22.24 లక్షలు. మరో 6.74 లక్షల వినియోగదారులు బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం కావాల్సి ఉంది. ఖాతా లేని వారికి మొదటి మూడు నెలలు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా అవుతుంది. అ తర్వాత మరో మూడు నెలలు అదనపు మినహాయింపు కాలంగా వెసులుబాటు కల్పిస్తారు. ఈలోగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం కాని వారు పూర్తి స్థాయి మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గడువులోగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుంటే అప్పటి వరకు తీసుకున్న సిలిండర్ సబ్సిడీమొత్తాన్ని నగదుగా పొందే వెసులుబాటు కల్పించారు. గతంలో పరిస్థితి.. గతంలో వంటగ్యాస్‌కు ఆధార్‌తో ముడిపెట్టి, న గదు బదిలీని అమలు చేశారు. ఇది వినియోగదారులకు చుక్కలు చూపించింది. మొత్తం తొమ్మిది నెలలు అమలైనప్పటికీ... మొదటి మూడు నెలల పాటు మినహాయింపు కాలంగా పరిగణించారు. ఫలితంగా ఆధార్ అనుసంధానం కాని వారికీ సబ్సిడీ వర్తించింది. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ ఒకటి నుంచి 2014 ఫిబ్రవరి వరకు పూర్తి స్థాయి డీబీటీ అమలు కావడంతో వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. ఆధార్అనుసంధానం కాని వారు సిలిండర్‌కు పూర్తి స్థాయి ధర ను చెల్లించాల్సి వచ్చింది. -
ఓటర్లకు నాయకుల 'నగదు బదిలీ'
ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడానికి అభ్యర్థులు దొంగదారులు వెతుక్కుంటున్నారు. ఏ మార్గంలో డబ్బు తరలించినా ఎన్నికల అధికారులు పట్టేసుకుంటున్నారు. రహస్యంగా పంపుదామనుకుంటున్నా ప్రత్యర్థి పార్టీలకు విషయం తెలిసిపోయి ఉప్పందించడంతో పోలీసులు, అధికారులు, మీడియా వచ్చి పట్టుకుంటున్నారు. అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. పోటీ చేసే అభ్యర్థులు దీనికి కూడా పరిష్కారాలు కనుగొంటున్నారు. ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టి.. తర్వాత ఉపసంహరించుకున్న 'ప్రత్యక్ష ప్రయోజన బదిలీ'.. అదే నగదు బదిలీ పథకాన్ని ఇందుకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు!! చాలామంది ఓటర్లకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం పుణ్యమాని దాదాపు అందరూ బ్యాంకు ఖాతాలు తెరవడంతో పాటు.. ఆ వివరాలను గ్యాస్ డీలర్లకు ఇచ్చారు. దాంతో గ్యాస్ డీలర్ల వద్ద వాళ్ల పరిధిలో ఉన్న వినియోగదారులందరి బ్యాంకు ఖాతాల వివరాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న మొత్తం గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్లి, వారివద్ద నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు తమ అనుచరుల్లో కొంతమందిని ఇందుకోసం పురమాయిస్తున్నారు. ఒక్కొక్కరికి లక్ష, రెండు లక్షల వంతున వారి ఖాతాల్లో డిపాజిట్ చేసి.. ఆయా ఖాతాల నుంచి ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేయిస్తున్నారు. బలహీనవర్గాలకు చెందిన ఓటర్లకు కూడా బ్యాంకు ఖాతాలు ఉండటంతో వీరి పని మరింత సులభం అవుతోంది. డీలర్ల నుంచి కాకుండా నేరుగా ఆయా వాడల్లోని పెద్దల వద్దకు వెళ్లి వారినుంచే వివరాలు తీసుకుని తాము ఇవ్వదలచుకున్న మొత్తం అలా బదిలీ చేసేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం కాస్తా నాయకులకు ఇలా పంట పండిస్తోంది!!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement