-
2017లో 20 లక్షల ఉద్యోగాలు!
-
2017లో 20 లక్షల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: దేశంలోని నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే. డీమానిటైజేషన్ కారణంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలకు లభిస్తున్న ప్రోత్సాహం లాంటి ఇతర కారణాలల మూలంగా టెలికాం రంగంలో నిపుణుల అవసరం బాగా పెరగనుందని , దీంతో ఈ ఏడాది సుమారు 20 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ రిపోర్ట్ ప్రకారం డేటా వ్యాప్తి, కొత్త సర్వీసు ప్రొవైడర్ల ప్రవేశంకారణంగా రెండు మిలియన్ల ఉద్యోగాలు ఈ ఏడాది పెరిగనున్నాయి. ఇందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలని నివేదిక భావించింది. డీమానిటైజేషన్ , మొబైల్ ధరలు తగ్గడం, నెట్ వర్క్ విస్తరణకు ఆయా కంపెనీల పెట్టుబడులు,ఇంటర్నెట్ వినియోగం , డిజిటల్ లావాదేవీలు పెరగడం, ప్రభుత్వ సంస్కరణలు ఇందుకు కలిసి రానున్నాయని పేర్కొంది. టెలికాం రంగ నైపుణ్య కౌన్సిల్ (టీఎస్ఎస్సీ)తో కలిసి ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచాలని, తద్వారా భారీ స్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఈ విభాగంలో 2020-21 నాటికి 9.20 లక్షల ఉద్యోగాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) లభిస్తాయని తెలిపింది. 2021 నాటికిటెలికాం రంగంలో మొత్తం 87 లక్షల మందికి పైగా ఉపాధి దొరుకుంతుందని అంచనా వేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ (ఐఓటీ), మొబిలిటీ సొల్యూషన్స్, టెలికాం మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ నిర్మాణాలు, విక్రయాలు తదితర విభాగాలకు నిపుణులు అవసరమని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షులు నీతి శర్మ అన్నారు. మొబైల్ తయారీ సంస్థలకు 17.60 లక్షల (1.76 మిలియన్) మంది, టెలికాం ఆపరేటర్లకు 3.70 లక్షల (0.37 మిలియన్)మంది ఉద్యోగుల అవసరమున్నట్లు తన నివేదికలో పేర్కొంది. నెట్వర్క్ ఇంజినీర్లు, సైబర్ భద్రతా నిపుణులు, సేవల నిపుణులు, యాప్ డెవలపర్లు, సిస్టమ్ ఇంజినీర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మొబైల్ తయారీ నిపుణులు, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ , ఐ-డీఏఎస్ ఇంజనీర్లు ఉన్నాయి, బ్యాక్ ఆఫీస్ & ఎడ్మినిస్ట్రేషన్ లాంటి కీలక ప్రొఫైల్స్ లో 2017 నాటికి డిమాండ్ బాగా ఉంటుందని తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement