-
రియల్టీ చరిత్రలో ఇదో రికార్డ్.. భారీ ధరకు అమ్ముడైన దయ్యాల కొంప
ఓ ప్రాపర్టీ మంచిది కాదనే పేరు పడితే చాలు ఎంత ప్రైమ్ లోకేషన్లో ఉన్నా, వాస్తు దోషాలు లేకున్నా, ఎమినిటీస్ బాగున్నా ఆ ప్రాపర్టీ అమ్ముడుపోదు. కొనేందుకు ఒక్కరూ ముందుకు రారు. కానీ అమెరికాలో ఈ భయంగొలిపే ఓ భవనం మాత్రం రియల్టీ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తూ రికార్డు రేటుకు అమ్ముడై పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూత్‌బంగ్లా హాలీవుడ్ సినిమా ప్రియులకు ఆమాట కొస్తే హరర్ మూవీ లవర్స్‌కి కంజ్యూరింగ్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. దెయ్యాలు, భూతాలు, ప్రేతాలకు సంబంధించి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా కంజ్యూరింగ్ సిరీస్‌లో సినిమాలు వస్తున్నాయి. ఆండ్రియా పెరాన్ (67) అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు 1971 నుంచి 1980 వరకు రోడే ఐలాండ్‌లో ఓ ఫార్మ్‌హౌజ్‌లో నివసించారు. కంజ్యూరింగ్ కొంప 1736లో కట్టిన ఆ ఫార్మ్‌హౌజ్‌లో పెరాన్ కుటుంబానికి దెయ్యాలతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఫార్మ్‌హౌజ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా 2013లో కంజ్యూరింగ్ సినిమాను తెరకెక్కించగా బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపింది. అయితే అప్పటి వరకు ఆ ఫార్మ్‌హౌజ్ గురించి స్థానికులకు మాత్రమే తెలుసు. కంజ్యూరింగ్ పుణ్యమా అని ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి ఆ ఇళ్లు అంటే హడల్ అందరికీ. దయ్యాలపై ప్రయోగాలు అయితే ఇటీవల దెయ్యాల కొంపగా పేరుపొందిన తన ఫార్మ్‌హౌజ్‌ను అమ్మేందుకు ఎంతగా ప్రయత్నించినా ఎవరూ కొనలేదు. రెండు దశబ్ధాల తర్వాత 2019లో అమ్మగలిగాడు. ఈ ఇంటిని జెన్, కోరి హైన్‌జన్ అనే ఇద్దరు వ్యక్తులు కంజూరింగ్ దయ్యాల కొంపను సొంతం చేసుకున్నారు. ఎందుకంటే వీరిద్దరు అప్పటికే ఆత్మల పరిశోధనలు చేస్తున్నారు. దీంతో ఈ ఇళ్లు తమ పరిశోధనలకు పనికి వస్తుందని 4,39,00 డాలర్లకు కొనుగోలు చేశారు. ఏం జరిగిందో మరి ఆ దయ్యాల కొంపలో జెన్, కోరి హైన్‌జన్ ప్రయోగాలు పూర్తయ్యాయో లేదా వాళ్లకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాలో తెలియదు కానీ వాళ్లు రెండేళ్లు మించి ఈ ఇంటిని తమతో అట్టిపెట్టుకోలేకపోయారు. 2021 సెప్టెంబరులో ఈ ఇంటిని 1.2 మిలియన్ డాలర్లు ఆస్కింగ్ ప్రైజ్‌గా నిర్ణయించి అమ్మకానికి పెట్టారు. ఆ దెయ్యాల కొంపను ఫ్రీగా ఇచ్చినా ఎవరూ కొనరు. అలాంటిది 1.2 మిలియన్ డాలర్లు చెల్లించి ఎవరు సొంతం చేసుకుంటారనే మాటలు అంతటా వినిపించాయి. ఎవరతను? అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కొద్ది రోజుల్లోనే ఈ భూత్‌బంగ్లాను సొంతం చేసుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు. ఆస్కింగ్ ప్రైజ్‌ను మించి చెల్లించేందుకు రెడీ అయ్యారు. దీంతో ఏకంగా 1.52 (రూ. 12 కోట్లు) మిలియన్ డాలర్లకు ఇళ్లు అమ్ముడైపోయింది. 3100 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ భూత్‌బంగ్లా కొత్త ఓనర్ ఎవరనేది మాత్రం గోప్యంగా ఉంచారు. చదవండి: లగ్జరీ హోమ్స్‌కే డిమాండ్ ఎక్కువ: 3 బీహెచ్‌కే సేల్స్ జూమ్ -
ఆ సినిమాకు కుక్కలు కూడా వణికిపోతున్నాయి
ది కంజ్యూరింగ్-2.. ఇప్పుడు ఈ హాలీవుడ్ సినిమా చేస్తున్నంత హల్ చల్ మరే చిత్రం కూడా చేయడం లేదు. థియేటర్లోకి వెళుతున్నవారు తమ గుండెలను అదిమిపట్టుకుంటూనే భయపడేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్కొక్కరు రెండు మూడుసార్లు ఈ సినిమా చూస్తూ భయాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సినిమా ఎంత ఆసక్తిగా తీశారో వేరే చెప్పనక్కర్లేదు. అయితే, ఈ సినిమా చూసిన వాళ్లే కాదు.. జంతువులు కూడా తెగ భయపడిపోతున్నాయని ఓ వీడియో చెబుతోంది. సామాజిక అనుసంధాన వేదికల్లో ఒకటైన ట్విట్టర్ లో ఒక వ్యక్తి ది కంజ్యూరింగ్-2సినిమాను ప్రస్తావిస్తూ ఓ వీడియో ట్వీట్ చేశాడు. ఇందులో ఓ ఇంట్లో టీవీలో ది కంజ్యూరింగ్-2 సినిమాను కుక్క కూడా ఎంతో ఆసక్తిగా చూస్తు అందులో వచ్చే భయానక సన్నివేశాలు చూసి చివరకు అది కూడా భయంతో సోఫా చాటుకెళ్లి నక్కింది. సాధారణంగా దెయ్యాలను చూస్తే కుక్కలు మొరుగుతాయని, వెంటపడి తరుముతాయని చెప్పడం విన్నాం కానీ.. ఇలా దెయ్యం సినిమా చూసి భయపడి దాచుకునే కుక్కలు ఉంటాయని తెలుసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని వీడియో తీసి ఓ వ్యక్తి పోస్ట్ చేయగా మన తెలుగు సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ఖాతా ద్వారా రీ ట్వీట్ చేశారు. -
మళ్లీ భయపెట్టనున్న కన్జ్యూరింగ్-2
ది కంజ్యూరింగ్ హారర్ కథా చిత్రం అనడానికి అసలైన నిదర్శనం ఇది. ప్రేక్షకులకు భయం అంటూ ఏమిటో తెలిపిన చిత్రం. ఉత్కంఠకు పరాకాష్ట. ప్రేక్షకులు క్షణం క్షణం గుండెల్ని గుప్పెట్లో పెట్టుకుని చూసిన చిత్రం ది కంజ్యూరింగ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండో హారర్ చిత్రంగా రికార్డ్‌కెక్కిన చిత్రం ఇది. ఆ చిత్ర దర్శకుడు జేమ్స్‌వాన్ తాజాగా ది కంజ్యూరింగ్కు సీక్వెల్‌ను సిద్ధం చేశారు. ది కంజ్యూరింగ్ చిత్రం కంటే మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరింతంగా,అన్నిటికీ మించి మరింత భయపెట్టే చిత్రంగా కంజ్యూరింగ్-2 ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. ఇది కూడా పారానార్మల్ ఇతివృత్తంతో కూడిన చిత్రమే.అయితే యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మించడం విశేషం. నలుగురు పిల్లలతో తల్లి నివశించే ఒక ఇంట్లో జరిగే అనూహ్య సంఘటనలను ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఎలా ఛేదించాడన్న పలు ఆసక్తికమైన అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని ఆంగ్లం,తమిళ భాషల్లో జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు వార్నర్ బ్రదర్స్ నిర్వాహకులు వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement