-
నడిరోడ్డులో యువకుడిని బాదేసిన తృప్తి దేశాయ్
-
నడిరోడ్డులో యువకుడిని బాదేసిన తృప్తి దేశాయ్
మహిళలకు ప్రవేశం లేదని చెప్పే ఆలయాల్లోకి వెళ్లి.. అక్కడ తాము సైతం పూజలు చేస్తామంటూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ తాజాగా ఓ యువకుడిని నడిరోడ్డులో చితకబాదేసింది. చెప్పులతో కొట్టింది. ఒక మహిళతో సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకోడానికి నిరాకరించినందుకు అతడికి ఈ శిక్ష విధించింది. మహిళా హక్కుల కార్యకర్త అయిన తృప్తి తన సహచరులతో కలిసి శ్రీకాంత్ లోంఢే అనే వ్యక్తిని పుణె-అహ్మద్‌నగర్ రోడ్డుపై శిర్వాల్ అనే గ్రామం వద్ద నడిరోడ్డులో అందరూ చూస్తుండగా చెప్పులతో కొట్టింది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని తృప్తి ఆరోపించింది. ఇప్పుడామె గర్భవతి అయ్యిందని.. అబార్షన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆమె చేయించుకున్న తర్వాత కూడా పెళ్లి చేసుకోలేదని తెలిపింది. అతడు ఇంతకుముందు మరో ఇద్దరు మహిళలను కూడా ఇలాగే మోసం చేశాడని, దాంతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం ఏమీ కనపడలేదని చెప్పింది. లోంఢేను తృప్తి దేశాయ్ కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. అయితే.. ఇదంతా పబ్లిసిటీ స్టంటేనని, ఇలా జనాన్ని శిక్షించడం తృప్తి దేశాయ్ మానుకోవాలని కొందరు కామెంట్లు పెట్టారు. సామాజిక కార్యకర్తలమని చెప్పుకొనేవాళ్లు ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమకు ఇష్టం వచ్చినట్లు న్యాయం చెబుతుంటే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుందని విశ్వంభర్ చౌదరి అనే సామాజిక కార్యకర్త అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement