-
కనకదుర్గమ్మను దర్శించుకున్న మహేశ్
-
వందేళ్ల వరకు సినిమాలే చేస్తా: మహేశ్
సాక్షి, విజయవాడ: సూపర్ స్టార్ మహేశ్ బాబు శుక్రవారం విజయవాడలో సందడి చేశారు. ‘భరత్ అనే నేను’ సినిమా విజయం సాధించడంతో మహేశ్ నగరంలోని అన్నపూర్ణ థియేటర్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ప్రేక్షకులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. మహేశ్‌తో పాటు చిత్ర దర్శకుడు కొరటాల శివ, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. సినిమా చూసిన తర్వాత మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విజయవాడలో సినిమా చూడటం సంతోషంగా ఉంది. ఒక్కడు, పోకిరి, దూకుడు చిత్రాల విజయోత్సవ వేడుకలను ఇక్కడే నిర్వహించాం. వందేళ్లు వచ్చే వరకు సినిమాలు మాత్రమే చేస్తా. ఇప్పటివరకు నాన్నగారి ఇమేజ్ నాపై పడలేదు. ఈ సినిమాలో నన్ను నాన్నలా చూపించినందుకు కొరటాలకు కృతజ్ఞతలు. భరత్ అనే నేను సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విజయయాత్రం చేస్తున్నాం.. రాజకీయాల గురించి మాట్లాడను’ అని తెలిపారు. కొరటాల శివ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు విజయవాడలో క్రేజ్ ఉంటుందన్నారు. విజయవాడలో బ్లాక్ బాస్టర్ అంటే ప్రపంచం మొత్తం బ్లాక్ బాస్టరే అని అన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చిన మహేశ్ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మహేశ్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు ఎగబడ్డారు. కాగా మహేశ్ విజయవాడ పర్యటన ముగిసిన తర్వాత తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలో కూడా అభిమానుల సమక్షంలో ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని వీక్షించనున్నారు. -
జేమ్స్‌బాండ్ ఎవరో అర్థమైందా...
గాంధీనగర్ : ‘జేమ్స్‌బాండ్’ అల్లరి నరేష్ నగరంలో సందడి చేశాడు. థియేటర్లో ప్రత్యక్షమై నవ్వులు పూయించాడు. తాను జేమ్స్‌బాండ్ కాదంటూ తన భార్య అంటూ తనదైన శైలిలో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జేమ్స్‌బాండ్ చిత్ర విజయోత్సవంలో భాగంగా యూనిట్ సభ్యులు మంగళవారం నగరంలోని అన్నపూర్ణ థియేటర్‌కు చేరుకుని సందడి చేశారు. ప్రేక్షకుల కోరిక మేరకు అల్లరి నరేష్ చిత్రంలోని డైలాగులు చెప్పారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ హాస్య చిత్రలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని ప్రేక్షకులు మరోసారి నిరూపించారన్నారు. చిత్రం టైటిల్ కథానాయిక పాత్రతో ముడిపడి ఉందన్నారు. చిత్రం ఆద్యంతం హాస్యభరితంగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా చిత్రం చూసేలా చిత్రాన్ని దర్శకులు తెరకెక్కించారన్నారు. జేమ్స్‌బాండ్ ఎవరో అర్థమైందా.. అంటూ ప్రేక్షకులను ప్రశ్నించారు. తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కథానాయిక సాక్షిచౌదరి, నటులు పృథ్వీరాజ్, హేమ, నిర్మాతలు సుంకర రామబ్రహ్మం, అనీల్, కెమెరామెన్ రాము, పంపిణీదారులు సర్వేశ్వరరావు, అన్నపూర్ణ థియేటర్ అధినేత పెద్దబాబు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement