Sudha Reddy Becomes First Indian Celeb Confirmed To Attend MET Gala 2024, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది మెట్‌ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?

Published Fri, May 3 2024 12:08 PM

Sudha Reddy Becomes First Indian Celeb Confirmed To Attend MET Gala 2024

మెట్ గాలా( MET Gala ).. అనేది సెల‌బ్రిటీలు డిజైన‌ర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించే మెగా ఈవెంట్‌. ఈ కార్యక్రమం ప్రతి మే నెలలో మొదటి సోమవారం నిర్వహిస్తారు. ఈ మెట్‌ గాలా ఈవెంట్‌ని‌ మ్యాజియం కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం డబ్బు సేకరించేందుకు వినియోగిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్‌ సెలబ్రెటీలు, ప్రహుఖులు, లెజెండ్‌లు, అథ్లెట్లు, రాజకీయనాయకుల ఒక రాత్రి అంతా స్టే చేసి మరీ ఈ ఫ్యాషన్‌ వేడుకను జరుపుకుంటారు.

ఈ ఈవెంట్‌ 1948 నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్‌లో  తెలుగు మహిళ సందడి చేయనుంది. సినిమాలకు సంబంధం లేని ఓ మహిళ ఇందులో పాల్గొనే అవకాశం రావడం విశేషం. ఈ మహిళ మన హైదరాబాదీనే. ఆమె పేరు సుధారెడ్డి. ఆమె ఈ గాలా ఈవెంట్‌లో మరోసారి తళుక్కుమంటోంది. ఇంతకుమునుపు 2021లో ఇదే గాలా ఈవెంట్‌లో సందడి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎవరీమె అంటే..

సుధారెడ్డి మన నగరానికి చెందిన బ‌డా వ్యాపార‌వేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ డైరెక్ట‌ర్ కూడా. సుధారెడ్డి ఫస్ట్ టైమ్ 2021లో ‘మెట్ గాలా రెడ్ కార్పెట్‌’పై త‌ళుక్కుమ‌ని మెరిశారు. మళ్లీ ఈ ఏడాది మెట్‌ గాలా రెడ్‌ కార్పెట్‌పై మరోసారి మయమరిపించనున్నారు. అంతేగాదు తన ష్యాషన్‌ డిజైనర్‌ దుస్తులతో మద్రు వేసేందుకు సుధారెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఇద్దరు ప్రముఖ డిజైనర్లను సెలక్ట్‌ చేసుక్నున్నారు. 

ఈ మేడాది మే 6న ఈ మెగా ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. అందులో మన తెలుగు మహిళ సుధారెడ్డి అలెగ్జాండర్ మెక్ క్వీన్, తరుణ్ తహిలియానిని డిజైన్‌ చేసిన దుస్తులను ధరించనున్నారు. బిగ్గెస్ట్‌ నైట్‌గా ప్రసిద్ధి చెందిన ఈ మెగా గాలా ఈవెంట్‌కి మరోసారి రావడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ ష్యాషన్‌ వేడుకలో తన దుస్తులు మరింత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తోంది సుధారెడ్డి.

ఈసారి ఆమె ఈ ఫ్యాషన్‌ వేడుకలో భారతీయ సంస్కృతిని టచ్‌ చేసేలా విభిన్నమైన వస్త్రాలంకరణతో మెరవనుంది. నిజానికి ఈ మెట్‌ థీమ్‌ "స్లీపింగ్ బ్యూటీస్: రీవాకనింగ్ ఫ్యాషన్" అంటే..చారిత్రక వస్త్రాలంకరణపై దృష్టి పెట్టేలా చేయడమే ఈ వేడుక ముఖ్యోద్దేశం. ఇక ఈ ఏడాది మెట్‌ గాలా థీమ్‌ వచ్చేటప్పటికీ గార్డెన్ ఆఫ్ టైమ్‌. అందుకు తగ్గట్టుగానే సెలబ్రిటీలు, డిజైనర్లు తమ సొంత ప్రతిభను వెలికితీసి మరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకలో ఎన్నో రకాల ఫ్యాషన్‌ డిజైన్‌వేర్‌లు సందడి చేయనున్నాయి. 

(చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!)


 

Advertisement
Advertisement