షుగర్‌ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్‌ పరార్‌! | Sakshi
Sakshi News home page

షుగర్‌ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్‌ పరార్‌!

Published Sat, May 4 2024 12:34 PM

Diabetes care precautions check ​ here

మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. జీవన శైలి మార్పులు,క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలు దీనికి పరిష్కారం.   ఒకసారి మధుమేహం బారిన పడితే జీవితాంతం    జాగ్రత్తలు తీసుకోవల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్రమైన  సమస్యలు తప్పవు.

మధుమేహం వచ్చిందని భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం  కాదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి.  మధుమేహాన్ని నియంత్రించాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.  అవేంటో ఒకసారి  చూద్దాం.

కొద్దిపాటి నడక, యోగా
ఉదయాన్నే  లేదా  రాత్రి నడక,  యోగా, ధ్యానం చాలా అవసరం.   ముఖ్యంగా డయాబెటిక్ సమస్య ఉన్నవారు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి.  రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకుపక్రమించకూడదు. కనీసం పది, ఇరవై నిమిషాలు నడక,వజ్రాసనం వంటి యోగాసనాలను అలవాటు చేసుకోవాలి.  దీని బరువు అదుపులో ఉంటుంది.  తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

రాత్రి భోజనం చేసిన  వెంటనే నిద్రపోవడం అనేది షుగర్‌ లెవల్స్‌ ఎలివేట్‌  కావడానికి ముఖ్యం కారణం. కాబట్టి  తిన్న తర్వాత కనీస శారీరక శ్రమ చాలా అవసరం

స్వీట్లకు, కొన్ని రకాల పండ్లు
మామిడికాయ, పనస, అరటి లాంటి పండ్లకు చాలా దూరంగా ఉండాలి. ఒక విధంగా  చెప్పాలంటే ఒక్క జామకాయ తప్ప ఏదీ తినకూడదు.. తిన్నా.. చాలాపరిమితంగా తీసుకోవాలి. షుగర్‌ ఎక్కువగా ఉండే స్వీట్లకు  పూర్తిగా దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో స్వీట్లు తినకపోవడం మంచిది.  
మంచి నిద్ర, నీళ్లు 
ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే రాత్రి నిద్ర కూడా పడుతుంది. డయాబెటిక్ రోగులు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.
అలాగే రాత్రి భోజనం చేసిన 1 గంట తర్వాత మీరు కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు.

రాత్రిపూట మొబైల్ స్క్రీన్‌లకు  ఎంత దూరంగా ఉంటే మంచింది. రాత్రి పడుకుని టీవీ, మొబైల్‌ చూడటం వల్ల, మెడ నొప్పులు, తలనొప్పి వస్తాయి. మద్యపానం, ధూమపానం పూర్తిగా నిషేధించాలి. 

 ఎప్పటికపుడు పరీక్షలు, వైద్యుల సలహాలు
ఒకసారి మన శరీరంలోకి మధుమేహం ఎంటర్‌ అయిందంటే అదొక హెచ్చరికలాగా భావించాలి. రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహా మేరకు మందులను వాడుతూ ఉండాలి.

నోట్‌: డయాబెటిక్‌ వచ్చిందని భయపడకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలి.  వ్యాయామం, ఆహార నియంత్రణ లాంటి జీవన శైలి మార్పులు ఆరోగ్య జీవనానికి పునాది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే.  పూర్తి సమాచారం, సందేహాలకోసం  వైద్య నిపుణులను సంప్రదించండి.
 

Advertisement
Advertisement