91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్‌ బిలియనీర్‌ | Sakshi
Sakshi News home page

91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్‌ బిలియనీర్‌

Published Sun, May 12 2024 9:24 PM

A 91 Year Old Subbamma Jasti India Oldest Woman Billionaire

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్‌గా నిలిచారు. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాలో అరంగేట్రం చేశారు. ఆమె నికర సంపద 1.1 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.91.9 వేల కోట్లు) చేరుకుంది.

ఎవరీ సుబ్బమ్మ..?
సువెన్ ఫార్మాస్యూటికల్స్‌ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వరులు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకటేశ్వరులు 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్‌ నడిపేవారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది.

సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె 2,653 స్థానంలో ఉన్నారు.  భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 34.9 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement