ఆ స్టార్‌ హీరో అమ్మాయిలను ఫూల్‌ చేస్తాడు.. జన్మలో పెళ్లి చేసుకోడు! | v | Sakshi
Sakshi News home page

ఆ హీరో అమ్మాయిలకు మాయ మాటలు చెప్తాడు.. పెళ్లి మాత్రం చేసుకోడు!

Published Fri, May 10 2024 2:27 PM

Mithun Chakraborty: He Will Never Get Married, But Fool Girls

బాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోయిన్లతో నడిపిన ప్రేమాయణాలకు లెక్కే లేదు. ఎంతోమంది ముద్దుగుమ్మలను బుట్టలో వేసుకున్న ఇతడు వారితో జీవితాన్ని కొనసాగించాలని మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. అందుకే ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాడు. అయితే సల్మాన్‌ పెళ్లి చేసుకోడన్న విషయం తనకెప్పుడో తెలుసంటున్నాడు నటుడు మిథున్‌ చక్రవర్తి. తాజాగా ఓ షోలో సల్మాన్‌ తుంటరితనాన్ని వెల్లడించాడు.

ఒక్క నిమిషం కూడా
సల్మాన్‌ నన్ను ఎంతగానో అభిమానిస్తాడు. ఎక్కువ ప్రేమను పంచుతాడు. మేము కలిసున్నప్పుడైతే నా వెంటే తిరుగుతాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండలేడు. నేను పడుకున్నా సరే నిద్రలో నుంచి లేపి మరీ కబుర్లు చెప్తుంటాడు. ఓసారి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో రాత్రి రెండు గంటలకు షూటింగ్‌ ఉంది. నేను ఆ విషయం మర్చిపోయి గదిలో గడియ పెట్టి నిద్రపోయాను. సడన్‌గా కళ్లు తెరిచేసరికి అతడు నా ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. అతడు లోపలకు ఎలా వచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వేం మనిషివిరా బాబూ అనుకుని లేచాను.

పెళ్లి చేసుకోడు
తనలో ఆ తుంటరితనం ఎక్కువగా ఉండేది. అతడు ఎప్పటికీ పెళ్లి చేసుకోడు.. అమ్మాయిలందరినీ ఫూల్‌ చేస్తాడు. నాకింకా పెళ్లవలేదు, తెలుసా అంటూ అమ్మాయిలతో మాట కలుపుతాడు. వాళ్లేమో.. ఇంత హ్యాండ్‌సమ్‌ సూపర్‌ స్టార్‌ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రేమలో పడతారు. కానీ అతడు ఎన్నటికీ పెళ్లిపీటలెక్కడని నేను గ్యారెంటీ ఇస్తాను' అని  మిథున్‌  చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement