తీపర్రు ఇసుక ర్యాంపుపై అధికారుల దాడి | Sakshi
Sakshi News home page

తీపర్రు ఇసుక ర్యాంపుపై అధికారుల దాడి

Published Fri, May 17 2024 11:30 AM

తీపర్రు ఇసుక ర్యాంపుపై అధికారుల దాడి

పెరవలి: తీపర్రు ఇసుక ర్యాంపుపై విజిలెన్స్‌, మైనింగ్‌ అధికారులు గురువారం ఉదయం 10.30 గంటలకు దాడి చేశారు. మైనింగ్‌ ఏడీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఇన్‌స్పెక్టర్‌ టి.గోపాలకృష్ణ, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రాత్రి 10 గంటల వరకూ తనిఖీలు చేశారు. వారిని చూసి నిర్వాహకులు, సిబ్బంది పరారయ్యారు. రెండు పొక్లెయిన్లు, రెండు లారీలు స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశామని ఏడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. తీపర్రు ఇసుక ర్యాంపులో ఇసుక తవ్వకాలకు 2025 వరకూ అనుమతులు ఉన్నాయని, ఇక్కడ 48 వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకానికి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకూ ఎంత మేర తవ్వకాలు జరిపారో లెక్కలు వేయాలన్నారు. దాడులపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ర్యాంపు తమ సొంత స్థలమని, ఇక్కడ తమ లారీలు ఎప్పుడూ ఉంటాయని, వాటిని ఎలా స్వాధీనం చేసుకుంటారని వాటి యజమానులు ప్రశ్నించారు. ర్యాంపులో లారీలు ఉన్నందున కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement