నేతన్న కుటుంబంలో వెలుగులు | Sakshi
Sakshi News home page

నేతన్న కుటుంబంలో వెలుగులు

Published Sat, May 4 2024 10:25 AM

నేతన్

తుని: కోటనందూరు మండలం బంగారయ్యపేటకు చెందిన పసగడుగుల అప్పారావుది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కులవృత్తి చేనేత మగ్గం పనిలో వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగించేవాడు. అలాంటి అప్పారావు కుటుంబంలో సీఎం జగన్‌ ప్రభుత్వం అండతో అనూహ్య మార్పులొచ్చాయి. ఆ నిరుపేద కుటుంబం కష్టాలను జయించి ప్రస్తుతం సంతోషంగా జీవిస్తోంది.

కాగా నేత కార్మికుడు అప్పారావుకు ముగ్గురు కుమారులు. జగనన్న ప్రభుత్వం వచ్చాక అప్పారావుకు పెన్షన్‌ కానుకతో పాటు పెద్దకుమారుడికి రైతుభరోసా, రెండో కుమారుడికి నేతన్న నేస్తం, చిన్న కుమారుడికి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. గత నాలుగున్నరేళ్లలో అప్పారావు పెన్షన్‌ కానుక ద్వారా రూ.లక్ష, పెద్ద కుమారుడికి రైతు భరోసా పథకంలో రూ. 54 వేలు, రెండో కుమారుడు పసగడుగుల త్రిమూర్తులకు నేతన్న నేస్తం ద్వారా సంవత్సరానికి రూ.24 వేలు చొప్పున 96 వేలు అందింది. రెండో కుమారుడు త్రిమూర్తులు భార్య సత్యగౌరికి జగనన్న చేదోడు రూపంలో రూ.40 వేలు, అమ్మవడి పథకం ద్వారా రూ.75 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని పొందారు.

రాజకీయ నాయకుల ప్రమేయం లేదు

సీఎం జగన్‌ పాలనలో సంక్షేమ పథకాల కోసం రాజకీయ నాయ కుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. ఎవరి ప్ర మేయం లేకుండానే మాకు అన్ని పథకాలు అందు తున్నాయి. గ్రామ వలంటీర్‌ నేరుగా ఇంటికొచ్చి అర్హత ఉన్న పథకాలు నమోదు చేశాడు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా చేయలేదు. ఇబ్బందుల్లో ఉన్న మాలాంటి పేదలను ఆదుకున్న దేవుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.

–సత్యగౌరీ, గృహిణి, బంగారయ్యపేట,

కోటనందూరు మండలం

ఆపద్భాందవుడు సీఎం జగన్‌

గతంలో ఎన్నో ఇబ్బందులు పడే మా కుటుంబం జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత సజావుగా సాగుతోంది. మా ఇంట్లో అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. నాకు ఏటా అందే నేతన్న నేస్తం మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తోంది. నా భార్యకు చేదోడు, అమ్మ ఒడి, తండ్రికి పెన్షన్‌ కానుక, అన్నయ్యకు రైతు భరోసా పథకాలు అందుతున్నాయి. సీఎం జగన్‌ అధికారంలోకి రాకపోయి ఉంటే మా కుటుంబం ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడేది.

–పసగడుగుల త్రిమూర్తులు, నేతన్న నేస్తం లబ్ధిదారు, బంగారయ్యపేట, కోటనందూరు మండలం

సచివాలయంలో ఉద్యోగం

సామన్య కుటుంబంలో పుట్టిన నేను దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో ఉన్నత చదువులు చదివాను. 2021–13 లో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫ్‌కేషన్‌ ఇవ్వలేదు. 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వడంతో పోటీ పరీక్ష రాయగా వేల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది.

–పసగడుగుల శివ గణేష్‌, సచివాలయ ఉద్యోగి, కోటనందూరు మండలం

చేనేత కార్మికుడు అప్పారావు

కుటుంబానికి రూ.3.65 లక్షల లబ్ధి

నిరుపేద కుటుంబానికి అండగా

సీఎం జగన్‌ ప్రభుత్వం

ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

నేతన్న కుటుంబంలో వెలుగులు
1/3

నేతన్న కుటుంబంలో వెలుగులు

నేతన్న కుటుంబంలో వెలుగులు
2/3

నేతన్న కుటుంబంలో వెలుగులు

నేతన్న కుటుంబంలో వెలుగులు
3/3

నేతన్న కుటుంబంలో వెలుగులు

Advertisement
Advertisement