'హర్ట్ అయ్యాను.. ఇక భారత్లో నో..'

'హర్ట్ అయ్యాను.. ఇక భారత్లో నో..'


కరాచీ: పాకిస్థాన్ ప్రముఖ గజల్ మేస్ట్రో గులాం అలీ భవిష్యత్తులో భారత్లో ఎలాంటి సంగీత కచేరి కార్యక్రమాలను నిర్వహించబోనని స్పష్టం చేశారు. భారత రాజకీయాలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాను ఇక కచేరి కార్యక్రమాలను భారత్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించనని చెప్పారు. ఇప్పటికే ఆయన లక్నో, ఢిల్లీలో నవంబర్ 25న ఒకటి, డిసెంబర్ 3న మరొకటి సంగీత కచేరి నిర్వహించాల్సి ఉంది. అయితే, వాటిని ఇప్పటికే రద్దు చేసుకున్నట్లు తెలిపారు.



తాను నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా భారత్లో కొన్ని పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నించే తీరు తనను ఇబ్బంది పెట్టిందని అందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పారు. ఇదిలా ఉండగా, గులాం నిర్ణయాన్ని భారత్ సెన్సార్ బోర్డు సభ్యుడు అశోక్ పండిట్ స్వాగతించారు. గులాం అలీ సరైన నిర్ణయం తీసుకున్నారని, అలాగే, పాకిస్థాన్ కూడా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చేవరకు, సరిహద్దులో ఉన్న భారత సైనికులతో సరిగా వ్యవహరించేవరకు గులాం ఇండియాలో అడుగుపెట్టవద్దని సలహా కూడా ఇచ్చారు. భారత సైనికులను పాకిస్థాన్ చంపేస్తుందని ఆయన ఇప్పటికి అర్ధం చేసుకున్నందుకు పొగడకుండా ఉండలేకపోతున్నానని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top