మహిళా ఓటర్లే నిర్ణేతలు | Sakshi
Sakshi News home page

మహిళా ఓటర్లే నిర్ణేతలు

Published Sat, May 4 2024 6:30 AM

మహిళా ఓటర్లే నిర్ణేతలు

కొరాపుట్‌ జిల్లాలో..

జయపురం: ఈ నెల 13వ తేదీన జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొరాపుట్‌ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం. ఈ జిల్లాలో 9,69,092 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 5,00,405 మంది మహిళలు, 4,68,604 మంది పురుషులు, 83 మంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు. లక్ష్మీపూర్‌, కొరాపుట్‌, పోట్టంగి, జయపురం, కొట్‌పాడ్‌ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

●లక్ష్మీపూర్‌(ఎస్టీ–141)లో 1,72,483 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 90,732 మంది మహిళలు, 81,732 మంది పురుషులు, 19 మంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు.

●కొట్‌పాడ్‌(ఎస్టీ 142) నియోజకవర్గంలో 2,08,283 మంది ఓట్లు ఉండగా.. వారిలో 1,07,191 మంది మహిళా ఓటర్లు, 1,01,081 మంది పురుషులు,11 మంది ట్రన్స్‌జెండర్స్‌ ఉన్నారు.

● జయపురం (జనరల్‌–143)నియోజకవర్గంలో 2,11,908 ఓటర్లు ఉండగా.. 1,09,104 మంది మహిళా ఓటర్లు, 1,02,770 మంది పురుషులు, 34 మంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు.

● కొరాపుట్‌ (ఎస్సీ–144) నియోజకవర్గంలో 1,90,341 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 97408 మంది మహిళలు, 92,921 మంది పురుషులు, 12 మంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు.

● పొట్టంగి (ఎస్సీ–145) నియోజకవర్గంలో 2,76,182 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,86,076 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 90,100 మంది పురుష ఓటర్లు, ఆరుగురు ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు.

● జిల్లాలో మొత్తం ఓటర్లలో మొదటిసారి 22,500 మంది ఓటు హక్కును వినియోగించుకుంచుకోనున్నారు.

● జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 1158 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయనుండగా వాటిలో కొరాపుట్‌ నియోజకవర్గంలో 215 బూత్‌లు, పొట్టంగిలో 238 బూత్‌లు, లక్ష్మీపూర్‌లో 225, జయపురంలో 237, కొట్‌పాడ్‌లో 243 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

● ఐదు నియోజకవర్గాలలో 1158 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తుండగా పట్టణాల్లో గల బూత్‌లలో మరో 129 నుంచి 150 వరకు అదనపు బూత్‌లు ఏర్పాటు చేస్తారు. ఇవి కేవలం మహిళా పోలింగ్‌ టీమ్‌లు నిర్వహిస్తాయి. ముఖ్యంగా ఈ అదనపు బూత్‌లు జయపురం, కొరాపుట్‌, కొట్‌పాడ్‌, సునాబెడలలో ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలో మొదటిసారి 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి వద్దనే ఓటు వేసుకునే హక్కు కల్పించారు.

మొత్తం ఓటర్లు 9,69,092 మంది

మహిళలు 5,00,405 మంది

పురుషులు 4,68,604 మంది

ట్రాన్స్‌జెండర్స్‌ 83 మంది

Advertisement
Advertisement