24న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష | Sakshi
Sakshi News home page

24న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష

Published Wed, May 22 2024 5:05 AM

-

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఈ నెల 24న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తునట్లు పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 11 గంటలకు పరీక్ష జరుగుతుందని విద్యార్థులను 9.30 గంటలకు పరీక్ష కేంద్రంలోనికి వదులుతామన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్‌ బ్లాక్‌పెన్సిల్‌, ఎరేజర్‌, బ్లాక్‌పెన్నును వెంట తీసుకురావాలనాన్నారు. హాల్‌టికెట్లు ఆన్‌ఆలైన్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

సోనామసూరి ధర రూ.2,419

దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మంగళవారం జరిగిన ఈనామ్‌ టెండర్లలో సోనామసూరి ధాన్యం గరిష్టంగా రూ.2,419, కనిష్టంగా రూ.2,143 ధరలు నమోదయ్యాయి. ఆముదాలు క్వింటాల్‌కు సరాసరిగా రూ.5,479 ధర పలికింది. మార్కెట్‌కు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement