సన్నీ లియోన్ బర్త్‌డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్ బర్త్‌డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు

Published Thu, May 16 2024 8:04 AM

Sunny Leone Fans From Karnataka Celebrate Her Birthday

సన్నీలియోన్ బాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమెకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. మే 13న తన 43వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. దీంతో ఆమె అభిమానులు సైతం తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు కేక్ కట్ చేసి అన్నదానాలు చేశారు. అలా తమ అభిమాన నటి మీద ప్రేమను చాటుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

కర్నాటకలోని కర్కల్లి గ్రామానికి చెందిన యువకులు ఆమె పుట్టినరోజు వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సన్నీలియోన్‌ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి అక్కడ వారందరూ కేక్‌ కట్‌ చేశారు. ఈ యువకుల బృందం తమను తాము కర్కల్లి బాయ్స్ అని పిలుస్తారు. సన్నీ పుట్టినరోజును ఎందుకు జరుపుకున్నారో  కూడా వారు చెప్పుకొచ్చారు. సన్నీ చేస్తున్న సామాజిక సేవతో పాటు ఆమెలో ఉన్న దాతృత్వమే తమను అభిమానులుగా మార్చిందని వారు తెలిపారు. 

కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చిందని వారు గర్తుచేశారు. ఆమె నటించిన గత సినిమాలు ఎలా ఉన్నా సరే సన్నీలో సేవా గుణం ఉంది. భారత్‌పై గౌరవంతో ఇక్కడే ఉంటుంది. అందుకు తగ్గట్లు తన జీవితాన్ని మార్చుకుంది. ఇక్కడి ప్రజల్లో మమేకమైంది. ఇక్కడి ప్రజలకు ఆమె ఎంతో సాయం చేస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి..? అంటూ వారు సన్నీ లియోన్‌ గురించి చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement