దేశమంతా నిరాశ.. అక్కడ మాత్రం ఊరట! | Sakshi
Sakshi News home page

దేశమంతా నిరాశ.. అక్కడ మాత్రం ఊరట!

Published Sat, May 4 2024 2:08 PM

gold price today rate may 4

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను నిరాశకు గురి చేశాయి. క్రితం రోజున భారీగా తగ్గి ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 4) మళ్లీ స్వల్పంగా ఎగిశాయి.

హైదరాబాద్‌, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 పెరిగి రూ. 71,830 లను తాకింది.

ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..
➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 ఎగిసి రూ.66,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 పెరిగి రూ.71,980 లకు చేరింది. 
➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 పెరిగి రూ.71,830 వద్దకు ఎగిసింది.
➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.100 ఎగిసి రూ.71,830 లకు చేరుకుంది.

చెన్నైలో తగ్గింపు
దేశమంతా ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరుగుదలను చూడగా చెన్నైలో మాత్రం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,000 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.72,000 లకు దిగొచ్చింది.

Advertisement
Advertisement