ఉరవకొండలో కృష్ణమ్మ గలగలలు | Sakshi
Sakshi News home page

ఉరవకొండలో కృష్ణమ్మ గలగలలు

Published Sat, May 4 2024 9:25 AM

ఉరవకొ

కృష్ణాజలాలతో నియోజకవర్గం సస్యశ్యామలం

గతంలో ఎటు చూసినా

బీడు భూములే

నేడు పచ్చని పంటలతో కళకళ

భారీగా పెరిగిన భూగర్భజలాలు

సీఎం వైఎస్‌ జగన్‌ హమీతో

80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు

జీడిపల్లి రిజర్వాయర్‌

నిర్వాసితులకూ పునరావాసం

● ఉరవకొండ మండలంలో జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన పర్యాటక పుణ్యక్షేత్రం పెన్నహోబిళం ఉంది. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు.

● కూడేరు మండలంలో పీఏబీఆర్‌(పెన్నఅహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌) ఉంది. ఇది పర్యాటక ప్రాంతంతో పాటు జలవిద్యుత్‌ తయారీ కేంద్రంగా ఉంది.

● బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌ జిల్లాకు ఆయువుపట్టు లాంటింది. హంద్రీనీవా ద్వారా వచ్చే నీటిని జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు.

● ఉరవకొండ మండలం బూదగవిలో రాష్ట్రంలోనే రెండోదిగా ప్రసిద్ధిగాంచిన సూర్యదేవాలయం ఉంది.

● కూడేరులో ప్రసిద్ధిగాంచిన జోడులింగాల సంగమేశ్వర ఆలయం కొలువుదీరింది.

నీటితో కళకళ లాడుతున్న

జీడిపల్లి రిజర్వాయర్‌

ఉరవకొండ: నియోజకవర్గంలో జల సిరులు సవ్వడి చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లా కరువును పాలదోలడానికి జలయజ్ఞంలో భాగంగా హంద్రీ–నీవాకు అంకుర్పారణ చేయగా ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయకట్టు అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో కృష్ణాజలాలు పరుగులుడితున్నాయి. ఒకవైపు కృష్ణ, మరోవైపు తుంగభద్ర నీటితో రైతులు విస్తుృతంగా పంటలు సాగు చేస్తున్నారు.

నియోజకవర్గ విశిష్టత..

ఉరవకొండ నియోజకవర్గం అనంతపురం జిల్లా కేంద్రానికి వాయువ్యదిశలో 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1808లో దత్త మండలాల్లో ఉరవకొండ ఒకటిగా ఉండేది. 1882లో అనంతపురం జిల్లాలో భాగమైంది. 1988 నుంచి గ్రామ పంచాయతీ బోర్డుగా ఎర్పడి స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టింది. 1985 మే 25న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మాండలిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో కణేకల్లు సబ్‌డివిజన్‌ తాలుకాలోని కొన్ని గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేశారు. ఉరవకొండ చుట్టూ కొండ ఉండటం వల్ల ఆకొండ పాము పడగ ఆకారంలో ఉండటం వల్ల ఉరగాద్రిగా పిలవబడే ఈ ప్రాంతం ఉరవకొండగా మారిపోయింది.

నియోజకవర్గ స్వరూపం..

ఉరవకొండ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. 2009 నియోజకవర్గ పునర్విభజనలో నియోజకవర్గంలో ఉన్న కణేకల్లు, పామిడి, గుంతకల్లు మండలాల్లోని కొన్ని గ్రామాలు పూర్తిగా ఆయా మండలాల్లోకే వెళ్లాయి. కొత్తగా కూడేరు, బెళుగుప్ప మండలాలు నియోజకవర్గంలోకి చేరాయి. ఉరవకొండ నియోజకవర్గ కేంద్రానికి ఉత్తరాన వజ్రకరూరు మండలం, దక్షిణాన బెళుగుప్ప మండలం, తూర్పున కణేకల్లు, బొమ్మనహాళ్‌, పడమర కూడేరు మండలాలున్నాయి. ఉరవకొండకు కేవలం 17 కిలోమీటర్ల దూరం( విడపనకల్లు మండలం) దాటగానే కర్ణాటక సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. దీంతో పలు గ్రామాల్లో కన్నడ ప్రభావం అధికంగా ఉంది. పాఠశాలలో తెలుగు మాధ్యమం ఉన్నప్పటికీ వ్యవహారికంలో ఇప్పటికీ కన్నడ భాషను వాడుతున్నారు.

రాజకీయ పోరు..

రాజకీయ ఉద్ధండులకు నిలయమైన ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు ప్రతిసారి విలక్షణ తీర్పును వెలువరిస్తూ వస్తున్నారు. ఉరవకొండలో ఒక పార్టీ నుంచి అభ్యర్థి గెలిస్తే ఇంకొక పార్టీ అధికారం చేపట్టే సెంటిమెంట్‌ కొనసాగుతోంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా ఆరుసార్లు టీడీపీ గెలుపొందగా, నాలుగు సార్లు కాంగ్రెస్‌, ఒకసారి ఇండిపెండెంట్‌, ఒకసారి వైఎస్సార్‌సీపీ విజయం సాధించాయి. 1962లో గుర్రం చిన్నవెంకన్న(ఇండిపెండెంట్‌) 1967లో గుర్రం చిన్నవెంకన్న(నేషనల్‌ కాంగ్రెస్‌) 1972లో బుక్కిట్ల బసప్ప(కాంగ్రెస్‌) 1978లో రాయల వేమన్న(కాంగ్రెస్‌) 1983లో వై.భీమిరెడ్డి(టీడీపీ), 1985లో గుర్రం నారాయణప్ప(టీడీపీ) 1989లో గోపినాథ్‌(కాంగ్రెస్‌) 1994లో పయ్యావులకేశవ్‌(టీడీపీ) 1999లో వై.శివరామిరెడ్డి(కాంగ్రెస్‌) 2004లో పయ్యావుల కేశవ్‌(టీడీపీ) 2009లో పయ్యావులకేశవ్‌(టీడీపీ) 2014లో వై.విశ్వేశ్వరరెడ్డి (వైఎస్సార్‌సీపీ) 2019లో పయ్యావుల కేశవ్‌ (టీడీపీ) గెలుపొందారు.

నియోజకవర్గ ప్రత్యేకతలు..

నియోజకవర్గ సమాచారం

ఉరవకొండ బరిలో 11 మంది అభ్యర్థులు

ఉరవకొండ నియోజకవర్గ అసెంబ్లీ పరిధిలో 11 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో నలుగురు ఇండిపెండింట్‌ అభ్యర్థులు ఉన్నారు. బరిలో ఉన్న వారిలో వై.విశ్వేశ్వరరెడ్డి (వైఎస్సార్‌సీపీ), పయ్యావుల కేశవ్‌ (టీడీపీ), వై.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్‌), అంకే తిప్పేస్వామి (బీఎస్‌పీ), కురుబ చిన్నక్క (ఆలిండియా కిసాన్‌ జనతా పార్టీ), బెస్త పవన్‌కుమార్‌ (భారతీయ చైతన్య యువజన పార్టీ)తో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా మోహన్‌దాస్‌, బి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.దామోదర్‌రెడ్డి, విశ్వేశ్వరయ్యస్వామి ఉన్నారు.

ఉరవకొండలో కృష్ణమ్మ గలగలలు
1/2

ఉరవకొండలో కృష్ణమ్మ గలగలలు

ఉరవకొండలో కృష్ణమ్మ గలగలలు
2/2

ఉరవకొండలో కృష్ణమ్మ గలగలలు

Advertisement
Advertisement