అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి

Published Mon, May 20 2024 4:50 AM

అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి

నారాయణపేట రూరల్‌: సోమవంశీయ క్షత్రియ సమాజ్‌ సభ్యులు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేద్దామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రిటైర్డ్‌ ఐజీపీ ఐపీఎస్‌, ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి విశ్వనాథ్‌ రవిందర్‌ అన్నారు. పట్టణంలోని శ్రీఅంబాభవాని ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేసి సమీపంలోని ఫంక్షన్‌హాల్‌లో మడి, ధూల్‌పేట సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్‌ ఉద్దాన్‌ సదస్సులో పాల్గొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా అన్ని రంగాల్లో వెనకబడిపోతున్నామని, ప్రతీ కుటుంబంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలని సూచించారు. చిన్నతనం నుంచే పిల్లలకు చదువుతో పాటు సంస్కారం,బాధ్యతలను తెలియచేయాలన్నారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించాలన్నారు. సాంస్కృతిక అంశాలు, క్రీడలపై ఉత్సాహాన్ని కల్పించాలన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు నాగురావునామాజి, స్థానిక నాయకులు నారాయణరావు, విఠల్‌రావు, విజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement