ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. . వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో మరింత అనుకూల సమయం. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. క్రీడాకారులు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో మిత్రులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. పసుపు, ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి..
నూతన వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు అమలు చేస్తారు. కీలక సమావేశాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత కలసివస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు.గణేశాష్టకం పఠించండి.
ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. రుణబాధలు తొలగుతాయి. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్యులు, రాజకీయవర్గాలకు ఒత్తిడులు తగ్గుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కొత్త పనులు చేపడతారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. క్రీడాకారులు, కళాకారులకు అంచనాలు ఫలిస్తాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
అతి ముఖ్యమైన ∙పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. పట్టుదల పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుచతాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఒక సమాచారంæ ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకువస్తాయి. వ్యాపారాలలో మరింత లాభాలు దక్కుతాయి. విస్తరణ యత్నాలు సాగిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన∙సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు సాగిస్తారు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. శ్రమాధిక్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మనోనిబ్పరంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు పట్టుదలతో కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. మీ నిర్ణయాలపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు.. గృహం, వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ముందుకు సాగుతారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో అడుగువేస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ, దేవీఖడ్గమాల పఠించండి.
కొత్త వ్యక్తుల పరిచయం. పనులు మరింత వేగంగా సాగుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి లోటు రాదు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక , రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
కొత్త వ్యవహారాలను శ్రమ పడ్డా పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. క్రీడాకారులు, రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నీలం పసుపు రంగులు.విష్ణుధ్యానం చేయండి.
కొన్ని పనులు ఆలస్యమైనా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించే సమాచారం రావచ్చు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడుల అన్వేషణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. వైద్యులు, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఫలప్రదమవుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు తగిన గుర్తింపు రాగలదు. చిరకాల కోరిక నెరవేరే సమయం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహన, గృహయోగాలు. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. క్రీడాకారులు, రాజకీయవర్గాల వారు అనుకున్న విజయాలు సా«ధిస్తారు. వారం ప్రారంభంలో బంధువిరో«ధాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, ఎరుపు, ఆంజనేయ దండకం పఠించండి.
ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహాన్నిస్తుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కొన్ని వివాదాల పరిష్కారానికి చొరవ చూపుతారు. బంధువులతో సందడిగా గడుపుతారు.. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయ, పారిశ్రామివర్గాల అంచనాలు నిజమవుతాయి.వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కొన్ని పనులు మరింత నెమ్మదిగా సాగుతాయి. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యభంగం. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు స్వల్పంగా అందుతాయి.ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కొంటారు. రాజకీయవర్గాలు, కళాకారులకు అందిన అవకాశాలు నిరాశ పరుస్తాయి.వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నూతన పరిచయాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.