ఆగష్టు 29: భారత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ జయంతి | National Sports Day 2024: All you need to knoW about Major Dhyan Chand | Sakshi

భారత హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి నేడు(ఆగష్టు 29)

అలహాబాద్‌(ప్రయాగ్‌రాజ్‌- ఉత్తరప్రదేశ్‌)లో 1905లో ధ్యాన్‌చంద్‌ జననం

ధ్యాన్‌చంద్‌ తల్లిదండ్రులు శారదా సింగ్‌- సమేశ్వర్‌ సింగ్‌

ధ్యాన్‌చంద్‌ తండ్రి సమేశ్వర్‌ సింగ్‌ బ్రిటిష్‌ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు

తండ్రి విధుల దృష్ట్యా వివిధ పట్టణాలు సందర్శించిన ధ్యాన్‌ చంద్‌ తొలుత రెజ్లింగ్‌పై మక్కువ పెంచుకున్నారు

ఆర్మీలో చేరిన తర్వాత హాకీ ప్లేయర్‌గా మారిన ధ్యాన్‌చంద్‌

1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన హాకీ జట్టులో ధ్యాన్‌చంద్‌ కీలక ప్లేయర్‌

భారత్‌ తరఫున 185 మ్యాచ్‌లు ఆడి 400 గోల్స్‌ చేసిన ధ్యాన్‌చంద్‌

డిసెంబరు 3, 1979లో కన్నుమూసిన ధ్యాన్‌చంద్‌

ధ్యాన్‌చంద్‌ గౌరవార్థం 2012 నుంచి ఆగష్టు 29న నేషనల్‌ స్పోర్ట్‌ డే నిర్వహణ

ఈ ఏడాది 'శాంతియుత, సమ్మిళిత సమాజాలను ప్రోత్సహించడం కోసం క్రీడలు' అనే థీమ్‌తో నిర్వహణ

నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌