.. | Weekly Horoscope In Telugu From 25-05-2025 To 31-05-2025 | Sakshi

ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

చేపట్టిన పనులలో కొంత ఇబ్బంది ఏర్పడినా అధిగమిస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మధ్యలో కొన్ని సమస్యలు, వివాదాలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. పట్టుదల మరింత పెరుగుతుంది. అనుకున్న పనులు సజావుగా సాగేందుకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఇంతకాలం నైరాశ్యంలో ఉన్న మీకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు నెమరువేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. పసుపు, నేరేడురంగులు. గణేశాష్టకం పఠించండి.

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. శ్రీమహావిష్ణుధ్యానం పఠించండి.

మొదట్లో వివాదాలు, సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గుతుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరే సమయం. బంధువుల సలహాలు కొన్ని స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు కష్టానికి ఫలితం దక్కుతుంది. గృహయోగం. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

మీ శ్రమకు తగిన ఫలితం దక్కే సమయం. అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడంలో స్వశక్తిపైనే ఆధారపడతారు. ఆప్తుల నుంచి పిలుపు రావడంతో ఉత్సాహంగా గడుపుతారు. భూవివాదాలు పరిష్కారమయ్యే సూచనలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులను కలుసుకుని మీ భావాలను వెల్టడిస్తారు. ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

ఏ పనినైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా అధిగమిస్తారు. ఎదురుచూస్తున్న ఒక అవకాశాలు మాత్రం చేజారే వీలుంది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటారు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. శ్రీసూర్యప్రార్ధన మంచిది.

మధ్యమధ్యలో కొన్ని చికాకులు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. మీ ఆలోచనలకు మరింత పదునుపెడతారు. ఎటువంటి పనులైనా నేర్పుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. భూవివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పెండింగ్‌లో ఉంచిన పెళ్లి మాటలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. కళారంగం వారి ఆశలు కొన్ని నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆప్తులతో విభేదాలు. ఎరుపు, నీలం రంగులు. హయగ్రీవ ధ్యానం చేయండి.

నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. ఆర్థిక విషయాలు మరింత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. తెలుపు, గులాబీ రంగులు. శివాష్టకం పఠించండి.

అందరిలోనూ మీ మాటకు ఎదురుండదు. ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. లక్ష్యాల సాధనలో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు శుభవర్తమానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనిస్తారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ పూర్తి చేస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి కొంత వరకూ సానుకూలం. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. శ్రీకృష్ణస్తుతి మంచిది.