. | Weekly Horoscope In Telugu From 14-09-2025 To 20-09-2025 | Sakshi

అనుకున్న కార్యాలు నెమ్మదిగా కొనసాగుతాయి. బ«ంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు ఎటూ తేల్చుకోలేని విధంగా ఉంటాయి. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత నిరుత్సాహం. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు, విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. గులాబీ, బంగారు రంగులు, అంగారకస్తోత్రాలు పఠించండి.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తి కాగలవు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. అనారోగ్యం. తెలుపు, లేత ఎరుపు రంగులు, గణేశ్‌ను పూజించండి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులతో సఖ్యత. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది.. కళాకారుల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో శ్రమా«ధిక్యం. బంధువులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా. పసుపు, ఆకుపచ్చ రంగులు, దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.

కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. రాని బాకీలు సైతం వసూలవుతాయి. మీఖ్యాతి మరింత పెరుగుతుంది. సమాజసేవలో పాలుపంచుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలు,. కళాకారులకు సన్మానయోగం. గులాబీ, పసుపు రంగులు, వారం మధ్యలో మనశ్శాంతి లోపిస్తుంది. మిత్రులతో వైరం. దూరప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. రాబడి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు వ్యతిరేకులు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు.. వైద్యరంగం, క్రీడాకారులకు ఉత్సాహవంతమైన కాలం. వారం చివరిలో ఆరోగ్యభంగం. అనుకోని ప్రయాణాలు. కష్టించినా ఫలితం కనిపించదు. నీలం, తెలుపు రంగులు, గణేశాష్టకం పఠించండి.

ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం, అలాగే, కొత్త భాగస్వాములు జతకలుస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలించే సమయం.. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. బంధువుల నుండి ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. బంగారు, ఆకుపచ్చరంగులు, రామరక్షాస్తోత్రాలు పఠించండి.

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కోర్టు కేసుల నుండి విముక్తి లభిస్తుంది. శుభకార్యాల ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని ఈతిబాధల నుండి విముక్తి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు దక్కుతాయి.. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. మానసిక ఆందోళన. తెలుపు, లేత నీలం రంగులు, దేవీస్తుతి మంచిది.

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి∙సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. కీలక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలలో మీ అంచనాలకు మించి లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధననష్టం. కుటుంబంలో చికాకులు. విలువైన వస్తువులు జాగ్రత్త. నలుపు, ఆకుపచ్చ రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శ్రేయోభిలాషులు సహాయపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సొగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు విసర ణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం ఊరటనిస్తుంది. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువుల నుండి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఎరుపు, బంగారు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి..

నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాల బాట పడతారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ పర్యనలు కూడా ఉండవచ్చు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. రుణభారాలు. పసుపు, నేరేడు రంగులు, శివస్తోత్రాలు పఠించండి.

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు. వైద్యులు, పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో శ్రమ పెరుగుతుంది. మిత్రులతో విభేదిస్తారు. ధనవ్యయం. లేత ఎరుపు, బంగారు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం. ఎంతటి క్లిష్టమైన పనినైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. వాహనయోగం. చర్చలు సఫలం కాగలవు. వ్యాపారాలను చాకచక్యంగా నడిపించి విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం రావచ్చు. వైద్యులు, కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.