. | Weekly Horoscope Telugu 07 12 2025 To 13 12 2025 | Sakshi

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ముఖ్య వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకులు తొలగుతాయి. కుటుంబంలో .శుభకార్యాలపై చర్చలు. మీ మాటే చెల్లుబాటు కాగలదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో అదనపు ఖర్చులు.దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

దూరప్రయాణాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించని స్థితి. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణయత్నాలు. కుటుంబసభ్యులతో వైరం. కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలలో కొంత అసంతృప్తి ఉంటుంది. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. విద్యార్థులు మరింత కృషి చేయడం మంచిది. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. నీలం, ఆకుపచ్చ రంగులు. శివపంచాక్షరి పఠించండి.

పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన సామగ్రి కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభాలు, రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఓర్పుతో విధులు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. గోధుమ, తెలుపు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మొండిబాకీలు వసూలై ఇబ్బందులు అధిగమిస్తారు. కుటుంబం అందరితోనూ సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారు అంచనాలు , ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. ఎరుపు, గోధుమ రంగులు. గణేశాష్టకం పఠించండి.

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. మిత్రులతో వివాదాల పరిష్కారం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన, భూయోగం. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబ సమస్యలు యుక్తితో పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుతాయి.ఉద్యోగాలలో మీ హోదాలు పదిలం. మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలు విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు. రాజకీయవర్గాలు కొత్త పదవులు కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆప్తులతో మాటపట్టింపులు.ప్రయాణాలలో అవాంతరాలు. గులాబీ,తెలుపు రంగులు. దేవీస్తుతి మంచిది.

ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం.భూములు, వాహనాలు కొంటారు. రుణబాధల నుంచి విముక్తి. ఆకస్మిక ధనలబ్ధి. పరిమితికి మించి ఖర్చు చేయరు.. వ్యాపార విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా మార్పులు రావచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలు. అనుకూల సమయమే. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. ప్రయాణాలు. మానసిక ఆందోళన. నేరేడు, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

కొత్త విధానాలు, అంచనాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు అందిపుచ్చుకుంటారు.కొత్తకొత్త ఆలోచనలు స్పురించి వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తారు. కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. రావలసిన మొండిబాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు విజయాల బాటలో పయనిస్తారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కొన్ని అగ్రిమెంట్లు వాయిదా. శ్రమ తప్పదు. నలుపు, నీలం రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సన్నిహితుల సాయం పొందుతారు. వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆరోగ్యం విషయంలో గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయ, కళారంగాల వారు సన్మానాలు,సత్కారాలు పొందుతారు.విద్యార్థులకు పరిశోధనలలో అనుకూల ఫలితాలు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆలోచనలు కలసిరావు. ఎరుపు, ఆకుపచ్చరంగులు అన్నపూర్ణాష్టకం పఠించండి.

పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సన్నిహితులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అంది ఆశ్చర్యపోతారు. అప్పులు తీరతాయి. కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. పలుకుబడి కలిగిన వారు పరిచయం కాగలరు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. అందర్నీ ఆకట్టుకుంటూ ముందడుగు వేస్తారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో విశేషమైన పేరు గడిసారు. రాజకీయవర్గాలకు కొత్తపదవులు లభిస్తాయి. విద్యార్థులకు పరిశోధనలలో విజయం. వారం మధ్యలో దూరప్రయాణాలు. మనస్సు చంచలంగా ఉంటుంది. ధనవ్యయం. ఎరుపు,గులాబీ రంగులు. విష్ణుధ్యానం చేయండి.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి సంఘటనలు ఎదురవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కొన్ని బాకీలు వసూలవుతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. . సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మీ మాటే చెల్లుబాటు కాగలదు. రాజకీయవర్గాలకు విశేష గౌరవం దక్కుతుంది.. కళాకారులు సన్మానాలు పొందుతారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధువుల నుండి ఒత్తిడులు రాగలవు. పసుపు, ఆకుపచ్చరంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. కుటుంబంలో సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. వ్యాపారాలలో కొత్తపెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు కొత్త సంస్థల్లో భాగస్వాములవుతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.విద్యార్థులకు ఫలితాలు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడులు రాగలవు. గులాబీ,తెలుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటì æనిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. వారం మధ్యలో వృథా ఖర్చులు కుటుంబంలో ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా సాగవు. నేరేడు, గోధుమరంగులు. శివాష్టకం పఠించండి.