ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. సోదరులు కొంత సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మ«ధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.
వీరికి మిశ్రమంగా ఉంటుంది. పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు ఉండదు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేకున్నా కొన్ని మార్పులు తప్పదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా సాగవు. గులాబీ, తెలుపు రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.
ఎంతటి వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆ తరువాత కొంత మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయం కాగలరు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనుకోని పిలుపు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు అన్నింటా అనుకూలమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.
బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో మానసిక అశాంతి. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తుంది. విద్యార్థులు మరింత కృషి చేస్తే ఫలితం కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు. అనుకున్న పనుల్లో ప్రతిబ«ంధకాలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వివాహ, ఉద్యోగయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నెమ్మదిగా సాగి స్వల్పలాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు లేనిపోని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.
ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. సమస్యలు కొన్ని ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇంటాబయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, నీలం రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
నేర్పుగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల హడావిడి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకునే సమయం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తి, నేర్పుతో క్లిష్టమైన వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం చివరిలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. అనుకోని ధనవ్యయం. బంగారు, తెలుపు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
కొన్ని ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులు మాటసహాయం అందిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు సైతం వసూలై ఆర్థికంగా బలపడతారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవర్గాలకు మరింత సానుకూలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. వినాయక స్తోత్రాలు పఠించండి.
ప్రారంభంలో కొన్ని సమస్యలు, వివాదాలు తప్పకపోవచ్చు. అయితే పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రుల సహాయం కోరతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహ వేడుకలకు హాజరవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.