చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, శ్రీమహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.
పలుకుబడి పెరుగుతుంది. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అవార్డులు రావచ్చు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్య భంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు, శ్రీమహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు. సన్నిహితులతో మరింత ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తి చేస్తారు. మీ సత్తా పదిమందీ గుర్తిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాల యత్నాలు సఫలం. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ఆర్థిక విషయాలు మరింత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ ఆశయాలు నెరవేరేందుకు మార్గం ఏర్పడుతుంది. ఒక సమాచార ం సంతోషం కలిగిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు ఎదురుకావచ్చు. గులాబీ, ఎరుపురంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ముఖ్యమైన వ్యవహారాలు కొంత జాప్యంతో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారంతో భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకుపచ్చ, నీలం రంగులు. శ్రీమీనాక్షిస్తుతి పఠించండి.
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రోత్సాహం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, నీలం రంగులు. శ్రీశివపంచాక్షరి పఠించండి.
కొత్త పనులు చేపట్టడమే కాకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు అమలు చేస్తారు. మీ విజ్ఞానాన్ని అందరితో పంచుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు.స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు మరింత సానుకూలం. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడురంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉండడమే కాకుండా రుణబాధలు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మీ సత్తా నిరూపించుకుంటారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
పనులు కొంత మందగించినా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ఆప్తులు, బంధువుల సూచనలు పాటిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. చిరకాల మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నీలం, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు కలసిరావు.బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగినా చివరిలో స్వల్ప లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఇష్టం లేకున్నా మార్పులు తప్పవు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి. వారం చివరిలో వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. శుభవార్తలు. నీలం, పసుపు రంగులు. శ్రీఉమాదేవి స్తోత్రాలు పఠించండి.
పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అందరిలోనూ విశేష గుర్తింపు రాగలదు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు తథ్యం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. శ్రీసుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
పరిచయాలు పెరుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే సంతృప్తినిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యతిరేక పరిస్థితులను సానుకూలపర్చుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారికి ఆహ్వానాలు, పిలుపులు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది.