. | Rasi Phalalu Daily Horoscope On 8 12 2025 In Telugu | Sakshi

కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు.

కొత్త పనులు చేపడతారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. పనుల్లో ప్రతిబంధకాలు. ఇంటాబయటా సమస్యలు.బంధువులు,మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి.ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి లభిస్తుంది.

ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. వివాదాలు చికాకు పరుస్తాయి. సన్నిహితులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు.

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. చిరకాల సమస్య ఒకటి. పరిష్కారానికి నోచుకుంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగల అవకాశం.

ఉత్సాహంగా పనులు చేపటి ్టపూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరి^è యం. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం.

కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వ్యాపార లావాదేవీలలోఆటుపోట్లు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పనులలో అవాంతరాలు తప్పవు.బంధువులు, మిత్రులతో కలహాలు. వాహనాలు, ఆరోగ్యం విషయాలలో శ్రద్ధ చూపండి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు స్థానచలనం.

ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్య సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. కొత్త వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

కొత్త పనులు చేపడతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కుటుంబంలో కలహాలు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి. ఆరోగ్యపరమైన చికాకులు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగులకు అనుకోని బదిలీలు.