. | Rasi Phalalu: Daily Horoscope On 24-06-2025 In Telugu | Sakshi

మేషం....కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. ధనలాభం. నూతన ఒప్పందాలు. ఆస్తిలాభ సూచనలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిథునం....ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం...చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం....సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కన్య....సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల....పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. వైద్యసేవలు.

వృశ్చికం....ఇతరులకు సైతం సాయపడతారు. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం. పనుల్లో ప్రతిష్ఠంభన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు...కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వైద్యసేవలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం...మిత్రులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.