. | Rasi Phalalu: Daily Horoscope On 16-12-2025 In Telugu | Sakshi

ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది.కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కార్యక్రమాలు కొన్ని నిరాశ పరుస్తాయి. ఆదాయం అంతగా కనిపించదు. ప్రయాణాలు వాయిదా. కొత్తగా అప్పులు చేస్తారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు. దేవాలయ దర్శనాలు. కుటుంబసభ్యులు, స్నేహితులతో విభేదిస్తారు. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది.

కుటుంబపరంగా కొద్దిపాటి చికాకులు. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దేవాలయ దర్శనాలు.

ఉద్యోగయత్నాలలో పురోగతి. అందరిలోనూ గౌరవం. చర్చలు సఫలం. కుటుంబంలో శుభకార్యాల చర్చలు. అదనపు రాబడి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. దేవాలయ దర్శనాలు.

కార్యక్రమాలలో స్వల్ప అవాంతరాలు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. కష్టపడ్డా ఫలితం ఉండదు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి. స్వల్ప శారీరక రుగ్మతలు.

ప్రముఖులతో పరిచయాలు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి.

నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. కొత్త కార్యాలు చేపడతారు. వస్తులాభాలాలు. వృత్తులు, వ్యాపారాలలో మరింత అనుకూలత.

ఆదాయం కంటే ఖర్చులు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో కొంత జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో విభేదిస్తారు. వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆదాయం కొంత సంతప్తినిస్తుంది. విచిత్రమైనసంఘటనలు. చేపట్టిన కార్యాలలో స్వల్ప ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో శ్రమాధిక్యం.