పరిచయాలు పెరుగుతాయి. వృథా ఖర్చులు చేస్తారు. ఆలోచనలు కొలిక్కి రావు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో కొంత ప్రోత్సాహం.

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తులు, వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి.

మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తులు, వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు.

మీ శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

చిరకాల మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలం.

రుణవిముక్తి లభిస్తుంది. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ఆర్థిక ఇబ్బందులు కాస్త తొలగుతాయి. దూరపు బంధువుల కలయిక. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

రాబడి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తులు, వ్యాపారాలు నిదానిస్తాయి.

దూరప్రాంతాల నుండి కీలక సమాచారం. యత్నకార్యసిద్ధి. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. నిర్ణయాలలో మిత్రుల సలహాలు. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిత్రుల నుండి కొంత ఒత్తిడులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఆలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి. దైవదర్శనాలు. ధనప్రాప్తి. శుభకార్యాలపై చర్చలు. వృత్తులు, వ్యాపారాలను సాఫీగా కొనసాగిస్తారు.