ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలకు ఇబ్బంది ఉండదు. శత్రువులనుకున్న వారు మిత్రులుగా మారతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు శ్రమకు ఫలితం దక్కే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. ముఖ్య వ్యవహారాలను సకాలంలో చక్కదిద్దుతారు. నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుండి బయటపడతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు శుభవార్తలు వింటారు. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ధనవ్యయం. ఒత్తిడులు. పసుపు, బంగారు రంగులు. శ్రీదక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ఆర్థికంగా మరింత సర్దుబాట్లు కాగలవు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబసమస్యలను స్వయంగా పరిష్కరించుకుంటారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వాహనసౌఖ్యం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. కళాకారులు, వైద్యరంగం వారికి మరింత ప్రోత్సాహం. వారం మధ్యలో ధననష్టం. బంధువిరోధాలు. అనారోగ్యం. గణపతి స్తోత్రాలు పఠించండి.

కొన్ని కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. కొన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్య ఎదురీదవలసి వస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. స్థిరాస్తి వివాదాలతో కుస్తీపడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. పసుపు, నేరేడు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.

కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. కాశీ, ప్రయాగ వంటి యాత్రలు చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలను విస్తరించడంలో కొందరి సాయం అందుతుంది. ఉద్యోగాలలో యుక్తిగా బాధ్యతలు నిర్వహిస్తారు. వైద్యరంగం, క్రీడాకాకారులకు ఊహించని సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలను పెంచుచకుంటారు. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు వృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో తగినంత గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.

చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వాహనయోగం. వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలను చాకచక్యంగా నిర్వహించి లాభాలు దక్కించుకుంటారు. వైద్యరంగం ,రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ఊహించని సంఘటనలు ఎదురుకావచ్చు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. క్రీడాకారులు,పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం చివరిలో మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

అనుకున్న కార్యక్రమాలను చక్కదిద్ది ఊరట చెందుతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మీరు అనుకున్నంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చికాకులు, చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

ముఖ్యమైన వ్యవహారాలను కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ విశేష గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. వివాహాది కార్యక్రమాల నిర్వహణపై ఆలోచనలు సాగిస్తారు. కొన్ని వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. కళారంగం, రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు చర్చలు జరుపుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్నంత ప్రగతి సాధిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింత పెంచుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో ఎదురయ్యే ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. వైద్యులు, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. అధిక ఖర్చులు. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.

కొన్ని సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. అనుకున్న వ్యవహారాలు నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. క్రీడాకారులు, సాంకేతిక వర్గాలకు ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక ఆందోళన. గులాబీ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.