
నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటి(nalgonda municipality) వద్ద బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్లో బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కార్యకర్తలు బైఠాయించడంతో.. కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌ెడ్డి మండిపడ్డారు.
అదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు.
అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతాం..
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్(Congress) నేతలు మండిపడుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రస్తకే లేదన్నారు. ‘పోలీసులపై కంచర్ల భూపాల్ రెడ్డి దుర్భాషలాడారు. కంచర్ల భూపాల్ రెడ్డి పదేపదే అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాం ఇకపై ఉరికిచ్చి కొడతాం.కంచర్ల భూపాల్ రెడ్డి ఒక మెంటల్ కృష్ణ’అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల, అనుచరుల దాడి
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment