బీజేపీ గూండాలతో కేజ్రీవాల్‌ను చంపించే ప్రయత్నం: సీఎం ఆతిశీ | Attack on Arvind Kejriwal Parvesh Verma Atisi BJP AAP | Sakshi
Sakshi News home page

బీజేపీ గూండాలతో కేజ్రీవాల్‌ను చంపించే ప్రయత్నం: సీఎం ఆతిశీ

Jan 19 2025 12:45 PM | Updated on Jan 19 2025 1:34 PM

Attack on Arvind Kejriwal Parvesh Verma Atisi BJP AAP

న్యూఢిల్లీ:  దేశరాజధాని ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగిన దరిమిలా ముఖ్యమంత్రి ఆతిశీ ఈ ఘటనకు కారణం బీజేపీ అంటూ, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను చంపడానికి భారతీయ జనతా పార్టీ శిక్షణ పొందిన గూండాలను పంపిందని  ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలా చేస్తున్నదని స్పష్టమవుతోందన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మీడియాతో మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను చంపడానికి నేరస్తులు, గూండాలను పంపినట్లు స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఈ దాడిలో పాల్గొన్న రోహిత్ త్యాగి అని, అతను  ఎప్పుడూ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ పక్కనే ఉంటాడన్నారు. ఆయన పర్వేష్ వర్మ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడన్నారు.

ఈ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై 2011లో దొంగతనం కేసు, హత్యాయత్నం కేసు నమోదయ్యాయని,  ఈ నేరానికి అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఆతిశీ(atisi) పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న మూడవ వ్యక్తి సుమిత్ అని, అతనిపై దొంగతనం, దోపిడీ, హత్యాయత్నం కేసులు నడుస్తున్నాయన్నారు.
 

శనివారం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేసిన ముగ్గురు గూండాలు సాధారణ బీజేపీ కార్యకర్తలు(BJP workers) కాదని, శిక్షణ పొందిన గూండాలు, నేరస్తులని.. వారిపై నమోదైన కేసులను చూస్తే తెలుస్తుందని ఆతిశీ పేర్కొన్నారు. దీనిని చూస్తుంటే ఎన్నికల భయంతో బీజేపీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌ను చంపడానికి ప్రయత్నిస్తోందని స్పష్టంగా తెలుస్తున్నదని ఆమె ఆరోపించారు.

ఈ ప్రమాదం తర్వాత కూడా ఎన్నికల సంఘం ఏమీ స్పందించలేదని ఆతిశీ పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ కు గరిష్ట అధికారం ఉన్నప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు.  ఈ ఘటనపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కిల్లర్ తరహా వ్యక్తులు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కోసం ప్రచారం చేయడానికి వచ్చారా లేదా అరవింద్ కేజ్రీవాల్‌ను చంపడానికి వచ్చారా? అని ప్రశ్నించారు. వారు ఢిల్లీకి ఎందుకు వచ్చారు? అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రతిరోజూ దాడి జరుగుతోందని,  తాజాగా జరిగిన  ఘటన అరవింద్ కేజ్రీవాల్ హత్యకు జరిగిన కుట్ర అని సంజయ్‌సింగ్‌ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: పారా గ్లైడింగ్‌లో ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement