breaking news
Telangana High Court
-
డీజీపీ నియామకంలో ‘సుప్రీం’ ఆదేశాలు పాటించారా?
సాక్షి, హైదరాబాద్: డీజీపీగా బి.శివధర్‌రెడ్డి నియామకంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డికి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ పూర్తికాల డీజీపీని నియమించే ప్రక్రియను ప్రారంభించాలని సర్కార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామా జిక కార్యకర్త టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు. పార్టీ ఇన్ పర్సన్(పిటిషనర్) వాదనలు వినిపిస్తూ.. శాశ్వత నియామకం జరిగేలా చూడటానికి, డీజీపీ పదవీ విరమణకు కనీసం 3 నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ భర్తీకి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో సర్కార్ విఫలమైందని, తద్వారా శాశ్వత నియా మక ప్రక్రియను పక్కన పెట్టిందన్నారు. అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. యూపీఎస్సీకి ఒక ప్యానెల్‌ను సమర్పించినట్లు తెలిపారు.అయితే, కమిషన్ అనేక వివరణలు కోరిందని, ఈలోగా కొందరు అధికారుల పదవీ విరమణతో ఈ ప్రక్రియ మ రింత సంక్లిష్టంగా మారిందన్నారు. ప్రస్తుత కేసు లో కో–వారంటో (ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి అధికారాన్ని సవాల్ చేసే) రిట్ దాఖలు చేయలేరని చెప్పారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషనర్ భావిస్తే.. అక్కడే ధిక్కార కేసు దాఖలు చేయాలని నివేదించారు. న్యాయస్థాన ం ఆదేశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
కొత్త హైకోర్టు పనులపై సీఎస్ వికాస్ రాజ్ సమీక్ష
సాక్షి,హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త హైకోర్టు భవన సముదాయం పనుల పురోగతిని రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ బుధవారం పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్లు (బిల్డింగ్స్, ఎలక్ట్రికల్), ఆర్అండ్బీ ఫీల్డ్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ సంస్థ డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, కన్సల్టెంట్లు టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు. పనుల వేగం, క్రమబద్ధత, నాణ్యతను వికాస్ రాజ్ సమీక్షించి, వివిధ దశల పూర్తి కాలపట్టికలను ఖరారు చేశారు.తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక న్యాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కొత్త హైకోర్టు భవన సముదాయానికి రూ.2,583 కోట్ల పరిపాలనా అనుమతి ఉంది. మొత్తం 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, ఎంఈపీ పనులకు రూ.1,980 కోట్లు, ఫర్నిచర్ మరియు ఆపరేటివ్ పరికరాలకు రూ.603 కోట్లు కేటాయించారు. 2024 డిసెంబర్ 7న జారీ చేసిన జీఓ ఆర్టీ నెం.827 ద్వారా పరిపాలనా ఆమోదం లభించింది.పనుల సమీక్షలో భాగంగా, డ్రాయింగ్లను ముందుగానే సమర్పించాలని కన్సల్టెంట్లను వికాస్ రాజ్ ఆదేశించారు. తద్వారా కార్మికులు, సామగ్రి, యంత్రాల సమర్థ వినియోగం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. పనుల పూర్తి కార్యక్రమాన్ని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్), కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ కలిసి రూపొందించాలని, దానిపై తరచూ సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఒప్పందంలో పేర్కొన్న మైలురాళ్ల ప్రకారం పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. న్యాయ అధికారుల సూచనలకు అనుగుణంగా మార్పు చేసిన నమూనాలను ఆలస్యం లేకుండా సిద్ధం చేసి, అనుమతులు పొందాలని కన్సల్టెంట్లకు ఆదేశించారు. జోన్-2కు సంబంధించిన అటవీ అనుమతులు సహా అన్ని క్లియరెన్సులను త్వరితగతిన పూర్తిచేయాలని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్)కు సూచించారు.డిజైన్ మార్పుల వల్ల ఏర్పడిన ఆలస్యాలను అధిగమించేందుకు శాఖ, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేయాలని, ప్రాజెక్టును సమయానికి పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. -
జీహెచ్ఎంసి డీలిమిటేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసి డీలిమిటేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు స్వీకరించే గడువును మరో రెండు రోజులు పొడిగించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీ 24 గంటల్లోపు జనాభా వివరాలు, వార్డుల వారీగా మ్యాప్‌ను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. పౌరులు రెండు రోజుల్లోపు తమ అభ్యంతరాలను సమర్పించాలి. వాదనలో అడ్వకేట్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ గురించి ప్రస్తావించారు. డెడ్‌లైన్ దగ్గర పడుతున్నందున.. రెండు రోజులకు మించి గడువు పొడిగించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల న్యాయవాదులు మూడు రోజులు గడువు ఇవ్వాలని కోరగా.. హైకోర్టు రెండు రోజులు సరిపోతుందని తేల్చిచెప్పింది.అంతకుముందు జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, రాష్ట్ర ప్రభుత్వ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.డీలిమిటేషన్‌పై ముందస్తు సమాచారం ఇవ్వలేదని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రభాకర్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ మ్యాప్‌ను పబ్లిక్ డొమైన్లో ఉంచలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ప్రతిగా పునర్విభజన మ్యాప్‌ను హైకోర్టుకు సమర్పించామని ఏజీ చెప్పారు. నియోజకవర్గాల సరిహద్దులు మార్చకుండా వార్డుల విభజన మాత్రమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. పై విధంగా స్పందించింది. -
‘గీతం’ బకాయిలు రూ.118 కోట్లా?
‘నామమాత్రపు బకాయిలున్నా పేద వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తారు. తొలగించే ముందు వినియోగదారులకు ఎలాంటి నోటీసు కూడా పంపరు. అలాంటిది రూ.118 కోట్లు బకాయిలున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది. పదవుల్లో ఉన్న వారి కోసం ఓ చట్టం, పేదవారి కోసం మరో చట్టాన్ని విద్యుత్ అధికారులు రూపొందించారా?’ ‘దశాబ్దాలుగా బిల్లు చెల్లించకుండా విద్యుత్ సేవలు పొందుతుండటం దిగ్భ్రాంతికరం. 2008–09 నుంచి బకాయిలు పేరుకుపోయాయి. విశ్వవిద్యాలయానికి విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేయాలని డిస్కమ్‌ల నుంచి స్పష్టమైన ఉత్తర్వులున్నా.. అధికారులు మాత్రం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమయ్యారు. ఇది సంబంధిత అధికారుల నిష్క్రియాత్మకతకు నిదర్శనం’ – జస్టిస్ నగేశ్ భీమపాక సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండు దశాబ్దాలుగా ఓ సంస్థ విద్యుత్ బిల్లు చెనిష్క్రిల్లించకుంటే అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రూ.118.13 కోట్ల బకాయిలున్న గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) యూనివర్సిటీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు ఓ నీతి.. ఆర్థికంగా ఉన్నవారికో నీతా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్యంలో తన ఇంటికి రూ.800 బకాయి ఉంటే అధికారులు సరఫరాను ఎలా నిలిపివేశారో ఈ సందర్భంగా జస్టిస్ నగేశ్ భీమపాక గుర్తు చేసుకున్నారు. అలాంటి విద్యుత్ అధికారులు గీతం వర్సిటీకి ఎందుకు వెసులుబాటు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. పదవుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారా అని ప్రశ్నించారు. విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా మీనమేషాలు లెక్కబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా, పదవుల్లో ఉన్న వారి కోసం అధికారులు చేపట్టే ఇలాంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని హెచ్చరించారు. విశ్వవిద్యాలయానికి విద్యుత్ సరఫరాను ఎందుకు నిలిపివేయలేదో వివరించడానికి తదుపరి విచారణ తేదీన టీజీఎస్పీడీసీఎల్లోని ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించారు. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేశారు. చర్య తీసుకోకపోవడం సరికాదు.. బకాయిలను చెల్లించాలని, లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపేస్తామంటూ గత సెప్టెంబర్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం వర్సిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యా యవాది వాదనలు వినిపిస్తూ.. గీతం వర్సిటీకి వి ద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేయడం అన్యాయమన్నారు. టీజీఎస్పీడీసీఎల్ స్టాండింగ్ కౌన్సెల్ శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలోనూ గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశామన్నారు. దాన్ని సవాల్ చేస్తూ 2020లో రిట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. తొలుత వర్సిటీ మ ధ్యంతర స్టే పొందినా.. తర్వాత పిటిషన్‌ను ఉపసంహరించుకుందని చెప్పారు. దీంతో విద్యుత్ బకాయిలు గణనీయంగా పేరుకుపోయాయని చెప్పారు. మొత్తం రూ.118,13,46,432 బకాయిలున్నాయని, తదనుగుణంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ గత సెప్టెంబర్ లో మళ్లీ నోటీసు జారీ చేశారని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పెద్దఎత్తున, దీర్ఘకాలిక బకాయిలున్నా గీతం వర్సిటీపై ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. -
కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. హైకోర్ట్ ఆగ్రహం
బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2' సినిమాకు ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు ఇచ్చింది. ఈ మేరకు బుకింగ్స్ ప్రారంభించారు. కానీ గురువారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రీమియర్ల కోసం పెంచిన టికెట్ రేట్లు తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో పెంచిన ధరలతోనే టికెట్స్ అమ్మారు. షోలు పడ్డాయి. దీంతో ఇప్పుడు మరో న్యాయవాది ఈ విషయమై పిటిషన్ వేశారు. న్యాయస్థానం చెప్పినా సరే ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో హైకోర్ట్.. చిత్రబృందంపై, బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్క లేదా ? ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారని బుక్ మై షోని హైకోర్టు ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో సమాధానమివ్వగా.. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారా లేదా? అని ప్రశ్నించింది. ఎందుకు మీపై కంటెంప్ట్ యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలని సీరియస్ అయింది. మధ్యాహ్నం మళ్లీ విచారణ జరగనుంది.మరోవైపు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో 'అఖండ 2' నిర్మాణ సంస్థ 14 రీల్స్.. లంచ్ మోషన్ దాఖలు చేసింది. అఖండ-2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను, డివిజన్ బెంచ్‌లో 14 రీల్స్ సంస్థ అప్పీలు చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్‌లో అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థకు ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉతర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. 14వ తేదీ వరకు స్టే విధించిన డివిజన్ బెంచ్.. తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా వేసింది.అలానే సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయింది. కోర్ట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదు? హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కోర్టు ఉత్తర్వులు పట్టవా? సీనియర్ అధికారులు అయి ఉండి ఎందుకు ఇలాంటి మెమోలు జారీ చేస్తున్నారు? ప్రతిసారి ఈ మెమొలు ఇవ్వడం ఎందుకు ?? కోర్టు ఉత్తర్వులు తర్వాత విత్‌డ్రా చేయడం ఎందుకు?? అని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. -
హైకోర్టులో 12 జడ్జి పోస్టులు ఖాళీ
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. హైకోర్టుకు మంజూరైన జడ్జి పోస్టులు 42 కాగా, ప్రస్తుతం 12 ఖాళీలు ఉన్న మాట వాస్తవమేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పార్లమెంట్ వేదికగా అంగీకరించారు. అయితే, ఈ ఖాళీల భర్తీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు కొలీజియం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు.రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2025 డిసెంబర్ 5 నాటికి తెలంగాణ హైకోర్టు నుంచి జడ్జీల నియామకానికి సంబంధించి ఏ ఒక్క ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదన్నారు. నిబంధనల ప్రకారం ఖాళీ ఏర్పడటానికి 6 నెలల ముందే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కానీ, ఈ గడువు చాలా అరుదుగా మాత్రమే అమలవుతోందని మంత్రి తెలిపారు. -
ఆ పిల్‌కు నంబర్ కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాప్ర యోజన వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్‌ను ఈ పిటిషన్‌కు జత చేయాలని స్పష్టం చేసింది. ఈ రెండు పిల్లపై సీజే ధర్మాసనం వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. పలువురికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరాలు లేవనెత్తిన రిజిస్ట్రీ నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఫైలింగ్ నంబర్‌పైనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 2017లో అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇదే ‘కేబినెట్ హోదా’ అంశంపై పిటిషన్ వేశారని, అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టినా ప్రయోజనం లేదని చెప్పారు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఓ నిర్ణయం తీసుకుంటారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తారని చెప్పారు. ఆర్టికల్ 164 (1ఏ) ప్రకారం మంత్రివర్గ హోదా కల్పించే విషయంలో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదన్నారు. ప్రస్తుతం 16 మంది కేబినెట్ మంత్రులకు అదనంగా ప్రభుత్వంలోని 14 మంది ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు ఆ హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నా రు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు జరిమానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా విధించింది. రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. వారం లోపు చెల్లించాలని స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. జంట జలాశయాల సమీపంలో నిర్మాణాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.చివరి అవకాశం ఇచ్చినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి 2 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా వేసింది. -
‘అఖండ 2’ సినిమాకు మరో భారీ షాక్.. హైకోర్టులో పిటిషన్!
మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సిన అఖండ-2 కు ఊహించని షాక్ తగిలింది. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేశారు. లంచ్ మోషన్‌కి అనుమతించిన న్యాయస్థానం.. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేయనుంది.కాగా, ఇప్పటికే అఖండ 2(Akhanda 2 ) రిలీజ్ ఒకసారి వాయిదా పడింది. ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఈ వివాదాన్ని సెటిల్ చేసుకొని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సతీష్ కమల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ప్రీమియర్స్‌ని రద్దు చేయడంతో పాటు టికెట్ల రేట్ల పెంపుకు ఇచ్చిన మోమోని సస్పెండ్ చేయాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. మరికాసేపట్లో హైకోర్టు(Telangana High Court) దీనిపై విచారణ చేయనుంది. దీంతో ఇప్పుడు మరోసారి అఖండ 2 సినిమా హాట్ టాపిక్ అయింది. మరి ఈ విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది.అఖండ 2 విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. సంయుక్త హీరోయిన్గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. -
బంజారాహిల్స్‌లో రూ. 350కు గజమా?
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లో గజం రూ.350 చొప్పున మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుటుంబ సభ్యులకు భూమిని క్రమబద్ధీకరించడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సామాన్య ప్రజలకూ అదే ధరకు ఎల్ఆర్ఎస్ చేస్తున్నారా అని అడిగింది. జీవోలో లోపాలు కనిపిస్తున్నా యని, పరిశీలించి తప్పు ఉంటే సరిదిద్దుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో తామే జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. కేకే కుమారుడు వెంకటేశ్వర్రావు, కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మికి భూమి క్రమబద్ధీకరణ చేస్తూ 2023, మే 23న విడుదల చేసిన జీవో 56ను సవాల్ చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ జీవో కింద వందల కోట్ల విలువైన భూమిని కె.కేశవరావు కుమారుడు, కూతురుతోపాటు కవితరావుకు నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ చేశారన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, ఎన్బీటీ నగర్లో 1,161 గజాల భూమిని రూ.2,500 చొప్పున, 425 గజాలను రూ.350 చొప్పున క్రమబద్ధీకరించారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మురికివాడల్లో క్రమబద్ధీకరణకూ ఓ పరిమితిపిటిషనర్ తరఫున న్యాయవాది శ్రేయస్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అత్యంత ఖరీదైన బంజారాహిల్స్‌లో స్వల్ప ధరలకు ప్రభుత్వం భూ క్రమబద్ధీకరణ చేసిందన్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర రూ.60 వేలు ఉండగా, రూ.350, రూ.2,500కు గజం చొప్పున ఇచ్చిందన్నారు. దీంతో ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. లబ్ధిదారులు ఆర్థిక శాఖకు వినతిపత్రం సమర్పించడంతో ప్రత్యేక జీవో విడుదల చేశారన్నారు. అప్పటికే ఒక ప్లాట్‌కు విద్యుత్ కనెక్షన్ ఉండటంతో.. కనెక్షన్ తీసుకున్న నాటి మార్కెట్ ధరకే క్రమబద్ధీకరించినట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో అందరికీ ఒకేలా ఉండాలి కానీ.. ఇలా ఒకరికి అనుకూలంగా ఉండేలా ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. మురికివాడల్లోనూ భూ క్రమబద్ధీకరణకు కూడా ఓ పరిమితి ఉందని వ్యాఖ్యానించింది. 1998 నాటి ధరను పరిగణనలోకి తీసుకోవడం సమర్థనీయం కాదంది. -
అధికారుల నిర్లక్ష్యంతోనే సిగాచీ పేలుడు
సాక్షి, హైదరాబాద్: సిగాచీ పేలుడు ఘటనకు ఒకరోజులో జరిగిన లోపం కారణం కాదని.. కొంత కాలంగా అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యమే ప్రధాన కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్మిక, పరిశ్రమలు, పర్యావరణ శాఖలు ఎవరి పని వారు చేయలేదని అభిప్రాయపడింది. సరైన సమయంలో తనిఖీలు నిర్వహించి ఉంటే 54 మంది ప్రాణాలు పోయేవి కాదంది. పరిమితికి మించి పేలుడు పదార్థాలున్నా పట్టించుకోలేదని, 90 మంది పనిచేయాల్సిన చోట సగం మందే విధులు నిర్వహిస్తున్నారని పేర్కొంది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేస్తేగానీ మిగతా వారు దారిలోకి వచ్చేలా లేరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు అధికారి చెప్పిన వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాలు సమయం ఇస్తున్నామని, పూర్తి వివరా లతో సమాధానం చెప్పేందుకు సిద్ధమై రావాలని ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేసింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామి కవాడలోని సిగాచీ పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందగా, 8 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియు ద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారించింది.సంక్షిప్త నివేదికలు సమర్పించాం..దర్యాప్తు అధికారులు హాజరుకావాలని గత విచారణ సందర్భంగా ఆదేశించడంతో.. డీఎస్పీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ విజయ్‌కృష్ణ, పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ గౌరీ శంకర్ కోర్టుకు వచ్చారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు అధికారులు రికార్డులతో పాటు సంక్షిప్త నివేదికను సమర్పించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ధర్మాసనం జోక్యం చేసుకుని అధికారుల తనిఖీలపై డీఎస్పీని ప్రశ్నించింది. గత డిసెంబర్లో పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించినట్లు బదులిచ్చారు. మరి ఇతర శాఖలు ఏం చేస్తున్నాయని ధర్మాసనం అడిగింది. ప్రమాదకర రెడ్ జోన్‌లోని పరిశ్రమల్లో పదుల సంఖ్యలో శాఖలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా, అది జరగలేదని తెలు స్తోందని చెప్పింది. పరిశ్రమ యాజమాన్యంపై చార్జిషీట్ దాఖలు చేస్తారు.. మరి అధికారుల మాటేమిటని ప్రశ్నించింది. ఈ కేసు విచారణలో సహకరించడానికి అమికస్ క్యూరీగా డొమినిక్ ఫెర్నాండెజ్‌ను ధర్మాసనం నియమించింది. ఘట నకు సంబంధించిన వివరాలు, పత్రాలను ఆయ నకు సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం తాజాగా స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆమ్రపాలి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.అయితే, ఐఏఎస్ ఆమ్రపాలిని ఏపీకి అలాట్ చేస్తూ గత ఏడాది అక్టోబర్‌లో DOPT ఉత్తర్వులు జారీ చేశారు. DOPT ఉత్తర్వులను ఆమ్రపాలి క్యాట్‌లో సవాల్ చేశారు. ఈ క్రమంలో ఐఏఎస్ హరికిరణ్‌తో స్వాపింగ్‌లో భాగంగా ఆమ్రపాలిని క్యాట్ తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను DOPT మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ సందర్బంగా ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని వాదించింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు క్యాట్ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్టు హైకోర్టు తీర్పు ఇచ్చింది. -
హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరై బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఆయన క్షమాపణను అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచి్చంది. అయితే ధిక్కరణ కేసు కొనసాగుతుందని, వాదనలు విని తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. బతుకమ్మకుంట భూ వివాదంపై జూన్ 12న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ భూ హక్కులు కోరుతున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం.. రంగనాథ్‌ను నేరుగా హాజరై వివరణివ్వాలని గతంలో ఆదేశించింది. అయినా గత నెల 27న ఆయన హాజరుకాలేదు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారిక అవసరాలు, అనివార్యమైన విపత్తు నిర్వహణ బాధ్యతల కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఆయన దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)ను కొట్టివేసింది. డిసెంబర్ 5న ఎలాంటి కారణాలు చెప్పకుండా హాజరుకావాలని మరోసారి ఆదేశించింది. దీంతో శుక్రవారం రంగనాథ్ ధర్మాసనం ముందు హాజరై క్షమాపణ కోరారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని హామీఇచ్చారు. దీంతో ధర్మాసనం ధిక్కరణ పిటిషన్లో వాదనలు విన్నది. జూన్ 12 తర్వాత నిర్మాణాలు చేపట్టినట్లు తాజా ఫొటోల్లో కనిపిస్తోందని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రస్తావన తీసుకురావొద్దని, ధిక్కరణపైనే వాదనలు వినిపించాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. సివిల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా డిసెంబర్ 18కి వాయిదా వేసింది. -
10 రోజులుగా పని చేయని పోలీస్ వెబ్సైట్లు!
హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు హ్యాకింగ్ ముఠాలు షాకిచ్చాయి. ఇటీవలే హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఈ ముఠాలు.. తాజాగా సైబరాబాద్ మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లను కూడా టార్గెట్ చేశాయి. దీనివల్ల గత పది రోజులుగా ఈ వెబ్సైట్లు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వెబ్సైట్లలోని లింకులు ఓపెన్ చేస్తే, అధికారిక సమాచారానికి బదులుగా బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నాయని పలువురు గమనించడంతో విషయం తీవ్రతరం అయింది. వెంటనే IT విభాగం ఈ రెండు సైట్లను డౌన్ చేసి సర్వర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్సైట్ల నిర్వహణ బాధ్యతలు చూసే NIC (National Informatics Centre) అలర్ట్ అయ్యింది.హ్యాకింగ్‌కు కారణమైన ముఠాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తూ సర్వర్ల భద్రతను బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. సైబర్ దాడులు వరుసగా జరుగుతుండటంతో ప్రభుత్వ విభాగాల్లో సైబర్ భద్రతపై కొత్త చర్చ మొదలైంది. అధికార వర్గాలు మాత్రం త్వరలోనే వెబ్సైట్లను పునరుద్ధరిస్తామని, భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడిస్తున్నాయి. -
బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జారీచేసిన జీవోలపై స్టేను హైకోర్టు పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీవో 9, 41, 42పై నిలిపివేత ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ప్రతివాదు లను ఆదేశించింది. అప్పటి నుంచి మరో రెండు వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్లకు చెబుతూ.. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవా పూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవ రెడ్డితోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. తమ వాదనలూ వినాలని కోరుతూ కాంగ్రెస్ సహా కొందరు బీసీ నాయకులు 28 మంది ఇంప్లీడయ్యారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ప్రతివాదులు కోరడంతో సమ్మతించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకే ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసమే పంచాయతీ ఎన్నికలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి స్పష్టం చేశా రు. రాజ్యాంగ ఉద్దేశం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జనాభా లేని వర్గాలకు సర్పంచ్, వార్డు స్థానాలను రిజర్వ్ చేస్తే ఎన్నికలు నిలిచి పోయి వాటి ప్రయోజ నానికి భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర వర్గాలకు రిజర్వ్ చేయాలని తాము ఆదేశిస్తే అది ఎన్నికల నిర్వహణ ను ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు. తమ ముందున్న పిటిషన్లు విసృత పరిణామాలతో ముడిపడి ఉన్నందున వాటిని ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ బుధవారానికి వా యిదా వేశారు. వరంగల్ జిల్లా మహమూద్ పట్నంలో ఆరుగురు ఎస్టీలుంటే సర్పంచ్ పోస్టుతోపాటు 3 వా ర్డులను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన యాకూబ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటివే మరో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ టి. మాధవీదేవి విచా రణ చేపట్టి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు నిలిచిపోవడం సరికాదు.. ‘రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 25న నోటిఫికేషన్ ఇచ్చింది. 2011 జనాభా లెక్క లు, 2014 గణాంకాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను తీసుకొని పాలసీ ప్రకారం, రోస్టర్ రొటేషన్ ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను రిజర్వ్ చేసింది. తమ గ్రామాల్లో రిజర్వేషన్ కులం లేదని కొందరు, అతికొద్ది మందే ఉన్నారని మరికొందరు పిటిషన్లు వేశారు. రిజర్వ్ అయిన కులాల వారు లేకుంటే స్థానాలు ఖాళీగా ఉండే ఉంటాయని.. అలాంటి చోట రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని, సంబంధిత గ్రామాల్లోని ప్రస్తుత జనాభా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్లు కోరుతున్నారు. 2011 జనగణన డేటాను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేశామని, ఇప్పటి డేటాను తీసుకోలేమన్నది అదనపు అడ్వొకేట్ జనరల్ వాదన. ఈ పిటిషన్లలో విచిత్రమైన వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసు కుంటే ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు జరగకపోవడం సముచితం కాదు. వాటిని ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం’అని తీర్పు కాపీలో న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
ఓటర్ లిస్టులో కల్పన పేరును తక్షణమే నమోదు చేయాలి: హైకోర్టు
సాక్షి, నల్లగొండ: మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన మహిళ కల్పనకు ఓటు హక్కు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. కల్పన పేరును ఓటర్ లిస్టు నుంచి అధికారులు తొలగించారు. దాంతో కల్పన హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై విచారణ అనంతరం హైకోర్టు ఓటర్ లిస్టులో కల్పన పేరును తక్షణమే నమోదు చేయాలని తేల్చి చెప్పింది. ఇందుగుల గ్రామ సర్పంచ్ సీటు ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే ఈ పంచాయితీ పరిధిలో ఇద్దరే ఎస్టీ మహిళా ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ పదవి మహిళకు కేటాయించడంతో పాటు నాలుగు వార్డులను సైతం ఎస్టీకి కేటాయించడం జరిగింది. -
ఐఏఎస్ కేడర్‌లో ఐపీఎస్లా?
సాక్షి, హైదరాబాద్: శిఖాగోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్‌లోకి తీసుకోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది. కొందరు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 1342ను సవాల్ చేస్తూ సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వడ్ల శ్రీకాంత్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పౌర సరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా శిఖాగోయల్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించడం చట్టవిరుద్ధమన్నారు. చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన జీఓ చెల్లదని చెప్పారు. రాష్ట్రంలో కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులే దర్యాప్తు చేస్తున్నారని, ఆ నివేదిక కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శి (ప్రస్తుతం ఐపీఎస్ అధికారి)కే పంపడం సరికాదన్నారు. ఇండియన్ అడ్మిని్రస్టేటివ్ సరీ్వస్ (కేడర్) రూల్స్, 1954ను ఉల్లంఘస్తూ ఏకపక్షంగా ఇచి్చన జీఓను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను అడ్డుకోలేమని హైకోర్టు సీజే ధర్మాసనం తేల్చిచెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేస్తూ ఇచ్చిన జీవో 46 నిలిపివేతకు నిరాకరించింది. రాజ్యాంగ నిబంధన ద్వారా జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం కూడదని, ఎన్నికల నిలిపివేత సరికాదని సుప్రీంకోర్టు పదేపదే చెప్పిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 285(ఏ) ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని చెప్పింది. ఈ నెల 22న ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, శ్రీ మడివాల మాచదేవ రజకుల సంఘంతోపాటు మరో ముగ్గురు ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో 46ను జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 9(4) ప్రకారం.. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీ–ఏ, బీ, సీ, డీలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లు కల్పించలేదు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయ్యిందన్నారు. నామినేషన్ల స్వీకరణ కూడా జరుగుతోందని, ఈ సమయంలో జోక్యం సరికాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. ఆ నివేదిక బహిర్గతం చేస్తే నష్టమేంటి? బీసీలపై అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక బహిర్గతం చేస్తే వచ్చే నష్టమేంటని సర్కార్‌ను న్యాయమూర్తి జసిŠట్స్ టి.మాధవీదేవి ప్రశ్నించారు. కవరింగ్ లేటర్, కమిషన్ చైర్మన్ సంతకం లేకుండా నివేదిక కోర్టుకు సమరి్పంచడాన్ని తప్పుబట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై న్యాయమూర్తి శుక్రవారం విచారణ చేపట్టారు. రిజర్వేషన్ల ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా లేనందున ఎన్నికలను నిలిపివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. ప్రస్తుతం స్టే ఇవ్వకుంటే.. తర్వాత పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు వచి్చనా అప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జోక్యం చేసుకోవద్దని ఏజీ కోరారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించిన తీరు సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సీజే ధర్మాసనం ముందు కూడా పిటిషన్లు ఉన్నందున ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. -
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో 46పై హైకోర్టు ఇవాళ(నవంబర్ 28, శుక్రవారం) విచారణ జరిపింది. ఈ దశలో ఎన్నికల పై స్టే విధించలేం అని హైకోర్టు స్పష్టం చేసింది. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలనీ కోరుకుంటున్నారా? పిటీషనర్‌కు హైకోర్టు ప్రశ్న వేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ తరఫు అడ్వకేట్ తన వాదనలు వినిపించారు.42 శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించమనీ మేమే చెప్పాం కదా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో 2009 లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్‌ను రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని హై కోర్టు తేల్చి చెప్పింది.‘‘మేమే ఎన్నికలు నిర్వహిoచమని ఆదేశించి.. మేమే స్టే ఎలా ఇస్తాం’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ రిపోర్డ్‌ను బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు తెలిపింది. సబ్ క్యాటగిరి రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 6 వారాలోపు కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు.. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. -
కోర్టు ఉత్తర్వులంటే ఆటలా?
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానం ఉత్తర్వులంటే ఆటగా ఉందా.. హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని హైడ్రా కమి షనర్ రంగనాథ్‌పై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులపై గౌరవం ఉంచాలని.. అహంకార పూరితంగా వ్యవహరించొద్దని సూచించింది. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వారిని ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించొచ్చని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే న్యాయస్థానం ఎప్పుడూ అలా ఆదేశాలివ్వలేదని.. కానీ, అవసరమైతే ఉత్తర్వులు ఇచ్చేందుకు వెనుకాడబోమంది. తదుపరి విచారణకు హాజరుకాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. బతుకమ్మకుంట భూ వివాద విషయంలో హైకోర్టు జూన్ 12న స్టేటస్కో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ భూ హక్కులు కోరుతున్న ఎ.సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.గత విచారణ సందర్భంగా ధిక్కరణపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని చెప్పినా, రంగనాథ్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక అవసరాలు, అనివార్యమైన విపత్తు నిర్వహణ బాధ్యతల కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఆయన దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)ను కొట్టివేసింది. తన హాజరుతో కోర్టును ఇబ్బంది పెట్టకూడదని ఆయన భావిస్తున్నారన్న న్యాయవాది వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. తదుపరి విచారణకు హాజరుకాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. -
‘బీసీ రిజర్వేషన్లపై’ నేడు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇదే అంశంపై విచారణ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నందున.. తాజా పిటిషన్లలో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చనేది పరిశీలిస్తామని జస్టిస్ టి.మాధవీదేవి వెల్లడించారు. అవసరమైన వాటిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెబుతూ విచారణ వాయిదా వేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకుని రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 23న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ లంచ్‌మోషన్ రూపంలో పలు పిటిషన్లు దాఖ లయ్యాయి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి మధ్యాహ్నం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సామల రవీందర్, ఇతరులు వాదనలు వినిపించారు. బీసీలకు 23% కూడా కేటాయించలేదు ‘బీసీలకు 23 శాతం కూడా పంచాయతీ స్థానాలు కేటాయించలేదు. కొన్ని జిల్లాల్లో 13 శాతమే రిజర్వు చేశారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీల కంటే బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా స్థానాలు తక్కువే కేటాయించారు. ఓ గ్రామంలో 2014లో ఎస్టీ మహిళ, 2019లో జనరల్ మహిళకు రిజర్వ్ చేస్తే ఇప్పుడు ఎస్సీలకు రిజర్వు చేశారు. వాస్తవానికి ఆ ఊరిలో బీసీల సంఖ్య ఎక్కువ. ప్రభుత్వం విడుదల చేసిన జీవో, షెడ్యూల్ నిబంధనలకు విరుద్ధం..’అని పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా.. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘చట్టప్రకా రం 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు పాటిస్తూ పంచాయతీ స్థానాలు కేటాయించాం. ముందు ఎస్టీకి, తర్వాత ఎస్సీకి, అనంతరం బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే రిజర్వేషన్లు ఇచ్చాం..’ అని నివేదించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ‘బీసీలకు 23 శాతం ఇవ్వాలని చట్టంలో లేదు’అని పేర్కొన్నారు. మహమూద్ పట్నం జీపీ ఎన్నికలు నిలిపివేత వాదనలు విన్న న్యాయమూర్తి.. తొలుత ఈ పిటిషన్లు సీజే ధర్మాసనం ముందు పెడితే బాగుంటుందేమోనని అభిప్రాయపడ్డారు. తర్వాత మొదటి కోర్టులో రిజ ర్వేషన్ల పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్నందున సింగిల్ జడ్జిగా ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చో పరిశీలన జరిపి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. అయితే బీసీ కమిషన్ నివేదికను సమరి్పంచాల్సిందిగా ప్రభుత్వా న్ని ఆదేశించారు. అదే సమయంలో వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నంలో ఆరుగురు ఎస్టీలుంటే, సర్పంచ్ పోస్టుతో పాటు మూడు వార్డులను వారికే కేటాయించడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కేటాయించడం సరికాదన్నారు. దీనిపై సమరి్పంచిన వినతిపత్రంలో నిర్ణయం తీసుకునేదాకా ఆ పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. -
54 మంది మృతి చెందితే.. ఇంత నిర్లక్ష్య దర్యాప్తా?
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో జరిగిన భారీ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 54 మంది మృతి చెందిన ఘటన దర్యాప్తుపై అధికారుల ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ప్రశ్నించింది. దారుణ ఘటన జరిగి ఐదు నెలలు కావొస్తున్నా దర్యాప్తు ఏమీ తేల్చకపోవడాన్ని తప్పు బట్టింది. 237 మంది సాక్షులను విచారించినా ఎలాంటి పురోగతి లేకపోవడం సరికాదంది. ఘటనకు కారణాలేంటి, బాధ్యలెవరనేది గుర్తించకపోవడమేంటని అడిగింది.ఇలాంటి ప్రమాదంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా..ఒక డీఎస్పీని నియమిస్తారా అని ప్రశ్నించింది. తదుపరి విచారణ రోజున తమ ముందు హాజరై దర్యాప్తునకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తును అధికారిని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ప్రమాదంలో 54 మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని హైదరాబాద్ స్నేహపురి కాలనీకి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం విదితమే. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు లేకపోవడం, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పరిశ్రమ సిబ్బందిని ఎందుకు విచారించలేదు పిటిషనర్ తరఫున న్యాయవాది వసుధ నాగరాజ్ వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగి నాలుగు నెలలు కావొస్తున్నా దర్యాప్తు మందకొడిగా సాగుతోందన్నారు. పరిహారం పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదని, బాధ్యులైన వారిని అరెస్టు చేయలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిపుణుల కమిటీ నివేదికను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని దర్యాప్తు సంస్థకు ఇటీవలే అందజేశామన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.సిగాచి పరిశ్రమ తరఫు హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలుకు రెండు వారాలు సమయం కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘మరణించిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు ‘సిగాచి’ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లించే చర్యలు చేపట్టాలని గత విచారణ సందర్భంగా ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం. ఆ మేరకు మరణించిన, గాయపడిన కార్మికులతో పాటు కనిపించకుండా పోయిన వారికి చెల్లించిన పరిహారం వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున ఏఏజీ న్యాయస్థానానికి సమరి్పంచారు. దర్యాప్తులో భాగంగా 237 మంది సాక్షులను అధికారులు విచారించారని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఘటనపై పూర్తి చార్జిïÙట్ దాఖలు చేయడానికి మరో 15 మంది సాక్షులను విచారించాల్సి ఉందన్నారు.సాక్షుల వివరాలను పరిశీలిస్తే మరణించిన, గాయపడిన కార్మికుల బంధువులు, కొందరు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. పరిశ్రమ యాజమాన్యాన్ని, ఉద్యోగులను విచారించినట్లు పేర్కొనలేదు’అని అభిప్రాయపడింది. దర్యాప్తుకు సంబంధించిన రికార్డులు, కేసు డైరీ లాంటి వివరాలతో దర్యాప్తు అధికారి తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు పరిశ్రమకు రెండు వారాలు సమయానికి అనుమతించింది. తదుపరి విచారణ డిసెంబర్ 9న మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసింది. -
గ్రూప్–2 ఉద్యోగులకు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ద్వారా ఎంపికై వివిధ పోస్టుల్లో 2019లో నియామకమైన ఉద్యోగులకు హైకోర్టు సీజే ధర్మాసనంలో భారీ ఊరట లభించింది. నియామకాలను రద్దు చేస్తూ ఈ నెల 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. గ్రూప్–2 కింద 1,032 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయగా, నవంబర్‌లో పరీక్షలు జరిగాయి. కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారంటూ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయపాలేనికి చెందిన భూక్యా ప్రియాంకతోపాటు మరికొందరు హైకోర్టులో 2019లో ఆరు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. గ్రూప్–2 నియామకాలను రద్దు చేస్తూ ఈ నెల 18న తీర్పునిచ్చారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా కమిషన్ నియమకాలు చేపట్టడాన్ని తప్పుబట్టారు. డబుల్ బబ్లింగ్, వైట్నర్, ఎరైజర్ వినియోగించిన జవాబు పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేశారు. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్టవిరుద్ధమంటూ రద్దు చేశారు. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫార్సులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించారు. ఈ ప్రక్రియంతా 8 వారాల్లో పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికుమార్‌తోపాటు మరొకరు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అందరి వాదనలూ వింటాం.. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీలెంట్ల తరఫున సీనియర్ న్యాయ వాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. కొందరు అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్ల పార్ట్–బీలో స్క్రాచింగ్, ట్యాంపరింగ్, వైట్నర్, ఎరైజర్ వినియోగించినట్టు తేలింద ని చెబుతూ నియామకాలను రద్దు చేయడం సరికాదన్నారు. అలా ఉల్లంఘనకు పాల్పడిన వారి పత్రాలను తొలగించినట్టు కమిషన్ పేర్కొన్నా, సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదన్నారు.ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఓఎంఆర్ షీట్లలో వైట్నర్, ఎరైజర్ వినియోగించిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమన్నారు. హైకోర్టు తీర్పునకు, సాంకేతిక కమిటీ సూచనలకు విరుద్ధంగా ట్యాంపరింగ్ జరిగిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారని చెప్పారు. కీలకమైన గ్రూప్–2 అభ్యర్థుల ఎంపిక లోపభూయిష్టంగా జరిగినందునే సింగిల్ జడ్జి పున: మూల్యాంకనానికి ఆదేశించారని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. అప్పీలెంట్ల వాదనలో ప్రాథమిక ఆధారాలున్నాయని భావిస్తూ సింగిల్ జడ్జి ఆదేశాలను నిలిపివేస్తూ, విచారణ వాయిదా వేసింది. ఇరుపక్షాల న్యాయవాదులతోపాటు టీజీపీఎస్సీ వాదనలు వింటామని స్పష్టం చేసింది. -
రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘిస్తారా?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRAA) పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ గురువారం ఘాటు విమర్శలు చేసింది. ‘‘రాజ్యాంగ హక్కులను హైడ్రా ఉల్లంఘించింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకేశారు?. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఫుల్ ట్యాంక్ లెవల్(FTL) నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారు?. అసలు ఎఫ్టీఎల్ నిర్ధారణే జరగనప్పుడు హద్దులు ఎలా నిర్ణయిస్తారు?. హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదు?..సున్నం చెరువు సియేట్ కాలనీలో ఉన్న వారిపై హైడ్రా చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తాయి. సియేట్ కాలనీ వాసుల స్థలాలలో ఫెన్సింగ్ వేయడం, కూల్చి వేయడం లాంటివి చేయొద్దు’’ అంటూ హైడ్రాను హైకోర్టు హెచ్చరించింది.నల్లచెరువు వద్ద ఉద్రిక్తతకూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద హైడ్రా గురువారం కూల్చివేతలకు దిగింది. అయితే.. అధికారుల్ని అడ్డుకునేందుకు ప్రకాష్ నగర వాసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగగా.. ఉద్రిక్తత నెలకొంది. -
2019 గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట
-
TG: గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: 2015 ఏడాదికి సంబంధించి తెలంగాణ గ్రూప్ 2 మెరిట్ లిస్ట్ ర్యాంకర్లకు హైకోర్ట్ లో ఊరట లభించింది. తెలంగాణ గ్రూప్-2 నియమాకాలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినx తీర్పును డివిజనల్ బెంచ్ సస్పెండ్ చేసింది. అదే సమయంలో ఆ కేసు విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. మొన్నటి తీర్పు ఇలా..తొమ్మిదిరోజుల కిందట దేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్–2 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎంఆర్ షీట్లో సమాధానాలు గుర్తించే పార్ట్–బీలో ట్యాంపరింగ్ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను ప్రశ్నించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ కమిషన్‌ను తప్పుబట్టింది. డబుల్ బబ్లింగ్, వైట్నర్, ఎరైజర్ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫారసులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియంతా 8 వారాల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. పదేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్–2 నియామకాలను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓఎంఆర్ షీట్లో సమాధానాలు గుర్తించే పార్ట్–బీలో ట్యాంపరింగ్ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను ప్రశ్నించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ కమిషన్‌ను తప్పుబట్టింది. డబుల్ బబ్లింగ్, వైట్నర్, ఎరైజర్ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫారసులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియంతా 8 వారాల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. అయితే ఇప్పుడు ఆ తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. అసలు ఏం జరిగింది..? గ్రూప్–2 కింద 1,032 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయగా, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నపత్రం బుక్లెట్, ఓఎంఆర్ షీట్లకు పొంతనలేవన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. బుక్లెట్ నంబర్, ఓఎంఆర్ నంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇని్వజిలేటర్లు భావించడంతో ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ 2017లో నివేదిక సమర్పించింది. పార్ట్–బీలో జవాబులకు ట్యాంపరింగ్, వైట్నర్ వాడితే ఆ పేపర్లను మూల్యాంకనం చేయవద్దని సిఫారసు చేసింది. అనంతరం ఇది హైకోర్టుకు చేరింది. -
బీసీ రిజర్వేషన్లపై మీ వైఖరి తెలియజేయండి
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది. సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల కోసం ఈ నెల 23న జిల్లా కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆందోల్ మండలం రాంసాన్‌పల్లికి చెందిన మాజీ సర్పంచ్ కొరబోయిన ఆగమయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ, చట్టబద్ధమైన, న్యాయ సూత్రాలను కచ్చితంగా పాటించిన తర్వాత బీసీల జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. వన్ మ్యాన్ కమిషన్ సూచించిన మేరకు 42 శాతానికి బదులుగా రాష్ట్రవ్యాప్తంగా 17.087 శాతం పంచాయతీ స్థానాలను కేటాయించడం సబబుకాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు ఒక్క స్థానాన్నీ కేటాయించకపోవడం ఆందోళనకరమన్నారు. ఎన్నికలకు జారీ చేసిన గెజిట్ కులాల మధ్య అసమానతను రుజువు చేస్తోందని చెప్పారు. ఈ కారణంగా అధిక జనాభా ఉన్న బీసీల హక్కులకు భంగం వాటిల్లుతుందని, అలాగే వారి ప్రాతినిధ్యం తీవ్రంగా తగ్గుతుందని నివేదించారు.ఎన్నికల రిజర్వేషన్ల జీవో నిలిపివేయండిహైకోర్టులో దాఖలైన పిటిషన్సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను వెల్లడిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఒకట్రెండు రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ధర్మాసనం ముందుకు రానుంది. తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, శ్రీ మడివాల మాచదేవ రజకుల సంఘంతోపాటు మరో ముగ్గురు ఈ పిటిషన్ వేశారు. ‘బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో 46ను జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టం–2018లోని సెక్షన్ 9(4) ప్రకారం.. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీ–ఏ, బీ, సీ, డీలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లు కల్పించలేదు. అనంతరామన్ కమిషన్ నివేదికను ప్రభుత్వం విస్మరించింది. దీంతో బీసీల్లోని నాలుగు వర్గాలు అంటే.. మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, గౌడ వర్గాలే స్థానిక సంస్థల్లో రాజకీయ అధికారాన్ని పొందుతాయి. ఇతర పేద బీసీ వర్గాల వారు పేదలుగానే మిగిలిపోతారు. చట్టప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా సర్కార్‌ను ఆదేశించాలి’అని కోరారు. -
‘ఈ–చలాన్’ చట్టబద్ధతపై స్పష్టత ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన నిబంధనల మేరకు ఈ–చలాన్ వ్యవస్థలోని చట్టబద్ధతపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే పోర్టల్ అప్‌గ్రేడేషన్‌పై వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 9కి వాయిదా వేసింది. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ కోసం జారీ చేసిన రూ. 1,200 జరిమానా, యూజర్ చార్జీలు రూ. 35తో కలిపి మొత్తం రూ. 1,235 ట్రాఫిక్ చలాన్ విధించడాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన వి. రాఘవేంద్రచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ తాజాగా విచారణ చేపట్టారు. చలాన్ వేయడంలో చట్టపరమైన నిబంధనను పేర్కొనడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ జరిమానా మోటారు వాహనాల చట్టం, కేంద్ర మోటారు వాహన నియమాలకు విరుద్ధంగా ఉందన్నారు. నిబంధనల మేరకు రూ. 100 నుంచి రూ. 300 మధ్య మాత్రమే జరిమానా విధించాలని రూ. 1,200 సరికాదని నివేదించారు. చట్టవిరుద్ధంగా మోపే జరిమానాతో మధ్యతరగతి పౌరులపై భారం పడుతుందన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చలాన్ కారణంగా పిటిషనర్‌కు ఇబ్బంది ఉన్నా, అభ్యంతరమున్నా అధికారులకు వినతిపత్రం సమర్పించవచ్చన్నారు. తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ–చలాన్ సిస్టమ్‌లో నిబంధనల వివరాలను పొందుపర్చలేదని, వాటిని చేర్చడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. -
నేడో రేపో పంచాయతీ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మంగళ, బుధవారాల్లో విడుదలయ్యే అవకాశం కనిస్తోంది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ, కేబినెట్ భేటీలో చర్చ కూడా జరగనుండడంతో 25వ తేదీనే షెడ్యూల్ జారీ అయినా అవ్వొచ్చని అధికార వర్గాలంటున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమ్మతిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు ప్రభుత్వం తరఫున పీఆర్ఆర్డీ తెలియజేసింది. రాబోయే మూడు, నాలుగు వారాల్లోగా (వచ్చే నెల 25వ తేదీలోగా) ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.మొత్తం 31 జిల్లాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ కాపీలను సీఎస్‌కు అందజేసింది. మరోవైపు సోమవారం హైకోర్టులో పంచాయతీ ఎన్నికలపై విచారణ జరగాల్సి ఉండగా చీఫ్ జస్టిస్ సెలవు పెట్టడంతో వాయిదా పడింది. మంగళవారం దీనిపై విచారణ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ విచారణ సందర్భంగా తాము పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, కోర్టు సూచనలకు అనుగుణంగా 50 శాతం లోపు రిజర్వేషన్లతో ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ పక్షాన పీఆర్ఆర్డీ కోర్టుకు తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఎస్ఈసీ సై తం ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని సన్నాహాలు చే శామని కోర్టుకు నివేదించనున్నట్టు తెలిసింది. ఇంకోవైపు మంగళవారం జరగనున్న కేబినెట్ భేటీలో ఎన్నికల నిర్వహణ, తేదీలపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళ లేదా బుధవారాల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు.ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి పొరబాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని ఆదేశించారు. హైకోర్టు నుంచి స్పష్టతరాగానే వెంటనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున అందుకు అన్నివిధాలుగా సమాయత్తం అయ్యి ఉండాలని సూచించారు. ఎన్నికలపై సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు. -
ప్రవేశాలు మొదలయ్యాక మార్పులు చెల్లవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలు మారుస్తూ ‘లోకల్’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. 2025–26 విద్యా సంవత్సరానికి స్థానికులకు 85 శాతం, అఖిల భారత కోటాగా 15 శాతం కేటాయించడం సరికాదని అభ్యంతరం తెలిపింది. ప్రైవేట్, అన్–ఎయిడెడ్, మైనారిటీ, నాన్–మైనారిటీ కళాశాలల మేనేజ్మెంట్ కోటాలో ఈ విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ కోర్సుల అడ్మిషన్లలో జీఓ అభ్యంతరకరమని అభిప్రాయపడింది. ఈ విద్యా సంవత్సరానికి తాజా ‘కోటా’వర్తించదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ వర్సిటీ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో పిటిషనర్ న్యాయవాది రిప్లై కౌంటర్ వేయాలని సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లను స్థానికులకు, 15 శాతం అఖిల భారత కోటా కింద కేటాయిస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 200ను సవాల్ చేస్తూ బెంగళూరుకు చెందిన స్వరూప్ హెచ్ఈఎస్తోపాటు మరికొందరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విద్యా సంవత్సరానికి ఆమోదయోగ్యం కాదు.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జి. మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ ‘పిటిషనర్లు తెలంగాణకు స్థానికేతరులు. ప్రైవేట్, అన్–ఎయిడెడ్, మైనారిటీ, మైనారిటీయేతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నాన్–లోకల్ విద్యార్థులకు అన్యాయం జరిగేలా జీవో తెల్చింది. రాష్ట్రంలోని స్థానికులకు 85 శాతం, అఖిల భారత కోటాగా 15 శాతం కేటాయించడం సరికాదు. 2025–26 విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా కింద పీజీ వైద్య విద్య ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు వర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులకు ఈ జీఓ విరుద్ధంగా ఉందని చెప్పారు. ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలు మారుస్తూ జీఓ జారీ చేయడం చట్టవిరుద్ధం.. దాన్ని రద్దు చేయాలి’అని కోరారు. దీనిపై వైద్యారోగ్య శాఖ జీపీ రమేశ్, కాళోజీ వర్సిటీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ టి శరత్ స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలు మార్చడాన్ని తప్పుబడుతూ ఈ విద్యా సంవత్సరానికి పాత విధానాన్నే కొనసాగించాలని తేల్చిచెప్పింది. -
గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే
-
నియామకాల వైకుంఠపాళీ!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) గ్రూప్–2 పోస్టులకు 2015–16లో చేసిన ఎంపికలు రద్దయ్యాయి. తప్పుడు మూల్యాంకనంతో చేసిన ఎంపికలు చెల్లవని మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చింది. జీవితంలో నిరుద్యోగ పర్వం సంక్లిష్టమైనది. ఎవరో కొందరు అదృష్టవంతులకు తప్ప దాన్నుంచి తప్పించుకోవటం సులభమేం కాదు. ఎలాగోలా దాటామనుకున్నంతలోనే, ఉద్యోగం వచ్చిందని సంబరపడేలోగానే అవకతవకలో, అవినీతో బయటపడి నియామకాలు రద్దుకావటం ఇటీవలి ధోరణి.పశ్చిమ బెంగాల్లో 2016లో పాఠశాల సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కుంభకోణం చోటుచేసుకోవటంతో దాదాపు 26,000 మంది టీచర్ల నియామకాలు రద్దయ్యాయి. తొమ్మిదేళ్లపాటు ఉపాధ్యాయులుగా పనిచేసినవారు తిరిగి నిరుద్యోగులు కావటం ఎంత వైపరీత్యం! తప్పు చేసిన వారిని శిక్షించాలి తప్ప తమనెలా ఇళ్లకు పంపుతారని కొందరు చేసిన వినతిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే సక్రమంగా ఎంపికైనవారు కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ కొనసాగవచ్చని వెసులుబాటిచ్చింది.అంటే అందరికందరూ నిరుద్యో గులై మళ్లీ తమ సత్తా చాటుకోవాలి. తెలంగాణ హైకోర్టు తీర్పు కొంతమేర నయం. గ్రూప్–2 పరీక్ష రద్దు కాలేదు. పునర్మూల్యాంకనం మాత్రమే జరుపుతారు. అయితే ఇన్నాళ్లూ ఉద్యోగస్తులుగా ఉన్నవారికి మళ్లీ ఫలితాలు వెలువడేవరకూ ఏం జరుగు తుందోనన్న గుబులు వెన్నాడుతుంది. అటు అప్పట్లో అవకాశాలు చేజారిన వారిలో ఆశలు చిగురిస్తాయి. నియామక బాధ్యతలు చూసే సంస్థలు అత్యంత జాగరూకతతో మెలగకపోతే, నిబంధనలను పాటించకపోతే యువతకు ఇలాంటి కష్టాలు తప్పవు.1,032 పోస్టులకు 2016 నవంబర్‌లో జరిగిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ 2017లో సిఫార్సులు చేసింది. వాటిని శ్రద్ధగా అమలు చేస్తే వివాదమే తలెత్తేది కాదు. ఆ విషయంలో మొదట సింగిల్ జడ్జి బెంచ్, అటుతర్వాత ద్విసభ్య ధర్మాసనం తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా జరగటం వల్లే పునర్మూల్యాంకనం చేయాలని జస్టిస్ భీమపాక నగేశ్ ధర్మాసనం ఆదేశించాల్సి వచ్చింది.శ్రద్ధగా చదువుకుని పట్టభద్రులైనా ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో సైతం కృతార్థులైతే తప్ప నిరుద్యోగ పర్వాన్ని దాటడం అసాధ్యం. ఇందుకోసం అమ్మానాన్నల్ని వదిలి, నగరాల్లో ఉండే కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. స్థోమతకు మించి వేలాది రూపాయలు వెచ్చించి, తినీ తినకా రాత్రింబగళ్లు కష్టపడతారు. తీరా ఆ పరీక్షలు లాటరీ లాంటివి. శ్రద్ధపెట్టి చదివిన అంశాలు రాకపోవచ్చు. అంత ముఖ్యం కాదనుకున్నవి పరీక్ష పత్రంలో ప్రత్యక్షమై సవాలు చేస్తాయి. వీటికి నియామక సంస్థల నిర్లక్ష్యం తోడైతే చెప్పేదేముంది? ఇస్తున్న ప్రశ్నపత్రం, దానికి జోడించాల్సిన ఓఎంఆర్ షీట్లపై నిర్వాహకులకే అవగాహన కొరవడితే అభ్యర్థులకూ, ఇన్విజిలేటర్లకూ ఏం చెబుతారు?అప్పటికప్పుడు పరీక్ష హాల్లో ఏదో ఒకటి నిర్ణయించి అమలు చేయించటం వల్ల అంతిమంగా నష్టపోయేదెవరు? అభ్యర్థి వ్యక్తిగత వివరాల విషయంలో చిన్న చిన్న పొరపాట్లుంటే మన్నించవచ్చని, పార్ట్ట్–బిలోని ప్రశ్నలకు సంబంధించి జవాబులకు వైట్నర్ వాడినా, తుడిచే ప్రయత్నంచేసినా మూల్యాంకనం చేయొద్దని కమిటీ చేసిన సిఫార్సునే పాటించాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం చెప్పినా బేఖాతరు చేయటం సరైందేనా? తమ ఇష్టానుసారం మూల్యాంకనం కానిచ్చి, నియామకాలు పూర్తి చేయటం సమస్యాత్మకమవుతుందని, అర్హులైనవారికి అన్యాయం జరుగుతుందని కమిషన్‌కు తెలియదా? నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నవారు కమిషన్ నిర్వాకం వల్ల నియా మకాలు రద్దయి, అయోమయంలో పడ్డారు. దిద్దుబాట్లకూ, వైట్నర్ వినియోగానికీ, డబుల్ బబ్లింగ్కూ పాల్పడినవారూ మళ్లీ పరీక్షల సాగరంలో ఈదక తప్పదు. మొదటే అన్నీ సక్రమంగా పాటించి మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలు ప్రకటించివుంటే ఇంతమంది నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేవారు కాదు. కమిషన్‌లో జవాబుదారీ తనం కొరవడటం వేలాది మందికి శాపం. -
హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కఠినంగా స్పందించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపట్టినందుకు హైడ్రా అధికారులపై పలు ప్రశ్నలు సంధించింది.సంధ్య కన్వెన్షన్‌లో చేపట్టిన కూల్చివేతలు ఎవరి అనుమతి తీసుకుని చేశారు? ఎవరు చెప్పారని ఆ చర్యలు తీసుకున్నారు? అంటూ కోర్టు హైడ్రా అధికారులను హైకోర్టు నిలదీసింది. కోర్టు ముందస్తు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా వ్యవహరించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.కాగా కూల్చివేతలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోర్టు అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి (గురువారం) వాయిదా వేసింది. -
2015 గ్రూప్–2 రద్దు!
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్–2 నియామకాలను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓఎంఆర్ షీట్లో సమాధానాలు గుర్తించే పార్ట్–బీలో ట్యాంపరింగ్ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను ప్రశ్నించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ కమిషన్‌ను తప్పుబట్టింది. డబుల్ బబ్లింగ్, వైట్నర్, ఎరైజర్ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫారసులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియంతా 8 వారాల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. ఆరు పిటిషన్లు విచారించిన హైకోర్టు గ్రూప్–2 కింద 1,032 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయగా, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నపత్రం బుక్లెట్, ఓఎంఆర్ షీట్లకు పొంతనలేవన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. బుక్లెట్ నంబర్, ఓఎంఆర్ నంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇని్వజిలేటర్లు భావించడంతో ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ 2017లో నివేదిక సమర్పించింది. పార్ట్–బీలో జవాబులకు ట్యాంపరింగ్, వైట్నర్ వాడితే ఆ పేపర్లను మూల్యాంకనం చేయవద్దని సిఫారసు చేసింది. కమిటీ సిఫారసులపై కొందరు సింగిల్ జడ్జి, తర్వాత ద్వి సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సాంకేతిక కమిటీ సిఫారసులను పాటించాల్సిందేనని ద్వి సభ్య ధర్మాసనం 2019లో తీర్పు చెప్పింది. అయినా అందుకు విరుద్ధంగా పత్రాలను మూల్యాంకనం చేశారంటూ సూర్యాపేట జిల్లా మట్టపల్లి మండలం చెన్నాయపాలెంకు చెందిన భూక్యా ప్రియాంకతోపాటు మరికొందరు హైకోర్టులో 2019లో ఆరు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం తీర్పు వెలువరించారు. వాదనలు సాగాయిలా.. పిటిషన్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘ఓఎంఆర్ షీట్లలో వైట్నర్, ఎరైజర్ వినియోగించిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధం. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ట్యాంపరింగ్ జరిగిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. కీలకమైన గ్రూప్–2 అభ్యర్థుల ఎంపిక లోపభూయిష్టంగా జరిగింది. తిరిగి మూల్యాంకనం చేసేలా కమిషన్‌ను ఆదేశించాలి. గ్రూప్–2 నియామకాలను రద్దు చేయాలి..’అని విజ్ఞప్తి చేశారు. కమిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ద్వి సభ్య ధర్మాసనం తీర్పు మేరకే కమిషన్ పరీక్షలు నిర్వహించింది. ఓఎంఆర్ షీట్లను ఆటోమేటిక్ స్కానింగ్ విధానం ద్వారా మూల్యాంకనం చేసినందున ఎవరూ జోక్యం చేసుకోవడం సాధ్యంకాదు. ఇప్పటికే ఎంపికై నియమితులైన వారంతా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నియామకాలకు భంగం కలిగితే పరిపాలనా గందరగోళానికి దారితీస్తుంది. పరీక్షల్లో ఎంపిక కాని వారు కోర్టును ఆశ్రయించారు..’అని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇటీవల తీర్పును రిజర్వు చేసి, మంగళవారం తీర్పు వెలువరించారు.ఇది కమిషన్ తప్పుడు నిర్ణయమే..‘జవాబు పత్రాల ట్యాంపరింగ్ జరిగిందని తెలుస్తున్నప్పుడు వాటిని మూల్యాకనం చేయడం కమిషన్ తప్పుడు నిర్ణయమే. నోటిఫికేషన్లోనూ ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొని పాటించకపోవడం వైఫల్యమే. పార్ట్–బీలోని జవాబుల మూల్యాంకనంపై కమిటీ నిషేధం విధించింది. ఆటోమేటెడ్ యంత్రాల ద్వారా చేసిన మూల్యాంకనంలో లోపాలకు తావులేదన్న కమిషన్ వాదనను అనుమతించలేం. ఓఎంఆర్ షీట్ పార్ట్–ఏ లోని ప్రశ్నల మూల్యాంకనానికి మాత్రమే హైకోర్టు, సాంకేతిక కమిటీ అనుమతించాయి. పార్ట్–బీలోని ప్రశ్నలను మూల్యాంకనం చేసే అధికారం కమిషన్‌కు ఎంతమాత్రం లేదు. ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత, సమానత్వం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఇక్కడ వర్తిస్తుంది. కమిషన్ చట్టబద్ధమైన అధికార పరిధిని దాటి వ్యవహరించడాన్ని స్వాగతించలేం. 2019 అక్టోబర్ 24న విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నాం..’అంటూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ కావడంతో డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. గేమింగ్ సైట్లోకి వెళ్తుందని రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.పలు సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. సైట్‌ను రిస్టోర్ చేసిన ఎన్ఐసీ అధికారులు.. విదేశీ గేమింగ్ యాప్‌ల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. వెబ్సైట్ సబ్ సబ్ డొమైన్స్ యథావిధిగా పనిచేస్తున్నట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి. కోర్టు కేసు లిస్టులు.. ఇతర బ్లాగులు సవ్యంగానే కొనసాగుతున్నట్లు వివరించాయి.కాగా, దేశంలో జనం జేబులను గుల్లచేస్తూ, వారి ప్రాణాలను బలి తీసుకున్న ఆన్లైన్ గేమ్‌లకు చెక్‌పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. డబ్బుతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమ్‌లను నిర్వహించినా లేక ప్రోత్సహించినా లేక ప్రచారం చేసినా జైలుశిక్ష లేదా భారీ జరిమానా.. కొన్నిసార్లు జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించేలా ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు–2025’ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది. -
అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హైకోర్టు మరోసారి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను హెచ్చరించింది. నీటివనరుల రక్షణ, సరస్సుల పునరుజ్జీవం పేర ఏకపక్షంగా, చట్టవిరుద్ధ నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. అధికారం చూపించడానికి బాధ్యతలు కట్టబెట్టలేదనే విషయాన్ని గుర్తెరిగి పనిచేయాలని సూచించింది. న్యాయస్థానం తీవ్ర చర్యలకు ఉపక్రమించేలా వ్యవహరించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది.తాజా కోర్టు ధిక్కరణ పిటిషన్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. ఖానామెట్‌లోని తమ్మిడికుంట సమీపంలోని భూముల్లో పనులకు సంబంధించి కోర్టు జారీ చేసిన యథాతథ స్థితి ఆదేశాలను ఉల్లంఘించడంపై హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణకు వర్చువల్‌గా హాజరైన రంగానాథ్‌పై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. మంచి పేరుతో హాని వద్దు హైడ్రాపై మీ అభిప్రాయం ఏంటని, సరస్సుల పునరుజ్జీవనంలో మీ పాత్ర ఏంటని రంగనాథ్‌ను ధర్మాసనంఅడిగింది. ఉల్లంఘనలు, ఆక్రమణలపై ఫిర్యాదులతో ప్రజలు హైడ్రా వద్దకు వస్తున్నారని.. తర్వాత తీసుకున్న చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారని రంగనాథ్ బదులిచ్చారు. కూల్చివేతలప్పుడు చట్టవిధానం పాటించారా.. పార్టీలకు నోటీసులు జారీ చేసి, విచారణకు అవకాశం ఇవ్వరా అని ధర్మాసనం ప్రశ్నించింది. కూల్చివేతలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉదహరించింది. వాటిని మీరు ఎందుకు అనుసరించరు.. మీరు అనుసరిస్తే, ప్రజలు కోర్టుకు ఎందుకు వస్తున్నారని అడిగింది.ఈ దేశంలో ధనిక వర్గాలతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా భూమిపై పెట్టుబడి పెడతారని, వారు తెలిసీ తెలియక ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో కొనుగోలు చేసి ఉండొచ్చని పేర్కొంది. అలాంటి వారికి నోటీసులైనా జారీ చేయకుండా నడిరోడ్డుపై నిలబెడుతున్నారని.. చట్టాన్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్లు కూల్చివేస్తున్నారంది. మంచి చేయడం పేరుతో ఇతరులకు హాని చేయవద్దంది. 50 నుంచి 100 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన చిన్న షెల్టర్లను అధికారులు తరచుగా వారాంతాల్లో నోటీసు లేకుండా కూల్చివేసిన ఘటనలపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిర్ధారించే అధికారం హైడ్రాకు లేదు.. కొందరి నిర్మాణాలను మీరు చెప్పాపెట్టకుండా కూల్చివేస్తారు.. మరికొందరివి మాత్రం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల కింద క్రమబద్దీకరిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది సమంజసమేనా అని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం, ప్రక్రియను పాటించకపోవడం లాంటి పిటిషన్లు ఇకపై రాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏప్రిల్‌లో కోర్టు ఆదేశాలు జారీ చేసినా హైడ్రా పనులు కొనసాగించిందన్నారు. సరస్సుల పునరుద్ధరణ, పునరుజ్జీవనం ముసుగులో హైడ్రా తమ భూములను ఆక్రమించుకునేందుకు కుట్ర పన్నిందన్నారు. కుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణకు ఎలాంటి సర్వే నిర్వహించకుండా పిటిషనర్ల భూములను ముంపునకు గురిచేసి నిరుపయోగంగా మార్చిందని నివేదించారు. అవి అసైన్మెంట్ భూములని హైడ్రా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. భూమి వర్గీకరణ నిర్ధారించే ఎలాంటి అధికారం హైడ్రాకు లేదన్నారు. ⇒ ‘సచివాలయంలో ఉండే వారు సామాజిక, ప్రజల అంశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా లేదా వాటిని మరిచిపోతున్నారా? అధికారం ఉండగా కొన్ని మంచి పనులైనా చేసి మానవతావాదులుగా నిలవండి. అధికారులు తమ శక్తిని సామాన్యులపై ప్రదర్శించాలని చూస్తే కోర్టులు అంతకంటే శక్తిమంతమైనవని మరవొద్దు. అలాంటి అధికారాలను న్యాయస్థానాలు వినియోగించే పరిస్థితి తేవద్దు.’ ⇒ ‘కూల్చివేతల పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తాం.. కోర్టు ఆదేశాలను పట్టించుకోం.. అంటే తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హైడ్రాపై ధిక్కరణ కేసులు రోజూ ఈ కోర్టుకు వస్తూనే ఉన్నాయి. న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలను పాటించకపోయినా.. ఉల్లంఘించినా ఎలా స్పందించాలో కూడా తెలుసు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలు, మురుగు నీటిపారుదల బోర్డు, రెవెన్యూ, రోడ్లు, అనధికార, అక్రమ నిర్మాణాలు.. ఇలా అన్ని ఇతర విభాగాల్లో ఇష్టం వచ్చినట్లు జోక్యం చేసుకునే అధికారం హైడ్రాకు ఉందా?’ –కమిషనర్ రంగనాథ్‌తో ధర్మాసనం -
వ్యక్తిగత ప్రయోజనాలకు సీబీఐని వాడుకోలేరు
సాక్షి, హైదరాబాద్: స్వప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను వినియోగించుకోవాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత ప్రయత్నిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ప్రతివాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురామ్ శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. అంతకుముందు ప్రతివాదుల తరఫున న్యాయవాదులు సాయి వంశీకృష్ణ, ఉమామహేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ, ‘సునీత పరస్పర విరుద్ధ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఒకవైపు కేసు సత్వర విచారణకు హైకోర్టులో పిటిషన్లు వేస్తూ, మరోవైపు మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు నచ్చినట్లు విచారణ చేయాలని కోరడం ఎంతమాత్రం చెల్లదు. ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తే భవిష్యత్‌లో బాధితులమని చెప్పుకొనేవారంతా దర్యాప్తు సంస్థలను సొంత లబ్ధికి ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. సునీత చర్యలన్నీ అర్థం లేకుండా ఉన్నాయి. సత్వర విచారణ కోరుతున్నారా? లేదా విచారణ ఇంకా జాప్యం కావాలని కోరుకుంటున్నారా? అనే అంశంపై స్పష్టత లేకుండా ఆమె న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఇష్టమొచ్చినట్లు వేస్తున్న పిటిషన్లతో కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాదు.. విచారణ ఏళ్లకు ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ కేసులో రోజూ విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే, ఈ కోర్టు మళ్లీ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా నిష్ప్రయోజనం అవుతుంది. న్యాయస్థానంలో కేసు విచారణ ఆలస్యం చేయడానికే సునీత ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు. పిటిషన్ సమర్థనీయం కాదు. కొట్టివేయండి’ అని నివేదించారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తు ఏమిటి?‘సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ దిగువ కోర్టును నిర్ణయం తీసుకోమని చెప్పింది. అయితే, వాస్తవ పరిధి ఉన్న కడప కోర్టును ఆదేశించిందా? లేక హైదరాబాద్‌లోని ఈ కోర్టును ఆదేశించిందా? అనేది సందేహాస్పదంగా మారింది. ‘అధికార పరిధి’ తేలిస్తే ఈ పిటిషన్ మెయింటెనబుల్ అవుతుందో? లేదో? తెలుస్తుంది. సుప్రీంకోర్టులో సునీత వేసిన పిటిషన్లలో ప్రతివాదులుగా సీబీఐని తప్ప నిందితులను చేర్చలేదు. దీంతో వారి వాదనలు వినిపించే అవకాశం లేకుండా పోయింది. సుప్రీం కోర్టు మరింత దర్యాప్తునకు ఆదేశించలేదు. దిగువ కోర్టును ఆశ్రయించాలని మాత్రమే ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో వేసిన పలు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం వద్ద ప్రస్తావించలేదు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమీ లేదంటూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఆ తర్వాత మళ్లీ దర్యాప్తు చేయాలని కోరడం చట్టవిరుద్ధం. ఏ కేసులోనైనా చార్జెస్ ఫ్రేమ్ చేశాక దర్యాప్తు కొనసాగించడం సాధ్యం కాదు. ఫలాన ఫలాన అంశాలపై దర్యాప్తు చేయాలని సునీత కోరలేరు. ఎలా దర్యాప్తు చేయాలో కూడా ఆమె చెబుతుండడం సరికాదు. సీబీఐ తనకు నచ్చినట్లు, తను చెప్పినట్లు దర్యాప్తు చేయాలని ఆమె పట్టుబట్టడం చెల్లదు. దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టులో వెల్లడించిన సీబీఐ, మళ్లీ విచారణ ఎలా ప్రారంభిస్తుంది’’ అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. -
‘కాళేశ్వరం’ పిటిషన్లలో కౌంటర్లు వేయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి మూడు వారాల్లో పిటిషనర్లు రిప్లై కౌంటర్లు వేయాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణ జనవరి 19కి వాయిదా వేసింది. అప్పటిదాకా జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలు వద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసీఆర్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేశామని, మిగతా మూడు పిటిషన్లలో కౌంటర్లు వేసేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. సమ్మతించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు నెలలకు వాయిదా వేసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే... ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కౌంటర్ వేశారు. అందులోని అంశాల మేరకు... ‘కాళేశ్వరంలో అక్రమాల నిగ్గుతేల్చేందుకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారమే చంద్రఘోష్ కమిషన్ నియమాకం జరిగింది. పిటిషన్‌ను పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోక ముందే పిటిషనర్ (కేసీఆర్) కోర్టును ఆశ్రయించారు. రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ ఎస్ఆర్ టెండూల్కర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన మేరకు కమిషన్ నివేదిక ఓ నిజనిర్ధారణ నివేదిక మాత్రమేనని దానికి ఎలాంటి చట్టబద్ధత లేదన్నది పిటిషనర్ వాదన. కానీ, ఆయనకు కమిషన్ చర్యలు, చట్టపరమైన అంశాలు తెలుసు. పిటిషనర్ అభ్యర్థన మేరకు కమిషన్ ఇన్‌కెమెరా విచారణ సాగించింది. పిటిషనర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో తీవ్రమైన అక్రమాలకు పాల్పడ్డారని కమిషన్ ఎత్తిచూపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ వేయగా, దాన్ని కూడా పిటిషనర్ ఈ కోర్టులో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీనిపై కేసీఆర్ సుప్రీంకు వెళ్లారు. కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంపై పిటిషనర్‌కు అవగాహన ఉన్న కారణంగానే ఆయన పిటిషన్లు వేశారు. సెక్షన్ 8బీ, 8సీ తనకు తెలియదని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎలాంటి నిరసన, అభ్యంతరం లేకుండా స్వచ్ఛందంగా కమిషన్ ముందు విచారణకు హాజరైనందున సెక్షన్ 8బీ, 8సీ కింద నోటీసులు కోరే హక్కు లేదు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ విచారణ సాగిందనడం అర్థరహితం. కమిషన్ ఏర్పాటు, నివేదిక సెక్షన్ 4(ఎఫ్) ప్రకారం చట్ట సమ్మతం. కమిషన్ ఏర్పాటు ఏకపక్షం కాదు.. అత్యంత ప్రజా ప్రాముఖ్యత అంశం. బరాజ్ కూలిపోయి ఖజానాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాజెక్టు ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, కాంట్రాక్టు మంజూరు, అమలు, నిర్వహణ, నాణ్యతా నియంత్రణలోనే కాకుండా ఆర్థిక దుర్వినియోగం వంటి తీవ్రమైన అవకతవకలను కమిషన్ నిర్ధారించింది. పిటిషనర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి స్థల ఎంపిక, డిజైన్ ఖరారు, ప్రారంభ కాంట్రాక్టు మంజూరు, బరాజ్‌ల నిర్మాణం, నిర్వహణ పనులను కమిషన్ పరిశీలించింది. ఇది రాజకీయ వ్యూహం అన్న పిటిషనర్ వాదన నిరాధారం. మేడిగడ్డ వద్ద నిర్మాణంపై నిపుణుల కమిటీ ముందే హెచ్చరించింది. అయినా నిర్లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మాణాలకు పరిపాలన అనుమతులు బిజినెస్ రూల్స్ ప్రకారం కేబినెట్ ముందు ఉంచాలి. కానీ, అలా చేయలేదు. కేంద్ర జల సంఘం పరిశీలనకు ముందే పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. మెస్సర్స్ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ డీపీఆర్‌ను విస్మరించారు. పిటిషనర్ రాష్ట్రానికి భారీ ఆర్థిక నష్టాన్ని సమర్థించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన ఇంజనీరింగ్ లోపాలు, ఒప్పందాల ప్రకారం నిర్వహణ లేకపోవడం పేర్కొనడం వాస్తవం. అక్రమాలను నిర్మూలించడానికి, లక్ష్యాలను అమలు చేయడానికి శాసన, పరిపాలనా చర్యలు తీసుకోవడానికి విచారణ కమిషన్ సిఫార్సులు ప్రస్తుత ప్రభుత్వానికి అవసరం. బరాజ్ నిర్మాణ స్థలాన్ని మార్చవద్దని వివిధ కమిషన్లు సిఫార్సులు చేసినా వినకుండా పిటిషనర్ రూ.7500 కోట్లు ఖజానాపై భారం పడేలా చేశారు. ఈ పిటిషన్ విచారణార్హం కాదు. కొట్టివేయండి. మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేయండి’అని కౌంటర్లో పేర్కొన్నారు. -
కలెక్టర్‌ను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?
సాక్షి, హైదరాబాద్: చెరువు శిఖం భూమిలో మందిర నిర్మాణానికి కలెక్టర్ అనుమతి ఎలా ఇస్తారని, నిధులు ఎలా విడుదల చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్ట ప్రకారం నిధులు విడుదల చేశారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసులో కలెక్టర్‌ను నిందితుడిగా ఎందుకు చేర్చలేదని పోలీసులను అడిగింది. ఇరుపక్షాలు పూర్తి వివరాలతో రావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.భూపాలపల్లి పట్టణంలో పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి 2024, జనవరిలో స్థానిక కోర్టును ఆశ్రయించారు. శిఖం భూమి 2 ఎకరాలు కబ్జా చేసి వెంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. జనవరి 16న తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సుధాంశురావు వాదనలు వినిపిస్తూ.. రెండు పిటిషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ పిటిషన్ వేస్తామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుని నిందితులను చేర్చడంపై వ్యాఖ్యలు చేయొద్దని సుధాంశురావు కోరగా, న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసంహరణకు నిరాకరిస్తూ.. కలెక్టర్, పో లీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ జో క్యం ఉండటంతో చార్జిషీట్ దాఖలు చేయడం తా త్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల నుంచి పత్రాలు అందని కారణంగా ఆలస్యం జరిగిందని ఏపీపీ చెప్పగా.. మరి, రెండే ళ్లుగా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెరువులో మందిర నిర్మాణానికి కలెక్టరే అనుమతి ఇస్తే.. ఇక రేపు చెరువులన్నీ ఇలాగే మారతాయన్నారు. -
హైకోర్టులో టీవీ5 మూర్తికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో టీవీ5 సీఈవో మూర్తికి చుక్కెదురైంది. హీరో ధర్మమహేష్ పెట్టిన కేసుపై స్టే ఇవ్వాలని టీవీ5 మూర్తి హైకోర్టును ఆశ్రయించారు. ధర్మ మహేష్ వాదనలు వినకుండా స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్టపరంగా ముందుకెళ్లాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.10 కోట్లు డిమాండ్..కాగా, మూర్తి తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. లేకపోతే ప్రైవేటు వీడియోలు బయటపెడతానని వేధింపులకు గురిచేస్తున్నారని.. ఈ అంశంపై సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో వర్దమాన సినీనటుడు కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేశ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్.. పిటిషనర్ తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో మహేశ్ ఫిర్యాదును, ఆయన సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు.. మూర్తితోపాటు మహేశ్ భార్య గౌతమిపై బీఎన్ఎస్లోని సెక్షన్ 308 (3), ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 72 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం..మహేశ్ ఫోన్‌ను మూర్తి చట్టవిరుద్ధంగా ట్యాప్ చేస్తున్నారు. ఆయన ప్రైవేట్ సంభాషణల్ని సైతం రికార్డు చేసి టీవీ5లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న చిరుమామిళ్ల గౌతమి, మూర్తి కలిసి మహేశ్, ఆయన తండ్రికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను రికార్డు చేసి టీవీ5 చానల్లో ప్రసారం చేశారు. ఈ చట్టవిరుద్ధ ప్రసారం ద్వారా మహేశ్ వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశారు. ఆయనతోపాటు ఆయన కుటుంబాన్నీ అవమానించడంతోపాటు మానసిక వేదనకు గురి చేసి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారు.ఆ తర్వాత కూడా మూర్తి మహేశ్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను స్పై కెమెరాలతో రికార్డు చేశారు. వాటిని అడ్డం పెట్టుకుని గౌతమి, మూర్తి రూ. 10 కోట్లు ఇవ్వాలని లేదా మహేశ్ వ్యాపార సంస్థ గిస్మత్ అరబిక్ మండిలో యాజమాన్య హక్కులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించకపోతే ఫోన్ రికార్డింగ్‌లు, ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, టీవీ5లో ప్రసారం చేస్తామని మహేశ్‌ను బెదిరించారు. -
తెలంగాణ యూనివర్శిటీలో 2012 నియామకాలపై హైకోర్టు తుది తీర్పు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో అక్రమంగా జరిగిన అధ్యాపకుల నియామకాలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ (అకడమిక్ కన్సల్టెంట్ల అసోసియేషన్) 2013 ఫిబ్రవరి 22న దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. తక్షణమే కొత్త నోటిఫికేషన్ జారీ చేసుకోవచ్చని వర్సిటీకి స్పష్టం చేసింది.2012లో ఇచ్చిన నోటిఫికేషన్లో చేర్చకూడని పోస్టులు చేర్చడం, చేర్చాల్సిన పోస్టులు వదిలేయడంతో సంబంధిత సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మారిపోవడాన్ని సవాల్ చేస్తూ కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పునిచ్చారు. నోటిఫికేషన్ ప్రకారం 53 మంది అధ్యాపకులను నియమించగా వారిలో ప్రస్తుతం 45 మంది పనిచేస్తున్నారు.ఈసీ ఆమోదం లేకుండానే.. 2006లో స్థాపించిన వర్సిటీలో జీవో 420 ప్రకారం ఆర్ట్స్, సైన్స్ గ్రూపులను వేరుగా తీసుకొని ప్రతి గ్రూప్‌లోని సబ్జెక్టులను అక్షర క్రమంలో పెట్టి అన్ని పోస్టులకూ ఒకే రన్నింగ్ రోస్టర్ వర్తింపజేయాల్సి ఉంది. ప్రతి డిపార్ట్మెంట్కు వేర్వేరు రోస్టర్ నిర్వహించడం అసాధ్యం కావడంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. అయితే వర్సిటీలో పోస్టులు భర్తీ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదం తీసుకోవాలి. ఈ క్రమంలో 20వ పాలకమండలి 2012 ఏప్రిల్ 27న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిలిపివేసి వాటి స్థానంలో రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.ఇంటిగ్రేటెడ్ కోర్సులకు వర్సిటీ రెగ్యులర్ స్టాఫ్‌ను తీసుకోలేదు. ఎక్కువగా తాత్కాలిక కన్సల్టెంట్లతో క్లాసులు నిర్వహించింది. దీంతో ఈ మార్పుల తర్వాత పోస్టుల లెక్కలు, రోస్టర్ పాయింట్లు మళ్లీ పరిగణనలోకి తీసుకొని పాలకమండలిలో పెట్టాలి. కానీ దీన్ని వర్సిటీ పాటించలేదు. అలాగే రెండేళ్ల కోర్సులకు ప్యాటర్న్ 1:2:4 (ప్రొఫెసర్:అసోసియేట్:అసిస్టెంట్), ఇంటిగ్రేటెడ్ కోర్సులకు 1:3:7 విధానం పాటించాలి. అయితే అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిలిపివేసిన తర్వాత వాటికి 1:3:7 ప్యాటర్న్ వర్తించదు. కానీ నోటిఫికేషన్లో వాటిని ఐదేళ్ల కోర్సుల్లాగే వర్సిటీ చూపించింది. అక్షర క్రమంలో అప్లైడ్ ఎకనామిక్స్ ‘అ’తో మొదలవుతుందని గ్రూప్ టాప్‌లో పెట్టారు. ఈ కారణంగా ఇతర సబ్జెక్టుల రోస్టర్ మొత్తం మారిపోయింది.కోర్సు నిలిపివేసినా పోస్టులు చూపి.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీని కూడా నిలిపివేసినప్పటికీ 1:3:7 ప్యాటర్న్ ప్రకారం వర్సిటీ ఎక్కువ పోస్టులు చూపించింది. దీంతో ఫిజిక్స్ లాంటి తరువాతి సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మారిపోయాయి. అదేవిధంగా బోటనీ డిపార్ట్మెంట్లో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2012 మే 6న మరణించినా ఆ ఖాళీని నోటిఫికేషన్లో చేర్చలేదు. దీంతో ఇది కూడా రోస్టర్‌ను మార్చేసింది. 2012 ఏప్రిల్ 27న పాలక మండలి రెండు ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ నోటిఫికేషన్ మాత్రం 2012 మే 25న వచి్చంది. దీనిప్రకారం నోటిఫికేషన్ వచి్చన తేదీన ఆ రెండు కోర్సులు అమల్లో లేవు. దీంతో మనుగడలో లేని కోర్సులకు పోస్టులను చూపించి తప్పుదోవ పట్టించడంతో ఇది రోస్టర్ పాయింట్లను నేరుగా ప్రభావితం చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. 2012 నోటిఫికేషన్ చెల్లదని స్పష్టం చేసింది. ఆ నోటిపికేషన్ మేర కు చేసిన నియామకాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. -
చెరువు మధ్యలో పట్టా ఇస్తారా?
పర్యావరణ హననానికి ఎలాంటి విపత్తులు కారణం కాదు. మనిషే బాధ్యుడు. సర్కార్ భూములే కాదు.. చెరువులనూ వదలడం లేదు. వాస్తవ స్థితిని పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు వారికి పట్టాలు జారీ చేస్తున్నారు. కోర్టుల ఆదేశాలన్నా లెక్కలేదు. ఎఫ్టీఎల్ భూములకూ పట్టాలిచ్చేస్తున్నారు. ఇటు కోర్టుల్లో అందుకు విరుద్ధంగా కౌంటర్లు వేస్తున్నారు. అధికారులది ద్వంద్వ నీతి. చెరువుల నడిమధ్య భూమికి పట్టాలు జారీ చేస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 37 ఎకరాల చెరువు భూమిలో ఓ మాజీ ఎమ్మెల్యేకు 27 ఎకరాలకు పట్టా జారీ చేశారు. పాస్ పుస్తకాలతో సహా అతను పిటిషన్ వేశారు. అధికారుల తీరు క్షంతవ్యం కాదు అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ, నీటి పారుదల అధికారుల తీరు పై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. వాస్తవ స్థితిని పరిశీలించకుండా ఇష్టమొచ్చినట్టు పట్టాలు జారీ చేస్తున్నా రని ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఆ ఆధారాలతో వారంతా న్యాయస్థానా ల్లో పిటిషన్లు వేస్తున్నారని వ్యాఖ్యానించింది. రెవెన్యూ శాఖను రద్దు చేస్తే గానీ ఈ దేశం బాగుపడదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండ లం అడవిమల్లెల సర్వే నంబర్ 11, 12, 13, 29, 30, 31లోని తమ పట్టా భూమిని మిషన్ కాకతీయ పథకంలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ వ్యవసాయదారుడు బోనం సంజీవరెడ్డి సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మా సనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ.. పట్టా భూమిని చెరువుగా పేర్కొంటూ మిషన్ కాకతీయలో చేర్చడంలో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ తీరు సరికాదన్నారు. కనీసం పిటిషనర్ల భూమిని సేకరించలేదని వారికి నోటీసులైనా జారీ చేయలేదన్నారు. అధికారుల నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వాదించారు. పిటిషనర్ల పట్టా భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కలెక్టర్ రాకుంటే చర్యలు తప్పవు కొత్త ప్రాజెక్టు కట్టేప్పుడు మాత్రమే భూ సేకరణ చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా పరిహారం ఇచ్చే అవకాశం లేదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెంచితే వారి భూములు మునిగిపోతాయి కదా అని అడిగారు. ప్రైవేట్ భూమిపై అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఏదైనా నీటిమట్టం పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం అధికారులకు ఉందని ఏజీపీ బదులిచ్చారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ఏజీపీ కోరారు. ఈ సందర్భంగా రెవెన్యూ, నీటిపారుదల అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఓ చెరువులో 27 ఎకరాలు పట్టా భూమి అని ఓ మాజీ ఎమ్మెల్యే ఈ కోర్టుకు వచ్చారు. చెరువు మొత్తం ఏరియా 37 ఎకరాలు. 37 ఎకరాల్లో 27 ఎకరాలకు ఎలా పట్టా ఇచ్చారో అధికారులకే తెలియాలి. అధికారుల తప్పిదానికి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాలని మరవొద్దు. ఎఫ్టీఎల్ భూములనీ అధికారులంటారు.. పట్టా భూములని ప్రైవేట్ వ్యక్తులంటారు. ఖమ్మం కేసులో 29 సర్వే నంబర్ భూమి స్వభావ పట్టా.. భూమి వివరణ మెట్ట అని అధికారులే పేర్కొన్నారు. కానీ, 29 సర్వే నంబర్ పూర్తిగా చెరువు మధ్యలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారించని కారణంగానే ఇలాంటి పిటిషన్లన్నీ వస్తున్నాయి. రెవెన్యూశాఖను తొలగిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు’అని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయని పక్షంలో ఈ కోర్టు తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. -
టీవీ5 మూర్తిపై కేసు
సాక్షి, హైదరాబాద్: శ్రేయా బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (టీవీ–5) సీఈవో డీహెచ్వీఎస్ఎస్ఎన్ మూర్తి తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తూ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని వర్దమాన సినీనటుడు కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. లేకపోతే ప్రైవేటు వీడియోలు బయటపెడతానని వేధింపులకు గురిచేస్తున్నారని.. ఈ అంశంపై సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్... పిటిషనర్ తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో మహేశ్ ఫిర్యాదును, ఆయన సమరి్పంచిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు.. మూర్తితోపాటు మహేశ్ భార్య గౌతమిపై బీఎన్ఎస్లోని సెక్షన్ 308 (3), ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 72 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం..: మహేశ్ ఫోన్‌ను మూర్తి చట్టవిరుద్ధంగా ట్యాప్ చేస్తున్నారు. ఆయన ప్రైవేట్ సంభాషణల్ని సైతం రికార్డు చేసి టీవీ5లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న చిరుమామిళ్ల గౌతమి, మూర్తి కలిసి మహేశ్, ఆయన తండ్రికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను రికార్డు చేసి టీవీ5 చానల్లో ప్రసారం చేశారు. ఈ చట్టవిరుద్ధ ప్రసారం ద్వారా మహేశ్ వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశారు. ఆయనతోపాటు ఆయన కుటుంబాన్నీ అవమానించడంతోపాటు మానసిక వేదనకు గురి చేసి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా మూర్తి మహేశ్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను స్పై కెమెరాలతో రికార్డు చేశారు. వాటిని అడ్డం పెట్టుకుని గౌతమి, మూర్తి రూ. 10 కోట్లు ఇవ్వాలని లేదా మహేశ్ వ్యాపార సంస్థ గిస్మత్ అరబిక్ మండిలో యాజమాన్య హక్కులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించకపోతే ఫోన్ రికార్డింగ్‌లు, ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, టీవీ5లో ప్రసారం చేస్తామని మహేశ్‌ను బెదిరించారు. -
మార్గదర్శి కేసు.. ఉండవల్లికి సుప్రీం కోర్టు కీలక సూచన
సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ఆర్బీఐ నిబంధనలను ఆ కంపెనీ ఉల్లంఘించిన అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని మాజీ ఎంపీ, అడ్వొకేట్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు గురువారం సూచింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఇవాళ వాదనలు వింది. వర్చువల్‌గా విచారణకు హాజరైన ఉండవల్లి ‘‘ఇది డిపాజిట్ల కలెక్షన్, పేమెంట్స్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందని.. దీనిపైన విచారణ జరగాలని’’ కోరారు. అయితే.. ఈ అంశాలన్నీ హైకోర్టు ముందున్న ప్రధాన పిటిషన్ విచారణ సందర్భంగా వినిపించాలని ఆయనకు ధర్మాసనం సూచించింది. ప్రస్తుతం తాము కేసు మెరిట్ లోకి వెళ్లడం లేదని.. హైకోర్టు స్టే ఇవ్వనన్న అంశంపై మాత్రమే విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇక.. ఈ కేసులో ఉండవల్లి అసలు ప్రతివాది కాదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ సమయంలోనూ తాము ఎలాంటి వ్యాఖ్యానం చేయదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తూ.. తాము చెల్లించాల్సిన 2,300 కోట్ల రూపాయల డిపాజిట్లలో సింహభాగం చెల్లించామని, ఎస్క్రో ఖాతాలో 5.43 కోట్ల రూపాయలు ఉన్నాయని.. డిపాజిట్ల మెచ్యూరిటీ ఆధారంగా వాటిని చెల్లించాలని కోరారు. -
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: పదేళ్లకు పైగా సర్వీస్ ఉన్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని అక్టోబర్ 23న తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల సేవలను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఈ తీర్పును న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వర్ రావు వెలువరించారు. ఈ కేసు వి.ప్రదీప్, ఎం.రాములు దాఖలు చేసిన రిట్ పిటిషన్లకు సంబంధించినది. వీరిద్దరూ 13 సంవత్సరాలుగా జూనియర్ ఇంజనీర్/మ్యానేజర్గా, మ్యానేజర్ (ప్రొడక్షన్ అండ్ ప్రోక్యూర్మెంట్)గా 16.5 సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ సేవలందిస్తున్నారు.జస్టిస్ రాజేశ్వర్ రావు తన తీర్పులో పేర్కొంటూ, పిటిషనర్లు తాత్కాలిక లేదా విరామాలతో కూడిన పనుల్లో కాకుండా, సాంక్షన్ చేసిన పోస్టులపైనే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ అంశం “వివాదాస్పదం కాదని” కూడా న్యాయస్థానం గమనించింది.అలాగే, కోర్టు స్పష్టమైన గడువును విధించింది. తీర్పు ప్రతిని అందుకున్న తేదీ నుండి మూడు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
ఆ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసిన ‘సుప్రీం’
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంలో 1200 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు (mphs) ఊరట దక్కింది. మల్లీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.2013లో ఉమ్మడి ఏపీలో కారుణ్య నియామకాల కింద 1200మంది ఎంపీహెచ్‌ఎస్‌లు ఉద్యోగం పొందారు. అయితే, ఆ నియామక ప్రక్రియను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా ఆ 1200మందిని కారుణ్య నియామకం కింద నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు 1200మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకాల్ని రద్దు చేసింది. దీనిపై ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయ స్థానం .. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వారి ఉద్యోగాల్లో కొనసాగించవచ్చని కీలక తీర్పును వెలువరించింది. -
నిబంధనలను సర్కారే ఉల్లంఘిస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఎలా మార్పు చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. సొంత నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఎలా? అని అడిగింది. ఏ నిబంధన మేరకు గడువు పొడిగించారో చెప్పాలని, లేనిపక్షంలో లిక్కర్ షాపుల ఎంపిక ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుందని చెప్పింది. మరోవైపు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచితే వచ్చే నష్టమేంటని పిటిషనర్లను ప్రశ్నించింది. దరఖాస్తులను స్వీకరించవద్దని ఎలా చెబుతారని నిలదీసింది. కాగా, ప్రాథమిక ఆధారాలున్నందున ఇరుపక్షాల పూర్తి స్థాయి వాదనలు వినాలని అభిప్రాయపడింది. వాదనలు ముగిసే వరకు ప్రక్రియను నిలిపివేయడమో లేదా ఈ నెల 18వ తేదీని కటాఫ్‌గా తీసుకోవడమో చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.ఏదేమైనా శనివారం మరోసారి వాదనలు వింటామని చెబుతూ, విచారణను వాయిదా వేసింది. మద్యం దుకాణాల దరఖాస్తుల గడువును పొడిగించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన డి.వెంకటేశ్వరరావుతో పాటు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో 2025–27కు సంబంధించి 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు కోరుతూ ఆగస్టు 20న నోటిఫికేషన్ విడుదలైంది. తొలుత దరఖాస్తుల గడువును ఈ నెల 18వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఈ నెల 23 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.23న జరగాల్సిన డ్రాను 27కు వాయిదా వేసింది. దరఖాస్తుల గడువు పెంపు నిర్ణయం తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టంలోని నిబంధన 12(5)లకు విరుద్ధం. 18వ తేదీ తర్వాత పోటీ పెరిగింది. దీంతో పిటిషనర్లకు మద్యం దుకాణాలు పొందే అవకాశాలు తగ్గిపోయాయి. కారణాలు ఏవైనా గడువు పెంపు చట్టవిరుద్ధం. దుకాణాల కోసం గడువు పొడిగిస్తూ 18న తెలంగాణ ప్రభుత్వ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జారీ చేసిన మెమోను కొట్టివేయాలి. విచారణ పూర్తయ్యే వరకు ప్రక్రియపై స్టే విధించాలి’అని కోరారు. ప్రక్రియను నిలిపివేయవద్దు.. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్లు కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మెమోను సవాల్ చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లాల్లో ప్రచురించిన గెజిట్‌ను వారు సవాల్ చేయలేదు. ఈ నెల 18 వరకు మద్యం దుకాణాల కోసం మొత్తం 89,343 దరఖాస్తులొచ్చాయి. ఆ తర్వాత వచి్చన వాటి సంఖ్య 5,793 మాత్రమే. ఇది చాలా తక్కువ. మొత్తం దరఖాస్తుల సంఖ్యలో దాదాపు 5 శాతమే. గడువు పెంపు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. పరిస్థితుల మేరకు గడువు పెంచే అధికారం సర్కార్‌కు ఉంటుంది. దుకాణాల కేటాయింపు ప్రక్రియపై ఎలాంటి స్టే ఇవ్వవద్దు. మొత్తం ప్రక్రియపై స్టే ఇస్తే అది సర్కార్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. శనివారం వాదనలు విని నిర్ణయం తీసుకుంటామంటూ విచారణను వాయిదా వేశారు. -
భూ అప్పగింత ఉత్తర్వుల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్‌లోని అనంతారం గ్రామం సర్వే నంబర్ 137/27లోని 1.07 ఎకరాలను సేవాలాల్ మందిరానికి దీర్ఘకాలిక లీజుకు, వాస్తవ ధరకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్న లోకాయుక్త ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. లోకాయుక్త రిజిస్ట్రార్‌తోపాటు శంకర్‌నాయక్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మరో నలుగురితో కలిసి సేవాలాల్ ఆలయాన్ని నిర్మించడానికి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి 10 నుంచి 15 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ లోకాయుక్తకు ఓ ఫిర్యాదు అందింది. ఈ ట్రస్టు అక్కడ నిర్మించే అతిథి గృహానికి రోడ్డు కోసం ఒక రైతు భూమిలోని మిర్చి పంటను తొలగించిందని, దీంతో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడని అందులో పేర్కొన్నారు. ఈ ఘటన ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైందన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఆక్రమణపై దర్యాప్తు జరిపి, ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన లోకాయుక్త జిల్లా కలెక్టర్‌ను నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 2017, 2021లో కలెక్టర్ నివేదికలు సమర్పించారు. ట్రస్ట్ ఆక్రమించిన 1.07 ఎకరాల్లో లింటెల్ లెవల్ వరకు నిర్మాణం, అప్రోచ్ రోడ్డు, బోర్వెల్ కనిపించాయన్నారు. సదరు భూమిని లీజు లేదా ధరకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్‌ను లోకాయుక్త ఆదేశించింది. ఆక్రమించినట్లు శంకర్ ఒప్పుకున్నారు..లోకాయుక్త గతేడాది జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కలెక్టర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కలెక్టర్ తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ తేరా రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘లోకాయుక్త తన అధికార పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం–1977, తెలంగాణ లోకాయుక్త చట్టం–1983 నిబంధనలకు విరుద్ధం. సేవాలాల్ మందిర నిర్మాణం కోసం భూమిని ఆక్రమించినట్లు శంకర్‌నాయక్ లోకాయుక్త విచారణలో ఒప్పుకున్నారు. నిబంధనలకు మేరకు ఏదైనా కంపెనీ, ప్రైవేట్ సంస్థ, సంఘాలకు భూమి కేటాయించాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి. చట్టవిరుద్ధంగా దాఖలు చేసిన వినతిపత్రం ఆధారంగా ఆ భూమిని శంకర్‌నాయక్‌కు అప్పగించలేమని సీసీఎల్ఏ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘిస్తూ ఇచ్చిన ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వివరాలను తమ ముందు ఉంచాలని జీపీ, ఈసీ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. దీనికి రెండు వారాలు సమయమిస్తూ, విచారణను వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంచిర్యాల మండలం లక్సెట్టిపేట్‌కు చెందిన రేంక సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రిజర్వేషన్లపై పిటిషన్ నేపథ్యంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ నిలిపివేస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో స్పష్టత వచ్చినా ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వెంటనే మరో నోటిఫికేషన్ జారీ చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి’అని కోరారు.ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు, షెడ్యూల్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం తరఫున షాజియా పర్వీన్ వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాలు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ అవసరం లేదని, ఎన్నికల తేదీలు తెలియజేస్తే చాలని స్పష్టం చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్చించి చెప్పాలని హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నెల 9 న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా.. నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిన్న సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్‌గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అన్నారు.నిన్ననే(అక్టోబర్ 16, గురువారం) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశాం. ఫ్రెష్ గా రిజర్వేషన్ లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుంది. రెండు వారాల సమయం కావాలంటూ కోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. -
ఓటర్ల జాబితాపై జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై బీఆర్ఎస్ అభ్యర్థి సమర్పించిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించినందున తమ జోక్యం అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల నమోదు, తొలగింపు నిరంతర ప్రక్రియ అని, ఈ నెల 21 వరకు సమయం ఉన్నందున సరైన చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అత్యంత అనివార్యమైతే తప్ప న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రస్తావించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూసుకోవాలని సుప్రీం హెచ్చరించిందని వ్యాఖ్యానించింది. ఇక ఈ పిటిషన్లో ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ విచారణ ముగించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లతోపాటు బయటి వ్యక్తుల పేర్లు చేర్చారంటూ మాగంటి సునీతతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలేంటంటే... పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘బీఆర్ఎస్ అభ్యర్థి ఈసీ అధికారిక వెబ్సైట్ నుంచి ఓటర్ల జాబితాను తీసుకున్నారు. నియోజకవర్గంలో 12 వేల బోగస్ ఓట్లతోపాటు బయటి వ్యక్తులు జాబితాలో ఉన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ తో కుమ్మక్కైన ఈసీ ఓటర్ల జాబితా సమగ్రతను దెబ్బతీసేలా ఎన్నికల దురి్వనియోగానికి పాల్పడింది. బోగస్ ఓట్లు తొలగించి.. నవంబర్ 11న ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఈసీని ఆదేశించాలి’అని చెప్పారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుంది. ఈ నెల 21న నామినేషన్లు పూర్తయ్యే వరకు సవరణకు అవకాశం ఉంది. జాబితాపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. సెప్టెంబర్ 2న ఈసీ విడుదల చేసిన ప్రాథమిక జాబితా ప్రకారం 3.92 లక్షల ఓటర్లున్నారు. సవరణల తర్వాత 6,976 మందిని కొత్తగా చేరగా, 663 మందిని తొలగించారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30న ప్రచురించాం. మొత్తం ఓటర్ల సంఖ్య 3.99 లక్షలు. జాబితాపై ఓటర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. 12వేల బోగస్ ఓట్లు చేర్చారన్న వాదన సమర్థనీయం కాదు’అని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈసీ చర్యలు ప్రారంభించినందున ప్రత్యేక ఉత్తర్వులు అనవసరం లేదని పేర్కొంది. పిటిషనర్లు తమ ఫిర్యాదుపై చర్యలకు వేచిచూడకుండా కోర్టును ఆశ్రయించారని చెప్పింది. -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీపై హైకోర్టు విచారణ చేపట్టింది. బోగస్ ఓట్లు తొలగించాలంటూ మాగంటి సునీత, కేటీఆర్ లంచ్ మోషన్ పిటీషన్లు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌తో సంబంధం లేనివారు ఓటర్ జాబితాలో చేరారని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు తన వాదనలు కోర్టుకు వినిపించారు. ‘‘జూబ్లీహిల్స్‌లో 19వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయి. కొంతమందికి రెండు ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు కూడా నమోదయ్యాయి’’ అని ఆయన కోర్టుకు తెలిపారు.పిటీషనర్లు చీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశారని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అవినాష్.. కోర్టుకు తెలిపారు. ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ.. 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారన్న ఈసీ తరఫు న్యాయవాది.. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు తెలిపారు.పిటీషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు.. ఈసీ తరఫు న్యాయవాది వాదనలను సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. పిటీషనర్ విజ్ఞప్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న ఈసీ న్యాయవాది వాదనలను హైకోర్టు రికార్డు చేసింది. ఈ పిటీషన్లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. -
బీసీ వర్గీకరణ తర్వాతే ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ వర్గీకరణ మే రకు రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించా లని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దా ఖలైంది. దీన్ని గతంలో దాఖలైన పిటిషన్లకు జత చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.అప్పటి నుంచి మరో రెండు వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 3కు వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో వర్గీకరణ లేకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ నోమాడిక్, సెమీనోమాడిక్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ‘విద్య, ఉపాధి కల్పనలో సంచార, డీనోటిఫైడ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు అందించడంలో అధికారుల వైఫల్యం రాజ్యాంగ విరుద్ధం. ఉమ్మడిగా 42 శాతం రిజర్వేషన్లు కలి్పస్తే ఆర్థికంగా ఎదిగిన కులాలు మాత్రమే లబ్దిపొందుతాయి. పేద బీసీ కులాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. జీవో 9ని నిలిపివేసి.. బీసీ వర్గీకరణతో కొత్త జీవో జారీ చేసేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలి’అని నివేదించారు. -
జేఏసీగా బీసీ సంఘాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ మేరకు అక్టోబర్ 18న బంద్ చేపట్టనున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వాస్తవానికి అక్టోబర్ 14న బీసీ సంఘాలు బంద్ చేపట్టాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో బీసీ సంఘాలు ఆదివారం (అక్టోబర్ 12) సమావేశమయ్యాయి. ఈ భేటీలో బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ నెల 18న చేపట్టాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఛైర్మన్‌గా ఆర్ కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీఆర్ నారగొని,వర్కింగ్ ఛైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్‌గా దాసు సురేష్ , రాజారామ్ యాదవ్‌లు ఎన్నికయ్యారు. -
బీసీ రిజర్వేషన్లతో పార్టీల ‘రాజకీయం’!
గాల్లో కత్తులు దూయడం... శూన్యంలో యుద్ధాలు చేయడం రాజకీయ పార్టీలు, నేతలకు అలవాటైన విద్యే. తెలంగాణ స్థానిక ఎన్నికల వ్యవహారం ఇప్పుడు దీన్నే నిరూపిస్తోంది. అన్ని పార్టీలకూ తుది పరిణామం ఏమిటన్నది స్పష్టంగా తెలిసినా అందరూ ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తూంటారు. ప్రత్యర్థులపై పైచేయికి వ్యూహాలు పన్నుతూంటారు. నిర్దిష్ట గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్వహణపై చిత్తశుద్ధి ఉంటే ఉండవచ్చు కానీ ఎన్నికల్లో అధిపత్యానికి బీసీ రిజర్వేషన్లను 42 శాతం చేయాలని సంకల్పించారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేశారు. కులగణన చేపట్టి రాష్ట్రంలో బీసీలు 56 శాతమని తేల్చారు కూడా. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం 42 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. జనాభాను బట్టి రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. స్థానిక సంస్థలలోనే కాక, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ బీసీలకురిజర్వేషన్లు ఉండాలని కొన్ని రాష్ట్రాల శాసన సభలు తీర్మానాలు కూడా చేశాయి. కాని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఏభై శాతానికి మించే వీలు లేదు. అయినా తాము అనుకున్న రిజర్వేషన్ల శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టింది. ఎవరైనా కోర్టుకు వెళితే అది ఆగిపోతుందని అంతా అనుకున్నదే. అయినా ఎవరికి వారు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇస్తూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గడిపారు. అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. కాని రాష్ట్ర గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు. గవర్నర్ సకాలంలో ఆమోదం తెలపకపోతే ఆ బిల్లు ఓకే అయిపోయినట్లే అని కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా తాము 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి జీవో ఇచ్చింది. అయినా ఎవరికి ఇది అమలు అవుతుందన్న నమ్మకం లేదు. కాని ఎవరూ దీనికి అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వచ్చారు. ఆ జీవోపై హైకోర్టులో ఊహించినట్లే స్టే వచ్చింది. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈలోగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం మరో చిత్రం. తదుపరి హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రకటించింది. ఈ గేమ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా భాగస్వామి అవడం గమనించదగిన అంశమే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని కమిషన్‌కు తెలియదా? తీర్పు వచ్చాక మళ్లీ రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు కొనసాగించాయి. రిజర్వేషన్ల జీవోను బీజేపీ, బీఆర్ఎస్లే అడ్డుకున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. కాగా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని, దీనిని ప్రజలలో ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కె.చంద్రశేఖరరావు కేడర్‌కు పిలుపు ఇచ్చారు. ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిందని విమర్శించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరు దురదృష్టకరం అని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలలో ఏ ఒక్కరికైనా చిత్తశుద్ది ఉందా అన్న ప్రశ్న వస్తే సమాధానం దొరకదు. ఎవరికి వారు అడ్వాంటేజ్ తమకు రావడానికే గేమ్ ఆడారు తప్ప ఇంకొకటి కాదనిపిస్తుంది. ఈ వ్యవహారానికి ముందు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించేవి. రిజర్వేషన్ల అంశంపై మాత్రం అందరూ పోటాపోటీగా 42 శాతానికి మద్దతిస్తున్నట్లు మాట్లాడేవారు. కేసీఆర్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తే రేవంత్ విమర్శించేవారని, రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం నేరమన్నారని బీఆర్ఎస్ ఇప్పడు గుర్తు చేస్తోంది. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక తనే రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్రానికి అధికారం ఉందన్నట్లుగా బిల్లు ఆమోదింప చేశారు. జీవో కూడా ఇచ్చేశారు. మరి ఇది చెల్లదన్న సంగతి ఆయనకు తెలియదా? అంటే ఏమి చెబుతాం? కులగణనతో చాలా మార్పులు వచ్చేస్తాయని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ అంటూ దేశంలో పర్యటిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా ఇప్పుడు వ్యవహారం మొదటికి వచ్చినట్లయింది. తమిళనాడులో మాదిరి షెడ్యూల్ 9 లో చేర్చితేనే రిజర్వేషన్ లకు చట్టబద్దత వస్తుందని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ బీహారు ఎన్నికలలో ప్రయోజనం కోసం ఈ డ్రామా ఆడిందని మాజీ స్పీకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. అయితే తమకు ఉన్న చిత్తశుద్దిని రుజువు చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ హైకోర్టులో స్టే రాకపోతే స్థానిక ఎన్నికలు జరిగిపోయేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచిన పార్టీగా పేరు తెచ్చుకునేది. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా చేశామనిపించుకునేది. గతంలో కేసీఆర్ కూడా ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించి ప్రచారం చేశారు.. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయనకు కూడా తెలుసు. అయినా కావాలని అప్పట్లో అలా చేశారన్నది నిష్టుర సత్యం. అలాగే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే పంథాలో సాగిందని చెప్పాలి. బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించి, అటు పాము చావకుండా, ఇటు కర్ర విరగకుండా వ్యవహరించింది. కేంద్రం మీదకు నెట్టాలని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం మీద నెపం ఉండేలా బీజేపీ ప్రయత్నం చేశాయి. జాతీయ పార్టీలను తప్పుపట్టి తానే బీసీలకు అనుకూలం అన్న భావన కలిగించాలని బీఆర్ఎస్ యత్నం.వాస్తవానికి ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాయానిపిస్తుంది. కాకపోతే అమాయక గ్రామీణులు కొందరు నిజంగానే ఎన్నికలు వచ్చేస్తాయనుకుని తమ చేతులు కాల్చుకున్నారట. దసరా నాడు వారికి ఎన్నికల ఖర్చు రూపేణా బాగానే చేతి చమురు వదిలిందట. ఏతావాతా ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పార్టీలు ఒక డ్రామాగా మార్చడం దురదృష్టకరం. తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రావాలని ఆకాంక్షిస్తున్న బీసీ వర్గాలకు మరోసారి నిరాశే ఎదురైంది.తాజాగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఇందుకు భిన్నంగా తీర్పు వస్తే ఒక చరిత్రే అవుతుంది. ఏమి జరుగుతుందో చూద్దాం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 9 అమలుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల కాగా.. దానిని అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని, ఈ మేరకు సీనియర్ కౌన్సిల్‌తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. దీంతో సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ సందర్భంగా.. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది.ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే..రిజర్వేషన్ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీ మాధవరెడ్డి, మరొకరు.. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు.ఇదీ చదవండి: ‘అలాగైతే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు’.. : తెలంగాణ హైకోర్టు -
కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలంటే లెక్కలేదా అంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్వరం మండలం నాగారంలోని గైరాన్ సర్కారీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తాము ఆదేశించామని, ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని జూన్‌లో తాము ఆదేశించామని.. 4 నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఎందుకు సమర్పించలేదని నిలదీసింది.ఆ భూముల వద్దకు వెళ్లి నిర్మాణాలు జరుగుతున్నాయా.. లేదా..పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఏం ఇబ్బందని అడిగింది. కలెక్టర్ నుంచి ఇంత నిర్లక్ష్యాన్ని ఊహించలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది న్యాయస్థానం ఉత్తర్వుల ధిక్కరణే అవుతుందని స్పష్టం చేసింది. చివరి అవకాశం ఇస్తున్నామంటూ.. వారంలోగా నివేదిక అందజేయాలని, అందులో ఆలస్యానికి కారణాలను వెల్లడించాలని తెలియచెప్పింది.ఇదీ కేసు..: నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని గైరాన్ భూములను కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు, వారి బంధువులు అక్రమంగా కొనుగోలు చేశారని బిర్లా మల్లేశ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం గానీ, బదిలీ చేయడం గానీ, నిర్మాణాలు చేపట్టడం సహా ఎలాంటి మార్పులు చేయవద్దని ప్రతివాదులకు తేల్చిచెప్పింది. ఈ విధంగా న్యాయస్థానం ఉత్తర్వులున్నా వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మల్లేశ్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.జూన్‌లో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు వారాల్లో పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు సమాధానమిస్తూ నివేదిక అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అయినా కలెక్టర్ నివేదిక దాఖలు చేయకపోవడంతో మహేశ్ మరో ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు వారం గడువిస్తూ తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేశారు. -
కింకర్తవ్యం..!?
సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42% కోటా జీవోపై హైకోర్టు స్టే విధించడంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందు కెళ్లాలనేదానిపై ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టు అటు రాజకీయ వర్గాలు, ఇటు బీసీ సంఘాలు భావిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్న దానిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.హైకోర్టు తీర్పు దరిమిలా ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయనే సమాచారం అందుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే ఈ అంశంపై పకడ్బందీగా ముందుకు వెళ్లడంపై న్యాయ నిపుణులతో సీఎం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేది కూడా శుక్రవారం అర్ధరాత్రికి స్పష్టత రావడంతో, ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లడంపై ప్రభుత్వ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకటి కాగా.. జీవో అమలుపై స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు సూచనలకు అనుగుణంగా ఆరు వారాల పాటు వేచి ఉండటం రెండో ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఆ సమయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు పంపిన బిల్లులకు కూడా మూడు నెలల సమయం పూర్తవుతుందని, అప్పుడు అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి బీసీ రిజర్వేషన్ల జీవోకు అనుకూల నిర్ణయాన్ని కోర్టుల నుంచి ఆశించేందుకు అవకాశం ఉంటుందని వారంటున్నారు. -
అంతా గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై హై కోర్టు స్టే విధించడంతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువ డిన నేపథ్యంలో కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా.. ఇప్పుడు అసలు ఎప్పుడు ఎన్నికలు జరు గుతాయో, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అర్థం కాక కింది స్థాయి కేడర్ అయోమయంలో పడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు అవు తున్నా అటు పార్టీ పదవులు కానీ, ఇటు నామినేటెడ్ పదవు లు కానీ లేకపోవడంతో నిరాశా నిస్పృహలు నెలకొన్నా యని, ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సైతం బ్రేకులు పడడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. కేడర్‌కు దిశానిర్దేశం ఏదీ?: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఏ మేరకు అమలవుతాయన్న దానిపై కూడా కాంగ్రెస్ కేడర్‌కు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఓ స్థాయి నాయకత్వం వరకు మాత్రమే చేరగా, సాధారణ కార్యకర్తల్లో మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ‘రిజర్వేషన్ల గురించి మాకు అవగాహన ఉంది. ఈ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఎన్ని కలు జరిగే అవకాశం కూడా లేదనే స్పష్టత మాకుంది.కానీ, గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలకు ఈ అవగాహన లేదు. ఎన్నికలు జరుగుతాయని అందరూ అనుకున్నారు. నోటిఫికే షన్ కూడా రావడంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని నామినే షన్లకు సిద్ధమవుతున్న తరుణంలో కోర్టు స్టే విధించడం గందరగోళానికి తెరతీసింది.’ అని ఓ మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల సంగతి ఎలా ఉన్నా ఏదో రూపంలో వీలున్నంత త్వరగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం మేలనే అభిప్రాయం క్షేత్రస్థాయి నాయకత్వంలో వ్యక్తమవుతోంది.రిజర్వేషన్లపై ముందుకే..రిజర్వేషన్ల విషయంలో ముందుకే వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికల కు వెళ్లాలని పట్టుబడుతున్నారు. ఏఐసీసీ ఆలోచన కూడా ఇదే తరహాలో ఉందని తెలుస్తోంది. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలకు వెళితే ఇతర రాష్ట్రాల్లో కూడా మార్గదర్శకంగా ఉంటామని, తాము బీసీలకు న్యాయం చేస్తామని తెలంగాణను చూపించి దేశ వ్యాప్తంగా చెప్పుకునే వెసులుబాటు ఉంటుందని ఏఐసీసీ భావిస్తోంది.పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించడం కన్నా కోర్టులు, రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి ముందుకు వెళ్లడమే మేలనే భావనలో టీపీసీసీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు మాత్రమే కోర్టు స్టే విధిస్తే, ఆ స్టేను ఎత్తివేయాలని కోరుతూ పార్టీ పరంగా కూడా అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. -
50 శాతంతో ఓకే!
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని హైకోర్టు సీజే ధర్మాసనం నిలిపివేసింది. దీంతో పాటు మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు సంబంధించి పంచాయతీ రాజ్ చట్టం–2018లో రిజర్వేషన్లను మారుస్తూ సెపె్టంబర్ 26న జారీ చేసిన జీవో నంబర్ 41, 42పై కూడా స్టే విధించింది. ప్రస్తుతానికి తాము పూర్తిస్థాయిలో మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని తెలిపింది.వికాస్ కిషన్రావ్ గవాలీ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని నిర్దేశించిందని, దీన్ని పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ ఇచ్చిన జీవోలను ఈ కోర్టు నిలిపివేసినందున, రాష్ట్ర ఎన్నికల సంఘం పెంచిన 17 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి తీర్పు కాపీని విడుదల చేసింది. ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేయండి..ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దన్న వాదనలు తమ ముందుకు వచ్చాయని.. వాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నందున.. గతంలో రాహుల్ రమేశ్వాఘ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆధారపడుతున్నామని చెప్పింది. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ట్రిపుల్ టెస్ట్‌ను పాటించపోతే, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి లేకుండా, పెంచిన దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని, స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఈ కోర్టు భావించడం లేదని చెప్పింది. రిజర్వేషన్ల పెంపు జీవోను నిలిపివేసినందున ఆ మేరకు మార్పు మాత్రమే సూచిస్తున్నామని స్పష్టం చేసింది. కింకర్తవ్యం..!? ⇒ జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు ⇒ న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సంప్రదింపులు ⇒ అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలు..రాజుకుంటున్న రాజకీయ వేడి సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42% కోటా జీవోపై హైకోర్టు స్టే విధించడంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అసలు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా లేదా? జరిగితే ఎప్పుడు, ఎలా జరుగుతాయి? ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్నది అసక్తికరంగా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందు కెళ్లాలనేదానిపై ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టు అటు రాజకీయ వర్గాలు, ఇటు బీసీ సంఘాలు భావిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్న దానిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు దరిమిలా ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయనే సమాచారం అందుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే ఈ అంశంపై పకడ్బందీగా ముందుకు వెళ్లడంపై న్యాయ నిపుణులతో సీఎం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేది కూడా శుక్రవారం అర్ధరాత్రికి స్పష్టత రావడంతో, ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లడంపై ప్రభుత్వ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. రెండే ప్రత్యామ్నాయాలు? రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండే ప్రత్యామ్నాయాలున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకటి కాగా.. జీవో అమలుపై స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు సూచనలకు అనుగుణంగా ఆరు వారాల పాటు వేచి ఉండటం రెండో ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఆ సమయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు పంపిన బిల్లులకు కూడా మూడు నెలల సమయం పూర్తవుతుందని, అప్పుడు అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి బీసీ రిజర్వేషన్ల జీవోకు అనుకూల నిర్ణయాన్ని కోర్టుల నుంచి ఆశించేందుకు అవకాశం ఉంటుందని వారంటున్నారు. ప్రతిపక్షాలకు అస్త్రంగా.. హైకోర్టు స్టే నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో ఇరుకున పెట్టే వ్యూహంతో ప్రతిపక్ష పారీ్టలు ముందుకెళుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుదల అంశం న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ప్రధాన రాజకీయ పారీ్టల నేతలు విమర్శిస్తున్నారు. హైకోర్టు స్టే విధించడానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిదేనని ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.రిజర్వేషన్ల అంశం రాజ్యాంగపరమైన, శాస్త్రీయమైన ప్రక్రియతోనే సాధ్యమని తెలిసీ, కాంగ్రెస్ పార్టీ దానిని పూర్తిగా అపహాస్యం చేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన బీసీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు.. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పారీ్ట.. వీరి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది.తమకు చిత్తశుద్ధి లేకపోతే అసలు ఇంత దూరం ఎందుకు తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో మద్దతిచ్చిన బీఆర్ఎస్ కోర్టు కేసులో ఇంప్లీడ్ కాకపోవడాన్ని తప్పు పడుతున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద ఉన్న బిల్లులను ఆమోదింపజేస్తే అసలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరమే రాదని, ఈ విషయంలో బీజేపీ నేతలు బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద హైకోర్టు స్టే రాష్ట్రంలో రాజకీయ వేడిని రగులుస్తుండగా.. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. -
రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో–9పై హైకోర్టు స్టే ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపేసిన నేపథ్యంలో గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు కీలక భేటీ నిర్వహించారు. తాజ పరిణామాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని.. అసెంబ్లీ లోపలా, బయటా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించినా జీవోకు చట్టబద్ధత సాధించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నద్ధతపైనా ఈ భేటీలో కేసీఆర్ సమీక్షించారు. ఐదుగురు మాజీ మంత్రుల నేతృత్వంలో ఏర్పాటైన వార్ రూమ్ పనిచేయాల్సిన తీరుపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపికైన నేపథ్యంలో ఆ పార్టీ అనుసరించే వ్యూహం, అభ్యర్థి బలాబలాలను విశ్లేషించి పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందున గ్రామీణ ప్రాంత నేతలు, కేడర్‌ను కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఉపఎన్నిక ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఒకట్రెండు రోజుల్లో పార్టీ డివిజన్ ఇన్చార్జీలు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారని సమాచారం. -
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. గురువారం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, సాయంత్రానికి హైకోర్టు దానిని నిలిపేయటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గత నెల 29 నుంచి అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కూడా తొలగిపోయింది. హైకోర్టు ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తామని ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల పూర్తిపాఠం అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొంది. గతంలో ఎస్ఈసీ జారీచేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా గురువారం మొదటి విడత మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు జిల్లాల్లో ఆయా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీచేశారు. గురు, శుక్ర, శనివారాల్లో నామినేషన్లు స్వీకరించాల్సి ఉండగా.. కేసు విచారణ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగింది. తొలి రోజు మొత్తం 16 జెడ్పీటీసీ, 103 ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు మకరందు తెలియజేశారు. గత నెల 29న జారీచేసిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్లను తదుపరి నోటిఫికేషన్ వచ్చేవరకు తక్షణం నిలుపుదల చేస్తున్నట్టు ఎస్ఈసీ ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఓటర్లకు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల పూర్తి పాఠం అందాకే...స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టు నుంచి పూర్తి ఆదేశాలతో కూడిన ‘సైన్డ్ కాపీ’అందాకే తదుపరి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించనున్నట్టు తెలుస్తోంది. తీర్పు కాపీలో ఎలాంటి కారణాలు పేర్కొన్నారో పరిశీలించిన తరువాత అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల పెంపు, పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో ఈ అంశాలన్ని వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి దాకా ప్రభుత్వపరంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకే అసెంబ్లీలో, బయటా, ఆర్డినెన్స్‌లు, బిల్లులు తేవడం ద్వారా పూర్తిస్థాయిలో ప్రయత్నాలు సాగించినందున వాటిని సాధించేవరకు ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్లాన్ ‘బీ’లేనట్టే ?కొన్నాళ్లుగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై ఇటు ప్రభుత్వంలో, అటు రాజకీయ పార్టీల్లో పెద్ద కోలాహలమే కొనసాగింది. నోటిఫికేషన్ కూడా రావటంతో ఇక ఎన్నికలు జరగటమే తరువాయి అనుకున్నారు. కానీ, చివరకు ఊరించి ఉసూరుమనిపించినట్లు హైకోర్టు తీర్పుతో అంతా చల్లబడ్డారు. నిజానికి బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేస్తే.. ప్లాన్ బీ కింద పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెంటనే వెళ్లాలని ప్రభుత్వం ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, హైకోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాల్లో రిజర్వేషన్ల కోసం జారీచేసిన జీవో 9ను కాకుండా, ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. అయితే, నోటిఫికేషన్‌పై స్టేకు గల అన్ని కారణాలను ఉత్తర్వుల్లో పొందుపరుస్తామని ప్రధాన న్యాయమూర్తి ఏకే సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులే కావడంతో.. రిజర్వేషన్లను మార్చి పాత విధానంలో ఎన్నికలకు కూడా వెళ్లలేని స్థితిలో ప్రభుత్వం పడిపోయింది. హైకోర్టు స్టేను తొలగించాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని తీర్పు కాపీ వచ్చిన తరువాతే పరిశీలించాలని భావిస్తోంది. -
బీఆర్ఎస్, బీజేపీలే అడ్డుకున్నాయి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అడ్డుకున్నాయని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో గురువారం గాం«దీభవన్‌లో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 2018లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ 50 శాతం మించకుండా చట్టం చేసిందని, అదే ఉరితాడుగా తయారైందని అన్నారు. 2019లో ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కులగణన చేసి జీవో ఇచ్చేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ఎంపిరికల్ డాటా అవసరమని హైకోర్టు చేసిన సూచనతోనే ప్రభుత్వం సైంటిఫిక్‌గా అధ్యయనం చేసి జీవో 9 తీసుకొచ్చిందన్నారు. బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపితే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం దానిని చట్టం కాకుండా నిలిపివేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కొని బీసీల నోటికాడి ముద్దను దూరం చేశాయన్నారు.రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ఆలోచన: మహేశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీ కోర్టులను, చట్టాలను గౌరవిస్తుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో చట్టబద్ధంగా ఎన్నికలకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కోర్టు తీర్పు వచ్చిన తరువాత పరిశీలించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ కుటిలయత్నాలు చేస్తున్నాయని, అడుగడుగునా బీసీలను అణగదొక్కిన పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం పొన్నం, జూపల్లి, వాకిటి శ్రీహరి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రులు తెలిపారు. చట్టపరంగా, న్యాయపరంగా బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి.. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి.. బీసీ బిల్లుకు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్‌కు పంపించామని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం బాధాకరమని జూపల్లి అన్నారు. బీసీలకు నోటికాడికి వచ్చిన ముద్ద లాగేసినట్లు చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలంగాణలోని బీసీలంతా ఆలోచించాలని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. -
భగ్గుమన్న బీసీ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై గురువారం హైకోర్టు స్టే విధించడం పట్ల బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు నోటివరకు అందిన కూడును లాగేశారంటూ మండిపడ్డాయి. స్టే విధిస్తూ తీర్పు ఇచి్చన వెంటనే హైకోర్టు ప్రాంగణంలో బీసీ సంఘాల నేతలు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. ప్రధాన పార్టీలపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బంద్ నిర్వహిస్తాం: ఆర్.కృష్ణయ్య ఈరోజు రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. జీవో ఇచి్చన వెంటనే కోర్టులో పిటిషన్ వేసినప్పుడు అదేరోజు స్టే ఇవ్వాల్సింది. కానీ అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత... చివరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు సమరి్పంచిన తర్వాత స్టే ఇవ్వడం దారుణం. ఈ అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రభుత్వ వైఖరిని బట్టి భవిష్యత్ ప్రణాళిక చేపడతాం. రాష్ట్ర బంద్ నిర్వహించి జనజీవనాన్ని స్తంభింపజేస్తాం. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: జాజుల బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయి. శుక్రవారం హైదరాబాదులో బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. చీకటి రోజు: జూలూరి గౌరీశంకర్రాజ్యాంగ సవరణ జరగకుండా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధ్యం కావని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకుండా జీవో 9ని ఇచ్చి అన్యాయం చేసింది. 42 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసి బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసగించింది. మరో మండల్ ఉద్యమం బీసీల రిజర్వేషన్ల కోసం మరో మండల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని, అందరం కలిసి నేటి బంద్‌ను విజయవంతం చేద్దామని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు వ్యాఖ్యానించారు. అగ్రకుల పాలకుల మీద ఆధారపడకుండా స్వతంత్ర బీసీ ఉద్యమ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం గురువారం రాత్రిలోగా నిర్ణయం ప్రకటించకుంటే బంద్ నిర్వహిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న తెలిపారు.హైకోర్టు వద్ద ఉద్రిక్తత చార్మినార్ (హైదరాబాద్): స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. హైకోర్టు ప్రాంగణం నుంచి రోడ్డుపైకి వచి్చన నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. స్పందించిన పోలీసు లు వారిని రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక నినాదాలతో హైకో ర్టు పరిసరాలు మారుమోగాయి. బీఆర్ఎస్–బీజేపీ కుమ్మక్కై తమ నోటికాడి ముద్దను లాక్కున్నాయంటూ కొందరు నేతలు నినాదాలు చేశారు. హైకోర్టులోనే ఉన్న మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, వి.హనుమంతరావు తదితరులు తీర్పు అనంతరం హైకోర్టు ప్రాంగణం నుంచి బయటికి వచ్చి బీఆర్ఎస్–బీజేపీ కుట్ర పన్నాయంటూ ధ్వజమెత్తారు. -
తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేత
సాక్షి,హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్‌ను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గురువారం(అక్టోబర్ 9వ తేదీ) హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ‘ 57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలింది. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్ ఎందుకు?, బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏజీ సుదర్శన్ రెడ్డి. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినది. మేం రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాం’ అని వివరించారు. ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ.. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంంగంలో ఎక్కడా లేదన్నారు. ‘ తెలంగాణలో ఏ రిజర్వేషన్లు లేని జనాభా 15 శాతం మాత్రమే. ఆ 15 శాతం మందికి 33 శాతం సీట్లు ఇస్తున్నాం’ అని హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరఫున వాదనలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.ఇది కూడా చదవండి:తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట -
రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణలు కొనసాగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందా? కాదా? అన్న ఉత్కంఠతకు తెరపడింది. గురువారం (అక్టోబర్9) రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రేపు ఉదయం 10.30గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రెండు దశల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు అక్టోబర్ 9 నుంచి తొలివిడుత నామినేషన్లుఅక్టోబర్ 13 నుంచి రెండో విడుత నామినేషన్లు అక్టోబర్ 23న మొదటిదశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 29న రెండో దశ ఎన్నికల పోలింగ్ -
స్థానికంపై ‘ప్లాన్ బీ’!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే.. అందుకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకుని ‘ప్లాన్ బీ’ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, మొత్తంగా 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై న్యాయస్థానాల్లో ప్రతికూల తీర్పులు వస్తే.. ఏం చేయాలనే దానిపై పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఈ నెల 6న సుప్రీంకోర్టులో, 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో విచారణకు రానున్నాయి. కోర్టుల వైపు అందరి చూపు.. పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా.. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ జీవోను కొట్టేయాలని గత నెల 27న ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఆ పిటిషన్‌పై ఈ నెల 8న హైకోర్టు విచారణ జరపనుంది. నాటి విచారణలో బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ దశలో రిజర్వేషన్ల పెంపుదలను ఆమోదించలేమని, అదేవిధంగా ఎలాంటి నిలిపివేత ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. ఒకవేళ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినా.. పిటిషన్లు ముందే దాఖలు చేసినందున మెరిట్ ఆధారంగా విచారణ చేస్తామని తెలిపింది. తాము ఇచ్చే తీర్పు మేరకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పింది. దీంతో 8న కోర్టు ఏం తేలుస్తుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. పాత రిజర్వేషన్ల ప్రకారమూ సిద్ధమే... సుప్రీం, హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే (50 శాతానికి లోబడి) ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పీఆర్ శాఖ సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్టీ, ఎస్సీల రిజర్వేషన్లను ఖరారు చేసినందున, వాటిని అలాగే ఉంచి గతంలో మాదిరిగా బీసీలకు 23 శాతం రిజర్వేషన్ల కల్పనకు మొగ్గుచూపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా గ్రామపంచాయతీల్లోని వార్డులవారీగా ఫొటోలతో కూడిన ఓటర్ జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కోర్టుల తీర్పు మేరకు ప్రభుత్వం మళ్లీ బీసీ కోటాపై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బీసీ, అన్ రిజర్వ్డ్ రిజర్వేషన్లను ఖరారు చేసి, వారంలోనే మరోసారి ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఎస్ఈసీ జారీచేసిన ఎన్నికల షెడ్యూల్స్ మార్చి వారం రోజుల అంతరంతో నిర్వహించేలా మరోసారి షెడ్యూల్‌ను జారీచేసే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. అవసరమైన మార్పులు చేశాక మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తొలివిడత నోటిఫికేషన్ 9వ తేదీకి బదులు 16న జారీచేసి, ఎన్నికలను 23వ తేదీకి బదులు 30న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా మిగతా నాలుగు విడతలకు కూడా వారం రోజుల అంతరంతో నోటిఫికేషన్, మిగతా దశల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇలా గతంలో ప్రకటించిన విధంగా నవంబర్ 11కు బదులు 18న ఎన్నికల ప్రక్రియను ముగించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో నెల వేచి చూస్తే ఎలా ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే పట్టుదలతో ఉన్న పక్షంలో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకునే గడువు వరకు వేచి ఉండే అవకాశం లేకపోలేదని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు మూడు నెలల్లోగా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి ఆమోదం పొందినట్టు భావించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. కాగా, మొదటి రెండు పర్యాయాలు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్స్‌లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై (పీఆర్ చట్టానికి సవరణలతో) అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. మరో 25 రోజులైతే ఆ బిల్లును పంపి 90 రోజులు అవుతుంది. అందువల్ల దీనితోపాటు సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నుంచి వచ్చే స్పందనల కోసం మరో నెల వేచి చూస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది. -
TG: బీసీ రిజర్వేషన్లు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(శనివారం, సెప్టెంబర్ 27) విచారణ జరిపింది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్‌లతో ఏర్పాటైన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటడం.. రాజ్యాంగ విరుద్ధమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని మయూర్‌రెడ్డి వివరించారు.ప్రభుత్వం తరపున ఏజీ వర్చువల్‌గా హాజరుకాగా.. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో రిజర్వేషన్లు 50 శాతం మించినట్టు ఉందని హైకోర్టు ప్రస్తావించింది. బీసీ బిల్లు గవర్నర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లిందంటూ ధర్మాసనం ప్రశ్నించగా.. గవర్నర్ దగ్గరకు బిల్లు వెళ్లి నెలరోజులు దాటిందని ఏజీ సమాధానమిచ్చారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు?. రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఎలా ఇస్తారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. మేం జోక్యం చేసుకోవద్దంటే.. ఎన్నికలకు వెళ్లమని హామీ ఇవ్వండి. 10 రోజుల వరకు ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టమని హామీ ఇవ్వాలన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఆలోచన ఏంటో ఏజీ చెప్పాలని పేర్కొంది.‘‘ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిటిషన్లు దాఖలైతే కోర్టులు జోక్యం చేసుకోలేవు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. పిటిషన్లు ఉన్నాయి కాబట్టి విచారించొచ్చు’’ అని హైకోర్టు పేర్కొంది. విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసిన ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి మరోసారి రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు. మూడు రోజుల క్రితమే రిజర్వేషన్లపై ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా వేశారంటూ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ శుక్రవారం(సెప్టెంబర్ 26) జీవో విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. -
హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కి మరోసారి షాక్!
తెలంగాణలో హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రాకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టికెట్ల పెంపుకు అంగీకరించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 24న ఓజీ మూవీ టికెట్ ధరల పెంపు మొమోని హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి.‘ఓజీ’ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.కాగా, తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న రాత్రి వేసిన ప్రీమియర్ టికెట్ ధరను రూ. 800గా నిర్ణయించారు. అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది. -
ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ ప్రకంపలు సృష్టించిన ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో జెరూసలెం మత్తయ్య(Jerusalem Mattaiah) పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై నేడు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. 2015 ఓటుకు నోటు కేసులో మత్తయ్య ఏ4గా ఉన్నారు. అయితే ఈ కేసు నుంచి ఆయన పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో మత్తయ్యను దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సర్కార్ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ, ఈ కేసులో(Vote For Cash Case) అసలు సూత్రధారి చంద్రబాబు అని, ఆయన పైనే దర్యాప్తు జరపాలని మత్తయ్య అంటున్నారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు ఓ లేఖ కూడా రాశారు.2015లో ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది. ఆనాడు ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యేగా ఉన్నఎల్విస్ స్టీఫెన్సన్కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం డబ్బు ఆఫర్ చేసినట్లు వీడియో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందన్న ప్రచారమూ ఒకటి ఉంది. ఈ కేసులో నేరానికి ప్రరేపితుడిగా(abettor)గా జెరూసలెం మత్తయ్య పేరును చేర్చారు. అయితే అప్పటి ఉమ్మడి హైకోర్టులో ఆయన పిటిషన్ వేయగా.. ఊరట దక్కింది. 2017లో తెలంగాణ ప్రభుత్వం, స్టీఫెన్సన్లు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే.. తీర్పు వెలువడే వేళ ‘అంతా చంద్రబాబే చేశాడు’ అంటూ మత్తయ్య సంచలన ప్రకటన చేశారు. ఏసీబీ, తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో తనను బలిపశువును చేస్తున్నారంటూ అందులో తన ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో లోకేష్ పాత్ర.. సంచలన వ్యాఖ్యలు -
‘ఓజీ’తో ప్రజలకు ఒరిగేదేముంది?
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రంతో ప్రజలకు ఒరిగేది ఏముందని, టికెట్ ధర పెంచితే ఎందుకు కొనాలని ప్రభుత్వాన్ని, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. రూ.వందల కోట్లతో చిత్ర నిర్మాణం చేపట్టే ముందు.. కొందరికి మాత్రమే రూ.కోట్లు ఇచ్చే ముందు ప్రజల అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. మీ ఇష్టం వచ్చినట్లు సినిమా తీసి వందల కోట్లు ఖర్చు చేశాం.. ప్రజలు కూడా వందలకు వందలు వెచ్చించి కొనాల్సిందేనని భావించడం సమర్థనీయం కాదంది. శుక్రవారం (26న) మరోసారి వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని కోరుతున్నామని డివిజన్ బెంచ్ పేర్కొంది. సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెబుతూ అప్పీల్‌పై విచారణ ముగించింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ వచ్చే నెల 4 వరకు ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుతూ, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది బర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి మెమోను నిలిపివేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ హైకోర్టులో డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీలెంట్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్‌దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారని, మెమో గడువు 4వ తేదీతో ముగుస్తుందన్నారు. ఆ తర్వాత విచారణతో అప్పీలెంట్‌కు ప్రయోజనం ఉండదన్నారు. పిటిషనర్‌కు కలిగింది రూ.100 నష్టం మాత్రమేనని, అది డిపాజిట్ చేస్తామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని రూ.100 కాదు.. రూ.100 కోట్లు డిపాజిట్ చేయండి అని అడిగింది. పిటిషనర్ దాఖలు చేసింది పిల్ కాదని, రిట్ పిటిషన్లో ప్రజా ప్రయోజనాలు కోరలేదని అవినాశ్ దేశాయ్ చెప్పారు. రిట్ పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపిస్తూ.. మెమో జారీ చేసే అధికారం హోంశాఖ ముఖ్య కార్య దర్శికి లేదన్నారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు మాత్రమే ఆ అధికారం ఉందన్నారు. గతంలో సినిమా టికెట్లపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకోవడం చట్టవిరుద్ధమన్నారు. గేమ్ ఛేంజర్, పుష్ప చిత్రాలకు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇదే హైకోర్టు నిలిపివేసిందని గుర్తు చేశారు. కోర్టులు సమర్థించాలా? వాదనలు విన్న డివిజన్ బెంచ్.. కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచటం సరికాదంది. రూ.1,000 కోట్లు పెట్టి సినిమా తీయడం వల్ల ప్రజలకు ఒరిగేదేముందని ప్రశ్నించింది. అది కొందరు వ్యక్తుల లబ్ధికోసమేనని పేర్కొంది. రూ.150 టికెట్‌ను రూ.800కు ప్రజలు ఎందుకు కొనాలని.. దీనికి ప్రభుత్వం ఎందుకు సహకరించాలో ఒక్క కారణం చెప్పాలని అడిగింది. ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు సమర్థించాలా అని ప్రశ్నించింది. ప్రజలకు చెప్పి హైబడ్జెట్ సినిమాలు తీస్తున్నారా.. వాళ్లు తీయమని అడిగారా అని నిలదీసింది. టికెట్ల పెంపు విధానపరమైన నిర్ణయమైతే జీవో జారీ చేయకుండా.. మెమో ఎలా విడుదల చేస్తారని తప్పుబట్టింది. శుక్రవారం సింగిల్ జడ్జి విచారణ చేపట్టి.. ఈ ఉత్తర్వులతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. -
సిరిసిల్ల కలెక్టర్ తీరు ఆక్షేపణీయం
సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాలు పాటించకపోగా భూ నిర్వాసితురాలిపై క్రిమినల్ కేసు పెట్టి రాజన్న సిరిసిల్ల కలెక్టర్ చట్ట నియమాలను ఉల్లంఘించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ హక్కులను, స్వేచ్ఛాయుత జీవనాన్ని, ప్రాథమిక హక్కులను హరించేలా ప్రవర్తించారని మండిపడింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు ఆక్షేపణీయమని, ఆయను పిలిచి తీవ్రంగా మందలించాలని సీఎస్‌ను ఆదేశించింది. ఇంకా సర్వీసు ఉన్నందున ఆయన సర్వీసులో కొనసాగాలన్న ఒకే ఒక్క కోణంలో చూసి నేరుగా తామే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయడం లేదని చెప్పింది. పిటిషనర్‌పై ప్రభుత్వం కేసు ఉపసంహరించుకుంటామని చెప్పినందున వేరే ఉత్తర్వులు అవసరం లేదంటూ నిర్వాసితురాలి పిటిషన్‌ను అనుమతిస్తూ తీర్పునిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత ఇంటిని ప్రభుత్వం 2004లో సేకరించింది. అయితే నిర్వాసితుల జాబితాలో తన పేరు లేదంటూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ జాబితాలో ఆమె పేరు చేర్చి పరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ కవిత కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా పరిహారం చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. కలెక్టర్ లేఖ ఆధారంగా ఎఫ్ఐఆర్ కోర్టును తప్పుదోవపట్టించి ఉత్తర్వులు పొందారంటూ కవితపై సివిల్/క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని ఆర్డీవో, వేములవాడ తహసీల్దార్‌కు కలెక్టర్ లేఖలు రాశారు. ఈ లేఖ ఆధారంగా తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో వేములవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ కవిత అప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి విచారణ చేపట్టి న్యాయస్థానాలపై కలెక్టర్‌కు గౌరవం లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. తప్పుడు సమాచారంతో కోర్టు నుంచి ఉత్తర్వులు పొంది ఉంటే తమకు చెప్పకుండా పిటిషనర్‌పై పోలీసు కేసు నమోదు పెట్టడం చట్టవిరుద్ధమని అప్పుడు తీర్పు ఇచ్చారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చర్యలు తీసుకొనే అధికారం కలెక్టర్‌కు లేదన్నారు. -
సింగిల్ జడ్జి తీర్పు తాత్కాలికంగా రద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ జవాబు పత్రాలను పునఃముల్యాంకనం చేయాలని లేదా పరీక్ష మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సీజే ధర్మాసనం తాత్కాలికంగా రద్దు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేస్తూ.. ఆలోగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏవైనా నియామకాలు చేపడితే అవి తామిచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్‌లపై స్టేటస్కో ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషనర్ల (ఎంపిక కాని అభ్యర్థులు) న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా..ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో గ్రూప్–1 పోస్టింగ్‌లకు లైన్‌క్లియర్ అయ్యింది. టీజీపీఎస్సీతో పాటు ఉద్యోగాలకు ఎంపికై నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించింది. అప్పీల్‌ను విచారించిన సీజే ధర్మాసనం గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితా(జీఆర్ఎల్)ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. ఈ తీర్పు ను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పేపర్ లీకేజీ లేదు, అక్రమాలు జరగలేదు: ఏజీ రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, మురళీధర్, మరికొందరు వాదనలు వినిపించారు. కమిషన్ తన సొంత నియమాల నుంచి తప్పుకుని పక్షపాతంగా వ్యవహరించినందున పరీక్షలో పారదర్శకత, సమగ్రత లోపించిందని సింగిల్ జడ్జి తేల్చడం సరికాదన్నారు. పరీక్షను కమిషన్ నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించిందని చెప్పారు. జవాబు పత్రాలు మళ్లీ దిద్దడం అనేది నిబంధనల మేరకు సాధ్యం కాదని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి రాజ్యాంగ సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై సింగిల్ జడ్జి తన తీర్పులో అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తీర్పును కొట్టివేయాలని, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి తీర్పు సరైందే..: రిట్ పిటిషనర్లు గతంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన ఎంపిక కాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు విద్యాసాగర్, రచనారెడ్డి, సురేందర్ వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారన్నారు. మొత్తం పరీక్షా ప్రక్రియలో విధానపరమైన అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు. హాల్ టికెట్ల నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం వరకు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. అందుకే మోడరేషన్ పద్ధతిని వర్తింపజేస్తూ మెయిన్స్ జవాబు పత్రాలు పునః మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించారన్నారు. ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి జోక్యం అవసరం లేదని అన్నారు. పలు ప్రశ్నలు సంధించిన సీజే.. వాదనల సందర్భంగా సీజే జస్టిస్ ఏకే సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. కొందరు అభ్యర్థులు మాత్రమే 10 నుంచి 12 గంటలు చదివారని ఎలా చెబుతారు?, పేపర్ లీకేజీ జరిగిందా.. అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆధారాలున్నాయా?, కొందరికి మేలు చేకూర్చేలా కమిషన్ వ్యవహరించిందనడానికి సాక్ష్యం ఉందా అని ప్రశ్నించగా.. ఏజీ లేదన్నారు. కేంద్రాల్లో ముందే పేపర్లు ఓపెన్ చేసినట్లు ఆరోపణలున్నాయా? ఎవరి పేపర్ దిద్దుతున్నామో మూల్యాంకనదారులకు తెలిసే అవకాశం ఉందా? అని అడగగా..లేదని ఏజీ బదులిచ్చారు. గ్రూప్–1 లాంటి కీలక పరీక్షలకు ఇంటర్వ్యూ ఉండదా అని అడగగా.. ప్రిలిమ్స్, మెయిన్స్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుందని చెప్పారు. దీంతో కీలకమైన పోస్టింగ్‌లకు అభ్యర్థులను ఎంపిక చేసే ముందు వారి బాడీ లాంగ్వేజ్ కూడా తెలియాలి కదా అని వ్యాఖ్యానించారు. సింగిల్ జడ్జి తీర్పులో పదాలపై అభ్యంతరంవిచారణ సందర్భంగా తీర్పులో సింగిల్ జడ్జి పేర్కొన్న పదాలపై సీజే ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాజనితాల ఆధారంగా ఘాటు పదాలను వాడుతూ తీర్పునిచ్చారని వ్యాఖ్యానించింది. పేపర్ లీకేజీ, అవినీతి, అక్రమాలకు ఎలాంటి ఆధారాలు లేనప్పుడు సింగిల్ జడ్జి ‘సమగ్రతకు భంగం’లాంటి సున్నితమైన పదాలు వినియోగించడం సరికాదని పేర్కొంది. హాల్‌టికెట్ పంపిణీ నుంచి ఫలితాల వెల్లడి వరకు ఎలాంటి విధానం పాటించాలనేది ఓ రాజ్యాంగ సంస్థకు చెప్పడం సమర్థనీయం కాదంది. పరీక్ష నిర్వహించే పద్ధతిపై పూర్తి అధికారం కమిషన్‌కు ఉంటుందని తేల్చిచెప్పింది. పారదర్శకత లేదు, సొంత నిబంధనల ఉల్లంఘన.. వంటి పదాలు సింగిల్ జడ్జి వినియోగించడం అభ్యంతరకరమని సీజే అన్నారు. పరీక్షల నిర్వహణకు కమిషన్‌కు పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. హాల్‌టికెట్లు ఎలా జారీ చేయాలి.. కేంద్రాలు ఎలా ఎంపిక చేయాలి..మూల్యాంకనదారులను ఎలా ఎంపిక చేయాలి.. వారు ఎలా దిద్దాలి.. మార్కులు ఎలా వెల్లడించాలి.. ఇదంతా న్యాయస్థానం.. కమిషన్‌కు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అది రాష్ట్రంలో కీలక పరీక్షలు నిర్వహించే రాజ్యాంగబద్ధ సంస్థ అన్నది మరవొద్దన్నారు. మహిళా కాలేజీలో మహిళలు మాత్రమే పరీక్ష రాస్తే తప్పేముందంటూ.. అంతమాత్రాన అక్రమాలు జరిగినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల 10లోగా రాతపూర్వకంగా వాదనలు అందజేయాలని ఇరుపక్షాల తరఫు న్యాయవాదులను ఆదేశించారు. -
గ్రూప్–1.. లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేసింది. వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. మొత్తం 563 ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 562 పోస్టులను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేసింది. ఒక పోస్టును మాత్రం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెండింగ్‌లో ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 18 పోస్టు కోడ్లకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ కార్యదర్శి ప్రియాంక ఆల బుధవారం అర్థరాత్రి విడుదల చేసిన వెబ్‌నోట్‌లో ప్రకటించారు. అభ్యర్థుల తుది జాబితాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఆధారంగా ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. గ్రూప్–1 తుది ఫలితాలు హైకోర్టు రిట్ అప్పీల్ నంబర్ 1066/2025, ఇతర పెండింగ్‌లో ఉన్న అన్ని రిట్ పిటిషన్లకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం, ధ్రువపత్రాల వివరాల ఆధారంగా ఎంపిక జరిగిందని, ఈ వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే తక్షణమే వారికి సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని, తెలంగాణ గెజిట్ నంబర్ 60: తేదీ. 28/12/2015లో పొందుపర్చిన టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో వివరించారు. గ్రూప్–1 టాపర్లు వీరేలక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, వంశీ కృష్ణారెడ్డి, జిన్న తేజస్విని, సిద్దాల కృతిక, హర్షవర్ధన్, కె.అనూష, ఏరండ్ల నిఖిత, కె.భవ్య, శ్రీకృష్ణ సాయి. వీరంతా డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఒకట్రెండు రోజుల్లో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. -
'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. పెంచిన ధరల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు మెమోని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇకపోతే ముందు రోజు అనగా 24న రాత్రి వేసే ప్రీమియర్‌కు తెలంగాణలో రూ.800 టికెట్ ధర(జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. విడుదల రోజు (ఈ నెల 25) నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది.'హరిహర వీరమల్లు' లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా.. ఇమ్రాన్ హష్మీ విలన్. తమన్ సంగీతమందించాడు. సుజీత్ దర్శకుడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. -
గ్రూప్ 1 తీర్పుపై హైకోర్టులో TGPSC కి భారీ ఊరట
-
గ్రూప్-1 ర్యాంకర్లకు గుడ్‌న్యూస్.. తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీకి (TGPSC) తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ర్యాంకులను రద్దు చేస్తూ.. మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలన్న సింగిల్ బెంచ్ తీర్పును బుధవారం డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది.గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరట ఇస్తూ నియామకాలు జరుపుకోవచ్చని.. అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెలకి వాయిదా వేసింది. గ్రూప్-1 మెయిన్స్(Group 1 Exam) ర్యాంకింగ్‌లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పు ఇచ్చింది. తిరిగి రీవాల్యూయేషన్ నిర్వహించాలని, కుదరకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ రిక్రూట్మెంట్ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా.. మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది.ఈ రిట్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్ధంగా అడ్వొకేట్ జనరల్ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1 నిర్వహణ రూల్స్‌లో.. రీవాల్యూయేషన్ అనేది లేదు. కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ తీర్పు సహేతుకం కాదు అని డివిజన్ బెంచ్(Telangana High Court Division Bench) దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ నియమకాలు జరుపుకోవచ్చని క్లియరెన్స్ ఇచ్చింది.ఇదీ చదవండి: కాళేశ్వరంతో నాకేం సంబంధం లేదు-స్మితా సబర్వాల్ -
హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్మాల్(Smita Sabharwal) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. స్మితా సబర్వాల్ నాడు సీఎం కేసీఆర్(Ex CM KCR) అదనపు కార్యదర్శి హోదాలో పని చేశారు. అయితే కాళేశ్వరం కమిషన్ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసిందని, చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. ‘కాళేశ్వరం నిర్మాణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను బాధ్యురాలిని కాను. అప్పటి ముఖ్యమంత్రికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చానని. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి హోదాలో 3 బరాజ్‌ల నిర్మాణ స్థలాలను కూడా సందర్శించానని కమిషన్ పేర్కొంది. బరాజ్‌ల నిర్మాణానికి పరిపాలనా అనుమతి, ఆమోదాల మంజూరులో నా పాత్ర ఉందని చెప్పింది. సంబంధిత ఫైళ్లను కేబినెట్ ఆమోదం కోసం ఉంచనందుకు, నిబంధనలను ఉల్లంఘించినందుకు నాపై తీవ్ర చర్యలకు సిఫార్సు చేశారు. కమిషన్ నాపై పక్షపాతంతో పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ నివేదికను రద్దు చేయాలి’అని స్మిత పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఒకట్రెండు రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh) ధర్మాసనం విచారణ చేపట్టనుంది.ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.. అప్పుడే! -
నాగారం భూములపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని గైరాన్ సర్కారీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించినా.. ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని జూన్‌లో తాము ఆదేశించినా.. ఇప్పటివరకు ఎందుకు సమర్పించలేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆలోగా నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది. నిర్మాణాలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో ధిక్కరణ పిటిషన్లో ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఇతరులకు నోటీసులు జారీ చేసింది.నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని గైరాన్ భూములను కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు, వారి బంధువులు అక్రమంగా కొనుగోలు చేశారని గతంలో బిర్లా మల్లేశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం, నిర్మాణాలు చేపట్టడం సహా ఎలాంటి మార్పులు చేయవద్దని ప్రతివాదులకు తేల్చిచెప్పడం తెలిసిందే. న్యాయస్థానం ఉత్తర్వులున్నా వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మల్లేశ్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. జూన్‌లో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు వారాల్లో పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు సమాధానమిస్తూ నివేదిక అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అయినా ఇప్పటివరకు కలెక్టర్ నివేదిక దాఖలు చేయలేదంటూ మహేశ్ మరో ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు.పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు రెండు వారాలు గడువు ఇచ్చి దాదాపు మూడు నెలలు కావస్తున్నా కలెక్టర్ ఇప్పటివరకు నివేదిక అందజేయలేదన్నారు. ఇది న్యాయస్థానం ఉత్తర్వుల ధిక్కరణే అవుతుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అక్టోబర్ 10లోగా నివేదిక దాఖలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తొలి ధిక్కరణ పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణ వాయిదా వేశారు. -
న్యాయవ్యవస్థలో వసతుల కల్పనకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన, కోర్టుల్లో సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లా కోర్టుల నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ సూచనలిస్తే స్వీకరిస్తామని చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్, జస్టిస్ ఏకే సింగ్ శనివారం భేటీ అయ్యారు.కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు అవసరమైన సిబ్బంది నియామకాలను త్వరితగతిన చేపట్టాలని జస్టిస్ ఏకే సింగ్ కోరారు. దీనిపై పలు ప్రతిపాదనలను సీఎం దృష్టికి తెచ్చారు. న్యాయవ్యవస్థ సూచనల మేరకు అవసరమైన వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలియజేశారు. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పదవీ విరమణా? రాజీనామానా?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి తన అఖిల భారత సర్వీస్‌కు పదవీ విరమణ చేశారా.. లేక రాజీనామా చేశారా.. అన్న వివరాలు లేకుండా పిటిషన్ దాఖలు చేస్తే ఎలా అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని మూడు వారాల్లో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2021, నవంబర్‌లో జరిగిన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా మాజీ ఐఏఎస్ వెంట్రామిరెడ్డి ఎన్నికైన విషయం విదితమే. ఈ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్‌తోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.‘2007 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి 2021, నవంబర్ 15 వరకు అధికారిగా కొనసాగారు. బీఆర్ఎస్లో చేరే ఉద్దేశంతో స్వచ్ఛంద పదవీవిరమణ నోటీసు సమరి్పంచారు. అయితే ఐఏఎస్ అధికారుల స్వచ్ఛంద పదవీ విరమణ నియమాల మేరకు నోటీసు ఇచ్చిన మూడు నెలల్లో డీవోపీటీ ఆమోదం తప్పనిసరి. కానీ, వెంకట్రామిరెడ్డి ఎటువంటి రాజీనామా చేయలేదని, పదవీ విరమణ పత్రాలు తమకు అందలేదని నిర్ధారించింది.ప్రభుత్వ అధికారిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 6(1) ప్రకారం పోటీకి అనర్హుడు. వెంటనే అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ.. ఎన్నిక రద్దు చేయాలి’అని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలు తెలుసుకొని అదనపు అఫిడవిట్ వేయాలని చెబుతూ విచారణ వాయిదా వేసింది. -
ఒకేసారి 404 కేసుల విచారణా?
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి 404 కేసులు ఎలా విచారణ చేస్తారని.. ఏఏ కేసులు విచారణ చేస్తున్నారో తెలియజేయాలి కదా అని సమాచార హక్కు కమిషన్ తీరును హైకోర్టు తప్పుబట్టింది. పజా సంబంధాల అధికారులు, మొదటి అప్పిలేట్ అధికారులు తగిన సమాచారం ఇవ్వకపోవడంతో శ్యామ్ అనే వ్యక్తి రాష్ట్ర సమాచార కమిషన్‌లో సెకండ్ అప్పీల్ దాఖలు చేశారు. ఇలా 404 కేసులు వేశారు. వీటిలో వాదనలు సమర్పించేందుకు రావాలంటూ శ్యామ్‌కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇన్ని కేసుల విచారణ ఒకే రోజు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అతను హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. కమిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 17 వేల కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కమిషన్ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే ఎక్కువ అప్పీళ్లు వేసిన పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఒకేసారి ఇన్ని కేసుల్లో పిటిషనర్ ఎలా వాదనలు వినిపిస్తారని ప్రశ్నించారు. నోటీసులను కొట్టివేస్తూ.. పూర్తి వివరాలతో మరోసారి జారీ చేయాలని కమిషన్‌ను ఆదేశించారు. -
సింగిల్ జడ్జి తీర్పు చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను మళ్లీ దిద్దాల్సిందేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ).. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. టీజీపీఎస్సీ తరఫున అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి (లీగల్) ఆర్.సుమతి బుధవారం అప్పీల్ దాఖలు చేశారు. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్ఎల్)ను రద్దు చేస్తూ ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు. తీర్పు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిట్ పిటిషన్ దాఖలు చేసిన గ్రూప్–1 అభ్యర్థులు 222 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ అప్పీల్‌పై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒకట్రెండు రోజుల్లో విచారణ చేపట్టనుంది. కేసు పూర్వాపరాలు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. మెయిన్స్ తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. అన్ని సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యం కాని పక్షంలో మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ వేసింది. ఊహలతో తీర్పు సమ్మతం కాదు..: ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్టబద్ధంగా లేవు. టీజీపీఎస్సీ సమర్పించిన వివరాలు, ఆధారాలను పరిగణనలోకి తీసు కోలేదు. మున్సిపల్ కమిటీ, హోషి యార్పూర్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఊహలు, నమ్మదగిన సాక్ష్యాలు లేనప్పుడు తీర్పు ఇవ్వడం సముచితం కాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం సూచన పరంగా చూస్తే ఈ తీర్పు ‘విపరీత ధోరణి’తో ఉంది. మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని చెబుతూనే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని చెప్పడం పరస్పర విరుద్ధం. కమిషన్ ఉద్యోగ నియమావళి ప్రకారం.. ఫలితాలిచ్చిన 15 రోజుల్లోగా మాత్రమే పునః మూల్యాంకనానికి వీలుంటుంది. మళ్లీ దిద్దాలనడం కూడా చెల్లదు. మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం ఉందని సింగిల్ జడ్జి పేర్కొనడం సబబు కాదు. గత ఏడాది అక్టోబర్ 27న స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు 18 మందితో కలిపి 21,093 మంది ఉన్నారని ప్రాథమిక సమాచారం ఇచ్చాం. తర్వాత తుది సమాచారం ఆధారంగా ఆ సంఖ్య 21,110 మందికి పెరిగింది. కోర్టు ఆదేశాల కారణంగా వీరిలో 25 మందిని పక్కకు పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆ సంఖ్య 21,085కు తగ్గినట్లు మార్చి 30న వెల్లడించాం. ఆంగ్లంలో 924 మంది అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో ఆ సంఖ్య 20,161కి తగ్గింది. ఈ వ్యత్యాసాన్ని శాస్త్రీయంగా వివరించినా సింగిల్ జడ్జి పట్టించుకోలేదు’అని టీజీపీఎస్సీ పేర్కొంది. వేర్వేరు హాల్‌టికెట్లు సమర్థనీయమే‘ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఇవ్వడం సమర్థనీయమే. అలా ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చాం. యూపీఎస్సీ విధానాన్ని అనుసరించాలని ఎక్కడా లేదు. పరీక్షా కేంద్రాల సంఖ్య 45 నుంచి 46కి పెరగడంపై పిటిషనర్ల ఆందోళనకు అర్థం లేదు. తొలుత 45 కేంద్రాలుగా నిర్ణయించినా క్షేత్రస్థాయిలో ఒక కేంద్రం ఎత్తైన చోట ఉంది. దీంతో 87 మంది దివ్యాంగుల సౌలభ్యం కోసం సర్దుబాటు చేసే క్రమంలో ఒక పరీక్షా కేంద్రం పెరిగింది’ అని కమిషన్ తెలిపింది. అనుభవమున్న వారినే ఎంపిక చేశాం: ‘ఫలితాల గణాంకాలను సింగిల్ జడ్జి తప్పుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఒకటోసారి, రెండోసారి మూల్యాంకనం చేశాక 15% కంటే ఎక్కవగా మార్కుల తేడా ఉంటే మూడోసారి మూల్యాంకనం చేసిన విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరి పేపరు మూల్యాంకనం చేస్తున్నామనేది దిద్దేవాళ్లెవరికీ తెలియదు. అనుభవమున్న, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో నిపుణులైన అధ్యాపకులనే మూల్యాంకనం కోసం ఎంపిక చేశాం. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరైనప్పుడు ఒకే తరహా మార్కులు పలువురికి రావడం సర్వసాధారణం. 719 మంది ఒకే రకమైన మార్కులు సాధించడంపై కమిషన్ ఇచ్చిన వివరణను న్యాయమూర్తి పట్టించుకోలేదు’అని టీజీపీఎస్సీ పేర్కొంది. -
‘గ్రూప్-1’పై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీజీపీఎస్సీ(TGPSC) బుధవారం ఆశ్రయించింది. ఇంతకు ముందు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. గ్రూప్ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని హైకోర్టు సింగిల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల్లో... టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను ఇచ్చింది. ఒకటి.. మెయిన్స్ జవాబు పత్రాలను ఎలాంటి అవకతవకలు లేకుండా రీవాల్యూయేషన్ చేయాలి. సంజయ్‌సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్(సాధారణ పద్ధతి)గా మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి. ఆ రీవాల్యూయేషన్‌లోనూ పొరపాట్లు జరిగితే పరీక్ష నిర్వహణకు కోర్టే ఆదేశిస్తుంది. రెండోది.. 2024 అక్టోబరు 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్‌ను రద్దు చేసి, పరీక్షలను తిరిగి నిర్వహించాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రక్రియను ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలి అని హైకోర్టు స్పష్టంచేసింది. మరోవైపు ఈ తీర్పుపై గ్రూప్-1 ర్యాంకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో తదుపరి ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలీదు: గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తమపై జరుగుతున్న అసత్య ప్రచారం.. సంచలన ఆరోపణలపై తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్లు, వాళ్ల తల్లిదండ్రులు స్పందించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. రీవాల్యూయేషన్ పేరిట హైకోర్టు వీళ్ల ఆశలపై నీళ్లు చల్లని సంగతి తెలిసిందే. అదే సమయంలో రాజకీయంగానూ వీళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సుమారు 200 మంది అభ్యర్థులు, వాళ్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.టీఎస్పీఎస్సీ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియలో అవకతవకలు, పేపర్ మూల్యాంకనంలో అక్రమాలు, రాజకీయ జోక్యం ఉన్నాయని ఆరోపణలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగానికి రూ.3 కోట్ల చొప్పున రూ.1700 కోట్ల కుంభకోణం జరిగిందనే ప్రభుత్వం, రిక్రూట్మెంట్ బోర్డుపైనా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. మరోవైపు.. మెయిన్స్ పరీక్షల వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయని, కొందరికి అసాధారణ ర్యాంకులు వచ్చాయని.. ఆఖరికి పరీక్ష రాయనివారికి కూడా ఫలితాలు ఇచ్చారని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ర్యాంకులు రద్దుచేస్తూ రీవాల్యూయేషన్ జరపాలని ఆదేశించింది.అయితే అప్పులు చేసి తమ పిల్లల్ని చదివించుకున్నామని.. అలాంటిది రూ.3 కోట్లు లంచాలు ఇచ్చి ఉద్యోగులు కొన్నామనే ప్రచారం తగదని తల్లిదండ్రులు వాపోయారు. రూ.3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తమలో కొందరికి తెలియదని అన్నారు ‘‘పస్తులుండి.. అప్పులు చేసి చదివించాం.. కష్టపడి మా పిల్లలు ఉద్యోగాలు సంపాదించారు. పేద విద్యార్థులే కష్టపడి గ్రూప్ 1ల్లో మెరిట్ ర్యాంకులు సాధించారు. రూ.3 కోట్లు చెల్లించి ఉద్యోగాలు కొనుగోలు చేశామనే ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం ఎంతగానో బాధిస్తోంది. అంత డబ్బే ఉంటే వేరే వ్యాపారాలు చేసుకునేవాళ్లం. నిరుద్యోగులు పెళ్లిళ్లు చేసుకోకుండా.. కొన్ని ఏళ్ల నుంచి చదువుకున్నారు. యూపీఎస్సీ పరీక్షల కోసం కాకుండా ఈ పరీక్ష కోసమే ప్రిపేర్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు అసత్య ఆరోపణలు మనోవేదనకు గురి చేస్తున్నాయి. రాజకీయాలు పార్టీల మధ్య ఉండాలి కానీ నిరుద్యోగులపై చూపించొద్దు. ఎన్నికల్లో ఓడితే మళ్లీ ఎన్నికలు పెట్టమని కోర్టులకెళ్తారా?. ఆరోపణలు చేస్తున్నవాళ్లు వాటిని నిరూపించాలి. వాటిపై ఎలాంటి విచారణకైనా మేం సిద్ధం. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. గ్రూప్-1ను ఇంకెంత కాలం నిర్వహిస్తారో రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టత ఇవ్వాలి. మా పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఎలాగైనా మాకు న్యాయం చేయాలి.’’ అని ర్యాంకర్ల తల్లిదండ్రులు పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. ‘‘ఉద్యోగ భర్తీ మీద రాజకీయాలు ఎందుకు?’’, ‘‘మూడు కోట్లు ఎక్కడ?’’ అంటూ పలు ఫ్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన తెలియజేశారు.xహైకోర్టులో ఏం జరిగింది?మెయిన్స్ వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయన్న వాదనలతో హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏకీభవించింది. ర్యాంకులను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పేపర్లను తిరిగి రీవాల్యూయేషన్ చేయాలని, ఈసారి అవకతవకలు లేకుండా చూడాలని, మళ్లీ అవకతవకలు జరిగినట్లు తేలితే ఊరుకోబోమని.. మళ్లీ పరీక్షకు తామే ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 8 నెలల్లోగా రీవాల్యూయేషన్ ప్రకక్రియ పూర్తి చేయాలని, అలాకాని పక్షంలో మళ్లీ పరీక్ష నిర్వహించే దిశగా ఆలోచనలు చేయాలని సూచించింది. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 30న ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచింది. కొందరు అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం విధానాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దాఖలైన మొత్తం 12 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదప్రతివాదనలు, పత్రాల పరిశీలన, విశ్లేషణ అనంతరం మంగళవారం 222 పేజీల సంచలన తీర్పును వెలువరించింది. అయితే.. కష్టపడి చదివిన తమ శ్రమ వృధా అవుతుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు ర్యాంకర్లు హైకోర్టు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. -
భూమి ఇస్తారా.. కోర్టుకు వస్తారా ?
సాక్షి, హైదరాబాద్: పీపుల్స్‌వార్ గ్రూప్ మాజీ దళసభ్యుడు నాగవెళ్లి మోహన్ భార్య అరుణకు భూమి ఇస్తారా.. లేదా వ్యక్తిగతంగా మా ముందు హాజరై వివరణ ఇస్తారా అని మెదక్ జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై తీవ్రంగా పరిగణించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తూ.. ఆలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే తమ ముందు హాజరు కావాలని కలెక్టర్‌ను ఆదేశించింది. 16ఏళ్లుఅండర్‌గ్రౌండ్‌లో ఉండి, పీపుల్స్‌వార్ దళ కమాండర్ హోదాకు ఎదిగిన మోహన్‌కు.. 5 ఎకరాల కేటాయింపుతో సహా పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 1989లో లొంగిపోయాడు. ఇదే క్రమంలో లొంగిపోయిన తీవ్రవాదుల ఉపశమనం కోసం 1993లో ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించింది. నిఘా విభాగం మెదక్ జిల్లాలో అతనికి భూమి కేటాయించాలని 1999లో సిఫారసు చేయగా, జిల్లా స్థాయి కమిటీ కూడా ఆమోదించింది. సదాశివపేటలో కొంత భూమిని కేటాయింపు కోసం గుర్తించారు. ఈలోపే పోలీసులకు సహకరిస్తున్నారని మోహన్‌ను నక్సలైట్లు చంపేశారు. తర్వాత ఆ భూమిని అతని భార్య నాగవెల్లి అరుణకు కేటాయించాలని 2004లో కలెక్టర్ సిఫారసు చేశారు. ప్రజ్ఞాపూర్‌లో ఎకరం స్థలం కేటాయించారు. ఇది పట్టా భూమి అని కొందరు కోర్టుకు వెళ్లడంతో రద్దు చేశారు. దీంతో అరుణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు. పోలీసులకు సహకరించినందుకే హత్య.. పిటిషనర్ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. 1989లో మోహన్ లొంగిపోగా, ఇప్పటివరకు భూమి కేటాయించకపోవడం సరికాదన్నారు. అరుణ దినసరి కూలీ అని, మానసిక వికలాంగుడైన కొడుకు కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. పోలీసులకు సహకరించినందుకే ఆమె భర్తను హత్య చేశారని గుర్తు చేశారు. వెంటనే అరుణకు భూమి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రెండు వారాలు సమయం ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేస్తామని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇదే చివరి అవకాశమని చెబుతూ, విచారణ వాయిదా వేశారు. -
అంగట్లో గ్రూప్ –1 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులు గ్రూప్–1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో మంత్రులు, సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్–1 పరీక్షను అక్రమాలకు తావులేకుండా తాజా నోటిఫికేషన్ వేసి మళ్లీ నిర్వహించాలన్నారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో పాటు ఆ పార్టీ నేతల కాసుల కక్కుర్తి వల్లే గ్రూప్–1 పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానాలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలని కేటీఆర్ సూచించారు. కేటీఆర్‌కు ‘గ్రీన్ లీడర్షిప్’అవార్డు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికిగాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సెపె్టంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటంమాజీ మంత్రి హరీశ్రావుసాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలను సక్రమంగా నిర్వహించలేక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. డైవర్షన్ రాజకీయాలతో గ్రూప్–1 పరీక్షలో అవినీతి, అవకతవకలను కప్పిపుచ్చాలనే ప్రభుత్వ ఆటలు సాగవు. గ్రూప్–1 పరీక్షలో జరిగిన అక్రమాలపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను నీరుగార్చి, వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆయన విమర్శించారు. గ్రూప్–1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి బీఆర్ఎస్వీ నేతల డిమాండ్ చిక్కడపల్లి (హైదరాబాద్): గ్రూప్–1 పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు. గురువారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం ముందు గ్రూప్–1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులతో కలసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న వారిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టుచేసి అబిడ్స్, ముషీరాబాద్ పోలీసుస్టేషన్లకు తరలించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు పేపర్ వాల్యుయేషన్‌లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేయాలని, తప్పుచేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుంగబాలు మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందున, నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
గ్రూప్1 అర్హుల గుండె చెదిరింది!
సాక్షి, హైదరాబాద్/చిక్కడపల్లి: రాష్ట్ర ప్రభుత్వశాఖ ల్లో గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఆనందం ఆవిరైంది. తుది జాబితాలో అర్హత సాధించి ధ్రువపత్రాల పరిశీలన సైతం పూర్తి చేసుకుని నియామక పత్రాలు తీసుకోవల్సిన సమయంలో.. అర్హుల జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వారికి శరాఘాతంలా తగిలింది. మెయిన్స్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించడంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. రీవాల్యుయేషన్ తర్వాత తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. రీవాల్యూయేషన్‌కు హైకోర్టు 8 నెలల గడువు ఇవ్వడంతో కింకర్తవ్యం ఏమిటనే దానిపై టీజీపీఎస్సీ ఆలోచనలో పడింది. ఇలావుండగా..పరీక్షలు బాగా రాసినప్పటికీ ఆశించినవిధంగా ఫలితాలు రాలేదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థులు మాత్రం హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. ఎన్నెన్నో అడ్డంకులు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 2022 ఏప్రిల్ 26న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం గ్రూప్–1 నియామకాల ప్రక్రియలో ఉన్న ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఆశావహులు అప్పటివరకు తాము చేస్తున్న చిన్నపాటి ఉద్యోగాలకు రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. మరికొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. 2022 అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. అదే ఏడాది చివర్లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. » 2023 ఆగస్టులో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అభ్యర్థులు కఠోర దీక్షతో సన్నద్ధతకు ఉపక్రమించారు. ఇంతలో టీజీపీఎస్సీలో పలు అర్హత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. ఇందులో భాగంగా గ్రూప్–1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని విచారణలో తేలడంతో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. » 2023 జూన్ 11న టీజీపీఎస్సీ మరోమారు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. అయితే ఈ పరీక్షల నిర్వహణ తీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారిస్తూ పరీక్షను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. » టీజీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం, కొ త్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, టీజీపీఎస్సీ ప్రక్షాళన, కొత్త కమిషన్ ఏర్పాటు, కొత్తగా మ రో 60 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీలను గుర్తింపు చ కచకా జరిగిపోయాయి. 2022 ఏప్రిల్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీజీపీఎస్సీ.. 2024 ఫిబ్రవరిలో 563 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. » 2024 జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను జూలై 7న టీజీపీఎస్సీ విడుదల చేసింది. 31,383 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరితో పాటు మరో 20 మందిని కోర్టు ఉత్తర్వుల ద్వారా అనుమతించారు. » అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 31,403 మంది అభ్యర్థుల్లో 21093 మంది మాత్రమే అన్ని పరీక్షలూ రాశారు. 2025 మార్చి 10వ తేదీన అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 30వ తేదీన జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసింది. » ఏప్రిల్ 10వ తేదీన 563 గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా చేపట్టింది. అయితే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వివిధ కేటగిరీలకు చెందిన పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నియామకాలకు బ్రేక్ పడింది. రీవాల్యుయేషనా? మళ్లీ పరీక్షలా? తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంపికైన అభ్యర్థులతో పాటు నిరుద్యోగ వర్గాల్లో చర్చోపచర్చలకు తెర లేపింది. మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం మళ్లీ జరుపుతారా? లేక తిరిగి పరీక్షలు నిర్వహిస్తారా? అనే చర్చ జరుగుతోంది. అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నియామక పత్రాలు అందుకోవాల్సి ఉండగా.. రీవాల్యుయేషన్ లేదా మళ్లీ పరీక్షలంటూ తీర్పు రావడంతో మూడున్నరేళ్లు పడిన శ్రమను తలచుకుంటూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాగా హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివిన అభ్యర్ధులు హైకోర్టు తీర్పుతో ఆందోళనకు గురవుతుంటే.. మెయిన్స్‌లో విఫలమైన కొంతమంది న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నారు. మంగళవారం అశోక్‌నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, పలు శిక్షణా కేంద్రాల్లో హైకోర్టు తీర్పు చర్చనీయాంశం అయ్యింది. ఆర్థికంగా పెను భారం కోచింగ్‌లు, మెటీరియల్, తదితర ఖర్చులు ఇప్పటికే తడిసి మోపెడయ్యాయి.మరోసారి పరీక్షలు రాయవలసి వస్తే మాత్రం ప్రతి పేద అభ్యర్థిపై పెను భారం పడుతుంది. – వై.క్రాంతికుమార్, గ్రూప్–1 అభ్యర్థి మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిందే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రభు త్వం మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు గతంలో ఎంతో నష్టం జరిగింది. మరోసారి పరీక్షలు నిర్వహించడం వల్ల వీరికి న్యాయం జరిగే అవకాశం ఉంది. – సలీమ్, గ్రూప్–1 అభ్యర్థికోచింగ్ కేంద్రాల దోపిడీకి మళ్లీ అవకాశం కోచింగ్ సెంటర్లు మరోసారి దోపిడీకి పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అశోక్‌నగర్ కోచింగ్ కేంద్రాల మాఫియాకు అడ్డాగా మారింది. హాస్టళ్లు, మెస్‌లు, స్టడీ హాళ్లు, కోచింగ్ కేంద్రాలు అభ్యర్థులను పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. – బి.చంద్రకాంత్, రాష్ట్ర సహ కనీ్వనర్, లా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా -
‘గ్రూప్-1’ తీర్పు.. రేవంత్‌కో గుణపాఠం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పిళ్లు, మళ్ళీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా మళ్లీ తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న కేటీఆర్.. ఇన్ని రోజుల పాటు గ్రూప్-1 అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణిచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.హైకోర్టు తీర్పు.. రేవంత్ సర్కార్ సమాధానం ఏంటి?: హరీష్హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలపై ఆయన మండిపడ్డారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఈ కోర్టు తీర్పుకు చెప్పే సమాధానం ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ మీ నిరక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు’’ అంటూ రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు మండిపడ్డారు.గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు..పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న…— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2025 -
తెలంగాణలో గ్రూప్-1 పోస్టింగ్ లకు బ్రేక్
-
‘ఇదే రిపీట్ అయితే మళ్లీ పరీక్షకు ఆదేశిస్తాం..’ గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను రద్దు చేస్తూ.. మెయిన్స్ పరీక్షల రీవాల్యూయేషన్‌కు ఆదేశించింది. ఒకవేళ రీవాల్యూయేషన్ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు చుక్కెదురైనట్లయ్యింది. గ్రూప్-1 వాల్యూయేషన్‌లో(మూల్యాంకనం) అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు, అలాగే ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని ఒక్కటిగా విచారించిన హైకోర్టు.. జులై 7న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో.. ‘‘సంజయ్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఇచ్చిన తీర్పులోని మాన్యువల్ ప్రకారం రీవాల్యూయేషన్ జరగాలి. అవకతవకలకు తావు లేకుండా వాల్యుయేషన్ చేయాలి. ఆ తర్వాతే 563 మందిని ఎంపిక చేసి పోస్టింగులు ఇవ్వాలి. మరోసారి అవకతకవలు జరిగితే మళ్లీ పరీక్షలకు ఆదేశిస్తాం’’ అని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు వెల్లడించారుఇప్పటికే గ్రూప్-1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈలోపు.. రీవాల్యూయేషన్‌కు ఆదేశిస్తూ రిక్రూట్మెంట్ బోర్డు(TGPSC)ను హైకోర్టు ఆదేశించింది. రీవాల్యూయేషన్ జరిపించిన తర్వాతే వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.తీర్పుపై సవాల్గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల రీవాల్యూయేషన్‌కు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ ఇవాళ ఇచ్చిన తీర్పును సవాల్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. నిరాశలో ఉన్న అభ్యర్థులు సైతం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించే యోచనలో ఉన్నారు.కిందటి ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన 563 పోస్టులకు టీజీపీఎస్సీ తరఫున నోటిఫికేషన్ వెలువడింది. మే/జూన్‌లో ప్రిలిమ్స్, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో మెయిన్స్ ఫలితాలు, ఏప్రిల్‌లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా పూర్తైంది. పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ పోస్టింగులకు బ్రేకులు వేసింది. -
‘గ్రూప్–1’ తీర్పు నేడు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో హై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. రెండు నెలలుగా లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న విషయం విదితమే. 2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. లక్షలాది మంది భవిష్యత్‌కు సంబంధించిన అంశం కావడంతో మూడు నెలలపాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు నమోదు చేసుకుంది. అందరి వాదనలు ముగిసిన తర్వాత జూలై 7న తీర్పు రిజర్వు చేసింది. నేడు తీర్పు వెల్లడించేందుకు పిటిషన్లను లిస్ట్ చేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నారు. -
ప్రసూతి సెలవులు ‘ఇద్దరి’కే పరిమితమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలకు ప్రసూతి సెలవులు ఇద్దరు బిడ్డలకే పరిమితమా.. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకుని తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుపై ఉన్న పరిమితిని సవాలుచేస్తూ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ రాజీవ్‌గాంధీ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.శ్వేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2010, మే 4 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 152ను సవాల్ చేశారు. ఈ జీవో ప్రకారం 180 రోజుల చొప్పున ప్రసూతి సెలవులకు అనుమతి ఉంటుందని.. అయితే ఇద్దరు పిల్లలకే పరిమితమని పేర్కొన్నారు. పరిమితిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున జీపీ ఎస్.సుమన్ విచారణకు హాజరై.. ప్రభుత్వం నుంచి సూచనలు పొందేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ వాయిదా వేసింది. -
విమాన ఇంధనాన్ని కల్తీ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌లో కల్తీకి పాల్పడితే వాహనాలు రోడ్డుపై ఆగిపోతాయని, విమాన ఇంధనం కల్తీ చేస్తే ఎక్కడ ఆగాలని పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ కారణంగా విమానం కూలి మనుషుల ప్రాణాలుపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. కనీస మానవత్వం అంటూ లేకుండా అక్రమాలకు పాల్పడితే ఎలా ఉపేక్షించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాంట్రాక్టు పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఎంత మాత్రం ఆమోదించబోమని.. కొట్టివేసింది. ట్యాంకర్లలో ఇంధనాన్ని కల్తీ చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కాంట్రాక్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కాంట్రాక్టర్ గురునాథం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం విచారణ చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్లో ఏదో శబ్దం వస్తుండటంతో నిలిపి పైకెక్కి చూశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని కొందరు వీడియోలు తీసి కల్తీ అంటూ సోషల్ మీడియాలో పెట్టారన్నారు. కల్తీపై విచారణ జరపకుండానే కాంట్రాక్టు రద్దు చేయడం సరికాదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విమాన ఇంధనంలో కల్తీకి పాల్పడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో సంపాదించే డబ్బు తప్ప ప్రజల ప్రాణాలు కనిపించవా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు రద్దు చేయడంలో జోక్యం చేసుకోబోమంటూ.. పిటిషనర్‌కు రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. -
కాళేశ్వరం సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్పల్ప ఊరట లభించింది. కాళేశ్వరం సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా.. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్‌రావు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సుందరం, శేషాద్రిలు తమ విజ్ఞప్తిని కోర్టుకు తెలియజేశారు. అయితే.. ఈ కేసును సీబీఐకి ఇవ్వనున్నట్లు అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ‘‘కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఆధారంగా సీబీఐకి సిఫార్సు చేశాం. మొత్తం దర్యాప్తు చేయాలని సీఐబీని కోరాం కమిషన్‌తో సంబంధం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ’’ అని ఏజీ అన్నారు. ఈ క్రమంలో సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను కోర్టుకు అందజేశారాయన.దీంతో కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే దసరా వెకేషన్ తర్వాత ఈ పిటిషన్లపై వాదనలు వింటామని పేర్కొంటూ.. అప్పటిదాకా ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఏజీకి స్పష్టం చేసింది. ఈ పిటిషన్ల తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం ఓ లేఖ రాసింది. కాళేశ్వరంతో పాటు అంతరాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రేమయంపైనా విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని సైతం లేఖలో వెల్లడించింది. ఇంకా ఆ లేఖలో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని.. ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని తెలిపింది. ఎన్డీఎస్ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు రాష్ట్రానికి సీబీఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది. సీబీఐ విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈలోపు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తునకు బ్రేకులు పడ్డట్లయ్యింది. -
హరీష్‌రావు పిటిషన్.. ప్రభుత్వాన్ని ఆదేశించలేమన్న హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను హరీష్‌రావు దాఖలు చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు.. లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరంపై రేపు హైకోర్టులో విచారణ చేపడతామని ధర్మాసనం చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. -
సాదా బైనామాకు లైన్‌క్లియర్..
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాలకు ఎట్టకేలకు లైన్‌క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసి క్రమబద్ధీకరణకు అనుమతిచ్చింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 2020, అక్టోబర్ 12న జారీ చేసిన జీఓ నంబర్ 112ను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా లింబా కె.కుంటాలకు చెందిన షిండే దేవిదాస్ హైకోర్టులో అదే ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని ప్రభుత్వాన్ని 2020లోనే ఆదేశించింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ చేయడాన్ని తప్పుబట్టింది. కొత్త చట్టం రాక ముందు (2020, అక్టోబర్ 29) వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయని, ఆ తర్వాత 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం కోర్టుకు తెలపగా, గడువుకు ముందు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం కూడా తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం.. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం విధించిన గడువులోగా 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ భూ భారతి (భూమిపై హక్కుల రికార్డు) చట్టం 2025 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పిల్ చెల్లదని వాదించారు. ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014, జూన్ 2 ముందు 12 ఏళ్లపాటు భూమి తమ అ«దీనంలో ఉన్నట్లు చూపిన సన్నకారు రైతులకు క్రమబద్దీకరణకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. 2020, అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్ బుక్స్ చట్టం–1971 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్దీకరించుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చినందున 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. స్టే ఎత్తివేస్తే 6,74,201 దరఖాస్తుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభిస్తుందని విన్నవించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పాత చట్టానికి బదులుగా కొత్త చట్టంలోని నిబంధనను సవాల్ చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేశామని, వాదనలకు అనుమతించాలని కోరారు. ఈ విజ్ఞప్తిని సీజే తోసిపుచ్చారు. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేసుకోవాలని, అలాగే పలుమార్లు వాయిదా కోరడం సరికాదని సూచించారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా పాత దరఖాస్తులనే అనుమతిస్తున్నారని, కొత్త వాటిని స్వీకరించడం లేదని.. ఇది వివక్షేనని ప్రభాకర్ పేర్కొన్నారు. దీనికి అంగీకరించని సీజే.. కొత్త చట్టంతో సన్న, చిన్నకారు రైతులు సాదా బైనామాలను క్రమబదీ్ధకరించుకనే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 2020లో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. -
అటూ ఇటుగా.. ఆరు నెలలు
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామాల క్రమబద్ధికరణ విషయంలో హైకోర్టులో ఉన్న అడ్డంకి తొలగిపోవడంతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఊరట లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 9.26 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, దాదాపు 10 లక్షల ఎకరాల భూమి ఈ దరఖాస్తుల పరిధిలో ఉంటుందని, ఈ మేరకు ఆ భూములన్నింటికీ త్వరలోనే విముక్తి లభిస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.అయితే, ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి అటూఇటుగా ఆరునెలల సమయం పట్టే అవకాశముంది. భూభారతి పేరుతో రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టం ప్రకారం ఈ దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. రెవెన్యూ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే...! ⇒ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా సాదాబైనామాల ద్వారా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి తొలుత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ⇒ ఈ నోటిఫికేషన్ మేరకు పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల దరఖాస్తుదారులకు, సాదాబైనామాల ద్వారా ఆ భూమిని అమ్మిన వారికి ఆర్డీవో నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసుల జారీకి కనీసం నెలరోజుల సమయం పడుతుందని అంచనా. ⇒ ఈ నోటీసుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. ఆ భూమికి సంబంధించి తెల్ల కాగితంపై రాసుకున్న సాదాబైనామా లావాదేవీ సరైందా లేదా అన్నది పరిశీలించడంతోపాటు చుట్టుపక్కల ఉన్న రైతుల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ⇒ అప్పుడు సదరు భూమిని అమ్మింది, కొన్నది వాస్తవమే అని తేలితే ప్రత్యేక ఆర్డర్ ఇచ్చి రిజి్రస్టేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ కట్టి క్రమబద్ధికరించుకునే అవకాశం కల్పిస్తారు. ⇒ అలా స్టాంపు డ్యూటీ కట్టిన తర్వాత ఓ సర్టీఫికెట్ ఇస్తారు. ఈ సరి్టఫికెట్‌ను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. ⇒ దీని ఆధారంగా ఆ భూమికి పాసు పుస్తకాలు వస్తాయి. ఈ సరి్టఫికెట్ ద్వారానే క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతాయి. ⇒ గతంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఉచితంగా చేసేవారు. కానీ, భూభారతి చట్టంలో మార్చిన నిబంధన ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. ⇒ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2020లో దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. ⇒ రాష్ట్రంలో ఇప్పటివరకు 13సార్లు సాదాబైనామాలను క్రమబద్ధికరించారు. 2020లో 14వ సారి జారీ చేసిన సాదాబైనామా ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ప్రక్రియకు మోక్షం కలగనుంది. ⇒ దీని తర్వాత సాదాబైనామాల క్రమబద్ధికరణకు ఆస్కారం ఉండదు. ఈ మేరకు భూభారతి చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించిన తర్వాత మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులను తీసుకునే వీల్లేదని పేర్కొన్నారు. మళ్లీ సాదాబైనామాల క్రమబద్ధికరణ చేపట్టాలనుకుంటే ఆ చట్టాన్ని సవరిస్తే కానీ సాధ్యం కాదు. కోర్టు నిర్ణయం సంతోషకరంతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ సమావేశాల్లో కూడా ఈ సాదాబైనామాలపై చాలాసార్లు చర్చించాం. అయితే, గతంలో అమల్లో ఉన్న ధరణి చట్టంలో సాదాబైనామాల పరిష్కార నిబంధనను పొందుపర్చలేదు. దీంతోనే కోర్టు కొట్టివేసింది. కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంలో ఆ నిబంధన పెట్టాం. ఇప్పుడు ఇదే నిబంధన ఆధారంగా కోర్టు సానుకూల తీర్పునిచ్చింది. ఇప్పటికైనా దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైనందుకు సంతోషంగా ఉంది. – భూమి సునీల్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు -
వాట్సాప్ సందేశాలతో‘అట్రాసిటీ’ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా ప్రైవేట్‌గా పంపిన సందేశాలతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. అవమానించే ఉద్దేశంతో అందరి ముందు కులం పేరుతో దూషించనప్పుడు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టడం కుదరదంటూ పిటిషనర్లపై కేసును కొట్టివేసింది. ఆ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్), సెక్షన్ 3(1)(ఎస్) ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అవమానించడమే లక్ష్యంగా అందరి ఎదుట దూషిస్తేనే దాన్ని బహిరంగంగా జరిగిన ఘటనగా భావించాలని చెప్పింది. క్రాంతికిరణ్ (ఎస్సీ), నిరుపమా దాడి (కాపు) క్లాస్మేట్స్. వేర్వేరు కులాలకు చెందినవారు. వీరు 2014లో వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో వారు విడిపోయారు. ఈ క్రమంలో నిరుపమ, ఆమె కుటుంబ సభ్యులు తనను కులం పేరుతో దూషించారని, తన దుస్తులను తగలబెట్టారని, తర్వాత విడాకులు కోరుతూ సందేశాలు, ఈ మెయిల్ ద్వారా బెదిరించారని క్రాంతి ఫిర్యాదు చేశారు. దీంతో నిరుపమ, ఆమె తండ్రి అనుపమ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజల మధ్య దూషణలు జరగలేదని, ఇది కేవలం వారి కుటుంబ వివాదం మాత్రమేనని వాదించారు. ఇంకా సాక్షులను విచారించాల్సి ఉన్నందున ఎఫ్ఐఆర్ను కొట్టివేయొద్దని క్రాంతి తరఫు న్యాయవాది, ఏపీపీ కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కుల దూషణ బహిరంగంగా జరిగినట్లు బయటి వ్యక్తులెవరూ వెల్లడించలేదని, ఇది వారి కుటుంబ వివాదం మాత్రమేనని స్పష్టంచేశారు. విచారణ కొనసాగించడం చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. పిటిషనర్లపై నమోదైన అట్రాసిటీ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. -
సమాజం సిగ్గుతో తలదించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: పుట్టిన రోజునే తండ్రికి కొడుకు తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి చోటుచేసుకున్నందుకు సమాజం సిగ్గుతో తలదించుకోవాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులతో కేక్ కట్ చేయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు కన్నీటిపర్యంతం కావడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలుడి హృదయం పగిలిపోయిందని.. దీనికి బాధ్యులెవరో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాల్సిందేనని అభిప్రాయపడింది. వైర్లతో విద్యుత్ స్తంభాలు, మామూళ్లతో కొందరి జేబులు బరువెక్కి కిందకు వంగుతున్నాయని చురకలంటించింది. అనుమతి లేని కేబుళ్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది.అనుమతి ఉన్నా ప్రమాదకరంగా ఉంటే వాటిని కూడా తీసేయాలని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో శ్రీకృష్ణుడి శోభాయాత్ర సందర్భంగా భక్తులు లాగుతున్న రథానికి విద్యుదాఘాతం జరిగి ఐదుగురు మృతి చెందడం, పాతబస్తీలో మరో నలుగురు మృతిచెందిన నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్ల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం తెలిసిందే. దీన్ని సవాల్‌చేస్తూ భారతీ ఎయిర్టెల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. కరెన్సీ నోట్లు మాత్రం కనిపిస్తాయ్.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ అనుమతులు తీసుకున్నాకే స్తంభాల ద్వారా కేబుళ్లు తీసుకున్నామని.. ప్రభుత్వం నోటీసు జారీ చేయకుండా నగరమంతా కేబుళ్లను కట్ చేయడం సరికాదన్నారు. టీజీఎస్పీడీసీఎల్ తరఫున శ్రీధర్‌రెడ్డి వాదిస్తూ నగరంలో దాదాపు 20 లక్షలకుపైగా స్తంభాలుంటే 1.70 లక్షల స్తంభాలపైనే కేబుళ్ల ఏర్పాటుకు అనుమతులున్నాయన్నారు.పరిమితికి మించి కేబుళ్ల వల్ల స్తంభాలు వంగిపోతున్నాయన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మామూళ్లతో కొందరి జేబులు కూడా బరువెక్కి వంగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అనుమతులున్న కేబుల్ ఏజన్సీలు అనధికారిక కేబుళ్ల తొలగింపు విషయంలో విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆదేశించారు.స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున ఏవి అనుమతులున్నవో ఏవి లేనివో గుర్తుపట్టడం కష్టంగా ఉందన్న వాదనను తోసిపుచ్చారు. అనుమతులు తీసుకోని సంస్థలు ఇచ్చిన కరెన్సీ నోట్లు మాత్రం అక్రమార్కులకు బాగా కనిపిస్తాయని చురకంటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆరు కుటుంబాలు అనుభవిస్తున్న వేదనకు సమష్టి బాధ్యత వహించాలన్నారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
చర్చించాకే చర్యలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో కమిషన్ నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని మంత్రిమండలి నిర్ణయించినప్పుడు.. అంతకుముందే మీడియాకు వివరాలు వెల్లడించడాన్ని తప్పుబట్టింది.పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లు ఒకవేళ నివేదికను అధికారిక వెబ్సైట్ లో పెడితే వెంటనే తీసివేయాలని ఆదేశించింది. కమిషన్ 8బీ, 8సీ కింద నోటీసులు జారీ చేయకుండా పిటిషనర్లను నిందితులుగా చూపడం సరికాదని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తదుపరి వారంలోగా సమాధాన కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, కమిషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా భేటీ వెనుక దురుద్దేశం ఉందన్న పిటిషనర్లు ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై 2024, మార్చి 14న విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 6 జారీ చేసింది. పిటిషనర్లు సహా పలువుర్ని కమిషన్ విచారించింది. ఈ ఏడాది జూలై 31న సర్కార్‌కు నివేదిక సమర్పించింది. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం తమ నోటీసులు జారీ చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. నివేదికలోని అంశాలు తమ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఈ నెల 4న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడంతో తమ పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు.నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం మీడియాకు వివరాలు వెల్లడించిందని తెలిపారు. ఈ మేరకు సెక్షన్ 8బీ, 8సీకి సంబంధించి కిరణ్ బేడీ వరెŠస్స్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ, స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ ఎల్‌కె అద్వానీ తీర్పు కాపీలను కూడా అందజేశారు. నివేదిక కాపీని తమకు అందించకుండా పదే పదే వివరాలు వెల్లడించడం ఏకపక్షం, చట్టవిరుద్ధమని.. దీని వెనుక దురుద్దేశం ఉందని.. సహజ న్యాయ సూత్రాలను సర్కార్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. జీవో 6ను రద్దు చేయాలని, కమిషన్ నివేదిక పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేదిగా ఉందని ప్రకటించాలని కోరారు..’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అసెంబ్లీలో చర్చకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న ఏజీ ‘కమిషన్ సమర్పించిన నివేదికను అధ్యయనం చేయడానికి, పరిశీలనాంశాలను మంత్రిమండలికి సమర్పించడానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని ఏజీ తెలిపారు. తమ నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు మంత్రిమండలి పరిశీలనకు సమర్పించిందని చెప్పారు.కాగా కమిషన్ నివేదికను ఆమోదించాలని, చర్చ కోసం అసెంబ్లీ ముందుంచాలని ఈ నెల 4న కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. అయితే అసెంబ్లీలో చర్చకు ముందే ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని గురువారం ఏజీని అడిగాం. అసెంబ్లీలో చర్చ తర్వాతే నివేదికపై తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచి్చన లిఖిత పూర్వక వివరణను ఏజీ శుక్రవారం కోర్టుకు సమర్పించారు. రిపోర్టును అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందని తెలిపారు’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో వివరించింది. స్టే, రద్దు ఉత్తర్వులివ్వని ధర్మాసనం ‘నివేదికలోని అంశాలను మీడియాకు వెల్లడించడం ద్వారా ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యహరించిందన్నది పిటిషనర్ల ఆరోపణ. అధికారిక వెబ్సైట్లో కూడా నివేదిక ఉంచినట్లు పేర్కొన్నారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ముందు, నివేదికను మంత్రిమండలి ఆమోదించి, చర్చ కోసం అసెంబ్లీ ముందు ఉంచాలని నిర్ణయించుకున్న తర్వాత నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. నివేదికను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లయితే, దానిని తొలగించాలి. 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి పిటిషనర్ల ప్రతిష్టను కించపరిచేలా కమిషన్ నివేదికలోని ఆంశాలు ఉంటే అంటే అది సరికాదు. లాగే, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని సర్కార్ చెబుతున్నందున పిటిషనర్లకు ‘ముందస్తు చర్యలు’ అనే భావన అవసరం లేదు. నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం లేదు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చట్టం వీలు కల్పిస్తుంది. అక్కడ దానిని చర్చించాలి. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. మూడు వారాలు సమయం ఇస్తున్నాం..’ అని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. -
కేకు కోయాల్సిన బాలుడు తలకొరివి పెట్టడం కలిచి వేసింది: హైకోర్టు
హైదరాబాద్: నగరంలో విద్యుత్ స్తంబాలకు వేలాడదీసి కేబుల్ వైర్లు తొలగింపు అంశానికి సంబంధించి భారతీ ఎయిర్టెల్ పిటిషన్‌పై ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) విచారణ జరిగింది. దీనిలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ బీమాపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప మిగతా ఏవీ ఉండకూడదని ఆదేశించారు. దీనిలో భాగంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామాంతాపూర్‌లో విద్యుత్ షాక్ కారణంగా పలువురు మరణించిన ఘటనను జడ్జి నగేష్ ప్రస్తావించారు. బర్త్‌డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఉదంతాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు.. తలకొరివి పెట్టడం కలిచి వేసిందన్నారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని, ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ‘ఆ ఘటనతో ప్రతి హృదయం పగిలిపోయింది.. దీనికి అందరం బాధ్యులేమేనా?, ఈ ఘటనతో సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’ అని జస్టిస్నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లోభాగంగా ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తొలుత ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.రామంతాపూర్‌లో అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. దీంతో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు కట్ చేసే పనిని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ అంశానికి సంబంధించి భారతీ ఎయిర్టెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సోమవారానికి వాయిదా పడింది. -
కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో దక్కని ఊరట
-
కేసీఆర్, హరీష్‌కు హైకోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో స్టే అవసరం లేదని పేర్కొంది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్బంగా పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్, హరీష్ ఇద్దరూ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున ఏజీ చెప్పుకొచ్చారు.హైకోర్టులో ప్రభుత్వం నిర్ణయాన్ని తెలిపిన ఏజీ..కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం వాదనల్లో భాగంగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని కాపీ రూపకంగా అందజేశారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కమిషన్ నివేదికను వెబ్సైట్లలో పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలో వెబ్సైట్లలో నివేదిక ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. గురువారం జరిగింది ఇదే.. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ విచారణ చేపట్టారు.ఇక, వీరిద్దరి పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడియాకు అందజేశారా?. మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. -
‘కాళేశ్వరం’పై నివేదిక ఎందుకు బయటపెట్టారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడి యాకు అందజేశారా?, మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ, కమిషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో కమిషన్ ఏర్పాటు కేసీఆర్, హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘మేడిగడ్డ బరాజ్‌కు సంబందించిన ప్రతిదీ కేబినెట్, ఇంజనీర్ల సూచనలు, ఆమోదంతోనే జరిగింది. దురదృష్టవశాత్తు అసాధారణ వర్షాలతో ఓ పిల్లర్ కుంగింది. దీనికి డిజైనింగ్, ఇంజనీరింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయినా ప్రభుత్వం రాజకీయ కక్షతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చట్ట నిబంధనలు పాటించలేదు. చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధతను, ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించింది. మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, నివేదిక కాపీ ఇవ్వాలని కోరినా ఇప్పటివరకు ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానిపై అసెంబ్లీలో చర్చించాలని తీర్మానించారు. అసెంబ్లీలో చర్చించకుండానే ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో నివేదికలోని వివరాలు మీడియాకు తెలియజేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియా సమావేశంలో నివేదికను బహిర్గతం చేశారు. నివేదికపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సారాంశాన్ని వందలాది అధికారిక, అనధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు సీఎం, మంత్రులు పదే పదే ప్రెస్మీట్లలో బీఆర్ఎస్ పార్టీ, పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ కోసం పాకులాడుతూ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో అప్రతిష్టపాలు చేసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పిటిషనర్లకు నోటీసులు సైతం సరైన విధానంలో ఇవ్వలేదు. చట్టంలోని సెక్షన్ 8బీ, 8సీ కింద సమన్లు జారీ చేయలేదు. కేవలం సాక్షిగానే నోటీసులిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సాక్షులు ఇచ్చిన వివరాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటే 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వాలి. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం మా ప్రతిష్టను దెబ్బతీసేలా పక్షపాతంతో, చట్టవిరుద్ధంగా సమర్పించిన నివేదికను రద్దు చేయాలి..’ అని కోరారు. ఈ సందర్భంగా కిరణ్‌బేడీ, ఎల్కే అద్వానీపై కమిషన్లను కొట్టివేసిన కేసులకు సంబంధించిన వివరాలు ధర్మాసనానికి అందజేశారు. ఇద్దరూ శాసనసభ్యులే.. అందుకే అసెంబ్లీలో చర్చ ప్రభుత్వం, కమిషన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘నివేదికపై అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. నివేదిక నేరుగా అసెంబ్లీలో బహిర్గతం చేస్తాం. పిటిషనర్లు ఇద్దరూ శాసనసభ సభ్యులు. ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వెచ్చించి ప్రాజెక్టు నిర్మించారు..’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీజే జోక్యం చేసుకున్నారు. అసెంబ్లీలో చర్చించాలని భావించినప్పుడు నివేదికను మీడియాకు ఎందుకు విడుదల చేశారని ఏజీని ప్రశ్నించారు. ‘నివేదిక ప్రతిని పబ్లిక్ డొమైన్లో పెట్టారా?, పిటిషనర్లకు 8బీ కింద నోటీసులిచ్చారా? నివేదిక ప్రస్తుత స్థితి ఏంటీ? అసెంబ్లీలో ప్రవేశపెట్టారా?’ అని అడిగారు. మీడియాకు ఇవ్వలేదు..పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు మీడియాకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, పబ్లిక్ డొమైన్‌లోనూ పెట్టలేదని ఏజీ బదులిచ్చారు. నివేదికకు కేబినెట్ ఆమోదం తర్వాత రూపొందించిన 60 పేజీల త్రిసభ్య కమిటీ నివేదికలోని వివరాలను మీడియాకు ఇచ్చామని చెప్పారు. 8బీ కిందే పిటిషనర్లకు నోటీసులిచ్చామని తెలిపారు. అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కిరణ్‌బేడీ, ఎల్కే అద్వానీ కేసులు ఇక్కడ వర్తించవని వాదించారు. కాగా, తనకు సమర్పించిన నివేదిక ప్రతి సరిగా కనిపించడం లేదంటూ కొన్ని పాయింట్లు హైలైట్ చేసి ఉండటంపై సీజే అభ్యంతరం తెలిపారు. విచారణను నిలిపివేద్దాం అని అన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తితో విచారణ కొనసాగించారు. వివరాలు స్పష్టంగా ఉన్న కాపీ ఇవ్వాలని వారికి సూచించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకుని చెప్పాలని ఏజీకి సూచిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
హైకోర్టు కీలక ప్రశ్న.. రేపు చెబుతామన్న ఏజీ
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్ ఇవ్వలేదని హరీష్ తరఫు లాయర్ అన్నారు. నివేదికలో అంశాలు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్నాయని.. లేఖ రాసినా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. సీఎం ప్రెస్‌మీట్ పెట్టి నివేదికను బయటకు ఇచ్చారన్నారు.కేసీఆర్ తరఫు లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ డొమైన్లో కమిషన్ రిపోర్టు ఉందని.. ప్రజెంటేషన్ ద్వారా వివరాలు బయటకు ఇచ్చారని కోర్టుకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఘోష్ కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో లేదన్న ఏజీ.. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సి ఉందని.. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్లో పెడతామన్నారు. కౌంటర్ మరిన్ని వివరాలు పొందుపరుస్తామని.. ఈ సమయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వొదన్న ఏజీ.. అసెంబ్లీలో చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని ఏజీ కోరారు.కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు?. నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా? అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా? ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏజీ తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అన్న హైకోర్టుకు.. రేపు సమాధానం చెబుతామంటూ ఏజీ తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు సమాచారం తెలుసుకున్న విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టు తెలిపింది. రేపే సమాధానం చెబుతామంటూ ఏజీ తెలపడంతో తదుపరి విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది. -
ఆ మరణాలకు బాధ్యులెవరు...?
సాక్షి, హైదరాబాద్: ‘కేబుల్ వైర్ల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దీనికి బాధ్యులెవరో చెప్పండి? ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు అన్యాయంగా దుర్మరణం చెందారు. అందుకు బాధ్యులు కేంద్రమా? రాష్ట్రమా? జీహెచ్ఎంసీనా? కేబుల్ ఆపరేటర్లా? ఎవరికి వారు మాకు సంబంధం లేదని చెప్పడం దుర్మార్గం. కేబుళ్ల పునరుద్ధరణ సమస్యే కాదు’అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్ల తొలగింపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో విద్యుదాఘాతంతో ఐదుగురు మృతి చెందిన విషయం విదితమే. పాతబస్తీలో మరో నలుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారతి ఎయిర్ టెల్ బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. మధ్యంతర ఉత్తర్వులివ్వలేం పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ.. కేబుల్ వైర్ల ఏర్పాటు కోసం ముందుగా అన్ని అనుమ తులు తీసుకుని.. రూ.21 కోట్లు చెల్లించా మని తెలిపారు. ప్రభుత్వం తొలగించాలని నిర్ణయం తీసుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వాలని, కానీ నోటీసులివ్వకుండా కేబుళ్లను కట్ చేయడం సరికాదని వాదించారు. గృహాలకు కేబుల్ తీసుకున్న వారు కూడా విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటున్నారని, అందుకు తమను బాధ్యులను చేయడం తగదని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్నెట్ సేవలు అందక డాక్టర్లు, న్యాయవాదులు, ఐటీ ఉద్యోగులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. టీజీఎస్పీడీసీఎల్, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. సమస్య వచ్చినప్పుడల్లా ఇలా పిటిషన్లు వేస్తున్నారని అన్నారు. గతంలో ఇలాగే పిటిషన్ వేసి ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. విద్యుత్ స్తంభాలపై పరిమితికి మించి కేబుళ్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ దశలో తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. వైర్ల తొలగింపుపై లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు. అప్పటివరకు వైర్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్కు సూచించారు. వివరాలను మా ముందు ఉంచండి: లోకాయుక్త సాక్షిలో వచ్చిన ‘కృష్ణుడి శోభాయాత్ర విషాదాంతం’వార్తకు లోకాయుక్త స్పందించింది. ఐదుగురు మృతి చెందిన ఘటనపై సుమోటోగా విచారణకు స్వీకరిస్తూ.. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, టీజీఎస్పీడీసీఎల్ ఎస్ఈ (ఆపరేషన్స్), ఉప్పల్ సీఐని ఆదేశించింది. వచ్చే నెల 11లోగా వివరాలను సమర్పించాలని ఆదేశించింది. -
శాఖల సమన్వయ లోపంతోనే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు వస్తున్నాయని.. వందల పిటిషన్లు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండటానికి వారే కారణమని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలోని ఒక్కో శాఖ ఒక్కోలా వ్యవహరిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, నాలాకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ అనుమతించి.. అవసరమైతే భూ సేకరణ చేసుకోమని సర్కార్‌కు ఆదేశాలు జారీ చేస్తేనే సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ‘రెవెన్యూ అధికారులు పట్టాదార్ పాసుపుస్తకాలిస్తూ ఉంటారు.. ము న్సిపల్ అధికారులు నిర్మాణాలకు అనుమతిస్తారు.. నీటిపారుదల అధికారులేమో నీటి ప్రవాహ మార్గమని, ఎఫ్టీఎల్ అని, బఫర్‌జోన్ అని చెబుతుంటారు. దశాబ్దాలు గడుస్తున్నా వివాదాలు మాత్రం పరిష్కా రం కావడం లేదు’అని వ్యా ఖ్యానించింది.చెరువు నీరు ప్రవహించే మార్గమైతే పాస్ పుస్తకాలు ఎలా జారీ చేశారని అడిగింది. జవహర్‌నగర్ కాంపౌండ్ వాల్ తొలగింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. జవహర్‌నగర్ కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసి డ్రైనేజీ, మురుగునీటిని తన భూమిలోకి అనుమతిస్తూ నీరుపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్ణ యం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కాచిగూడకు చెందిన పల్లె నర్సింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. మునక నుంచి బయటపడేందుకు ప్రహరీ కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. సమస్యను తెలియజేస్తూ అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించాలని పిటిషనర్‌కు సూచించారు. కౌంటర్ దాఖలు చేయా లని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. పార్కింగ్ వసతి ఉంటేనే ఫ్లాట్ కొనండిబిల్డర్లు 10 ఫ్లాట్లకు అనుమతి తీసుకుంటారు.. వీరికి పార్కింగ్ స్థలం ఉంటుంది.. అనధికారికంగా మరో 4 ప్లాట్లు నిర్మిస్తారు.. మరి వారికి పార్కింగ్ ఎలా ఇస్తారు? ప్రజలు ముందుగా పార్కింగ్ సదుపాయం చూసుకున్న తర్వాతే ఫ్లాట్లు కొనుగోలు చేయాలని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో చాలా భవనాలకు పార్కింగ్ వసతి లేకపోవడం అతి పెద్ద సమస్యగా మారిందన్నారు.హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ సమస్యపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణ సెపె్టంబర్ 2కు వాయిదా వేశారు. -
పీసీ ఘోష్ నివేదిక నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికను నిలిపివేయాలని కోరు తూ బీఆర్ఎస్ అధినేత కే సీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నివేదిక నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరు తూ కేసీఆర్‌తో పాటు మాజీమంత్రి హరీశ్‌రావు మంగళ వారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం–1952 ప్రకారం ప్రభుత్వం తమకు నోటీసులు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కమిషన్‌కు విచారణార్హత లేదని, నివేదికను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఘోష్‌ను ప్రతివాదులుగా చేర్చారు. కాపీ ఇవ్వకుండా పదేపదే ఆరోపణలు ‘నివేదిక కాపీని మాకు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8న లేఖ రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నివేదిక మా పరువుకు నష్టం కలిగించేలా ఉందని ఈ నెల 4న మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించిన విషయాల ద్వారా తెలుస్తోంది. మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, కాపీని ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఎటువంటి సమర్థనీయమైన ఆధారం లేకుండా అప్రతిష్టపాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రతివాదులు జీవో 6ను జారీ చేశారు. నిబంధనల మేరకే బరాజ్‌లు.. అన్నీ పరిశీలించాకే కేంద్రం అనుమతులు ఏడు జిల్లాలకు తాగు, సాగునీటిని అందించడానికి 160 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించి కాళేశ్వరం ఎత్తిపో తలు పథకానికి నిబంధనల మేరకు రూపకల్పన చేసి నిర్మించాం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో బరాజ్ నిర్మాణాన్ని మరో చోటికి మార్చాలనే నిర్ణయం సహా ప్రతి అంశంపై కేబినెట్ ఆమోదం తర్వాతే చర్యలు చేపట్టాం. 13 జిల్లాలకు నీరందించేలా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బరాజ్‌లకు ప్రతిపాదనల నుంచి నిర్మాణం వరకు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రం అనుమతి మంజూరు చేసింది’ అని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దురుద్దేశపూరితంగానే కమిషన్ ‘ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ కాళేశ్వరాన్ని అప్రతిష్టపాలు చేస్తూ వస్తోంది. అధిక వర్షపాతంతో మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగడం దురదృష్టకరం. దీనికి బరాజ్ రూపకల్పన, ఇంజనీరింగ్‌తో సంబంధం లేదు. అయినా బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దు్రష్పచారం ప్రారంభించింది. చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, దురుద్దేశపూరితంగా న్యాయవిచారణ కమిషన్ నియమించింది. అయినా ప్రజాజీవితంలో సమగ్రత, నిజాయితీకి కట్టుబడి ఉన్నందున కమిషన్ ముందు హాజరయ్యాం. నివేదిక పూర్తయిన తర్వాత మాకు ఇవ్వకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో మీడియాకు విడుదల చేసింది. దీన్ని పరిశీలిస్తే.. నివేదిక ఏకపక్షమని వెల్లడవుతోంది. విచారణ కమిషన్ చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధత, ప్రాథమిక సూత్రాలను కమిషన్ ఉల్లంఘించింది. ఎన్నికల్లో లబ్ధి కోసం..స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి మంత్రులు మా ప్రతిష్టను కించపరిచేలా మీడియా ద్వారా దాడి ప్రారంభించారు. ‘పరిపాలనా అనుమతుల నుంచి నిర్మా ణం వరకు అక్రమాలు జరిగాయి.. అవకతవకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారే బాధ్యులు.. ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు, వ్యక్తుల నిర్ణయం.. నాటి సీఎం సూచన మేరకే బరాజ్ స్థలాలు ఎంపిక చేశారు.. నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు.. రూ.259 కోట్ల పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ ముందుంచలేదు.. సీఎం, హరీశ్ ఆదేశాల మేరకే జారీ చేశారు.. ఖజానాపై అదనపు భారం పడింది..’ లాంటి వాక్యాలను నివేదికలో పేర్కొనడం పరిశీలిస్తే.. కమిషన్ కావాలనే మాకు వ్యతిరేకంగా విచారణ సాగించినట్లు తేటతెల్లం అవుతోంది.మాతో పాటు నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను బాధ్యుడిగా పేర్కొనడం హాస్యాస్పదం. నివేదికను పరిశీలిస్తే.. పిటిషనర్లపై తప్పుడు భావనతో, ముందస్తు ప్రణాళికతో కమిషన్ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన నాటి మంత్రుల వాదనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్ష నివేదికను రద్దు చేయాలి..’అని పిటిషన్లలో కేసీఆర్, హరీశ్ కోరారు. ఇదీ నేపథ్యం.. ప్రస్తుతం స్రూ్కటినీ దశలో ఉన్న ఈ పిటిషన్లకు రిజిస్ట్రీ నంబర్ కేటాయించాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇవి సింగిల్ జడ్జి వద్ద విచారణకొచ్చే అవకాశముంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో నిర్లక్ష్యం, లోపాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం..2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. జూలై 31న కమిషన్ నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు.. కేసీఆర్, హరీశ్, ఈటల కారణమని నివేదిక తేలి్చనట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించగా.. ఈ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికను కేసీఆర్, హరీష్‌రావు సవాల్ చేశారు. వేర్వేరుగా రెండు రిట్ పిటిషన్లను వారు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో కమిషన్ నివేదిక అదేవిధంగా ఇచ్చిందని.. కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు కేసీఆర్, హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.కాగా, మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. -
ఓసీ లేకుండా విద్యుత్ కనెక్షన్ కుదరదు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అధికారులిచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) సమర్పించకుండా బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది. బిల్డర్లు తరచూ.. ఆమోదించిన ప్లాన్ మార్చి నిర్మాణం చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా అదనపు అంతస్తులు కడుతున్నారని, ఆ తర్వాత క్రమబద్ధీకరణకు కోరుతున్నారని.. ఇవన్నీ ఉల్లంఘనలేనని వ్యాఖ్యానించింది. గతంలో తాము ఇచ్చిన సడలింపులను దుర్వినియోగపరిస్తే మౌనంగా ఉండలేమని తేల్చిచెప్పింది. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే సమర్థించలేమని హైకోర్టు పేర్కొంది. సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి ఓసీ పొందాలని ఓ కేసులో పిటిషనర్‌ను ఆదేశించింది. అది సమర్పించిన తర్వాతే టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్ ఇస్తుందని చెప్పింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని తన భవనానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఓసీ కోసం పట్టుబట్టకుండా టీజీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహమ్మద్ ఆరిఫ్ రిజ్వాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. స్టిల్ట్తో పాటు ఐదు అంతస్తుల నిర్మాణం జీహెచ్ఎంసీ మంజూరు చేసిన ప్రణాళిక ప్రకారమే జరిగిందన్నారు. అన్ని చార్జీలు చెల్లించిన తర్వాతే విద్యుత్ కనెక్షన్‌కు అనుమతి కోరామని చెప్పారు. టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలో ఓసీ సడలింపులకు అధికారులు అనుమతి ఇవ్వడంతో చాలా మంది లబ్ధిదారులు ఆ తర్వాత కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించలేదన్నారు. విద్యుత్ కనెక్షన్ పొంది సరఫరాను అనుభవిస్తున్నారని.. దీంతో ఈ ఏడాది జనవరిలో టీజీఎస్పీడీసీఎల్ ఓ సర్క్యులర్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు విద్యుత్ సేవలకు ఓసీ తప్పనిసరి చేసిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉల్లంఘనలను ప్రోత్సహించేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. -
సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో 2019లో నమోదైన కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు తుదిఉత్తర్వులు జారీ చేసింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గరిడేపల్లి పీఎస్‌లో అప్పటి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై 2019, జనవరి 19న ఎఫ్ఐఆర్ నమోదైంది.ఎలాంటి అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పొనుగోడులో సమావేశం నిర్వహించారన్నది ఫిర్యాదు. ఆధారాలు లేకుండా తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి.. ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. ట్రయల్‌కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు.. వరంగల్ జిల్లా కమలాపూర్ పీఎస్‌లో నమోదైన కేసులో ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి రేవంత్‌రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను, ఫిర్యాదుదారును ఆదేశించింది. తదుపరి విచారణ సెపె్టంబర్ 9కి వాయిదా వేసింది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 2,500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారన్న ఫిర్యాదు మేరకు రేవంత్‌పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. -
100 కేసులు.. 109 పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: క్రిమినల్ కేసుల్లో తెలంగాణ హైకోర్టు సత్వర పరిష్కారం చూపిస్తోంది. సగటున నమోదైన 100 కేసులకు పాత కేసులతో కలిపి 109 కేసులను పరిష్కరిస్తోంది. సివిల్ కేసుల్లో 94 శాతం పరిష్కారంతో కేసుల విచారణ సాగిస్తోంది. హైకోర్టులో ఇప్పటికి దాదాపు 2.35 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 30 శాతం న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నా.. పరిష్కారం శాతంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. కౌంటర్ల జాప్యంతో పెరుగుతున్న పెండింగ్‌లు కేసుల సత్వర విచారణకు న్యాయస్థానం తీవ్రంగా కృషి చేస్తున్నా.. జడ్జిల ఖాళీలు, సిబ్బంది లేమితోపాటు ప్రభుత్వం వేగంగా కౌంటర్లు వేయకపోవడంతో కొన్ని కేసులు విచారణ నత్తనడకను తలపిస్తోంది. సివిల్ కేసుల్లో ఏళ్లకేళ్లు కౌంటర్లు దాఖలు చేయకుండా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తుండటం పెండింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణమని న్యాయమూర్తులే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం గమనార్హం.⇒ దేశంలోని హైకోర్టుల్లో 7 లక్షల క్రిమినల్ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు పేర్లను కేంద్ర ప్రభుత్వం త్వరగా సిఫారసు చేయాలి. న్యాయమూర్తుల కొరతతో క్రిమినల్ అప్పీళ్లు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యను అరికట్టాల్సి ఉంది. – సుప్రీంకోర్టు⇒ కేసులు పెద్ద సంఖ్యలో పేరుకుపోవడం కోర్టు వ్యవస్థపై తీవ్ర భారం మోపుతుంది. ఒత్తిడి పెరగడంతో న్యాయమూర్తులు కేసులను సకాలంలో విచారించి నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. సుదీర్ఘ జాప్యం కారణంగా సాధారణ ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. – న్యాయ నిపుణులుప్రధాన సమస్యలు..⇒ న్యాయమూర్తుల ఖాళీలు, సిబ్బంది కొరత ⇒ అంతంత మాత్రంగా మౌలిక సదుపాయాలు ⇒ న్యాయ వ్యవస్థకు అరకొర నిధుల కేటాయింపు ⇒ కౌంటర్ల దాఖలుకు సర్కార్ ఏళ్లకేళ్లు సమయం తీసుకోవడం ⇒ చట్టంలోని లోటుపాట్లను కొందరు అనుకూలంగా మార్చుకోవడం ⇒ సాంకేతికతపై న్యాయవాదులకు పూ ర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంఅనుకూలతలు..⇒ కోవిడ్ తర్వాత వర్చువల్ విధా నం అందుబాటులోకి రావడం ⇒ లోక్ అదాలత్‌లపై ప్రజలను విస్తృత స్థాయిలో చైతన్యం చేయడం ⇒ సివిల్ కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ⇒ న్యాయమూర్తులు విచారణలను వేగవంతంగా చేపడుతుండటం ⇒ ఆన్‌లైన్‌లోనూ న్యాయవాదులు విచారణకు హాజరవు తుండటంఇంకా ఏం చేయాలి..⇒ సాంకేతికతపై కక్షిదారులకు, న్యాయవాదులకు అవగాహన కల్పించడం ⇒ ఒకే రకమైన కేసులను ఒకే చోట విచారణ చేపట్టడం ⇒ చిన్నచిన్న విచారణలకు న్యాయవాదులకు గడువు నిర్దేశించడం ⇒ బలమైన కారణాలుంటే తప్ప విచారణ వాయిదా వేయకుండా ఉంటడం ⇒ స్వల్ప కేసుల్లో వెంటవెంటనే తీర్పులు వెల్లడించడం ⇒ కౌంటర్ల దాఖలుకు సర్కార్‌కు గడువు విధించడంవాయిదాలు తగ్గితేనే..ప్రధానంగా సివిల్ కేసుల్లో వాయిదాలు తగ్గితేనే సత్వర పరిష్కారం సాధ్యమవడంతోపాటు పెండింగ్ భారం తగ్గుతుంది. కొన్ని కేసులు ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూ పెండింగ్ జాబితా పేరుకుపోతోంది. క్రిమినల్‌తో పాటు సివిల్ కేసులను వంద శాతానికి మించి పరిష్కారం చేయాలి. రెండేళ్లుగా జడ్జీలు సత్వర పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నా.. అదనపు భారంతో తీవ్ర ఒత్తిడి ఉంటోంది. మంజూరైన మేరకు న్యాయమూర్తుల నియామకం, మౌలిక వసతులు చేపడితే ఈ భారాన్ని తగ్గిస్తూ రావొచ్చు. – సంజీవ్‌రెడ్డి జిల్లెల్ల, హెచ్‌సీఏఏ మాజీ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది -
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2016లో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారంటూ రేవంత్‌పై ఫిర్యాదు చేయగా.. రేవంత్‌రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది.విచారణ పూర్తి చేసిన పోలీసులు.. అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసును కొట్టేయాలంటూ రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటరకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణ వాయిదా వేసింది. -
బాలిక అబార్షన్‌కు హైకోర్టు నో
సాక్షి, హైదరాబాద్: పెళ్లికాకుండానే గర్భందాల్చి 28 వారాల గర్భంతో ఉన్న ఓ బాలిక అబార్షన్‌కు ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రాణాపాయం ఉందన్న వైద్య నివేదిక నేపథ్యంలో ప్రసవం వరకు ఆమెను డిశ్చార్జ్ చేయొద్దని.. నిరంతరం వైద్యం అందించాలని నిలోఫర్ ఆస్పత్రిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది. తన కుమార్తె గర్భాన్ని (కవలలు) తొలగించేందుకు నిలోఫర్ వైద్యులను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది జూలై 22 నాటి వైద్య నివేదిక ప్రకారం తన కుమార్తె గర్భధారణ వయసు 27 వారాలు (ట్విన్ ఏ), 25 వారాలు (ట్విన్ బీ) అని పేర్కొంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక మరోసారి విచారణ చేపట్టారు. మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న గత ఉత్తర్వుల మేరకు నివేదిక అందించిన నిలోఫర్ సూపరింటిండెంట్... గర్భాన్ని తొలగిస్తే మైనర్ బాలిక ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్ విజ్ఞప్తిని నిరాకరించారు. -
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
-
సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి ఊరట లభించింది. ఆయనపై బీజేపీ కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. నాంపల్లి స్పెషల్ కోర్టులో కాసం వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ వాఖ్యలను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ క్వాష్ పిటిషన్ అనుమతిచ్చిన హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.కాగా, సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డికి ఊరట లభించింన సంగతి తెలిసిందే.. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్‌కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం(గత నెల జులై 28) డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు -
బాధ్యతలు చేపట్టిన కొత్త జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జీలు అదనపు న్యాయమూర్తులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గాడి ప్రవీణ్ కుమార్, రామకృష్ణారెడ్డి, సుద్దాల చలపతిరావు, గౌస్ మీరా మొహియుద్దీన్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పాటు కొత్త జడ్జీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన కొత్త జడ్జీలు తొలిరోజు సీనియర్ న్యాయమూర్తులతో కలసి కేసుల విచారణలో పాల్గొన్నారు. వీరి నియామకంతో హైకోర్టులో జడ్జీల సంఖ్య 30కి పెరిగింది. ఇంకా 12 ఖాళీలున్నాయి. ఈ నలుగురిని న్యాయవాదుల కోటాలో జడ్జీలుగా నియమిస్తూ గత నెల 28న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
3 నెలల్లో తేల్చండి
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాన్ని నీరుగార్చుతుంది. అలాగని మేం ఇప్పుడు ఏ ఆదేశాలూ జారీ చేయకపోతే.. ‘ఆపరేషన్ సక్సెస్–పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉంటుంది. స్పీకర్ తన ప్రస్తు త వైఖరిని పునరావృతం చేయడానికి దోహదపడినట్లు అవుతుంది.. – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనసభ స్పీకర్‌కే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణలో పార్టీ మారి అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో తీర్పు వెలువరించిన రోజు నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సభాపతి కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడాన్ని అనుమతించకూడదని పేర్కొంది. విచారణను ఆలస్యం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. మరోవైపు అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఏడు నెలలు.. 9 సార్లు విచారణ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి) దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత దాదాపు ఏడు నెలల్లో తొమ్మిది సార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, మోహిత్ రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, తదితరులు వాదనలు వినిపించారు. గత ఏప్రిల్ 3న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం.. గురువారం తీర్పు వెలువరించింది. ఎంత సమయం కావాలని ముందే అడిగాం.. ‘2025 జనవరి 15న సుప్రీంకోర్టు ముందు కేసు దాఖలైన తర్వాత 16న తొలిసారిగా మేం కొందరికి నోటీసులు జారీ చేశాం. ఫిబ్రవరి 3న జరిగిన విచారణ సందర్భంగా.. ఫిబ్రవరి 4న మరికొందరికి నోటీసులు జారీ చేశాం. జనవరి 31న తొలుత ఈ కేసు విచారణకు వచ్చినప్పుడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు ఎంత సమయం అవసరమో తెలుసుకోవాల్సిందిగా మేము సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి సూచించాం..’ అని ధర్మాసనం తెలిపింది. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’లా ఉండాలి ‘10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా పని చేస్తున్నప్పటికీ, ఆయన ఎటువంటి రాజ్యాంగపరమైన రక్షణ (కానిస్టిట్యూషనల్ ఇమ్యూనిటీ)ను పొందలేరు. నిజానికి ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి అనర్హత పిటిషన్లపై విచారించేందుకు సమయాన్ని నిర్ణయించమని స్పీకర్‌కు సూచించారు. అందుకు నాలుగు వారాల గడువిచ్చారు. అంతేకానీ పిటిషన్లపై నిర్ణయం తీసుకోమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయినప్పటికీ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ద్వారా డివిజన్ బెంచ్ తప్పిదానికి పాల్పడింది. ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకపోయినా తెలంగాణ శాసనసభ కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయడం సరైంది కాదు. ఇకపై ఈ కేసు ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’ లా ఉండాలి..’ అని సుప్రీంకోర్టు (నవ్వుతూ) వ్యాఖ్యానించింది. విచారణను పొడిగించేందుకు అనుమతి వద్దు ‘అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను పొడిగించడానికి స్పీకర్ అనుమతించకూడదు. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు అధికారాలు (కిహోటో హోల్లొహన్ (10వ షెడ్యూల్ సమర్థించిన) కేసులో తీర్పు నిష్పత్తిని ప్రస్తావిస్తూ) ఇరుకైన పరిధిలో (న్యారో కంపాస్) ఉన్నాయి. అలాగే స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు. స్పీకర్లు అనర్హత పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచే పరిస్థితిని రాజ్యాంగ ధర్మాసనం ఊహించి ఉండకపోవచ్చు. అనర్హత పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయించాలని కీషమ్ మేఘచంద్ర సింఘ్ కేసులో తీర్పు ఉంది. శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పిటిషన్లను నిరీ్ణత సమయంలోగా నిర్ణయించాలని మహారాష్ట్ర స్పీకర్‌కు జారీ అయిన ఆదేశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది..’ అని న్యాయమూర్తులు తెలిపారు. జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం ‘అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారం స్పీకర్‌కే ఇచ్చాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ తగిన సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. మనం దీనిని ఎదుర్కొనకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అనర్హతల విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. వీటిని ఎదుర్కొనకపోతే మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. 10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ..ఆయన ఎటువంటి ‘‘రాజ్యాంగపరమైన రక్షణ’’ని పొందలేరు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పొడిగించుకుంటూ పోవడానికి వీల్లేదు..– సుప్రీంకోర్టు ధర్మాసనంబీఆర్ఎస్ నేతల అభ్యర్థన తోసిపుచ్చిన ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కిహోటో హోల్లోహన్, సుభాష్ దేశాయ్ తదితరుల కేసులకు సంబంధించి రాజ్యాంగ బెంచ్ తీర్పును ప్రస్తావించింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని స్పష్టం చేసింది. ‘అయితే, ఫిరాయింపులు జరిగినప్పుడు అనర్హత అంశాన్ని తేల్చే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్‌కు లేదా చైర్మన్‌కు అప్పగించే యంత్రాంగం వల్ల రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నామా.. లేదా? అనే అంశాన్ని మాత్రం పార్లమెంట్ పరిశీలించాలి. ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలంటే, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే ప్రస్తుత యంత్రాంగం సరిపోతుందా? లేదా? అనే విషయం కూడా పార్లమెంటే తేల్చాలి..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై తేల్చే అత్యంత ముఖ్యమైన బాధ్యతను పార్లమెంట్ స్పీకర్‌కు అప్పగించినప్పుడు ఆ హోదాలో ఉన్నవారు ఎంతవేగంగా చర్యలు తీసుకున్నారనేది ప్రధానమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. షెడ్యూల్ 10 ఏం చెబుతోంది..ఇది పార్టీల నుంచి ఫిరాయింపులను నిరోధించడానికి రూపొందించింది. దీన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. రాజకీయ స్థిరత్వం, ప్రజాస్వామ్య ప్రక్రియ పరిరక్షణ, విలువలను కాపాడటం కోసం దీన్ని ఉద్దేశించారు. ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారం..పార్టీ ఆదేశాలు చట్టసభల సభ్యులు పాటించాలి. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా లేదా పార్టీ నుంచి వైదొలిగినా చట్టసభల సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఫిరాయింపుల అంశాల్లో కోర్టులకు అధికార పరిధి ఉండదు. స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయమే అంతిమం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరితే సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు. ఒకవేళ ఒక పార్టీ మరో పార్టీలో పూర్తిగా విలీనమైతే అనర్హత వర్తించదు. సభ్యుని అనర్హతపై ఏ కోర్టుకు అధికార పరిధి ఉండదు. -
కమిషన్ వేయాలా? వద్దా? తేలుస్తాం
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అన్యాక్రాంతం, అక్రమాల ఆరోపణలపై విచారణ కమిషన్ వేయాలా? వద్దా? అనేది తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లో తీర్పు రిజర్వు చేసింది. ఈ సర్వే నంబర్లలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు భూములను అక్రమంగా తమ పేరిట నమోదు చేసుకున్నారని, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని దాఖలైన మరో పిటిషన్‌లోని మధ్యంతర అప్లికేషన్ల(ఐఏ)లో తీర్పు వాయిదా వేసింది. భూకబ్జాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, దీనిపై విచారణ కమిషన్ వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్, పడమటి తండాకు చెందిన రాములు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మళ్లీ విచారణ చేపట్టారు. తెలియకుండా భూములు మార్చేశారు.. పిటిషనర్ తరఫున డాక్టర్ జె.విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. ‘194/ఐ, 195/ఐలో రాములు భూములున్నాయి. ప్రస్తుతం ఆ భూములు అతని అధీనంలోనే ఉన్నాయి. పాస్‌బుక్ అతని పేరిటే ఉన్నా.. భూభారతిలో మాత్రం జావేద్, ఆర్షియా సుల్తానా, అబ్దుల్ లతీఫ్ పేర్లు చూపిస్తోంది. తనకు తెలియకుండా ఆన్లైన్లో ఎలా మార్చారో చెప్పాలని తహసీల్దార్‌ను కోరినా వివరాలు ఇవ్వలేదు. కోర్టు ఆదేశించినా స్పందనలేదు. కమిషన్ వేస్తే గానీ వివరాలు బహిర్గతం కావని కోర్టును ఆశ్రయించాం’అని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘కమిషన్ వేస్తారు.. నివేదిక వస్తుంది, అది కూడా ఉన్నతాధికారులకు సమర్పించాల్సిందే, అప్పుడు కూడా ఆ నివేదికను అల్మారాలో పెట్టి వదిలేస్తే ఏం చేస్తారు’అని ప్రశ్నించారు. మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిందేనని న్యాయవాది బదులిచ్చారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగత అంశాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం సాధ్యం కాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్లో తీర్పు రిజర్వు చేశారు. -
డీఎస్సీ–2003 టీచర్లకు పాత పింఛన్
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. 2004, ఆగస్టు 31 వరకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమల్లో ఉన్నందున వారంతా అందుకు అర్హులని తేల్చిచెప్పింది. కొత్త కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్) 2004, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. అంతకుముందే వీరి నియామకం పూర్తయిందని స్పష్టం చేసింది.2004, సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని తమకు వర్తింపజేయడాన్ని సవాల్ చేస్తూ మెదక్ జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట్ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి సహా మరో 1,738 మంది హైకోర్టులో 2019, 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘2003, నవంబర్ 13న డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2004, జూన్ వరకల్లా వీరంతా ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.కేవలం పరిపాలనాపరమైన ఆలస్యం కారణంగా 2005, నవంబర్‌లో నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అలాంటప్పుడు సెప్టెంబర్‌లో వచ్చిన పింఛన్ విధానాన్ని ఎలా వర్తింపజేస్తారు. పిటిషనర్లంతా పాత పింఛన్‌కు అర్హులు’అని చెప్పారు. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్ పిటిషనర్లు పాత పింఛన్ పథకానికి అర్హులని, వారందరికీ ఆ ప్రయోజనాలందించాలని ఆదేశించారు. పాత పింఛన్ విధానంలో.. ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండా భవిష్యత్‌కు భద్రత కల్పిస్తుంది. ఒకవేళ పెన్షన్‌దారుడు మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి కోత లేకుండా పూర్తి పింఛన్ వస్తుంది. ఒక ఉద్యోగి పదవీ విరమణ సమయానికి చివరి నెల బేసిక్ వేతనంలో 50శాతాన్ని నెలసరి పింఛన్‌గా నిర్ధారిస్తారు. ఈ విధానంలో కరువు భత్యం(డీఏ), కరువు ఉపశమనం(డీఆర్), వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) సిఫార్సులుండేవి. కొత్త పింఛన్ విధానంలో... ఉద్యోగి వేతనంలోంచి నెలనెలా కొంత వెచ్చించాలి. చివరకు వచ్చే పింఛన్ చాలా తక్కువ. ఈ విధానంలో మూలవేతనం, డీఏను కలిపి.. దానిపై 10 శాతం ఉద్యోగి, 10 శాతం ప్రభుత్వం నెలనెలా జమచేయాలి. ఈ మొత్తాన్ని ఎస్బీఐ, యూటీఐ, ఎల్ఐసీ షేర్లలో పెడతారు. విరమణ పొందాక 60 శాతం ఒకేసారి ఇస్తారు. మిగతా 40 శాతాన్ని నెలవారీగా లెక్కగట్టి ఇస్తారు. -
సుప్రీం కోర్టులో రేవంత్‌రెడ్డికి ఊరట.. పెద్దిరాజుపై సీజేఐ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్‌కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే.. పిటిషనర్ తరఫు న్యాయవాది రితీష్ పాటిల్ క్షమాపణ కోరుతూ.. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసులు సీజేఐ గవాయ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేశారు.ఏం జరిగిందంటే.. గోపన్‌పల్లి గ్రామం సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతో పాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పీఎస్‌లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఈ కేసులో ఏ-1గా కొండల్ రెడ్డి(రేవంత్ సోదరుడు), ఏ-2గా ఈ.లక్ష్మయ్య, ఏ-3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న జస్టిస్ మౌషమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్‌రెడ్డి ఆదేశాలమేరకే దూషించారనే ఆరోపిస్తున్నా ఆధారాలు లేవని తెలిపింది. ఇదే భూమికి సంబంధించి ఇదే ఆరోపణలతో గచ్చిబౌలి పీఎస్‌లో 2014లో సైతం కేసు నమోదైందని, నిందితులు-సొసైటీకి మధ్య సివిల్ వివాదమని తేలడంతో తప్పుడు కేసుగా మూసేశారని గుర్తుచేసింది. దీనిపై ఫిర్యాదుదారు పెద్దిరాజు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు దాన్ని కొట్టేసిందని, దానిపై క్రిమినల్ రివిజన్ పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. జులై 18వ తేదీన రేవంత్‌రెడ్డిపై నమోదు అయిన కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. -
హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 3న వీరి పేర్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. దీంతో వీరు అదనపు న్యాయమూర్తులుగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కొత్త జడ్జీలుగా నియమితులైన నలుగురు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నరసింహశర్మతో కలసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం హైకోర్టులో 26 (సీజేతో కలిపి) మంది న్యాయమూర్తులున్నారు. ఈ నలుగురి ప్రమాణం స్వీకారం తర్వాత ఆ సంఖ్య 30కి చేరనుంది. ఇంకా 12 పోస్టులు ఖాళీగా ఉంటాయి. కాగా, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలత బదిలీపై ఇక్కడికి రావాల్సి ఉంది. ఈ బదిలీలకు కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదు. అలాగే తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. సుద్దాల చలపతిరావు.. చలపతిరావు 1971, జూన్ 25న జనగాంలో జన్మించారు. 1998, మార్చి 26న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయవాది వై.రామారావు వద్ద 1998 నుంచి 2004 వరకు జూనియర్‌గా పనిచేశారు. 2004 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టులతోపాటు హైకోర్టులో సివిల్, క్రిమినల్ సహా అన్ని విభాగాల కేసులు వాదించారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా 2022 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వాకిటి రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి 1970, సెపె్టంబర్ 14న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు స్వగ్రామం. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. బీకామ్ ఎల్ఎల్బీ పూర్తిచేసి 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయవాది ఎ.అనంతసేన్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2005 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టుతోపాటు తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, ఫ్యామిలీ, కంపెనీ లా విభాగాల్లో సమర్థుడిగా పేరు పొందారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈడీ స్టాండింగ్ కౌన్సిల్ విధులు నిర్వహిస్తున్నారు. గౌస్ మీరా మొహియుద్దీన్.. గౌస్ 1969, జూలై 15న జన్మించారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందినవారు. తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ హెచ్ఎంటీ మేనేజర్‌గా పనిచేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాల నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. 1993 మార్చి 17న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. సివిల్, రాజ్యాంగంతోపాటు పలు విభాగాల్లో సమర్థ వాదనలు వినిపించారు. గాడి ప్రవీణ్‌కుమార్... ప్రవీణ్‌కుమార్ 1971, ఆగస్టు 28న జన్మించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ స్వస్థలం. కాకతీయ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ, ఎల్ఎల్ఎం చదివారు. 1998, నవంబర్ 12న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టు, అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులో పలు కేసులు వాదించారు. రాజ్యాంగం, సర్విస్ మ్యాటర్, లేబర్ లా, క్రిమినల్ లా.. వంటి పలు విభాగాల్లో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
ఊహాగానాలతో నిర్ణయాలు కుదరదు
సాక్షి, హైదరాబాద్: అక్రమ వినియోగానికి, రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంటుందన్న ఊహాగానాలతో వాహన మార్పిడిని అడ్డుకోలేరని రవాణా శాఖ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇన్నోవా (ట్రాన్స్‌పోర్టు) వాహనాన్ని.. మ్యాక్సీ క్యాబ్ నుంచి ఓమిని బస్ (నాన్ ట్రాన్స్‌పోర్టు)గా మార్చడానికి నిరాకరించే నిబంధనలు చట్టంలో లేనప్పుడు అందుకు ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు కాపీ అందిన నాటి నుంచి ఆరు వారాల్లో చట్టప్రకారం ఓమిని బస్‌గా మార్పు చేయాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. తన ఇన్నోవా వాహనాన్ని మాక్సీ క్యాబ్ నుంచి ఓమిని బస్‌గా మార్చడానికి తిరస్కరిస్తూ 2022, 2025లో రవాణా శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన రత్నాజీరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె శరత్ మంగళవారం విచారణ చేపట్టారు. వాహనాన్ని ఓమిని బస్‌గా మార్చేందుకు స్లాట్ బుక్ చేసుకుని పన్నులు, చార్జీల కింద రూ.2 లక్షల డీడీని కూడా పిటిషనర్ తీసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాహనం మార్పునకు అధికారులు నిరాకరించడంతో 2022లో పిటిషనర్ ఇదే హైకోర్టును ఆశ్రయించారని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించినా పిటిషనర్ దరఖాస్తును అధికారులు మరోసారి 2025, మార్చిలో తిరస్కరించారని చెప్పారు. వాహన మార్పు కారణంగా సర్కార్ ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అక్రమంగా వాహనాన్ని మానవ రవాణా కోసం వినియోగించే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తంచేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మార్పిడిపై నిషేధానికి సంబంధించి రవాణా శాఖ అధికారులు ఎలాంటి నిబంధనలు సమరి్పంచలేదని, ఊహలతో తిరస్కరణ సరికాదని చెప్పారు. 6 వారాల్లో వాహనం మారి్పడికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. -
తెలంగాణ హైకోర్టు సీజేగా ఆపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం
-
తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of Telangana High Court) జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా హైకోర్టు చీఫ్ జస్టిస్‌లుగా ఇప్పటి వరకు ఆరుగురు పనిచేశారు. త్రిపుర హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ ఏకే సింగ్ ఏడో చీఫ్ జస్టిస్. హైకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 42 కాగా ప్రస్తుతం 26 మంది పనిచేస్తున్నారు. ఇద్దరు జడ్జీల బదిలీ.. ఒకరి చేరికతో ఆ సంఖ్య 25కు చేరింది.జస్టిస్ ఏకే సింగ్ పూర్తి పేరు అపరేష్ కుమార్ సింగ్. బీహార్‌లో1965 జూలై 7వ తేదీన జన్మిచారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా చేశారు. 1990లో వకీల్‌గా పేరు నమోదు చేసుకుని.. మొదట పాట్నా(బీహార్) హైకోర్టులో, తరువాత ఝార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. న్యాయ సేవలో..2012 జనవరి 24: ఝార్ఖండ్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియామకం2014 జనవరి 16: పర్మనెంట్ జడ్జిగా ప్రమోషన్2022 డిసెంబర్ – 2023 ఫిబ్రవరి: ఝార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్2023 ఏప్రిల్ 17: త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం2025 జూలై: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు -
హైడ్రాపై ఆగ్రహం.. కోర్టు ఆదేశాలున్నా కూల్చివేస్తారా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామంలోని 200 చదరపు గజాల్లోని 480 చదరపు అడుగుల నిర్మాణంపై కోర్టు ఆదేశాలున్నా ఎలా కూల్చివేశారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ, విచారణ వచ్చే నెల 22కు వాయిదా వేసింది. రంగనాథ్‌తోపాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతిలకు నోటీసులు జారీ చేసింది.వివరాల ప్రకారం.. తన ఇంటి విషయంలో మున్సిపాలిటీ అధికారులు, హైడ్రా జోక్యం చేసుకొని కూల్చే ప్రయత్నం చేస్తున్నాంటూ వడ్దే తార హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వివాదాస్పద నిర్మాణం సున్నం చెరువు ట్యాంక్‌లో ఉందని హైడ్రా వాదనలు వినిపించింది. రెవెన్యూ అధికారుల సాయంతో సర్వే నిర్వహిస్తున్నామని, అది పూర్తయిన తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తర్వాత చట్టప్రకారం ముందుకు వెళ్లాలని ఈ ఏడాది మార్చిలో ఆదేశాలు జారీ చేశారు.అయినా, కోర్టు ఆదేశాలను పక్కకు పెట్టి తన ఇంటిని కూల్చివేశారంటూ తార ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సున్నం చెరువుపై సర్వే పూర్తి చేసి హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ణయించాలని, ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని న్యాయస్థానం చెప్పినా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. జూన్ 30న పిటిషనర్‌ను అరెస్టు చేసి, ఇంటిని కూలిచేశారని చెప్పారు. కోర్టు ఉత్తర్వులున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. మాదాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎస్ఐ వెంకటేశ్.. 70 మందితో జూన్ 30న ఉదయం 4 గంటలకు వచ్చి పిటిషనర్‌తోపాటు కుటుంబసభ్యులను ఇంటిని నుంచి బయటకు వెళ్లగొట్టారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని ఏవీ రంగానాథ్‌ను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి ఊరట దక్కింది. గచ్చిబౌలి పీఎస్‌లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసింది.ప్రస్తుత సీఎం 2016లో అప్పటి మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలో ఐటీ హబ్‌గా పేరొందిన గచ్చీబౌలీకి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపన్నపల్లీలో 31 ఎకరాల హౌసింగ్ సొసైటీ భూమూల్ని ఆక్రమించుకునేందుకు రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డితో పాటు అతని అనుచరులు ప్రయత్నించారంటూ ఫిర్యాదులందాయి.ఆ ఫిర్యాదుల్లో రేవంత్‌రెడ్డి, అతని సోదరుడు,అనుచురులు ఎలాంటి హక్కులు, అనుమతులు లేకుండా వివాదాస్పద సొసైటీ భూముల్ని వినియోగించుకునేందుకు ప్రయత్నించారని, సొసైటీ సభ్యుల్ని బెదిరించడం, భూములతో సంబంధం ఉన్నవారిని దూషించారంటూ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చీబౌలీ పోలీసులు రేవంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భూముల వివాదానికి సంబంధించి కోర్టులో ఛార్జ్‌షీట్ కూడా దాఖలైంది. హైకోర్టు విచారణ చేపట్టింది. సొసైటీ భూముల వ్యవహారంలో తమ ప్రమేయం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేశారని రేవంత్ తరుపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అదే కేసులో 2019లో కోర్టులో రేవంత్ మరో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ విచారణ నిలిపివేయాలని కోరుతూ రేవంత్ వాదనలు వినిపించారు. రేవంత్ తరుపు వాదనలు విన్న కోర్టు ఎటువంటి అధికారిక అభియోగాలు మోపలేదు. దీనికి ప్రతిస్పందనగా, హౌసింగ్ సొసైటీ తరపు న్యాయవాదులు ఈ కేసులో రేవంత్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సొసైటీ భూముల వివాదంపై రిపోర్టును తయారు చేసి ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో 2020లో రేవంత్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సొసైటీ భూముల వివాదంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గత జూన్ 20న విచారణ చేపట్టిన కోర్టు తీర్పును జులై 17కి రిజర్వు చేసింది. ఇవాళ కోర్టులో జరిగిన విచారణలో.. సంఘటనా జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని హైకోర్టు తెలిపింది. ఫిర్యాదు దారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. గచ్చిబౌలి పీఎస్‌లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసింది. -
పరస్పర అంగీకారంతోనే కలిసి ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: అత్యాచార ఆరోపణలపై నమోదైన కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలసి ఉన్నప్పుడు ఒక్కరిపై ఆరోపణలు చేయడం సరికాదని, అవి నిరాధారమైనవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు(మహిళ) గతంలోనూ ఇలా మరొకరిపై ఫిర్యాదు చేయగా, అతనిపై కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది. 21 ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్‌తో ఉన్నారని అభిప్రాయపడింది. దీనికి పిటిషనర్‌ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెబుతూ.. రంజిత్‌పై కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఫిర్యాదుదారు మేరకు.. ‘2017లో నేను హాస్టల్లో ఉండి ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పరిచయం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చిన వెంటనే వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి నిరాకరించి.. ఇంటి నుంచి గెంటివేశారు’. ఈ ఫిర్యాదు ఆధారంగా, 2019లో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ట్రయల్‌కోర్టులో చార్జిïÙట్ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. అన్నీ తెలిసే పిటిషనర్‌తో ఉన్నారు..: పిటిషనర్ తరపు న్యాయవాది వాదన లు వినిపిస్తూ..‘పిటిషనర్ నిర్దోషి. ఫిర్యాదుదారు ఆరోపణలతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు. రెండేళ్లు గడిచిన తర్వాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇంత ఆలస్యానికి కారణం చెప్పలేదు. ఫిర్యాదుదారుకు బ్లాక్మెయిల్ చేసే అలవాటు ఉంది. కేశవ్‌కుమార్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసింది. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదులో తేదీలు, సమయం, స్థలం సరిగా వివరించలేదు. పిటిషనర్‌పై నేరాలు ఆమోదయోగ్యం కాదు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలి’అని కోరారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్‌పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నా యి. అతనిపై ఆరోపణలలో నిజానిజాలు ట్రయల్‌కోర్టు తేలుస్తుంది. పిటిషన్‌ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2019, జనవరి 16న ఇంటి నుంచి గెంటివేశారని చెబుతున్న మహిళ ఫిర్యాదు చేయడానికి 23 వరకు ఎందుకు ఆగాల్సి వచి్చందో పేర్కొనలేదన్నారు. ఆమెకు ఇలా ఫిర్యాదు చేసే అలవాటు ఉందని గత వివరాలు పరిశీలిస్తే తెలుస్తోందన్నారు. పిటిషనర్, మహిళ.. ఇద్దరూ మేజర్లు. వారి మధ్య సంబంధం ఏకభిప్రాయంతోనే జరిగినట్టు అవగతమవుతోందని స్పష్టం చేశారు. 21ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్‌తో ఉన్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీనికి పిటిషనర్‌ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెప్పారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పిటిషనర్‌పై కేసును కొట్టివేస్తున్నామని తీర్పునిచ్చారు. -
19న సీజే ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ఈ నెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం 12.30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆయన ఏడో సీజేగా బాధ్యతలు చేపడతారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత సీజే జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన నాటి నుంచి సీజే పోస్టు ఖాళీగానే ఉంది.సీజే నియామకానికి గత మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడంతో రెండు రోజుల క్రితం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇదిలాఉండగా, కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన రాష్ట్ర హైకోర్టు ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్‌కు బుధవారం ఫుల్‌కోర్టు ఘన వీడ్కోలు పలకనుంది. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఫస్ట్‌కోర్టు హాల్లో జరిగే వీడ్కోలు సమావేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొననున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సుజోయ్‌పాల్ 2024, మార్చి 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 21 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై కోల్‌కతా హైకోర్టుకు వెళ్లనున్నారు. -
తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ ఏకే సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇందులోభాగంగా తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఎన్న డూ లేనివిధంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తోనే 6 నెలలుగా తెలంగాణ హైకోర్టు కొనసాగింది. గత సీజే జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన విషయం తెలిసిందే. నాటి నుంచి సీజే పోస్టు ఖాళీగానే ఉంది. ఎట్టకేలకు పూర్తిస్థాయి సీజేను నియమించడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఏకే సింగ్.. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్ర రావుని త్రిపుర హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. దేశంలో ఐదుగురు న్యాయమూర్తులు సీజేలుగా నియమితులవగా, నలుగురు సీజేలను ఇతర హైకోర్టులకు బదిలీ చేశారు. ఈ మేరకు మే 26న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఏడో సీజేగా..: జస్టిస్ ఏకే సింగ్ 1965, జూలై 7న జన్మించారు. బీఏ ఆనర్స్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1990లో పట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 వరకు అక్కడ న్యాయవాదిగా పనిచేసి.. 2001లో జార్ఖండ్ హైకోర్టుకు మారారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2022, డిసెంబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2023, ఏప్రిల్ 17న ప్రధాన న్యాయమూర్తి పదోన్నతితో త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ వారంలో తెలంగాణ హైకోర్టు 7వ సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. కోల్‌కతాకు జస్టిస్ సుజోయ్‌పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ సుజోయ్‌పాల్‌ను కోల్‌కతాకు, జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్‌కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేస్తూ గెజిట్ జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులున్నారు. ఇద్దరి బదిలీ, ఒకరి రాకతో ఈ సంఖ్య 25కు చేరనుంది. మొత్తం 42 మందికిగాను ఇంకా 17 ఖాళీలుంటాయి. సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ అభిõÙక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలత బదిలీపై ఇక్కడికి రావాల్సి ఉంది. అలాగే న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ నియామకాలకు కూడా కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. -
‘ఫీజు’లపై జూన్‌లోగా నిర్ణయం తీసుకోలేరా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై జూన్‌లోగా నిర్ణయం తీసుకోలేరా? అని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏటా ఫీజుల అంశం ఓ ప్రహసనంలా మారిందని.. కౌన్సెలింగ్ ముగిసి తరగతులు మొదలయ్యే వరకు తేల్చకుండా కమిటీ వ్యవహరిస్తోందని విమర్శించింది. సీట్లు, ఫీజులు.. ఇలా ఏదో ఒక కారణంతో ఏటా కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సర్వసాధారణంగా మారిందని వ్యాఖ్యానించింది. నెలలుగా జరుగుతున్న అంశంలో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు వేయడంపై కాలేజీల తీరును తప్పుబట్టింది. ఫీజుల పెంపుపై శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.ఫీజుల పెంపునకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ 2024 డిసెంబర్లోనే ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతిపాదనలు సమర్పించాయన్నారు. మార్చిలో భేటీ అయిన కమిటీ ఆ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. దీనికి రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలే సాక్ష్యమన్నారు. దీంతో రిజిస్టర్‌ను వెంటనే కోర్టు ముందు ఉంచాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.అనంతరం టీఏఎఫ్ఆర్సీ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ కాలేజీలు లాభాపేక్షతో పనిచేయరాదంటూ సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కాలేజీల ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవడానికి సమయంపట్టే అవకాశం ఉన్నందున బ్లాక్ పీరియడ్ (2022–23 నుంచి 2024–25)లోని ఫీజులనే 2025–26కు కమిటీ సిఫార్సు చేసిందన్నారు. మధ్యంతర ఉత్తర్వుల్లో పెంపునకు అనుమతిస్తే తీర్పు విరుద్ధంగా వచి్చనా తిరిగి విద్యార్థులకు చెల్లించబోరని పేర్కొన్నారు. 70 శాతం పెంపు కోరుతున్నారు.. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కమిటీ ప్రతిపాదనలను ఆమోదించడం మాత్రమే సర్కార్ బాధ్యతన్నారు. కొన్ని కాలేజీలు 70 శాతం వరకు పెంపును కోరుతున్నాయని.. ఆ మేరకు పెంపునకు అనుమతిస్తే విద్యార్థులపై భారీగా భారం పడుతుందని నివేదించారు. దీనివల్ల లక్షన్నర మంది విద్యార్థులు ప్రభావితం అవుతారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మూడేళ్లకోసారి ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.డిసెంబర్లో ప్రతిపాదనలు పంపిస్తే జూన్ వరకు ఏం చేశారని టీఏఎఫ్ఆర్సీని ప్రశ్నించారు. మార్చిలో నోటిఫై చేసినప్పుడు కాలేజీలైనా తెలుసుకోవాలని కదా అని వ్యాఖ్యానించారు. కౌన్సెలింగ్, అడ్మిషన్ల సమయం దాకా కాలయాపన చేయడాన్ని తప్పుబట్టింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ఉన్నా ప్రతిపాదనలపై ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కాగా, కేశవ్ మెమోరియల్ పిటిషన్‌ను మరో న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.సీబీఐటీకి గ్రీన్‌సిగ్నల్.. ఫీజుల పెంపునకు టీఏఎఫ్ఆర్సీ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐటీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఫీజు పెంపునకు అనుమతించారు. బీఈ, బీటెక్‌కు రూ. 2,23,000, ఎంటెక్కు రూ. 1,51,600, ఎంబీఏ, ఎంసీఏకు రూ. 1,40,000 పెంచాలని.. ఈ మేరకు టీజీఈఏపీసీఈటీ అడ్మిషన్లలో మార్పు చేయాలని కన్వినర్‌ను ఆదేశించారు. 2025–26, 2027–28 బ్లాక్ పీరియడ్‌కు ఈ ఫీజులు వర్తిస్తాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
‘పోలీస్’ అభ్యర్థులపై కేసు చెల్లదు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన చేపట్టిన అభ్యర్థులపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసు చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించిన 10 మందికి ఊరటనిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వద్ద ఆందోళనకు దిగినందుకు బంజారాహిల్స్ పోలీసులు 2023 ఫిబ్రవరి 3న 16 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన కొంగరి మహేశ్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఐసీసీసీ భవనం సమీపంలో 16 మంది చట్టవిరుద్ధంగా సమావేశమై అనుమతి లేకుండా ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. రోడ్డుపై నినాదాలు చేస్తూ ట్రాఫిక్‌ను అడ్డుకున్నారన్నారు. అందువల్ల దర్యాప్తును కొనసాగించేలా పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌ఫుట్ విభాగాల్లో అప్పటి వరకు ఉన్న కొలతలను మార్చి, పెంచారని ఆరోపిస్తూ శాంతియుతంగా అభ్యర్థులు నిరసనకు దిగారన్నారు. వారు చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదని.. పోలీసులు తప్ప స్వతంత్రులెవరూ సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంటూ 10 మంది పిటిషనర్లపై కేసును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే పిటిషనర్లకు మాత్రమే ఈ ఊరట లభిస్తుందని.. మిగతా వారిపై దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
అధికారులు చట్టాలు తెలుసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనీస చట్టాలు తెలియకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారని హైకోర్టు అçసహనం వ్యక్తం చేసింది. ఆయా శాఖల పరిధిలో పనిచేసే అధికారులు చట్టాలు తెలుసుకోవాలని సూచించింది. వీలైతే వారికి తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్ మండలం మల్కపేట చెరువులోకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని నింపేందుకు చేపట్టిన కాలువ పనులను ఆపేయాలని కోరుతూ తండు చంద్రయ్య సహా మరో 10 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పనుల కారణంగా తమ పట్టా భూములు శాశ్వతంగా ముంపునకు గురవుతాయని తెలిపారు. దీనిపై మే 9న తాము అధికారులకు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదని పేర్కొన్నారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలిలా..: పిటిషనర్ తరఫున న్యాయవాది సందీప్ వాదనలు వినిపించారు.. ‘శిఖం సర్కారీ భూములు.. తెలంగాణ భూమి రెవెన్యూ చట్టం 1317 ఫస్లీలోని సెక్షన్ 24 ప్రకారం సర్కారువేనన్నారు. శిఖం పట్టా భూములు ప్రైవేట్ భూములు..’అని నివేదించారు. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం పిటిషనర్లు పరిహారానికి అర్హులని, పరిహారం చెల్లించిన తర్వాత కాలువ నిర్మాణం చేపట్టవచ్చునని చెప్పారు. ‘ఎఫ్టీఎల్లో ఉన్న పిటిషనర్ల భూములు ఎప్పుడూ నీటిలో మునిగే ఉంటున్నాయి. పిటిషనర్లు తరచుగా ప్రధాన కాలువ పనులను అడ్డుకుంటున్నారు. తమ భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే భూములకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు..’అంటూ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు.పిటిషనర్లు సంబంధిత ఆస్తికి పట్టాదారులు ‘శిఖం పట్టా అంటే ఏమిటి? అందులో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చన్నది కూడా నీటి పారుదల శాఖ అధికారులకు తెలియడం లేదు. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఉన్నంత మాత్రాన ప్రతీది సర్కార్ భూమి కాదు. శిఖం సర్కారీ, శిఖం పట్టా భూములు వేర్వేరుగా ఉంటాయి. శిఖం సర్కారీ భూములు పూర్తిగా ప్రభుత్వానివే. అందులో అధికారులు ఏ పనులైనా చేపట్టవచ్చు. కానీ శిఖం పట్టా భూములు ప్రైవేట్‌వి. మామూలుగా వర్షాకాలం నీటి మునక ఉంటుంది కనుక సాగు సాధ్యంకాదు.రబీ సీజన్లో మునక తగ్గినప్పుడు వాటిలో పట్టాదారులు పంటను సాగుచేస్తారు. ఆ భూములపై పూర్తి హక్కు వారిదే. ప్రభుత్వ అవసరం కోసం ఆ భూములు తీసుకోవాలని భావిస్తే శిఖం పట్టాదారులు పరిహారానికి అర్హులు. ఎఫ్టీఎల్లో ఉంది కదా అని పట్టాభూముల నుంచి కాల్వ తవ్వకం చేపడతామంటే ఎలా? పిటిషనర్లు సంబంధిత ఆస్తికి పట్టాదారులు. అధికారులందరినీ కూర్చోబెట్టి నీటి పారుదల, రెవెన్యూ చట్టాలు నేర్పించండి. కాల్వల తవ్వకానికి ఈ న్యాయస్థానం వ్యతిరేకం కాదు..’అని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఇది ఇల్లీగల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనధికారిక భవనాలకు ‘ఇది అనుమతి లేని నిర్మాణం’ అంటూ స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడంతో పాటు భవనం ముందు బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేసేలా ఆదేశాలిస్తామని హైకోర్టు తెలిపింది. దీంతో రెండు ప్రయోజనాలుంటాయని..అది ఒక వేళ బహుళ అంతస్తుల నిర్మాణం, అపార్ట్మెంట్ అయితే ప్రజలు ఎవ రూ కొనుగోలు చేయరని, వ్యక్తిగత ఇల్లు అయితే పరువు కోసమన్నా అక్రమ నిర్మాణాన్ని నిలిపివేస్తారని స్పష్టం చేసింది. లేకుంటే అనధికారిక నిర్మాణాల ప్రహసనం ఇలానే కొనసాగుతూ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాజా కేసులో వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని కోరడంతో తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది. హైదరాబాద్ మహరాజ్‌గంజ్ తోటగూడలోని అనధికారిక భవనానికి స్పీకింగ్ ఆదేశాలు (నోటీసులు) జారీ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాపారవేత్త జి.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే కూల్చివేతకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్వులకన్నా బోర్డుల ఏర్పాటే ఉత్తమం ‘అక్రమ నిర్మాణాల ముందు స్పీకింగ్ ఉత్తర్వులతో హోర్డింగులు, బోర్టులు ఏర్పాటు చేయాలి. అప్పుడే అనధికారికంగా నిర్మాణాలు చేపట్టే వారికి తెలిసొస్తుంది. చుట్టుపక్కల వాళ్లు అడుగుతారనే భయంతో కూడా నిర్మాణాలు నిలిపివేస్తారు. అలాగే భవనం ముందు బోర్డు ఉంటుంది కనుక మాకు తెలియకుండా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేశామని ఎవరూ చెప్పరు. న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వుల కంటే ఇది సత్ఫలితాలిస్తుంది. ఆ మేరకు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. అలాగే అసమర్థులైన ప్రభుత్వ అధికారులపై ఆధారపడటం కంటే ప్రజలు తమ పనులు తామే చేసుకునేలా అలవాటు చేసుకోవడం మంచిది. ఎవరికి వారు చట్టప్రకారం రక్షణ చర్యలు ఎలా తీసుకోవచ్చో నేర్చుకోండి..’అని న్యాయమూర్తి సూచించారు. అక్రమార్కుల్లో భయం పోతోంది.. ‘స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ప్రజలంతా కోర్టుకు వచ్చేవరకు ఎందుకు ఆగుతున్నారు? కోర్టు ఆదేశాలిచ్చినా వాటి అమలుకు తాత్సారం చేస్తున్నారు. కూల్చివేత, సీజ్ లాంటి చర్యలు వెంటనే ఎందుకు తీసుకోవడం లేదు?.. రానురాను పోలీసు, కోర్టు, అధికారులంటే అక్రమాలు చేసిన వారిలో భయం పోతోంది. సోషల్ మీడియా అంటే మాత్రం బెదిరిపోతున్నారు. అధికారుల మైండ్‌సెట్ మారడం లేదు.. జీహెచ్ఎంసీ అధికారులకు మంచి సాఫ్ట్వేర్, కంప్యూటర్లు, అద్భుత భవనాలన్నీ ప్రభుత్వం ఇచ్చింది. సాంకేతికతలో అంతర్జాతీయ స్థాయి పేరుంది. అయినా పని తీరు మారడం లేదు. అధికారులు మారుతున్నారు తప్ప వారి మైండ్‌సెట్ మాత్రం మారడం లేదు. మున్సిపల్ అధికారులే కాదు.. వారిని వెనకేసుకొచ్చే స్టాండింగ్ కౌన్సిళ్లు కూడా అలానే ఉన్నాయి. కోర్టులు వందల కొద్దీ ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఏదో ఒక కారణం చెబుతూ కాలయాపన చేస్తుంటారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడినా.. వారి పరువు పోవద్దని ఆలోచిస్తున్నాం. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే బోర్డు ఏర్పాటుకు ఆదేశాలివ్వాల్సి వస్తుంది..’అని న్యాయమూర్తి హెచ్చరించారు. -
తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం వారి నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్‌లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌తోపాటు జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలతలను తెలంగాణకు బదిలీ చేస్తూ గత నెల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ సుజోయ్‌పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. కొత్తగా ఎంపికైన వారు నలుగురు, బదిలీపై ఇక్కడికి వచ్చేవారు నలుగురు, ఇక్కడి నుంచి వెళ్లే వారు ఒకరు.. వీరందరి సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే న్యాయమూర్తుల సంఖ్య 33 (సీజేతో కలిపి)కు పెరగనుంది. ఇంకా 9 ఖాళీలుంటాయి. చాలాకాలం తర్వాత న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా పదోన్నతులు క ల్పించడంపట్ల అడ్వొకేట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జడ్జీల నేపథ్యాలు ఇవి.. ⇒ సుద్దాల చలపతిరావు 1971 జూన్ 25న జనగాంలో జన్మించారు. తండ్రి జగన్మోహన్రావు. 1998 మార్చి 26న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వై.రామారావు వద్ద 1998 నుంచి 2004 వరకు జూనియర్‌గా పనిచేశారు. 2004 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సిటి సివిల్ కోర్టులతోపాటు హైకోర్టులో సివిల్, క్రిమినల్ సహా అన్ని విభాగాల కేసుల్లో వాదనలు వినిపించారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సెల్‌గా 2022లో నియమితులయ్యారు. ప్రస్తుతం అవే విధులు నిర్వహిస్తున్నారు. ⇒ వాకిటి రామకృష్ణారెడ్డి 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు స్వగ్రామం. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. అన్న, చెల్లి ఉన్నారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఎ.అనంతసేన్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2005 నుంచి స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టుతోపాటు తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, ఫ్యామిలీ, కంపెనీ కేసుల్లో సమర్థులు. ఇప్పటివరకు 1,000 పిటిషన్లకుపైగా దాఖలు చేశారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈడీ స్టాండింగ్ కౌన్సెల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ⇒ గౌస్ మీరా మొహినుద్దీన్ 1969 జూలై 15న జన్మించారు. ఆయన హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన వారు. తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ హెచ్ఎంటీ మేనేజర్‌గా పనిచేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాల నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. 1993 మార్చి 17న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. సివిల్, రాజ్యాంగంతోపాటు పలు విభాగాల్లో సమర్థ వాదనలు వినిపించారు. ⇒ గాడి ప్రవీణ్‌కుమార్ 1971 ఆగస్టు 28న జన్మించారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్. తండ్రి జగన్మోహన్రావు. కాకతీయ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ.. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్ఎం చదివారు. 1998 నవంబర్ 12న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టు, అడ్మిని్రస్టేటివ్, ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులో పలు కేసులు వాదించారు. రాజ్యాంగ, సర్విస్ మ్యాటర్స్, లేబర్ లా, క్రిమినల్ లా.. పలు విభాగాల్లో నిష్ణాతులు. ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
పీఎస్‌లే కేంద్రంగా పంచాయితీలు
‘పోలీసుస్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి. వీటిని సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా మార్చారు. సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు’రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగోలు పోలీసుస్టేషన్లో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. సాక్షి, హైదరాబాద్: సివిల్ వివాదం.. ఇదంటే పోలీసులకు వీనుల విందు, బహు పసందు కూడా. క్రిమినల్ కేసులో ఏముంటుంది... పరిశోధన, తిరగడం, చాకిరీ... అదే సివిల్ కేసుల్లో అయితే... డబ్బే డబ్బు. నగరంతో పాటు చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే స్థాయిలో అక్రమాలు పెరిగిపోయాయి. ఇలాంటి వివాదాలన్నీ చివరకు పోలీసుల వద్దకే చేరుతున్నాయి. దీంతో కొందరు పోలీసులు తమ సివిల్ సెటిల్మెంట్లకు పోలీసుస్టేషన్లనే అడ్డాలుగా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి గతంలో న్యాయస్థానాలు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. ఆ విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ... ఇప్పుడు అనేక పోలీసుస్టేషన్లలో భూ వివాదాలను పరిష్కరించడం మామూలు విషయంగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే సివిల్ వివాదాలు లేకపోతే స్టేషన్‌తో పాటు అధికారుల ఖర్చులు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. తమ జేబులు నింపేవి కూడా అవే కావడంతో కింది స్థాయి పోలీసులు వాటి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే బయటపడితే ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో సాధ్యమైనంత వరకు కేసు రిజిస్టర్ చేయకుండానే వ్యవహారం చక్కబెడుతుంటారు. అప్పటికీ సెటిల్ కాకపోతే తాము ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు ఇరు వైపుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఆ తర్వాత కథ నడిపిస్తున్నారు. కేసు నమోదయితేనే సివిల్ కేసుల్లో తలదూర్చుతున్నారని తెలుస్తోంది. అసలు కేసే నమోదు చేయకపోతే? పోలీసులకు ఇబ్బందే ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కేసు నమోదు తప్పనిసరిగా మారుతుంది. అలాంటప్పుడు తమకు అనుకూలమైన లాయర్ల వద్దకు క్లైంట్స్ను పంపే పోలీసులు కోర్టు రిఫర్డ్ ద్వారా రమ్మని చెప్పి కేసులు నమోదు చేస్తుంటారు. వాటి విభజన చాలా కష్టం... ‘ఇచ్చట సివిల్ కేసులు నమోదు చేసుకోం... వివాదాలు పరిష్కరింపబడవు’ దాదాపు ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ ఈ బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. అయితే సివిల్ కేసులు నమోదు చేసుకోవడం మానేసిన ఖాకీలు... వచ్చిన కేసునల్లా సెటిల్మెంట్ చేయడం మాత్రం మర్చిపోవట్లేదు. దీనికి కారణం భూ వివాదాల్లో సివిల్, క్రిమినల్ విభజించడం చాలా కష్టం. ఈ రెండింటి మధ్యా ఓ చిన్న గీత మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే... అది సివిల్ వివాదం అవుతుంది. దీనిపై న్యాయస్థానంలోనే తేల్చుకోవాలి. అదే వ్యక్తి స్థలాన్ని ఆక్రమించే క్రమంలో కూల్చివేతలు, బెదిరింపులకు, దాడులకు దిగితే అది క్రిమినల్ కేసుగా మారుతుంది. అంటే.. పోలీసుల చేతికి వచ్చినట్లే. ఈ పరిణామాల నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు, కఠిన చర్యలు లేకుండా పోలీసులను, సివిల్ కేసులను వేరు చేయడం సాధ్యంకాదని వినిపిస్తోంది. అవన్నీ అటకెక్కిపోయాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుల సివిల్ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్ 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.చదవండి: అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల కూడా.. అప్పట్లో రాచకొండ లేకపోవడంతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు కమిషనర్ అధ్యక్షుడిగా, ఐజీ స్థాయి అధికారులైన అదనపు కమిషనర్ (సమన్వయం), అదనపు కమిషనర్ (నేరాలు) సభ్యులుగా, సైబరాబాద్ కమిషరేట్ విషయానికి వస్తే అధ్యక్షుడిగా పోలీసు కమిషనరే ఉన్నప్పటికీ సభ్యులుగా పరిపాలన విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, క్రైమ్ డీసీపీ వీటిని ఏర్పాటు చేశారు. ఆపై ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లకు (ఎస్ఓపీ) రూపమిచ్చి వెబ్సైట్లలో పొందుపరిచారు. కాలక్రమంలో ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్మెంట్లు కొనసాగుతున్నాయి. -
పారదర్శకంగా గ్రూప్–1 నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలను పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) హైకోర్టులో వాదనలు వినిపించింది. మూల్యాంకనం, హాల్ టికెట్ల జారీపై పిటిషనర్ల వాదనను తప్పుబట్టింది. వందల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాసినప్పుడు ఇలాంటి ఆరోపణలు సహజమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. 2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు బుధవారం విచారణ కొనసాగించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదిస్తూ.. ఈ గ్రూప్–1లో ఎంపికవుతున్న వారు సమాజానికి కీలకమైన సేవలందిస్తారని, వీరంతా భవిష్యత్ తెలంగాణకు వెన్నెముక లాంటి వారని అన్నారు.వీరి ఎంపిక పారదర్శకంగా జరగకపోతే ప్రమాదకమని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజ్యాంగ సంస్థల అంశాల్లో సెక్షన్ 226 ప్రకారం రెండు సందర్భాల్లో మాత్రమే హైకోర్టు జోక్యం చేసుకోగలదని చెప్పారు. మోసపూరితంగా నిర్వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించారు. బండిల్ ఆధారంగా అభ్యర్థిని తెలుసుకోలేరు.‘ఒక్కో పేపర్ ముగ్గురితో దిద్దించాం. ఇద్దరు ఇచ్చి న అత్యధిక మార్కుల సరాసరిని పరిగణనలోకి తీసుకుని ఫలితాలు వెల్లడించాం. అందరు అభ్యర్థులకు ఇదే విధానాన్ని అనుసరించాం. పదే పదే మూల్యాంకనం అన డం కాదు.. అంతా కలిపి ఒక ప్రక్రియ. బండిల్ ఆధారంగా సెంటర్, అభ్యర్థిని తెలుసుకునే అవకాశమే లేదు. బార్ కోడ్ అధారంగానే జవాబు పత్రాలు దిద్దడానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ బార్ కోడ్, అభ్యర్థి ఎవరో మూల్యాంకనం చేసే వారికి తెలిసే అవకాశమే లేదు. ఒకట్రెండుసార్లు చిన్న చిన్న తప్పులు జరగడం సాధారణం. అయినంత మాత్రాన రాజ్యాంగబద్ధమైన సంస్థను పదే పదే తప్పుబట్టడం సరికాదు. ప్రక్రియనంతా ప్రధాన మూల్యాంకన దారు పర్యవేస్తుంటారు. నంబర్లు ఒక ఆర్డర్లో ఉండటం కోసమే మెయిన్స్‌కు విడిగా హాల్‌టికెట్లు ఇచ్చాం. గతంలో పోలీస్ బోర్డు, జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు కూడా ఇలాగే పరీక్షలు నిర్వహించారు. హాల్‌టికెట్లను అక్టోబర్‌లో జారీ చేశాం. దీనిని చాలెంజ్ చేస్తూ ఎవరూ కోర్టుకు రాలేదు. హాల్ టికెట్ అందలేదన్న అభ్యర్థులూ లేరు. అక్టోబర్‌లో జారీ చేసిన హాల్‌టికెట్లను మార్చి వరకు ఆగి, ఫలితాలు వెల్లడించాక ఎంపిక కాలేదని తెలుసుకుని చాలెంజ్ చేయడం సమంజసం కాదు’అని టీజీపీఎస్సీ న్యాయవాది వాదించారు. అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్స్టేషన్లు మారాయని.. సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా వాటిని మార్చారని పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మంగళవారం ఓ కేసు విచారణ సందర్భంగా మండిపడింది. సివిల్ వివాదాల్లో తలదూరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవి ఇతరులకు తెలిసేలా నెలకోసారి సమావేశాలు నిర్వహించి చెప్పాలని ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. ఇదీ నేపథ్యం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగోల్ బండ్లగూడలోని తన ఇంటి విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని.. స్టేషన్‌కు పిలిపించి నకిలీ కేసులు సృష్టించారని.. రూ. 55 లక్షలు చెల్లించి ఇంటిపై ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని పి. సుదర్శనం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 9:30 వరకు స్టేషన్లో ఉంచి భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించుకోకుంటే జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించారని పిటిషన్ పేర్కొన్నారు.సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని.. దీనిపై పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలని కోరారు. గత విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకావాలని రాచకొండ సీపీ జి.సు«దీర్‌బాబు, నాగోల్ సీఐని ఆదేశించడంతో మంగళవారం సీపీ ఆన్లైన్లో, సీఐ నేరుగా విచారణకు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ మరోసారి విచారణ చేపట్టారు. సీపీకి కోర్టు సూచనలు ఈ సందర్భంగా సీపీకి న్యాయమూర్తి పలు సూచనలు చేశారు. ఇకపై సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చకుండా నెలవారీగా సమావేశం నిర్వహించాలని.. ఎవరైనా అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సందేశం ఇవ్వాలని సూచించారు. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉన్నా.. ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నా పోలీసుల జోక్యంతో పిటిషన్లు హైకోర్టుకు వస్తున్నాయన్నారు. మూడు రోజుల క్రితం ఓ పోలీసు నడిరోడ్డుపై ఒకరిని కొట్టడం చూశానని.. కానీ ప్రొటోకాల్ కారణంగా తాను కారులోంచి కిందకు దిగలేకపోయానని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వ్యక్తులను కొట్టే అధికారం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీకి స్పష్టం చేశారు.సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యానికి సంబంధించి న్యాయస్థానాల ఆదేశాలను పోలీసుల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)లో చేర్చడంతోపాటు ఎస్‌వోపీలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని డీజీపీకి సూచించారు. దీంతో న్యాయస్థానం సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని సుధీర్‌బాబు చెప్పారు. అనంతరం ప్రభుత్వం తరఫున జీపీ మహేశ్‌రాజే వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జూన్ 19న తనను నిర్బంధించారని పిటిషనర్ చెబుతున్నందున.. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీసీ టీవీ ఫుటేజీని కోర్టుకు అందజేయాలని పోలీసులను ఆదేశించారు. అప్పుడే పిటిషనర్‌ను రోజంతా స్టేషన్లో ఉంచారా? లేదా? అనేది తేటతెల్లమవుతుందన్నారు. సీసీ ఫుటేజీ సమర్పణపై వివరాలు తెలుసుకొని చెప్పేందుకు ఒకరోజు సమయం కావాలన్న జీపీ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చుతూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. -
అవకతవకలకు ఆస్కారమిచ్చేలా టీజీపీఎస్సీ చర్యలు..
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1లో అవకతవకలకు ఆస్కారం ఇచ్చేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పరీక్షలు నిర్వహించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. అనుకున్నవారు ఎంపికయ్యేలా నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకుందన్నారు. 2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు మంగళవారం విచారణ కొనసాగించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్ వాదనలు వినిపిస్తూ.. జనవరి 11 నుంచి జనవరి 25 వరకు మూల్యాంకనం నిమిత్తం ప్రొఫెసర్లను కేటాయించాలని కోరుతూ విద్యాశాఖ అధికారులకు టీజీపీఎస్సీ లేఖ రాసిందన్నారు. అయితే, లేఖ రాయకముందే ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా సమాచారం అందిందన్నారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియం పేపర్ల మూల్యాంకనం కోసం ప్రొఫెసర్లను నియమించినా.. ఆ భాషలు వచ్చినవారే ఆయా పేపర్లు దిద్దారా అనేది స్పష్టత లేదన్నారు. మూల్యాంకనం కోసం ప్రొఫెసర్లకు ఇచ్చి న జవాబు పత్రాలపై బండిల్ నంబర్ ఉంటుందని, దీని ఆధారంగా అది ఏ సెంటర్‌కు చెందినదో తెలుసుకోవచ్చన్నారు. తద్వారా ఏ వ్యక్తిదో తెలుసుకునేందుకు ఆస్కారం ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఒకే పేపర్ పలువురు ప్రొఫెసర్లు దిద్దారని చెబుతున్నా.. అందరూ ప్రొఫెసర్లు అన్ని రోజులు పనిచేయలేదన్నారు. అంటే ఎంపిక చేసిన ప్రొఫెసర్లు మాత్రమే ఒకే పేపర్‌ను పలుమార్లు మూల్యాంకనం చేసినట్టు తెలుస్తోందన్నారు. మరో సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లను జారీ చేయడం ఇదే తొలిసారని, టీజీపీఎస్సీ చరిత్రలో ఇది ఎప్పటికీ మాయనిమచ్చగా మిగిలిపోతుందన్నారు. ఎంపిక చేసిన వారు సెలెక్ట్ అయ్యేలా చూసే చర్యలు ఇక్కడి నుంచే షురూ అయ్యాయన్నారు. అనంతరం ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనల కోసం విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
అలాంటి అధికారుల ఫొటోలు ట్యాంక్‌బండ్‌పై పెట్టాలి: తెలంగాణ హైకోర్టు
తరాలు మారుతున్నా మున్సిపల్ అధికారులు పని తీరు మాత్రం మారడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేయడమేగానీ, సమస్యను వెంటనే పరిష్కరిద్దాం అనే ఆలోచన చేయరని తప్పుబట్టింది. ఇంకా ఎన్నాళ్లు ఇలా వ్యవహరిస్తారో అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ఆదేశి స్తూ.. విచారణ వాయిదా వేసింది. సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ తాలూకా ఖానామెట్‌లోని తమ భూమిలో రాయపాటి ప్రతిభ, రాయపాటి శ్రీహర్ష, జీబీ ప్రసాద్ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ సయ్యద్ రహీమున్నిసా సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘నోటీసులిస్తారు కూల్చి వేతలు ఉండవు. వచ్చే సోమవారం నుంచి ప్రతీ వారం చేపట్టిన కూల్చివేతల వివరాలు కోర్టు ముందు ఉంచేలా స్టాండింగ్ కౌన్సెళ్లకు ఆదేశాలిస్తా. అనధికారిక నిర్మాణాలకు, నగర విధ్వంసానికి ఈ స్టాండింగ్ కౌన్సెళ్లు, అధికారులే బాధ్యులు. ఎవరికి వారు మా పని మేం చేశామంటూ చేతులు దులుపుకుంటున్నారు. స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశామని స్టాండింగ్ కౌన్సెళ్లు.. ఉత్తర్వులిచ్చాం, టాస్ఫోర్స్కు బదిలీ చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్.. ఈ లేఖను పోలీసులకు అందజేశామని టాస్‌ఫోర్స్.. శాంతిభద్రతల్లో తలమునకలై మేం ఆ పనిని వాయిదా వేశామని పోలీసులు.. ఇలా ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అధికారులు, స్టాండింగ్ కౌన్సెళ్ల పేర్లు రాత్రి పూట కూడా స్పష్టంగా కనిపించేలా ట్యాంక్‌బండ్ నెక్లెస్ రోడ్‌పై విద్యుత్ దీపాలతో పోస్టర్లు వేయించాలి’అని అసహనం వ్యక్తంచేశారు. -
మున్సిపల్ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారు..ఎందుకు ఆలస్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు తెలుసుకొని తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 25న నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాలపరిమితి ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ నిర్మల్ నటరాజ్‌నగర్‌కు చెందిన రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీ.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. సర్కార్, ఎస్ఈసీ తీరు చట్టవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆరి్టకల్ 243 యూ, 243 జెడ్‌ఏలను ఉల్లంఘించేదిగా ఉందన్నారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019లోని నిబంధనలను ప్రభుత్వం పాటించకపోవడం, మూడు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఎలా ఆదేశాలిస్తామని న్యాయమూర్తి ప్రశ్నించారు.కేంద్ర ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందా అని అడిగారు. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్సీఐ పాత్ర ఉండదన్నారు. వార్డుల రిజర్వేషన్లు సహా అన్ని అంశాలు పూర్తి చేసిన తర్వాతే కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తుందని చెప్పారు. దీనిపై ఏజీపీ సౌమ్య స్పందిస్తూ.. సర్కార్ నుంచి సూచనలు తీసుకొని చెప్పేందుకు రెండు వారాలు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి.. విచారణను వాయిదా వేస్తూ, ఆ లోగా వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి, నిర్మల్ కలెక్టర్, కమిషనర్, ఎస్ఈసీలకు నోటీసులు జారీ చేశారు. -
ఐఏఎంసీకి భూకేటాయింపు చెల్లదు..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 2021లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూకేటాయింపును హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ సర్వే నంబర్83/1లో 3.70 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 126ను జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనా ధర్మాసనం కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఐఏఎంసీ ఒప్పందంలో భాగంగా ట్రస్టు బోర్డుకు ఆస్తులను విక్రయించే అధికా రం ఉంటుందంటూ ఒక ముఖ్యమైన నిబంధన క్లాజ్ 6 (డీ)ను చేర్చడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు బట్టింది.తెలంగాణ భూ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూమికి మార్కెట్ విలువ చెల్లింపును తప్పనిసరి చేసే ఏపీ ఏలియనేషన్ ఆఫ్ స్టేట్ ల్యాండ్స్ రూల్స్–1975ను ఈ భూ కేటా యింపు ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. ఐఏఎంసీ చట్ట బద్ధమైన సంస్థగా కంపెనీల చట్టం కింద నమోదు కాలేదని.. అందువల్ల ఉచిత భూమికి అనర్హమైనదిగా పరిగణించాల్సిందేనని తేల్చిచెప్పింది. గత నాలుగేళ్లలో ఐఏఎంసీ పనితీరు ఆశాజనకంగా లేదంటూ సంస్థ భవి ష్యత్తుపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఈ ఏడాది జనవరి 29 నాటికి 15 ఆర్బిట్రేషన్ కేసులనే ఐఏఎంసీ నిర్వహించిందని (అందులో 11 అనుకూలంగా)... 57 మధ్యవర్తిత్వ కేసుల్లో 17 మాత్రమే అనుకూలంగా నిర్వహించిందని హైకోర్టు అభిప్రాయ పడింది. అయితే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల నిమి త్తం ఏటా రూ. 3 కోట్ల మేర చెల్లింపులకు అనుమ తిస్తూ జారీ చేసిన జీవోలు 76, 365లను మాత్రం ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఐఏఎంసీ లాంటి కొత్త సంస్థకు ఆర్థిక సాయం అందించినా.. ఓ ప్రైవేట్ సంస్థకు అది శాశ్వతంగా ఉండ కూడదని హితవు పలికింది. ఐదేళ్ల తర్వాత ఆర్థిక సాయాన్ని కొనసాగించాలా వద్దా? అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని తీర్పులో సూచించింది.ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఇవీ.. ఐఏఎంసీ ట్రస్టుకు అత్యంత విలువైన ప్రాంతంలో రూ. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కేటా యిస్తూ 2021 డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో 126 విడుదల చేసింది. అలాగే నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు 76, 365లను, కేసుల కేటాయింపునకు జీవో 6ను జారీ చేసింది. ఏఐఎంసీని 2021 డిసెంబర్ 18న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అయితే ఆ జీవోలను కొట్టేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొనేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు ఎ.వెంకట్రామిరెడ్డి, వ్యక్తిగత హోదాలో కోటి రఘునాథరావు వేర్వేరుగా 2023లో ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్)ను దాఖలు చేశారు.ఓ ప్రైవేట్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు అత్యంత విలువ చేసే భూమిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. ఇది తెలంగాణ అర్బన్ ఏరియాస్ (డెవలప్మెంట్) చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఐఏఎంసీకి నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ. 3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుందని.. ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ పిల్లపై జనవరిలో వాదనలు ముగించిన జసిŠట్స్ కె.లక్ష్మణ్, కె.సుజన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.వాదనలు సాగాయిలా..పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రూ. 350 కోట్లకుపైగా విలువైన 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఐఏఎంసీకి కేటాయించడం రాష్ట్రానికి తీరని నష్టం. ఓ ప్రైవేట్ ట్రస్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించడమే కాకుండా నిర్వహణ పేరిట ఏటా రూ. 3 కోట్ల నిధులు కేటాయించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రైవేట్‌సంస్థకు భూకేటాయింపు జరిపారు’ అని పేర్కొన్నారు. ఐఏఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రజాప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూమి, నిధులు ఇచ్చిందన్నారు.ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ ‘ఐఏఎంసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే పలు అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కారానికి దోహదపడుతుంది. ఇలాంటి వివాదాలు కేవలం న్యాయస్థానాల్లోనే కాకుండా బయట కూడా చేసుకోవచ్చని న్యాయస్థానాలే చెబుతున్నాయి. ఐఏఎంసీతో వివాదాలు పరిష్కారమైతే కోర్టులపైనా భారం తగ్గుతుంది. ఇందులో ప్రజాహితం ఉన్నందునే ప్రభుత్వం భూమి, నిధులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఐఏఎంసీ ట్రస్ట్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రితోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ట్రస్టీలుగా ఉన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయీ దుర్వినియోగం కాలేదు’ అని నివేదించారు.ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయిందన్న ధర్మాసనం‘ప్రభుత్వాల నుంచి నిరంతర ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్) తన లక్ష్యాలను నెరవేర్చడంలో ఎలా విఫలమైందో మేము ఎత్తి చూపాలనుకుంటున్నాం. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి 1995లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఐసీఏడీఆర్ ఒక రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పడింది. దాని ప్రారంభం నుంచి ఐసీఏడీఆర్ 49 మధ్యవర్తిత్వ కేసులనే స్వీకరించిందని ఉన్నతస్థాయి కమిటీ నివేదిక పేర్కొంది.ఆర్థిక సహాయం ఉన్నా కేసుల పరిష్కారం నామమాత్రంగానే ఉన్నందున ఐసీఏడీఆర్‌ను స్వాధీనం చేసుకోవాలని.. దానికి మంజూరు చేసిన శాశ్వత లీజును రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఐఏఎంసీ అలా మారదని మేము ఆశిస్తున్నాము. అయితే మూడేళ్లుగా ఏటా రూ. 3 కోట్ల ఆర్థిక సాయం, ఉచిత కార్యాలయ స్థలాన్ని అందించినా ఐఏఎంసీ తనను తాను నిలబెట్టుకోలేకపోయింది. ప్రభుత్వం ఆశించిన మేరకు భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకునే సంకేతాలను చూపించలేకపోయింది. ఐఏఎంసీ ప్రారంభానికి మద్దతు సమర్థనీయమే.కానీ అలాంటి సంస్థలకు నిరంతర, శాశ్వత ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు. ఐఏఎంసీ పనితీరును ఏటా సమీక్షించి, దాని ఖాతాలను తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) లేదా మరే ఇతర సమర్థ అధికారి ద్వారా ఆడిట్ చేయించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. గత ఒప్పందం మేరకు ఐదేళ్ల తర్వాత ఐఏఎంసీ పనితీరుకు లోబడి నిధుల విడుదల ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. నిధుల కేటాయింపునకు పనితీరే కొలమానం..‘ప్రభుత్వ వివాదాలన్నీ ఐఏఎంసీలోనే పరిష్కరించుకునేలా ఇచ్చిన జీవో సమర్థనీయమే అయినా.. పలు సూచనలు చేయాల్సి ఉంది. రూ. 3 కోట్లకుపైగా విలువైన అన్ని వివాదాలను ఐఏఎంసీకి మధ్యవర్తిత్వం కోసం సూచించాలనే ప్రభుత్వ నిర్ణయం విధానపరమైనది. అయితే ప్రజాధనంతో ఈ అంశం ముడిపడి ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కేసులను ఐఏఎంసీకి సూచించడం, దానికయ్యే ఖర్చులను పరిశీలించాల్సి ఉంటుంది. ఐఏఎంసీ ద్వారా మధ్యవర్తిత్వ ఖర్చు ఎక్కువగా ఉందని.. ఖజానాపై గణనీయమైన భారం పడుతున్నట్లు గురిస్తే ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవచ్చు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత పిల్లను పాక్షికంగా అనుమతిస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది.మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాలి..‘కేంద్ర న్యాయ శాఖ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి దేశంలో సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఐసీసీ కోర్టు, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ), లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ (ఎల్‌సీఐఏ), హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (హెచ్కెఐఏసీ)ల మాదిరిగానే మధ్యవర్తిత్వ సేవలను అందించే సంస్థలను స్థాపించాలని సిఫార్సు చేసింది.సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ మద్దతు ప్రాముఖ్యతను వివరించింది. ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు సులభతరం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. మధ్యవర్తిత్వ సంస్థల నిర్వహణకు ప్రారంభ మూలధనం అవసరమని.. దాన్ని ప్రభుత్వం అందించవచ్చని పేర్కొంది. మధ్యవర్తిత్వ సంస్థలకు ప్రభుత్వాలు మద్దతివ్వడం సంతృప్తికరమే’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. -
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు
-
‘సర్పంచ్’ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(సర్పంచ్) నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మాధవి బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను సైతం పరిగణలోకి తీసుకున్నట్టు ధర్మాసనం తెలిపింది. అందులో భాగంగానే మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి.పిటిషనర్ల తరపు వాదనలు..గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసినా.. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధం. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులుపడుతున్నారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలి.తెలంగాణ ప్రభుత్వం తరఫున..సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ..రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తికాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక.. ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున... ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయవాది సమాధానమిస్తూ..రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.ఈసీ, ప్రభుత్వ అభ్యర్థన..మొత్తంగా.. ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా.. ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం జూన్ 23వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఆ తీర్పును వెల్లడించింది. కాగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. దాంతో ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధనను గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికలైనా పెట్టండి.. లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లలో కొంతమంది పౌరులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. -
టైటిల్ వివాదాలు ‘సివిల్’లోనే తేల్చుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో దశాబ్దాల నుంచి ఉన్న ఆస్తి వివాదానికి సంబంధించిన రిట్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 226 కింద జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తీవ్రమైన టైటిల్ వివాదాల పరిష్కారం కోసం ఆయా వ్యక్తులు సివిల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశిస్తూ పలు పిటిషన్లను కొట్టివేసింది. అసలైన రికార్డులు లేకపోవడం, పత్రాల ప్రామాణికతకు సంబంధించి విరుద్ధమైన వాదనలు ఉన్నప్పుడు.. అలాంటి వివాదాలను పరిష్కరించడానికి సివిల్ దావానే సరైన మార్గమంటూ జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి తీర్పు వెలువరించారు. షేక్‌పేట్ గ్రామం (ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4) సర్వే నంబర్ 396 (సవరించిన సర్వే నం. 225)లోని ఏడెకరాలకు సంబంధించి దశాబ్దా లుగా వివాదాలున్నాయి. ఈ భూమి తొలుత హైదరాబాద్ మాజీ ప్రధాన మంత్రి (దివాన్) మహారాజా సర్ కిషన్ పెర్షాద్ యాజమాన్యంలో ఉంది. తర్వాత ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో జూబ్లీహిల్స్ గైరా జిరాయట్టి పట్టాగా నమోదై ఉంది. కాగా, మహారాజా కిషన్ పెర్షాద్ చట్టబద్ధమైన వారసులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత యజమానుల పూర్వీకులకు అనుకూలంగా అమలు చేసిన అమ్మకపు పత్రాలు చెల్లవని పేర్కొన్నారు. అర్బన్ ల్యాండ్ (సీలింగ్, నియంత్రణ) చట్టం–1976 కింద పొందిన అనుమతులు మోసపూరితమన్నారు. ప్రస్తుత యజమానులు ప్రెస్టీజ్ గ్రూప్‌నకు అనుకూలంగా అమలు చేసిన డెవలప్మెంట్ అగ్రిమెంట్, జీపీఏని రద్దు చేయాలని కూడా పిటిషనర్లు కోరారు. ఈ తీర్పు ప్రభావం ఉండదు.. ప్రతివాదులైన.. ప్రైవేట్ కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ సంస్థ (ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్) యూఎల్సీ అనుమతుల తర్వాత నాటి హక్కుదారు అసదుల్లా ఖాన్ వారసుల నుంచి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశామని వాదించారు. ‘1937 నాటి రిజిస్టర్డ్ పత్రాల ద్వారా అసలు యజమానుల నుంచి టైటిల్‌ను తెలుసుకున్నాం. యూఎల్సీ నుంచి ఆమోదం పొందిన తర్వాత వారు 1980లో భూమిని విక్రయించారు’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. యూఎల్సీ రికార్డులు అందుబాటులో లేవని, వివాదాస్పద ఫొటో కాపీలు మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రభుత్వం అంగీకరిస్తోందన్నారు.మోసం ఆరోపణలకు సివిల్ విచారణ అవసరమని.. టైటిల్ వివాదాలు, వారసత్వ సమస్యలను సివిల్ కోర్టే నిర్ణయించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ రికార్డులు మాత్రమే యాజమాన్యాన్ని ఇవ్వవని తేల్చిచెప్పారు. రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ.. పరిష్కారం కోసం సివిల్ కోర్టును సంప్రదించవచ్చంటూ స్వేచ్ఛనిచ్చారు. సివిల్ కోర్టు విచారణపై ఈ తీర్పు ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. -
స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ (జూన్ 23, 2025న) జరిగిన విచారణలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించింది. దీనిలో భాగంగా ఎన్ని రోజుల్లో ఎన్నికల నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అడిగింది. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. సమయం కావాలని కోరింది. అయితే ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వం తమ ప్రక్రియ పూర్తి చేస్తే తాము ఎన్నికల నిర్వహణకు ముందుకెళతామని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. దాంతో ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధనను గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికలైనా పెట్టండి.. లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లలో కొంతమంది పౌరులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. -
తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాటాలు కోరకుండా చేయాలి
సాక్షి, హైదరాబాద్: నిత్యం పెరిగిపోతున్న తోబుట్టువుల ఆస్తి తగాదాలు, వివాహ వివాదాలపై ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్నత చదువులు చదువుకుని.. మంచి ఉద్యోగం చేస్తూ.. ఆర్థికంగా బాగానే ఉన్నా.. స్వల్ప ఆస్తి కోసం కొందరు సోదరులు, సోదరీమణులతో కొట్లాడుతుంటారన్నారు. ఒకరిపై ఒకరు కేసులు, పిటిషన్లు వేసుకుంటూ న్యాయస్థానాలను పెద్ద ఎత్తున ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మునిసిపల్ అధికారులు అమలు చేయడం లేదంటూ హైదరాబాద్ నివాసి చార్టర్డ్ అకౌంటెంట్ రాహుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూల్చిన తర్వాత స్థలాన్ని సమానంగా పంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. 2024, ఫిబ్రవరిలో జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్ ప్రకారం చర్యలు చేపట్టి.. స్టేటస్ రిపోర్టును తమకు తెలియజేయాలని సూర్యాపేట మునిసిపాలిటీని ఆదేశించారు. తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేశారు. కేసు విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన వ్యక్తి ఆ భవనంలో ఉంటున్న వారికి సోదరుడు అని.. నలుగురి మధ్య ఆస్తి వివాదం ఉందని తెలుసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఇలాంటి పిటిషన్లు న్యాయస్థానాల్లో పెరిగిపోతున్నాయని, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారంతోనే కేసులు..: ‘హైకోర్టుకు అధికారం ఉండి ఉంటే ఆస్తి తగదాలు, వివాహ వివాదాల్లో ఆస్తులన్నింటినీ న్యాయస్థానం కస్టడీలోకి తీసుకునేవాళ్లం. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి కోసం కొట్లాటలు పెట్టుకుని ఏం సాధిస్తారు? కోర్టు చుట్టూ తిరిగి చివరికి ఆ ఆస్తి పొందిన వాళ్లు కూడా సంతోషంగా ఉండలేరు. ఇక్కడ 264 గజాలు ఆరుగురు (తల్లిదండ్రులతో కలిపి) పంచుకోవాలి. దాదాపు 44 గజాల స్థలం కోసం కొట్లాడుతున్నారు. అందులో ఇళ్లు కట్టుకునేందుకు అధికారులు అనుమతి కూడా ఇవ్వరు. దాంతో ధనవంతులూ కాలేరు. చివరకు ఏం సాధించినట్లు.. అతి పెద్ద సమస్య ఏంటంటే అహంకారం. కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పరిష్కార నిపుణుడిని పెట్టినట్లు ఇక్కడ కూడా అలాంటి వ్యక్తిని ఏర్పాటుచేసి ఆస్తులను కస్టడీలోకి తీసుకుని.. పార్టి షన్ సూట్లో ఆస్తుల పరిష్కార ప్రక్రియ చేపడితే సరిపోతుంది. అసలు.. తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు కుమారుడు, కుమార్తె ఆస్తుల్లో వాటాను కోరకుండా చర్యలు తీసుకుంటే తెలిసొస్తుంది. ఉన్నత చదువులు చదువుకుంటారు.. మంచి ఉద్యో గం చేస్తుంటారు.. ఆర్థికంగా బాగానే ఉంటారు.. అయినా స్వల్ప ఆస్తి కోసం కూడా కొట్లాడుతుంటారు. కుటుంబ సభ్యులతో కొట్లాడి వెయ్యి గజాలు సాధించుకున్నా అది భవిష్యత్‌లో సంతృప్తినివ్వదు. అహంకారం వీడితే సమస్యలకు కుటుంబ స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుంది’అని పేర్కొన్నారు. -
దేవుడికీ అర్థం కారు!
సాక్షి, హైదరాబాద్: దేవుడు దిగివచ్చినా మున్సిపల్ అధికారుల తీరును అర్థం చేసుకోవడం సాధ్యం కాదని హైకోర్టు మండిపడింది. కళ్ల ముందే అంతస్తులకు అంతస్తులు భవన నిర్మాణం జరుగుతున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారని.. తీరా నిర్మాణం పూర్తయ్యాక విధులు గుర్తుకొచ్చి కూల్చివేత అంటూ హడావుడి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులే బాధ్యులని చెప్పింది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించగా.. ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. ‘నెలల తరబడి భవన నిర్మాణమంతా పూర్తయ్యే వరకు మున్సిపల్ అధికారులు ఏం చేస్తుంటారు? ఆ ప్రాంతంలోని ఏరియా ఇన్స్పెక్టర్లు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా? సెక్షన్ 461 ప్రకారం నిర్మాణం ప్రారంభంలోనే సీజ్ చేసే అధికారమున్నా ఎందుకు చేయరు? ఎవరో పిటిషన్ వేస్తే.. కోర్టు ఆదేశాలు జారీ చేస్తే.. తర్వాత స్పీకింగ్ ఆర్డర్స్ ఇస్తారు. స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చేలోపు భవన నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు కూల్చివేత అంటూ హడావుడి ప్రారంభిస్తారు.. రాష్ట్రంలో ఏటా వెలుస్తున్న అనధికార నిర్మాణాలను ఎందుకు ఆపలేకపోతున్నారు? విచిత్రమేంటంటే.. అక్రమ నిర్మాణం చేసేటప్పుడు వారికి కనిపించదు.. కానీ, పన్ను వసూలుకు మాత్రం ఆ భవనం కనిపిస్తుంది.. దాని వివరాలన్నీ తెలుస్తాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంటారు. మునిసిపల్అధికారులను దేవుడు కూడా బాగుచేయలేడు. ప్రజలకు మునిసిపల్ అధికారులు, న్యాయవాదులు, కోర్టుల గురించి తెలుసు. అధికారుల తీరు మారకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు’అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. క్రమబద్ధీకరణపై నిర్ణయం వరకు యథాతథస్థితి జీహెచ్ఎంసీ చట్టం–1955లోని సెక్షన్ 462 కింద చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నోటీసు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌కు చెందిన కె.రఘువీర ఆచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భవనం కూల్చివేస్తామంటూ అధికారులు నోటీసులు జారీ చేయడం చట్టవిరుద్ధమన్నారు. భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన నోటీసులను నిలుపుదల చేయాలని కోరారు. బీఆర్ఎస్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. చాలాప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులకు అధికారులు సహకరిస్తున్నారని, అందుకే నిర్మాణాలు పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. పిటిషనర్ సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకునే వరకు యథాతథస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను జూలై 15కు వాయిదా వేశారు.


