Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Sakshi Media reacts On TTD Legal Notice Row1
ఉడత ఊపులకు భయపడేది లేదు.. పోరాటం ఆగదు: సాక్షి మీడియా

సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం కథనాలల వ్యహారంలో లీగల్‌ నోటీసుల అంశంపై సాక్షి మీడియా సంస్థ స్పందించింది. టీవీ5 లీగల్‌ నోటీసుల ఉడత ఊపులకు భయపడేది లేదని, పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది. మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు.. అది నిజంకాదా?. క్షమాపణ చెప్తే చనిపోయిన వారు బతికొస్తారా? అని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నది నిజం కాదా?. బీఆర్‌నాయుడి హయాంలో.. తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా?. మీ చేతకానితనంలో సామాన్యులకు ఇబ్బందులు వాస్తవం కాదా?. రోజుల తరబడి క్యూలైన్‌లో ఇబ్బంది పడుతోంది నిజం కాదా?. ఏఐ టెక్నాలజీతో దర్శనాలు సాధ్యం కాదని మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం వెంకన్న సాక్షిగా చెప్పింది నిజం కాదా?. డిప్యూటీ సీఎం పవన్‌ దర్శనానికి వెళ్లారనే అక్కసుతో పూజారికే మోమో ఇచ్చింది నిజం కాదా?.. అని సాక్షి మీడియా సంస్థ నిలదీసింది.భక్తులకు సరైన సదుపాయలు కల్పించాలన్నదే మా తాపత్రయం. టీడీపీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి ఆకాంక్ష. సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్‌. శ్రీవారిని కేవలం వీఐపీలకు పరిమితం చేయడంపై ప్రశ్నించడం ఆగదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై మా పోరాటం ఆగదు అని సాక్షి మీడియా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

KTR Key Comments on Vice President Election2
‘‘రాహుల్‌ గాంధీ మా బాస్‌ కాదు..’’ ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ మద్దతు.. ఎన్డీయే అభ్యర్థికా? ఇండియా కూటమి అభ్యర్థికా? అనే ఉత్కంఠ కొనసాగుతున్నవేళ.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉపరాషష్ట్రపతి ఎన్నికపై జరిగేదంతా డ్రామా. బీసీలపై ప్రేమ నోటిపైనేనా.. చేతల్లో ఉండవా. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. మేం ఏ కూటమిలో లేం. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తిని కచ్చితంగా వ్యతిరేకిస్తాం..రాహుల్‌ గాంధీ మా బాస్‌ కాదు.. మోదీ మా బాస్‌ కాదు. ఢిల్లీలో మాకు ఏ బాస్‌ లేరు. మమ్మల్ని నడిపించేవారెవరూ లేరు. తెలంగాణ ప్రజలే మా బాస్‌. అందుకే మేం కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణం మా నిర్ణయం ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్‌.. రెండూ దౌర్భాగ్యమైన పార్టీలే. కానీ, తెలంగాణకు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఎవరు తెస్తారో.. వారికే మా మద్దతు ఉంటుంది. సెప్టెంబర్ 9 లోపు ఎవరు ఎరువులు ఇస్తామంటే వారికి మద్దతిస్తాం’’ అని కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదు. అయితే.. రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు.

Rohit, Virat Kohli ODI Retirement Confirmed, Latest ICC Rankings Leaves Fans Worried3
రోహిత్‌, కోహ్లికి ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. ఆకస్మికంగా తొలగింపు

ఐసీసీ తాజాగా (ఆగస్ట్‌ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలను భారీ షాక్‌కు గురి చేశాయి. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు.. వారం తిరిగేలోపే ర్యాంకింగ్స్‌ నుంచి పూర్తిగా మాయమైపోయారు. ఇవాళ (ఆగస్ట్‌ 20) ‍ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌, కోహ్లి పేర్లు కనిపించలేదు. ఇది చూసి రోహిత్‌, కోహ్లితో పాటు వారి అభిమానులు కూడా షాక్‌కు గురవుతున్నారు. ఇంత సడెన్‌గా తమ ఆరాధ్య ఆటగాళ్ల పేర్లు ఎలా మాయమైపోయాయని ఆశ్చర్యపోతున్నారు. ఇలా జరగడంలో ఐసీసీ తప్పిదమేమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. కొందరేమో రోహిత్‌, కోహ్లి టీ20, టెస్ట్‌ తరహాలో వన్డే రిటైర్మెంట్‌ కూడా సడెన్‌గా ప్లాన్‌ చేశారేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఐసీసీ రూల్స్‌ ఇలా..!ఐసీసీ ర్యాంకింగ్ రూల్స్‌ ప్రకారం.. ఓ ఆటగాడు 9-12 నెలల కాలంలో సంబంధింత ఫార్మాట్‌లో ఒ‍క్క మ్యాచ్‌ కూడా ఆడకపోతే ర్యాంకింగ్స్‌ నుంచి తొలగిస్తారు. అయితే తాజా ఉదంతంలో రోహిత్‌, కోహ్లి విషయంలో అలా జరగలేదు. వీరిద్దరు మార్చి 9న, అంటే ఐదు నెలల కిందట ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడారు. ఈ లెక్కన రోహిత్‌, కోహ్లి పేర్లు సడెన్‌గా వన్డే ర్యాంకింగ్స్‌ నుంచి తొలగించడానికి వీల్లేదు.మరి ఏం జరిగి ఉంటుంది..?రోహిత్‌, కోహ్లి పేర్లు వన్డే ర్యాంకింగ్స్‌ నుంచి ఆకస్మికంగా తొలగించడం వెనుక ఏదైనా కుట్ర (బీసీసీఐ) దాగి ఉందా అని వారి అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ ఇద్దరు 2027 వన్డే వరల్డ్‌కప్‌ వరకు ఈ ఫార్మాట్‌లో కొనసాగుతామని పరోక్షంగా చెప్పారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ సానుకూలంగా లేదని తెలుస్తుంది.రోహిత్‌, కోహ్లి రెండు ఫార్మాట్లలో లేకపోయినా యువ ఆటగాళ్లతో టీమిండియా పటిష్టంగా ఉందని వారి భావన. వీరిద్దరు వన్డేల నుంచి తప్పుకున్నా జట్టుపై పెద్ద ప్రభావముండదని వారి అభిప్రాయం. ఇప్పటి నుంచే వన్డేల్లో రోహిత్‌, కోహ్లి ప్రత్యామ్నాయాలకు తగినన్ని అవకాశాలిస్తే 2027 వరల్డ్‌కప్‌ సమయానికి రాటుదేలతారని వారి అంచనా. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీయే రోహిత్‌, కోహ్లిలను బలవంతంగా వన్డేల నుంచి తప్పుకునేలా చేస్తుందన్న వాదన వినిపిస్తుంది. ఇందులో భాగంగానే వారి పేర్లను వన్డే ర్యాంకింగ్స్‌ నుంచి తొలగించేలా ఐసీసీకి లేఖ రాసి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఇదే జరిగి ఉంటుందని రోహిత్‌, కోహ్లి అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, వన్డే ర్యాంకింగ్స్‌ నుంచి రోహిత్‌, కోహ్లి పేర్లు తొలగింపు తర్వాత కూడా శుభ్‌మన్‌ గిల్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బాబర్‌ ఆజమ్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా నుంచి శ్రేయస్‌ అయ్యర్‌ ఆరో స్థానంలో ఉన్నాడు.

Take A Look At India longest Railway Viaduct in Madhya Pradesh katni4
మరో అద్భుతం భారతీయ రైల్వే ఖాతాలో..

ఈ మధ్యకాలంలో ఇండియన్ రైల్వేస్‌ ఎన్నో అద్భుత ఘట్టాలను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్, పొడవైన రైల్వే టన్నెల్, చారిత్రక పాంబన్ బ్రిడ్జ్.. ఇలాంటి నిర్మాణాల తర్వాత ఇప్పుడు మరో ‘వావ్‌’ ఫీట్‌ను సాధించింది. అదే.. దేశంలోనే అత్యంత పొడవైన గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్‌ పూర్తి చేయడం. కట్నీ జంక్షన్‌లో ఇంజినీరింగ్ అద్భుతం.. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జంక్షన్ వద్ద ఈ గ్రేడ్‌ సెపరేటర్‌ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జ్‌ మొత్తం 33.40 కిలోమీటర్లు పొడవు. ఇందులో ఒకటి "అప్" ట్రైన్ల కోసం (ఇప్పటికే పూర్తయింది). మరొకటి "డౌన్" ట్రైన్ల కోసం.. ఇది 17.52 కిలోమీటర్ల పొడవుతో ఇంకా నిర్మాణంలో ఉంది. అప్‌ బ్రిడ్జ్‌ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) ఆమోదించారు. దీంతో అతిత్వరలోనే ఇది ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం.. 15.85 కిలోమీటర్ల పొడవుతో, ఫిల్లర్లపైనే నిర్మించిన ఈ ఎలివేటెడ్ ట్రాక్ నగరాన్ని పూర్తిగా మళ్లించి ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ అంటే.. రవాణా మార్గాలు (రోడ్లు, రైల్వేలు) ఒకే స్థాయిలో కాకుండా, వేర్వేరు ఎత్తుల్లో నిర్మించడమన్నమాట. తద్వారా వాటి మధ్య రాకపోకలలో అంతరాయం లేకుండా చేయొచ్చు. అంటే.. సిగ్నల్స్ లేకుండా ప్రయాణించగలవు. తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో పూర్తి కావాలనే టార్గెట్‌ ఉంది. గతి శక్తి పథకంలో భాగంగా.. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి పథకంలో భాగంగా చేపట్టబడింది. "అప్ లైన్" సెపరేటర్ నిర్మాణ ఖర్చు ₹580 కోట్లు కాగా, రెండు సెపరేటర్ల మొత్తం ఖర్చు రూ.1,247.68 కోట్లుగా అంచనా.ట్రాఫిక్ తగ్గింపు, సమయపాలన మెరుగుదల.. దేశంలోనే అతిపెద్ద రైల్వే జెంక్షన్‌ యార్డ్‌గా న్యూ కట్నీకి పేరుంది. గూడ్స్ & ప్యాసింజర్ ట్రైన్ల అధిక రాకపోకల వల్ల నిత్యం ఇక్కడ తీవ్ర రద్దీ నెలకొంటోంది. తద్వారా రైళ్ల రాకపోకలపై ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. అయితే.. తాజా గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్‌ వాడకంలోకి వస్తే ఈ సమస్య తొలిగిపోనుంది. అదెలాగంటే.. సింగ్రౌలి, బిలాస్‌పూర్ నుంచి వచ్చే ట్రైన్లు ఇక న్యూ కట్నీ జంక్షన్(కట్నీ ముద్వారా) వద్ద ఆగాల్సిన అవసరం లేదు. కోటా, బీనా వైపు వెళ్లే ట్రైన్లకు ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. అంటే.. వెస్ట్‌ సెంట్రల్‌, సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేజోన్‌ల నుంచి వచ్చే రైళ్ల రాకపోకలు సునాయసంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రయాణ సౌలభ్యం, సరుకు రవాణా మెరుగుదల.. కట్నీని మళ్లించే ట్రైన్లు ఇక నాన్‌ స్టాప్‌గా ప్రయాణించగలవు. ధన్‌బాద్, గయా, ముజఫర్‌పూర్ వంటి నగరాలకు వెళ్లే ప్రత్యేక ట్రైన్లు కూడా హాల్టింగ్‌ లేకుండా ముందుకు వెళ్తాయి. అదనంగా.. పవర్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా సకాలంలో జరిగేందుకు వీలు కల్పించనుంది. నిర్మాణంలో వినియోగించిన వనరులు15,000 టన్నుల స్టీల్1.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్1.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టినాలుగు Rail Over Rail (ROR) బ్రిడ్జ్‌లు, వాటిలో పొడవైనది 91.40 మీటర్లుఈ అద్భుతమైన నిర్మాణం భారత రైల్వేలు సాధించిన మరో ఘనతగా నిలిచింది. దేశ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

Parliament as Amit Shah tables bills in Lok Sabha on removal of jailed PM, CMs5
‘నేను అరెస్టయితే పదవికి రాజీనామా చేశా’..ప్రతులు చించి హోమంత్రిపై విసిరేసి

సాక్షి న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఈ మూడు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం, ఆ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికి పోయింది. 30 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన నేతల పదవులు రద్దయ్యేలా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లుతో రాజకీయ దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందంటూ బిల్లు ప్రతుల్ని చించివేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 3గంటల వరకు వాయిదా వేశారు.వాయిదాకి ముందు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేలా హోమంత్రి అమిత్‌షా బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతుల్ని చించి అమిత్‌షాపై విసిరేశారు. ఈ బిల్లు దేశ సమాఖ్య విధానానికి పూర్తి విరుద్దం అంటూ నినాదాలు చేశారు. గుజరాత్‌ హోమంత్రిగా ఉన్నప్పుడు అమిత్‌షా అరెస్ట్‌ అయ్యారంటూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన ఆరోపల్ని అమిత్‌షా ఖండించారు.‘అవును ..నన్ను తప్పుడు ఆరోపణలతో అరెస్ట్‌ చేశారు. నేను అరెస్ట్‌ అయినప్పుడు చేసినా నైతికంగా పదవికి రాజీనామా చేశాను’ అంటూ ప్రతిపక్ష ఎంపీలను అమిత్‌షా వారించారు.

YSRCP Bhumana Karunakar Reddy Serious Comments On BR Naidu6
టీవీ5 అబద్ధాలకు పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి: భూమన

సాక్షి, తిరుపతి: తిరుమలలో బీఆర్‌ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. బీఆర్‌ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీఆర్‌ నాయుడును చూసి వైఎస్సార్‌సీపీ భయపడదు అంటూ హెచ్చరించారు.టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘బొల్లినేని రాజగోపాల్‌ నాయుడు(బీఆర్‌ నాయుడు) ఆధ్వర్యంలో టీటీడీ ప్రతిష్ట దిగజారుతోంది. బీఆర్‌ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోంది. భక్తుల అవస్థలను బీఆర్‌ నాయుడు పట్టించుకోవడం లేదు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు. టీవీ-5 ప్రసారం చేసే అబద్ధాలకు వేల సంఖ్యలో పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి. బీఆర్‌ నాయుడు రూ.10వేల కోట్ల పరువు నష్టం ఇవ్వాల్సి ఉంటుంది.బీఆర్‌ నాయుడు, చంద్రబాబు ప్రజస్వామ్య ద్రోహం చేస్తున్నారు. తిరుమలలో బీఆర్‌ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారు. ఆయన అరాచకాలు ప్రజలందరికీ తెలుసు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను వైకుంఠం పంపించారు. టీటీడీ చైర్మన్‌ నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని అంటే మీకు అహం అడ్డు వచ్చింది. బాలాజీ నగర్ కాలనీలో బెల్ట్ షాప్ ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాలు చేయలేదా?. ఢిల్లీలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ఠలపై విజిలెన్స్ విచారణ జరగలేదా?. ఏ నీళ్లతో చేస్తే పాప పరిహారం అవుతుంది అనుకుంటామో.. పాప వినాశనంలో బోట్లు షికారు చేయించారు. మీ హయంలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టీవీ5 చానల్ ద్వారా ఈ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వైఎస్సార్‌సీపీ నాయకులపై మీ చానెల్‌లో చూపిస్తున్నారు. దీనికి మీపై పదికోట్ల రూపాయలు పరువు నష్టం వేయాలి. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నది మీరు కాదా?. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా?. మీ చానెల్ ప్రతినిధిని పెట్టుకుని మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఎవరు బిల్లులు ఇవ్వాలో మీరే చెప్తున్నారు. టీటీడీ చైర్మన్‌ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. రెండు గంటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం అన్నారు.. అది ఏమైంది?. మీ సిఫార్సులతో అడిషనల్ ఈవో కార్యాలయంలో టికెట్స్‌ పొందడం లేదా?. వీఐపీ తగ్గిస్తామని చెప్పి అత్యధికంగా టికెట్లు ఇస్తూ ఉన్నారు. శ్రీవాణి రద్దు చేస్తాము అని చెప్పి, ఈరోజు ఎక్కువ టిక్కెట్లు ఇస్తున్నారు. రద్దు చేసే దమ్ము మీకు ఉందా?. మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఒక సాధారణ వ్యక్తి బీఆర్‌ నాయుడు.. ఇన్ని లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు?. టీవీ5 చానెల్ ఎలా పెట్టాడు’ అని ప్రశ్నించారు. బీఆర్‌ నాయుడు ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడరు. బీఆర్‌ నాయుడును చూసి వైఎస్సార్‌సీపీ భయపడదు. హిందూ ధర్మాన్ని రక్షించడంలో సాక్షి మీడియా ముందుంది’ అని చెప్పారు.

Karnataka rains Jog Falls to gain vigour as Linganamakki dam gates opened7
జోరు జోరుగా జోగ్‌.. క్యూ కడుతున్న టూరిస్టులు

కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జోగ్‌ జలపాతం అద్భుత దృశ్యంతో అలరారుతోంది. భారీ వర్షాల తర్వాత జోగ్ జలపాతం అద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకాలోని షరావతి నదిపై నిర్మించిన లింగనమక్కి ఆనకట్ట గేట్లను ఆగస్టు 19న తెరిచారు. కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల తర్వాత అదనపు నీటిని విడుదల చేశారు.ఈ ఉత్కంఠభరితమైన దృశ్యాలను చూడటానికి చుట్టు పక్కల గ్రామాలనుంచి ప్రజలు క్యూ కట్టారు. సోషల్‌ మీడియాలో జోగ్‌ అందాల వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి.JOG Falls, India's 2nd highest , 830 ft Mega water fall, is at its peak now.Near Shivamogga, #Karnataka.pic.twitter.com/sMd2mBT8nq— Mahesh.BR (@Maheshbr4U) August 20, 2025 కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని పర్యాటకులు తరలివస్తున్నారు. పొగమంచులా కనిపిస్తున్న జలదృశ్యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు. రిజర్వాయర్,ఆనకట్టను నిర్వహించే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్) అధికారులు ఉదయం 10 గంటల ప్రాంతంలో గేట్లను తెరవడం ప్రారంభించారు. Time to visit #JogFalls !As linganamakki dam is filled & all crest gates are opened on Aug-19thVC: Madhu gowda pic.twitter.com/espIGjmQqY— Karnataka Development Index (@IndexKarnataka) August 20, 2025 మొత్తం 11 గేట్లను తెరిచారు. ఆనకట్టలో నీటి మట్టం ఇన్‌ఫ్లో పెరగడంతో పాటు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 19 ఉదయం నాటికి, జలాశయం పూర్తి స్థాయి 1,819 అడుగుల నీటి మట్టం ఉండగా, నీటి మట్టం 1,816.2 అడుగులుగా ఉంది.

KSR Comment: Minister Nara Lokesh Greater Than Deputy CM Pawan8
పక్కనే ఉంటూ పవన్‌ స్థాయిని తగ్గించే పనిలో!

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్‌ కల్యాణ్‌ పక్కనే లోకేశ్‌ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్‌తోపాటు లోకేశ్‌ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్‌సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్‌ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్‌ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్‌ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్‌ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్‌ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్‌ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్‌తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్‌ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్‌ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్‌ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్‌ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్‌కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్‌కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్‌తోపాటు లోకేశ్‌ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్‌ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్‌ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్‌ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్‌ లోకేశ్‌ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్‌ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్‌లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్‌ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్‌లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్‌కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్‌ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్‌ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్‌ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్‌ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్‌కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్‌ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్‌ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్‌బుక్‌ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్‌గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ICEA Demand Reclassify Mobile Phones as Essential Goods9
మొబైళ్లను 5% జీఎస్‌టీ శ్లాబ్‌లో చేర్చాలి

మొబైల్‌ ఫోన్లు, పరికరాలను, నిత్యావసర ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన 5 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లో చేర్చాలని కేంద్రానికి ఇండియా సెల్యూలార్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న 18 శాతం జీఎస్‌టీ తిరోగమన విధానమని పేర్కొంది. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్‌టీ రేట్లను రెండింటికి తగ్గించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఐసీఈఏ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లనేవి విలాస వస్తువులుగా గాకుండా విద్య, వైద్యం, ఆర్థిక సమ్మిళితత్వం, గవర్నెన్స్‌కి సంబంధించి అత్యవసర డిజిటల్‌ మౌలిక సదుపాయాలకు కీలకంగా మారాయని ఐసీఈఏ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థను 500 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా మొబైల్స్‌ను అయిదు శాతం జీఎస్‌టీలో చేర్చాలని కోరారు. జీఎస్‌టీ ప్రవేశపెట్టడానికి ముందు చాలా రాష్ట్రాలు మొబైల్‌ ఫోన్లను నిత్యావసర ఉత్పత్తులుగా గుర్తించి, వాటిపై 5 శాతం వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను) మాత్రమే విధించాయని మహీంద్రూ చెప్పారు.ఇదీ చదవండి: అల్ట్రాటెక్‌ 200 ఎంటీపీఏ సామర్థ్యంఅయితే, జీఎస్‌టీని ప్రవేశపెట్టాక ముందు 12 శాతం శ్లాబ్‌లో ఉంచి ఆ తర్వాత 2020లో 18 శాతానికి మార్చారని మహీంద్రూ గుర్తు చేశారు. దీనితో అందుబాటు ధరల్లో మొబైల్స్‌ లభ్యతపైనా, అమ్మకాల పరిమాణంపైనా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. మొబైల్స్‌ వార్షిక వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్లకు తగ్గిపోయిందని వివరించారు. కాబట్టి వీటిని అయిదు శాతం శ్లాబ్‌లోకి చేర్చడాన్ని మినహాయింపుగా భావించరాదని, కరెక్షన్‌గా పరిగణించాలని మహీంద్రూ చెప్పారు. 2015 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రూ. 18,900 కోట్లుగా ఉన్న మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.45 లక్షల కోట్లకు చేరింది.

Oracle laid off nearly 2800 employees in India affecting local workforce10
టాప్‌ కంపెనీలో 2,800 ఉద్యోగాలు కట్‌

కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఒరాకిల్ కార్పొరేషన్ భారతదేశంలోని శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. దేశంలోని కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని తొలగించాలని నిర్ణయించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతా వంటి కీలక ప్రాంత్రాల్లో సుమారు 28,824 మంది ఉద్యోగులు ఒరాకిల్‌లో పని చేస్తున్నారు. వీరిపై ‍ప్రభావంపడే అవకాశం ఉంది.కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, క్లౌడ్ సేవలు, కస్టమర్ బేస్‌పై నిమగ్నమైన బృందాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని క్యాంపస్‌ల్లో ఈ తొలగింపులు ఆకస్మికంగా ఉన్నాయని, తొలగింపు ప్యాకేజీలు లేదా అంతర్గత పునర్విభజన ఎంపికల ఊసే లేదని చెబుతున్నారు. యాజమాన్యం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఊహించని విధంగా నోటీసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఈ-కామర్స్, టెక్‌ స్టార్టప్‌ల్లో ఫ్రెషర్లకు అవకాశాలుగత నెలలో అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ పవర్‌ కోసం ఓపెన్ఏఐ ఓరాకిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్‌ను అద్దెకు తీసుకునేందుకు ఓపెన్ఏఐ అంగీకరించింది. తర్వాత ఒరాకిల్ స్టాక్ ఆల్‌టైమ్‌ గరిష్టానికి దగ్గరగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒరాకిల్ సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లేఆఫ్స్‌ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుని, మెరుగైన పనితీరు కనబరచాలని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు ఏఐపై ఆధారపడబోతోందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్కిల్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలని చెబుతున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement