యూట్యూబ్‌ ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన ఫీచర్లను తీసుకువస్తుంది.

తాజాగా టిక్‌టాక్‌ తరహాలో ‘గ్రీన్‌ స్క్రీన్‌’ను తీసుకువచ్చింది.

దీని ద్వారా యూజర్లు తమ వీడియోలను ‘షార్ట్స్‌’తో రీమిక్స్‌ చేసుకోవచ్చు.

మీ సరికొత్త ఒరిజినల్‌ షార్ట్స్‌ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించుకోవడానికి 60 సెకండ్ల వీడియోసెగ్మెంట్‌ నుంచి ఎలిజిబుల్‌ యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్స్‌ను ఎంపికచేసుకోవచ్చు’

ఈ విషయాన్ని యూట్యూబ్‌ తన బ్లాగ్‌పోస్ట్‌లో తెలియజేసింది.

సొంతగ్యాలరీ నుంచి పిక్చర్స్‌ లేదా వీడియోలను గ్రీన్‌స్క్రీన్‌ కోసం ఉపయోగించవచ్చు.

‘మెనూ ఆఫ్‌ ఆప్షన్‌’లో గ్రీన్‌స్క్రీన్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది.